సరికొత్త ఫీచర్లతో వాట్సాప్
సరికొత్త ఫీచర్లతో వాట్సాప్
Published Tue, Sep 13 2016 9:19 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. తాజా బీటా 2.16.264 అప్డేషన్తో స్నాప్చాట్ మాదిరిగా యూజర్లు తమ ఇమేజ్పై ఏదైనా టెక్ట్స్ రాసుకునేందుకు, డ్రాయింగ్ వేసుకునేందుకు సౌకర్యం కల్పించనుంది. ఉదాహరణకు వాట్సాప్ యాప్ ద్వారా ఫ్రంట్ పేసింగ్ ఫ్లాష్తో ఫోటో తీసుకున్నప్పుడు, ఎడిటింగ్ టూల్స్ను తాజా అప్డేషన్తో యూజర్లు పొందుతారు. ఫోటోపై ఏదైనా టెక్ట్స్ను రాసుకునే విధంగా, డ్రాయింగ్ వేసుకునేందుకు వీలుగా పెన్సిల్, "టీ"బటన్స్ కనిపిస్తాయి. ఫోటో మెసేజింగ్ యాప్ స్నాప్చాట్ మాదిరిగా వివిధ రంగులను వాడుకుంటూ యూజర్లు తమ ఫోటోలను డిజైన్ చేసుకోవచ్చు. యూజర్ల ఇమేజ్లను మరింత తీర్చిదిద్దడానికి స్టికర్ల కూడా వాడుకుని ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చట. మొదట ఈ ఫీచర్ను స్నాప్చాట్ ప్రవేశపెట్టింది. అనంతరం ఇన్స్టాగ్రామ్ కూడా ఇదేమాదిరి ఫీచర్ను తీసుకొచ్చింది.
తాజాగా వాట్సాప్ కూడా మెసేజింగ్ ప్రేమికుల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇక్కడ ఇంకో విషయం గురించి తెలుసుకోవాలి. కేవలం మన స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి వాట్సాప్ ద్వారా తీసిన ఫొటోలకు మాత్రమే ఎఫెక్ట్స్ ఇవ్వడం వీలవుతుంది. షేర్ చేసుకునే వాటికి ఎఫెక్ట్స్ ఇవ్వడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉంది. ఈ అధికారిక వెర్షన్‌ను వాట్సాప్ త్వరలో విడుదల చేయనుంది. టెస్ట్ చేయాలనుకునే యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ యాప్లో తాజా వాట్సాప్ వెర్షన్ను డౌన్ లోడ్ చేసుకుంటే, ఈ ఫీచర్లు యూజర్లకు ఇన్స్టాల్ అవుతాయి. అదేవిధంగా త్వరలోనే యూజర్ల చాట్ను వాట్సాప్ చదివేలా టెస్టింగ్ జరుగుతుందట. మెసేజ్లో ఉన్న టెస్ట్ను వాట్సాపే బయటికి చదివేలా స్పీక్ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. అయితే ఐఓఎస్ డివైజ్లన్నింటికీ ఒకేసారి ఈ ఫీచర్ అందుబాటులోకి రాదంట.
Advertisement
Advertisement