వినియోగదారుల వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫేమస్ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) ఓ కీలకమైన మార్పుకు సిద్ధమైంది. వినియోగదారు అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకోవడాన్ని నిరోధించడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది.
గుర్తు తెలియని వ్యక్తుల కాల్ బ్లాకింగ్, చాట్‌లాక్ వంటి ఫీచర్స్ మాదిరిగానే డిస్‌ప్లే పిక్చర్ లాక్ అనే ఫీచర్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. ఇది మనకు తెలియని వ్యక్తులు మన వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలు వెల్లడి కాలేదు.
ఇదీ చదవండి: రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
రాబోయే రోజుల్లో మనకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల మనకు నచ్చని వారికి ఫోటో కూడా కనిపించకుండా చేయొచ్చని తెలుస్తోంది. కాబట్టి మనకు నచ్చని వారు మన ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోలేరు. డీప్ ఫేక్‌లు చెలరేగుతున్న సమయంలో కంపెనీ తీసుకువస్తున్న ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment