
స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ.. దాదాపు వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. ఈ యాప్ ఉచిత మెసేజింగ్ & వీడియో కాలింగ్ వంటి వాటికి అనుమతిస్తుంది. సంస్థ యూజర్ల భద్రత, సౌలబ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రెండు కొత్త ఫీచర్స్ పరిచయం చేసింది.
వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్స్ సాయంతో.. మీ స్టేటస్, లాస్ట్‌సీన్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవడం వల్ల.. మీ వాట్సాప్ స్టేటస్, లాస్ట్‌సీన్ ఎవరికి కనిపించకూడదనుకుంటారో.. వారు చూడలేరు.
ఈ ఫీచర్ ఎలా సెట్ చేసుకోవాలంటే..
➤వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి.
➤సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తరువాత.. ప్రైవసీ అనే ఆప్షన్స్ కనిపిస్తుంది.
➤ప్రైవసీ మీద క్లిక్ చేసిన తరువాత.. మొదట్లోనే లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్ మీద క్లిక్ చేయాలి.
➤ఆలా చేసిన తరువాత.. నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి.
➤ఆ తరువాత మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ స్టేటస్, లాస్ట్‌సీన్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది సెలక్ట్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: రూ.46.89 లక్షల స్కోడా కారు లాంచ్: పూర్తి వివరాలు