photo editing
-
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
ఫోటోషాప్ జిమ్మిక్కులు మామూలుగా ఉండవు. టెక్నాలజీమీద పట్టు ఉంటే చాలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించవచ్చు. అలాంటి వారిలో జేమ్స్ అనే ఫోటోషాపర్ది అందె వేసిన చేయి. ఆయన కొంచెం చమత్కారి కూడా. మన ఆర్టిస్టు మోహన్‌లా...ఫోటోషాప్‌లో కనికట్టు చేయడంలో చాలా ఫేమస్.అందుకే జేమ్స్‌కు రోజూ కొన్ని రిక్వెస్ట్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. మా ఫోటో కొంచెం ఎడిట్ చేసి ఇవ్వొచ్చు కదా అని అడుగుతారు. జేమ్స్ ఇచ్చే ట్విస్ట్‌కి ఎలాంటి వారైనా ఫిదా కావాల్సిందే. ఒరిజనల్ ఫోటో చూసేదాకా అది ఎడిట్ చేసిన ఫోటో అని ఎవరూ గుర్తుపట్టలేనంత. ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే మచ్చుకు కొన్ని మీరే చూడండి.Some Hilarious Photoshop Requests that will make your day😂😂A Thread 🧵😂 pic.twitter.com/DpZi3krCrH— ✨🤍 (@Phillipong3) May 7, 2024 -
వాట్సాప్‌లో త్వరలో ఏఐ ఇమేజ్ ఎడిటర్!
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) అందుబాటులోకి వచ్చాక దానిని విరివిగా వాడేందుకు జనం ఎంతో ఉత్సాహం చూపిస్తు న్నారు. తాము వాడే యాప్‌లలో ఏఐ ఉంటే దాని సాయంతో సరదా సరదా ప్రయోగాలు చేస్తుంటారు. దీంతో ఫొటోలు, ఇమేజ్‌లను ఎడిట్ చేసే ఏఐ ఆధారిత ఫీచర్ త్వరలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో అందుబుటులోకి వచ్చే అవకాశ ముంది. బీటా వెర్షన్ వినియోగదారులకు మొదట దీనిని వాడే అవకాశం ఇవ్వొచ్చని ‘వెబ్బేటాఇన్ఫో’ తన కథనంలో పేర్కొంది. ఆ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యాప్‌లోని ఆప్షన్లను తమ అభిరుచికి అనుగుణంగా వాడుకుంటున్న యూజర్లు.. ఈ కొత్త ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇది అంబుబాటులోకి వస్తే ఇమేజ్ను తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు, బ్యాక్గ్రౌండ్లను మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.24.7.13 వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్న వాళ్లకు ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్ ప్రాథమిక కోడ్‌ను అందుబాటులోకి తేవచ్చు. బేటా ప్రోగ్రామ్‌లో భాగస్వాములైన టెస్టర్లనే తొలుత దీనిని వాడేందుకు అనుమతిస్తారు. సెర్చ్ బార్లో టైప్‌చేసి నేరుగా ఏఐ సర్వీస్‌తోనే చాటింగ్ చేసి కావాల్సిన ఫలితాలు పొందే ఫీచర్‌పైనా వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాయిస్ నోట్ వచ్చే సందేశాలనూ ఓపెన్ చేయకుండానే టెక్ట్స్ రూపంలో చదవగలిగేలా మరో ఫీచర్‌ను యూజర్లకు అందివ్వాలని వాట్సాప్ భావిస్తోంది. -
‘చిత్ర’మైన యాప్‌లు! అలా తీసిన ఫొటో ఇలా..
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, విస్తృతమైన స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఫోటోలు తీయడం అనేది ఊపిరి పీల్చుకున్నంత సహజంగా మారిన యుగం ఇది. ప్రతి కదలికకూ ఓ సెల్ఫీ.. రోజులో ఎన్ని సెల్ఫీలు, ఫొటోలు తీస్తామో మనకే తెలియదు. అయితే అలా తీసిన సాధారణ ఫొటోలు, సెల్ఫీలను అద్భుతమైన చిత్రాలుగా మార్చుకోవచ్చు. మీకు ఉన్నట్టుండి ఓ సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది.. మీ పెంపుడు జంతువు ముచ్చటగా అనిపించి ఓ ఫొటో తీస్తారు.. రమణీయ ప్రకృతి దృశ్యాన్ని మీ ఫోన్ కెమెరాలో బంధిస్తారు. ఈ సాధారణ ఫొటోలే వాన్ గోహ్ చిత్రించినట్లుగా, పికాసో మలిచినట్లుగా అద్భుతమైన చిత్రాలుగా మారిపోతే.. ఒక్కసారి ఊహించండి.. ఊహించడం కాదు.. నిజంగానే అద్భుతమైన చిత్రాలుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం అద్భుతమైన నైపుణ్యం అవసరం లేదు. ఇక్కడ మేం చెప్పే కొన్ని మొబైల్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ప్రిస్మా అనేక రకాల ఎడిటింగ్ ఆప్షన్లు కావాలనుకున్నవారికి ఈ యాప్ చక్కగా సరిపోతుంది. న్యూరల్ నెట్వర్క్, కృత్రిమ మేధస్సు కలయికతో మీఫొటోను కొత్త శైలిలో పునఃసృష్టిస్తుంది. దీన్ని ఉచితంగానే ఉపయోగించవచ్చు. కాస్త ఎక్కువ ఫీచర్లు కావాలనుకున్నవారు ప్రీమియం వర్షన్ ట్రై చేయొచ్చు. ఆర్ట్ స్టైల్, క్లాసిక్ టెంప్లేట్లు, ఫ్రేమ్‌లు వంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఫొటో నాణ్యతను పెంచే హెచ్డీ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ప్రిస్మా ( Prisma) యాప్ అందించే మరో ఆసక్తికరమైన ఫీచర్ మ్యాజిక్ అవతార్స్. ఇది ఏఐ సాంకేతికతను ఉపయోగించి మీ సొంత ఫోటోల నుంచి అవతార్లను సృష్టిస్తుంది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో అందుబాటులో ఉంది. పిక్సార్ట్ పేరులో ఉన్నట్లుగానే మీ ఫోటోలను ఆర్ట్‌గా మార్చాలనుకుంటే పరిగణించవలసిన మరొక మంచి యాప్ పిక్సార్ట్ (Picsart). గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో అందుబాటులో ఉంది. స్కెచ్ ఎఫెక్ట్లు, పాతకాలపు ఫిల్టర్లు, ఆయిల్ పెయింటింగ్ వంటి వాటితో సహా అనేక రకాల ఫిల్టర్లు, ఆర్ట్ స్టైల్‌లను ఇది అందిస్తుంది. క్రాపింగ్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ సర్దుబాటు, టెక్స్ట్ యాడింగ్ వంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. అదనంగా మీ ఫోటోకు ఆసక్తికరమైన స్టిక్కర్లు, ఎలిమెంట్లు యాడ్ చేయొచ్చు. ఇప్పటికే ఉన్న టెంప్లేట్లు కాకుండా పిక్సార్ట్లో మీరు తెలుసుకోవలసిన మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏఐ ఇమేజ్. గోఆర్ట్ ఫోటో ఆర్ట్ మేకర్ మీ ఫోటోలను తీర్చిదిద్దడానికి మరింత ప్రొఫెషనల్-గ్రేడ్ టూల్ కోసం చూస్తున్నట్లయితే గోఆర్ట్ (GoArt) ఫోటో ఆర్ట్ మేకర్ మంచి ఎంపిక. దీన్ని ఉపయోగించడం చాలా ఇతర ఫోటో ఎడిటింగ్ యాప్‌ల మాదిరిగా సూటిగా అనిపించకపోవచ్చు, కానీ ఇందులోని ఫీచర్లు, టూల్స్ కృషికి తగినవిగా చేస్తాయి. పెయిడ్ వర్షన్‌ను వినియోగిస్తే క్రెడిట్ల రూపంలో రోజువారీ రివార్డ్‌లు కూడా లభిస్తాయి. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోటోలీప్ ట్రెండింగ్‌లో ఉన్న అన్ని క్లాసిక్, ఏఐ ఫిల్టర్లతో మీ ఫొటోలను అద్భుతంగా మార్చుకోవాలంటే ఈ ఫోటోలీప్ (Photoleap) యాప్‌ను ట్రై చేయొచ్చు. ఫొటోలకి ఫ్యూచరిస్టిక్ ఎన్హాన్స్మెంట్స్ చేసే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. అలాగే మీ ఫోటోను కార్టూన్, యానిమేషన్, మాంగా మొదలైనవాటిగానూ మార్చవచ్చు. ప్రతి ఫిల్టర్ మీ ఫోటోలోని రంగు, ఆకృతి, నమూనా వంటి వివిధ అంశాలను మాన్యువల్‌గా పునరావృతం చేయడానికి సంక్లిష్టంగా ఉండే మార్గాల్లో సర్దుబాటు చేస్తుంది. ఇందులో స్కై టూల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ ఫోటోలలో ఆకాశాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఫోటోకు మరింత కళను జోడించడానికి ఏఐ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఫోటో ల్యాబ్ ఫోటో ల్యాబ్ (Photo Lab) అనేది దాని విస్తృత శ్రేణి ఎఫెక్ట్లు, ఫిల్టర్లు, ఫ్రేమ్‌లు, ఇతర ఎడిటింగ్ సాధనాలకు ప్రసిద్ధి చెందిన మరొక అప్లికేషన్. దీంట్లో యూజర్లు తమ ఫోటోలను సులువుగా కళాత్మక సృష్టిలుగా మార్చుకోవచ్చు. ఇతర యాప్‌ల మాదిరిగానే ఈ యాప్ కూడా ఫొటోలను అద్భుతంగా తీర్చిదిద్దడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. ఈ యాప్‌లో ఇతర యూజర్లు చేసిన ఫోటో ఎడిట్ల క్యూరేటెడ్ స్ట్రీమ్‌ను ప్రదర్శించే ఫీడ్ ఫీచర్‌ను ఉంది. ఇక్కడ మీరు కమ్యూనిటీ ద్వారా అప్లయి చేసే విభిన్న శ్రేణి ఎడిట్స్, ఎఫెక్ట్స్‌ను వీక్షించడం ద్వారా ఫోటో ల్యాబ్‌లోని సృజనాత్మక అవకాశాలను అన్వేషించవచ్చు. అలాగే యూజర్ల ఫీడ్ నుంచి ఫోటోలను లైక్, కామెంట్, షేర్ చేయవచ్చు. గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్స్టోర్లలో ఈ యాప్‌ను పొందవచ్చు. -
మీ ఫోన్లో ఈ పాపులర్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
రోజు రోజుకి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి వివిద రకాలుగా యూజర్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు ఇప్పుడు మరోసారి పాపులర్ ఎడిటింగ్ యాప్స్ రూపంలో నెటిజన్లను టార్గెట్ చేశారు. ఇటీవల గూగుల్ ప్రమాదకరమైన 150 యాప్స్‌పై నిషేదం విధించిన తర్వాత తాజాగా మరో మూడు యాప్స్‌ను నిషేదించినట్లు తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి నిషేదించిన ఈ మూడు యాప్స్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, డబ్బును దొంగలించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుపుతుంది. భద్రతా సంస్థ కాస్పర్ స్కై ఈ ప్రమాధకరమైన యాప్స్‌ను గుర్తించింది. వినియోగదారుల సమాచారంతో తస్కరించేందుకు ఫేస్బుక్ లాగిన్ వివరాలు ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. అనేక వెబ్ సేవలు, యాప్స్ 'లాగిన్ విత్ ఫేస్బుక్' అనే బటన్ ద్వారా వినియోగదారులను త్వరగా ధృవీకరించడానికి వారికి అనుమతిస్తాయి. అయితే, భద్రతా సంస్థ ప్రకారం.. ఈ యాప్స్ లాగిన్ డీటైల్స్ దొంగిలించి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి సైన్-ఇన్ డేటాను ఉపయోగిస్తున్నాయి.(చదవండి: అలా చేస్తే పెను ముప్పే..! తీవ్రంగా హెచ్చరించిన ఆపిల్..!) గూగుల్ నిషేదిత యాప్స్ జాబితా గూగుల్ నిషేధించిన యాప్స్ పేర్లు "మ్యాజిక్ ఫోటో ల్యాబ్ - ఫోటో ఎడిటర్", "బ్లెండర్ ఫోటో ఎడిటర్-ఈజీ ఫోటో బ్యాక్ గ్రౌండ్ ఎడిటర్", "పిక్స్ ఫోటో మోషన్ ఎడిట్ 2021". ఈ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి నిషేదించారు. వీటి నుంచి సురక్షితంగా ఉండటం ఎలా.. మొదట మీరు మీ మొబైల్ వీటిని వెంటనే డిలీట్ చేయండి. ఆ తర్వాత మీ ఫేస్బుక్ లాగిన్ వివరాలను వెంటనే మార్చుకోండి. చాలా మంది ఫోటో ఎడిటింగ్ యాప్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి, ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసే ముందు సాధ్యమైనంత వరకు క్రెడెన్షియల్స్ వెరిఫై చేయండి. ఆన్లైన్లో ఒకసారి వీటి గురుంచి నెగెటివ్ వార్తలు ఉన్నాయో లేదో చూడండి.(చదవండి: ‘బిట్‌కాయిన్ ఓ చెత్త.. పనికిమాలిన వ్యవహారం’) -
ఆధార్ కార్డ్ మీద ఫోటో నచ్చలేదా.. ఇలా మార్చుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: మన గుర్తింపునకు ఆధార్ కార్డ్ తప్పనిసరి అయ్యింది. కానీ ఆధార్ కార్డులో ఉండే ఫోటోలు చూస్తే.. మనమా కాదా అని డౌట్ వస్తుంది. అంత చిత్రవిచిత్రమైన ఫోటో ఎలా తీశారబ్బ అనే అనుమానం కూడా కలగకమానదు. ఇక ఆధార్ కార్డు మీద ఫోటోల మీద బోలెడు మీమ్స్. కానీ ఏం చేస్తాం.. మనకు నచ్చినా, నచ్చకపోయినా ఆ ఫోటోతేనే అడ్జస్ట్ కావాలి. కొన్ని సార్లు గుర్తుపట్టరాని విధంగా ఉన్న ఫోటోలతో సమస్యలు ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. కానీ ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికింది. ఆధార్‌కార్డ్ మీద ఫోటోని మార్చుకోవచ్చు. అదెలాగంటే.. ఆధార్ కార్డ్‌లో ఫోటో మార్చి.. కొత్త దాన్ని అప్లోడ్ చేయాలంటే.. ►ఆధార్ కార్డ్ మీద ఫోటో మార్చడం కోసం ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది. దీన్ని కూడా యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ నుంచి సులభంగా యాక్సెస్ చేసుకుని, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►మీ ఫోటోను మార్చడానికి మీరు మీ ప్రాంతంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. ►ఇందుకోసం అవసరమైన ఫీజు చెల్లించాలి. ►ఆధార్ నమోదు కేంద్రంలోని సంబంధిత అధికారి మీ కొత్త ఫోటోను క్లిక్ చేసి, మీ ఆధార్ కార్డుకు అప్లోడ్ చేస్తారు. ►ఆ తర్వాత నిర్ణీత వ్యవధిలోగా మీ ఆధార్ కార్డ్ మీద కొత్త ఫోటో వస్తుంది. -
బెస్ట్ ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఇవే!
సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఎక్కువ శాతం మంది ఫొటోగ్రఫీ మీద ఆసక్తి చూపుతున్నారు. కొందరు తమ ఫోటోని అందంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత తమ ఫోటోకి ఎన్ని లైక్స్ వచ్చాయి అని చూస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా వచినప్పటి నుండి ప్రతి ఒక్కరు ఫోటో ఎడిటింగ్ మీద ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. అలాగే కొందరు ఫోటోగ్రఫీ ద్వారా వారు కస్టమర్ దృష్టిని ఆకర్షించి వ్యాపారాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నారు. కొన్ని మంచి యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటికీ నెల నెల డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అంతే క్వాలిటీతో కొన్ని ఉచిత యాప్స్ మేము మీకు అందిస్తున్నాం.(చదవండి: 14వేలకే నోకియా 5.4 మొబైల్) 1. స్నాప్‌సీడ్: ఇది ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. మీ మొబైల్ లో దీని ద్వారా బెస్ట్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఉచితంగా లభిస్తున్న బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ లలో ఇది ఒకటి. ఇది గూగుల్ చేత తయారుచేయబడింది. ఇది డెస్క్‌టాప్ ఫోటో ఎడిటర్లలో ఉన్న ఫీచర్స్ దీనిలో లభిస్తాయి. అన్ని యాప్స్ మాదిరిగానే ఇందులో ప్రీసెట్ ఫిల్టర్లు కూడా లభిస్తాయి. దీనిలో మీరు ఈ ఫిల్టర్లను సవరించవచ్చు. క్రాపింగ్, స్ట్రెయిటెనింగ్, ఫ్రేమ్స్, టెక్స్ట్, విగ్నేట్స్ వంటి అన్ని క్లాసిక్ టూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. స్నాప్సీడ్లో ప్రెసిషన్ మాస్కింగ్ ఉంది. దీని ద్వారా మీరు గతంలో ఎడిట్ చేసిన హిస్టరీ కూడా సేవ్ చేసి ఉంటుంది. కాబట్టి మీరు ఏ సమయంలోనైనా తిరిగి ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. 2. పిక్స్‌లర్: 50 మిలియన్ డౌన్లోడ్లతో ప్లే స్టోర్‌లో పిక్స్‌లర్ 4.3 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లో 27ఎంబి కంటే తక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. ఈ యాప్ ఎక్కువ ఎఫెక్ట్స్ ఆడ్ చేసుకోవడంతో పాటు క్రియేటివ్ గా మీ ఫోటోలను ఎడిటింగ్ చేయవచ్చు . ఇందులో ఉన్న ముఖ్యమైన 'ఆటో-ఫిక్స్' ఫీచర్ తో యాప్ లో రంగులను అదే సర్దుబాటు చేసుకుంటుంది. దీని ద్వారా మీరు ఫోటోలను మరింత స్పష్టతతో కూడిన ఫోటోలను మీకు నచ్చినట్లు తయారు చేయవచ్చు. ఇది ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. 3. విస్కో: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతి ముఖ్యమైన ఫీచర్ వచ్చేసి క్లాసిక్-లుక్ ఫిల్టర్లు. ఇన్స్టాగ్రామ్ మాదిరిగా విస్కో కెమెరా, ఎడిటింగ్ టూల్స్, ఆన్లైన్ కమ్యూనిటీ కూడా ఉంది. ఈ ఉచిత ఫోటో యాప్ మీ ఫోటోలను అనలాగ్ ఫిల్మ్ కెమెరాలో తీసినట్లుగా కనిపించే అద్భుతమైన ఫిల్టర్ల సెట్ అందిస్తుంది. భారీగా ఫిల్టర్ చేసిన ఇన్స్టాగ్రామ్ ప్రీసెట్‌లతో పోలిస్తే మీ ఫోటోలకు క్లాస్ టచ్ ఇస్తాయి. మరియు మీరు వీటిని సాధారణ స్లైడర్ ద్వారా కూడా సర్దుబాటు చేయవచ్చు. అన్ని ఫోటో ఎడిటింగ్ యాప్స్ మాదిరిగానే ఇందులో క్రాపింగ్, బార్డర్స్ ఉన్నాయి. ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, టెంపరేచర్ లేదా స్కిన్ టోన్లను సరి చేయడానికి మీరు విస్కోను కూడా ఉపయోగించవచ్చు. 4. ప్రిస్మా ఫోటో ఎడిటర్: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైన ఫీచర్ వచ్చేసి మీ ఫోటోలను కళాత్మకంగా “పెయింటింగ్స్”, “డ్రాయింగ్లు” గా మార్చుకోవడం. ఈ ఉచిత ఫోటో ఎడిటింగ్ యాప్ కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుంది. ఇది “పికాసో, మంచ్ లేదా సాల్వడార్ డాలీ చిత్రించినట్లుగా ఫోటోలను ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీనిలో 500 కంటే ఎక్కువ సంఖ్యలో క్రియేటివ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ప్రిస్మాకు ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే ఆన్లైన్ కమ్యూనిటీ కూడా ఉంది. కాబట్టి, మీరు ఎడిటింగ్ పూర్తి చేసిన తర్వాత మీరు మీ చిత్రాన్ని మీ ప్రిస్మా ఫీడ్‌లో షేర్ చేయవచ్చు. 5. అడోబ్ ఫోటోషాప్ ఎక్స్‌ప్రెస్: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైన ఫీచర్ వచ్చేసి ఆల్‌రౌండ్ ఫోటో ఎడిటింగ్. మీరు లాప్టాప్ లేదా డెస్క్ టాప్ లో ఏ విదంగా ఫోటో ఎడిటింగ్ చేసుకుంటారో అదేవిదంగా ఇందులో చేసుకోవచ్చు. దీనిని మొబైల్ లో సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో అడోబ్ ఫోటోషాప్ లో ఉన్న ఫీచర్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. 6. కాన్వా: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైనది వచ్చేసి వ్యాపారానికి సంబందించిన బ్రాండెడ్ ఫోటోలను సులువుగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. కాన్వా యాప్ బెస్ట్ ఫ్రీ ఎడిటింగ్ యాప్స్ లో ఒకటి. దీనిలో ఫోటో ఎడిటింగ్ మాత్రమే కాదు వెబ్సైట్, మార్కెటింగ్ వంటి సంబందించిన ఫోటోలను కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అందుకే చాలా మల్టీ యూజ్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో 50,000 ఫ్రీ టెంపల్ట్స్ ఉన్నాయి. మంచి విజువల్స్ తో పోస్టర్లు తయారుచేయవచ్చు. -
సరికొత్త ఫీచర్లతో వాట్సాప్
-
సరికొత్త ఫీచర్లతో వాట్సాప్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. తాజా బీటా 2.16.264 అప్డేషన్తో స్నాప్‌చాట్ మాదిరిగా యూజర్లు తమ ఇమేజ్‌పై ఏదైనా టెక్ట్స్ రాసుకునేందుకు, డ్రాయింగ్ వేసుకునేందుకు సౌకర్యం కల్పించనుంది. ఉదాహరణకు వాట్సాప్ యాప్ ద్వారా ఫ్రంట్ పేసింగ్ ఫ్లాష్‌తో ఫోటో తీసుకున్నప్పుడు, ఎడిటింగ్ టూల్స్‌ను తాజా అప్డేషన్తో యూజర్లు పొందుతారు. ఫోటోపై ఏదైనా టెక్ట్స్‌ను రాసుకునే విధంగా, డ్రాయింగ్ వేసుకునేందుకు వీలుగా పెన్సిల్, "టీ"బటన్స్ కనిపిస్తాయి. ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ మాదిరిగా వివిధ రంగులను వాడుకుంటూ యూజర్లు తమ ఫోటోలను డిజైన్ చేసుకోవచ్చు. యూజర్ల ఇమేజ్‌లను మరింత తీర్చిదిద్దడానికి స్టికర్ల కూడా వాడుకుని ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చట. మొదట ఈ ఫీచర్‌ను స్నాప్‌చాట్ ప్రవేశపెట్టింది. అనంతరం ఇన్స్టాగ్రామ్ కూడా ఇదేమాదిరి ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాజాగా వాట్సాప్ కూడా మెసేజింగ్ ప్రేమికుల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇక్కడ ఇంకో విషయం గురించి తెలుసుకోవాలి. కేవలం మన స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి వాట్సాప్ ద్వారా తీసిన ఫొటోలకు మాత్రమే ఎఫెక్ట్స్ ఇవ్వడం వీలవుతుంది. షేర్ చేసుకునే వాటికి ఎఫెక్ట్స్ ఇవ్వడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉంది. ఈ అధికారిక వెర్షన్‌ను వాట్సాప్ త్వరలో విడుదల చేయనుంది. టెస్ట్ చేయాలనుకునే యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లో తాజా వాట్సాప్ వెర్షన్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే, ఈ ఫీచర్లు యూజర్లకు ఇన్స్టాల్ అవుతాయి. అదేవిధంగా త్వరలోనే యూజర్ల చాట్‌ను వాట్సాప్ చదివేలా టెస్టింగ్ జరుగుతుందట. మెసేజ్‌లో ఉన్న టెస్ట్‌ను వాట్సాపే బయటికి చదివేలా స్పీక్ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. అయితే ఐఓఎస్ డివైజ్‌లన్నింటికీ ఒకేసారి ఈ ఫీచర్ అందుబాటులోకి రాదంట.