ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వాట్సప్.. తాజాగా ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వాట్సప్ సమాచారం అందించే ‘వీ బీటా ఇన్ఫో’ తెలిపింది.
యూజర్లు ఈ ఏఐ ఫీచర్లను ఉపయోగించి వాట్సప్‌లో ఇమేజెస్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మార్చడం,రీస‍్టైల్ చేయడం, ఎక్స్‌పాండ్ లాంటి పనులన్నీ వాట్సప్ ఇంటర్ ఫేస్ నుంచి చేయొచ్చు. వాట్సప్ పనిచేస్తున్న రెండో ఏఐ టూల్స్ సాయంతో వాట్సప్ సెర్చ్ బార్‌లో ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవచ్చు. ఆ సమాచారం అంతా ‘మెటా ఏఐ’ అందిస్తుంది.
చాట్‌జీపీటీకి పోటీగా
మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్‌లు అందుబాటులోకి రాకముందే వాటి గురించి ఫీచర్ ట్రాకర్ వీ బీటా ఇన్ఫో అందిస్తుంది. తాజా వాట్సప్ బీటా అప్‌డేట్ ఏఐ- పవర్డ్ ఇమేజ్ ఫీచర్‌తో పాటు ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీటీపీకి పోటీగా వాట్సప్‌లో మెటా ఏఐని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment