ఇజ్రాయెల్ కంపెనీ పారాగాన్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసిన అత్యాధునిక స్పైవేర్ ద్వారా జర్నలిస్టులు, సివిల్ సొసైటీ సభ్యులతో సహా దాదాపు 100 మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు వాట్సప్ సైబర్ సెక్యూరిటీ ఆరోపించింది. అయితే, భారతీయ వినియోగదారులు ఈ ఉల్లంఘన బారిన పడలేదని హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ధ్రువీకరించింది. తన భారతీయ వినియోగదారులు ఈ దాడికి గురికాలేదని వాట్సాప్ స్పష్టం చేసింది.
గ్రాఫైట్ అని పిలువబడే ఈ స్పైవేర్ ‘జీరో-క్లిక్’ పద్ధతిని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేశారని వాట్సప్ తెలిపింది. అంటే బాధితులు ఎలాంటి లింక్‌పై క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండానే వ్యక్తులను టార్గెట్ చేసి హ్యాక్ చేసినట్లు పేర్కొంది. ఈ స్పైవేర్‌ను అక్కడి ప్రభుత్వ క్లయింట్లు ఉపయోగిస్తున్నారని భావిస్తున్నప్పటికీ, దాడి వెనుక ఉన్న నిర్దిష్ట వ్యక్తులను వాట్సప్ గుర్తించలేకపోయింది.
ముఖ్యంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)తో కంపెనీ గతంలో దాదాపు 2 మిలియన్ల డాలర్ల కాంట్రాక్టును దక్కించుకొని వార్తల్లో నిలిచింది. జాతీయ భద్రతా సమస్యల కారణంగా ఫెడరల్ ఏజెన్సీలు స్పైవేర్ వినియోగాన్ని పరిమితం చేసేలా, అప్పటి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వెలువడిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు అనుగుణంగా ఉండేలా ఈ ఒప్పందాన్ని సమీక్షించారు. పారగాన్ సొల్యూషన్స్ యూఎస్‌లోని చాంటిల్లీ, వర్జీనియాలో కార్యాలయాలను కలిగి ఉంది. యూఎస్ ప్రభుత్వ సంస్థలతో సంస్థ ఒప్పందాలపై పరిశీలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖాతాదారులచే స్పైవేర్‌ను విస్తృతంగా ఉపయోగించడంపై మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా
పారాగాన్ సొల్యూషన్స్‌పై వాట్సప్ చర్యలు చేపట్టింది. చట్టవిరుద్ధమైన నిఘా కోసం కంపెనీ స్పైవేర్‌ను ఉపయోగించడం నిలిపివేయాలని కోరుతూ.. ఇలాంటి చర్యలను వెంటనే ఆపాలని లేఖ రాసింది. వాట్సప్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారులు ప్రైవేట్‌గా కమ్యూనికేట్ చేసే సామర్థ్యాన్ని రక్షించడానికి నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. స్పైవేర్ సంస్థలను కట్టడి చేస్తూ వారి చర్యలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment