WhatsApp Upcomig Features In 2022: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ త్వరలో అదీ కొత్త ఏడాది మొదట్లో కొత్త ఫీచర్స్‌తో యూజర్ల ముందుకు రానుంది. ఈ ఏడాది అంతగా ఫీచర్ల అప్‌డేట్ ఇవ్వని వాట్సాప్.. 2022లో మాత్రం యూజర్ ఫ్రెండ్లీ అప్‌డేట్స్‌తో రానున్నట్లు సమాచారం.
భారత్ సహా ప్రపంచంలోనే మోస్ట్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా ఉంది వాట్సాప్. వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న వాట్సాప్.. క్రమంగా వివాదాలను అధిగమిస్తూ యూజర్ ఫ్రెండ్లీ యాప్‌గా పేరు దక్కించుకుంది. కరోనా ప్రభావంతో కిందటి ఏడాది, అలాగే 2021 కూడా వాట్సాప్ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది. ఈ తరుణంలో కొత్త సంవత్సరం అదిరిపోయే ఫీచర్లను అందించబోతోంది. వాబేటా ఇన్ఫోప్రకారం..
డిలీట్ ఫర్ ఎవ్రీవన్
2022లో వాట్సాప్ నుంచి రాబోయే కొత్త ఫీచర్ బహుశా ఇదే అయ్యి ఉండొచ్చు. గ్రూపులో పెట్టే ఏ మెసేజ్‌నైనా.. అడ్మిన్ డిలీట్ చేసే ఫీచర్ ఇది. అప్పుడు అక్కడ This was removed by an admin అని చూపిస్తుంది. ఇదిలా ఉంటే వాట్సాప్ రీసెంట్‌గా మెసేజ్ డెలిట్ ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన విషయం తెలిసిందే. యూజర్లు ఎవరైనా సరే చేసిన మెసేజ్‌ను వారంలోగా వెనక్కి తీసేసుకునే వెసులుబాటు కల్పించింది.
క్విక్ రిప్లయిస్.. బిజినెస్ ప్రత్యేకం
వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కోసం ఈ ఫీచర్. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్ కోసం తీసుకురాబోతున్నారు. ఇంతకు ముందు ఛాట్‌బాక్స్‌లో “/” అనే సింబల్‌ను తరచూ పంపించే మెసేజ్‌లకు త్వరగతిన స్పందించేందుకు యాడ్ చేసేవాళ్లు. ఇకపై ఈ ఫీచర్ ఛాట్‌షేర్ యాక్షన్ మెనూకి సైతం చేర్చునున్నారు.
స్టిక్కర్ స్టోర్
వాట్సాప్‌లో సాధారణంగా ఇతర యాప్‌ల సాయంతో స్టిక్కర్లు పంపుకోవడం తెలిసిందే. అయితే ఇకపై ఎంపిక చేసిన స్టిక్కర్స్‌ను నేరుగా వాట్సాప్ ద్వారానే పంపుకునే విధంగా స్టిక్కర్ స్టోర్ ఆప్షన్ తీసుకురాబోతోంది వాట్సాప్. వెబ్ అప్లికేషన్స్‌తో పాటు డెస్క్‌టాప్ వెర్షలకు ఈ ఆప్షన్‌ను అందించనుంది.
కమ్యూనిటీస్
కమ్యూనిటీస్ ఫీచర్. ఇది గ్రూప్ అడ్మిన్‌ల కోసం తీసుకురాబోతున్న ఫీచర్. తద్వారా మల్టీపుల్(ఒకటి కంటే ఎక్కువ) గ్రూపులు అడ్మిన్ కంట్రోల్ చేతిలో ఉంటాయి. అంతేకాదు సబ్ గ్రూపులను క్రియేట్ చేసే వీలుంటుంది కూడా.
మెసేజ్ రియాక్షన్స్
దీని గురించి ఆల్రెడీ చర్చించిందే. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో మాదిరి.. మెసేజ్‌లకు ఎమోజీల ద్వారా నేరుగా రియాక్ట్ అయ్యే వెసులుబాటు కల్పించడం. ప్రస్తుతం ఆరు ఎమోజీల సాయంతో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది వాట్సాప్.
స్టిక్కర్ సజెషన్స్
వాట్సాప్‌లో ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్ లోడ్ చేశారనుకోండి!. ఒకటి కంటే ఎక్కువ స్టిక్కర్లకు(సేమ్ స్టిక్కర్) సరిపోయేలా ఏదైనా టైప్ చేస్తే.. అప్పుడు అందులో ఓ స్టిక్కర్ చిహ్నం(కన్ఫ్యూజ్‌కి గురి చేయకుండా) ఆటోమేటిక్‌గా మారుతుంది. ఎందుకంటే వాట్సాప్ సర్వర్‌లో కాకుండా కేవలం డివైజ్‌లో మాత్రమే వాటిని డౌన్ లోడ్ చేశారు కాబట్టి. ఆ స్టిక్కర్లకు WhatsAppతో సంబంధం ఉండదు కాబట్టి. ఈ ఫీచర్ యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.
సేవ్ చేయకుండా స్టిక్కర్లు ఫార్వాడ్ చేయడం
సాధారణంగా వాట్సాప్‌లో ఎవరైనా స్టిక్కర్లు పంపితే.. వాటిని సేవ్ చేయకుండా మరొకరికి పంపలేం. అందుకే సేవ్ చేయకుండానే పంపే ఆప్షన్‌ను తీసుకురాబోతోంది.
చదవండి: వాట్సాప్ నెంబర్ పదే పదే బ్యాన్ అవుతోందా? ఇలా చేయండి
Comments
Please login to add a commentAdd a comment