Privacy
-
వాట్సాప్ హ్యాకింగ్: ఈ టిప్స్ పాటిస్తే మీరు సేఫ్
స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. అయితే.. సైబర్ మోసగాళ్ల ఆగడాలు మితిమీరుతున్న తరుణంలో ఆన్లైన్ స్కామ్‌లు పెరిగిపోతున్నాయి. వాట్సాప్ ద్వారా కూడా ప్రజలను మోసాలు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కొన్ని సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలివాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే.. టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయడం ఉత్తమం. దీని కోసం ముందుగా వాట్సాప్ ఖాతా ఓపెన్ చేసి.. అందులో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా ఒక పిన్ కూడా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీ ఖాతాను ఎవరూ హ్యాక్ చేసే అవకాశం లేదు.వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలివాట్సాప్ ఖాతాను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మెటా ఎప్పటికప్పుడు ఫీచర్స్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇది మీ భద్రతను పెంచడంలో సహాయపడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. యాప్ అప్డేట్ పేరుతో వచ్చే సందేశాల విషయంలో కూడా యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాప్ అప్డేట్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు వస్తుంటాయి.తెలియని కాల్స్ స్వీకరించకండితెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ (ఆడియో & వీడియో) స్వీకరించకపోవడం ఉత్తమం. కొంతమంది డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు వాట్సాప్ కాల్స్ ఉపయోగించే ప్రజలను మోసం చేస్తుంటారు. కాబట్టి తెలియని కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాట్ (DoT) హెచ్చరిస్తోంది.వైఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండండిపబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు.. అంత సురక్షితమైనవి కాదు. కాబట్టి హ్యాకర్లు ఎక్కువగా ఇలాంటి నెట్‌వర్క్‌లను ఉపయోగించి హ్యాక్ చేస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ వైఫై ఉపయోగించడాన్ని తగ్గించాలి. తప్పనిసరిగా ప్రైవేట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించాలి. అప్పుడే మీ డేటా సేఫ్‌గా ఉంటుంది.స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించండిమీ ఫోన్లో డేటా భద్రంగా ఉండాలంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించాలి. సింపుల్ పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకుంటే.. హ్యాకర్స్ సులభంగా మొబైల్స్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ లేదా పేస్ ఐడెంటిటీ వంటివి సెట్ చేసుకోవడం కూడా ఉత్తమం. 123456 లేదా abcdef వంటివి సెట్ చేయడం పూర్తిగా మానేయాలి. -
‘లొకేషన్’తో ప్రైవసీ చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: ‘లొకేషన్ పంపు.. నేను వచ్చేస్తా..’ ఎవరినైనా కలవడానికి వెళ్తేనో, కొత్త ప్రదేశానికి వెళ్తేనో ఈ మాట తప్పకుండా వినిపిస్తుంది. ఎవరికైనా మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పాలన్నా.. కొత్త ప్రాంతంలో నిర్దిష్టమైన ప్రాంతానికి వెళ్లాలన్నా ఈ లొకేషన్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరం. పెద్దగా తికమక పడాల్సిన అవసరం లేకుండానే అవసరమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. కానీ ఇది ఎంత సౌకర్యవంతమో అంతే స్థాయిలో ఇబ్బందికరం కూడా అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మన ప్రైవసీని దెబ్బతీస్తుందని.. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఎంత సేపు ఉన్నామనే ప్రతి అంశం ఈ లొకేషన్‌తో తెలిసిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లామా? సినిమా థియేటర్లో ఉన్నామా? ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లామా? అన్న వివరాలు గూగుల్‌తో పాటు మన ఫోన్లోని వివిధ యాప్ సంస్థలకు చేరిపోతాయి. ఇది మన వ్యక్తిగత అంశాలను బహిరంగం చేయడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే మన మొబైల్ ఫోన్లలోని లొకేషన్‌ను ఆన్ చేసుకోవాలని.. తర్వాత ఆఫ్ చేసి పెట్టడం వల్ల మనపై ఎవరూ నిఘా పెట్టకుండా ఉంటుందని వివరిస్తున్నారు. నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివీ.. మొబైల్ ఫోన్లలోని అన్ని అప్లికేషన్స్ (యాప్‌ల)కు లొకేషన్ సర్వీసెస్ అనుమతులు (పర్మిషన్) ఇవ్వొద్దు. అపరిచిత, అనుమానాస్పద యాప్‌లకు మన లొకేషన్ యాక్సెస్ ఇస్తే.. అది మన వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారుతుంది. కొన్ని యాప్‌లకు మనం ఇచ్చే పర్మిషన్లతో.. మన లొకేషన్ వివరాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం, మన కదలికలపై నిఘా పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. లొకేషన్ ఆన్‌లో ఉండటంతో మనం ఎప్పుడు ఎక్కడ ఉంటున్నామన్న సమాచారం ఇతరులకు సులువుగా తెలిసే అవకాశం ఉంది. లొకేషన్‌ను ఆధారంగా చేసుకుని కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. మొబైల్లో ఎప్పుడూ లొకేషన్ ఆన్‌లో ఉండటం వల్ల బ్యాగ్రౌండ్లో ఈ యాప్ పనిచేస్తూ, బ్యాటరీలో చార్జింగ్ త్వరగా తగ్గుతుంది. మొబైల్లో డేటా కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. -
మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్లు యూజర్ల ఏటాను చోరీ చేస్తున్నాయా? అంటే నివేదికలు అవుననే అంటున్నాయి. మోడ్రన్ టాప్ బ్రాండ్స్ కార్లలో డేటా ప్రైవసీ అనేది పీడకలే అంటూ కాలిఫోర్నియాకు చెందిన మొజిల్లా ఫౌండేషన్ తన తాజా పరిశోధనలో వెల్లడించింది. దాదాపు 25 కార్ బ్రాండ్లను సమీక్షించింది. ఆ సందర్బంగా సెక్స్ లైఫ్ నుంచి ఇష్టా ఇష్టాలు, పాలిటిక్స్ గగుర్పాటు కలిగించే ఇతర విషయాలు అన్నీ లీక్ అవుతున్నాయంటూ సంచలన అధ్యయన నివేదికను ప్రకటించింది. (గుడ్ న్యూస్: టీసీఎస్ వేల కోట్ల రూపాయల మెగా డీల్ ) మొజిల్లా ఫౌండేషన్ నిర్వహించిన వినియోగదారు గోప్యతా పరీక్షల్లో అవన్నీ విఫలమయ్యాయని తేలింది. పరిశోధనలో 84శాతం కార్ కంపెనీలు కారు యజమానుల నుండి సేకరించిన డేటాను సమీక్షించాయి, పంచుకుంటాయి లేదా విక్రయించాయి అని వెల్లడించింది. డ్రైవింగ్ డిజిటల్‌గా మారుతున్న యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, విక్రయించడంపై ఆందోళన వ్యక్తం చేసిన మొజిల్లా అసలు తమ పరిశోధనలోని కంపెనీలేవీ గోప్యతపై దాని ప్రమాణాలను పూర్తిగా సంతృప్తి పరచలేదని తెలిపింది. సెక్స్ టాయ్‌లు ,మానసిక ఆరోగ్య యాప్‌ల తయారీదారులతో సహా ఇంత పేలవమైన సమీక్ష రాలేదని తెలిపింది. కార్ల తయారీదారులు తమ కార్లను 'కంప్యూటర్ ఆన్ వీల్స్' అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అంతా డొల్ల అని ప్రైపసీ ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌కు ప్రసిద్ధి చెందిన మొజిల్లా రిపోర్ట్ చేసింది. "ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే డోర్‌బెల్‌లు, గడియారాలు తమపై గూఢచర్యం చేస్తున్నాయని ఆందోళన నేపథ్యంలో కార్ బ్రాండ్లు కూడా తమ వాహనాలను డేటా-గాబ్లింగ్ మెషీన్లుగా మార్చడం ద్వారా నిశ్శబ్దంగా డేటా వ్యాపారంలోకి ప్రవేశించాయని మొజిల్లా పేర్కొంది. అధ్యయనం ప్రకారం టెస్లా టాప్‌లో ఉందంటూ మరో బాంబు పేల్చింది.నిస్సాన్ రెండో స్థానంలో నిలిచింది. నిస్సాన్ సేకరించే డేటాలో “లైంగిక కార్యకలాపాలు” ఎక్కువగానూ, అలాగే కియా కంపెనీ ప్రైవసీ సిస్టం ప్రకారం, జాతి, మతపరమైన లేదా తాత్విక విశ్వాసాలు, లైంగిక ధోరణి, లైంగిక జీవితం, రాజకీయ అభిప్రాయాలతోపాటు "ట్రేడ్ యూనియన్ సభ్యత్వం" సమాచారంతో సహా "ప్రత్యేక వర్గాల" డేటాను ప్రాసెస్ చేయవచ్చని పేర్కొంది. (క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!) 84 శాతం బ్రాండ్స్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు , ఇతర బహిర్గతం చేయని వ్యాపారాలతో పంచుకున్నట్లు అంగీకరించినట్లు అధ్యయనం తెలిపింది. ఎక్కువమంది, 76 శాతం కస్టమర్ల డేటాను విక్రయించినట్లు చెప్పడం గమనార్హం. సగం కంటే ఎక్కువమంది డేటాను షేర్ చేస్తున్నట్టు చెప్పారు. కనెక్టెడ్ వాహనాలు డ్రైవింగ్ డేటామాత్రమే కాకుండా, వాహనంలోని వినోదం, శాటిలైట్ రేడియో మ్యాప్ లాంటి థర్డ్-పార్టీ ఫంక్షన్లను ట్రాక్ చేస్తున్నాయట. అత్యధిక సంఖ్యలో కార్ బ్రాండ్లు, 92 శాతం, కేవలం ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్, Dacia బ్రాండ్‌తో వినియోగదారులకు వారి వ్యక్తిగత డేటాపై ఎటువంటి నియంత్రణ లేకుండా అందిస్తోంది. బహుశా యూరోపియన్ యూనియన్ చట్టానికి లోబడి డేటా డిలిట్ రైట్ను వినియోగదారులకు అనుమతించి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. కనీస భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్నుటికీ ఫోర్డ్, చేవ్రొలెట్, టయోటా, వోక్స్వ్యాగన్ , BMW వంటి కార్ల బ్రాండ్లు ఏవీ కూడా గత మూడేళ్లుగా 68 శాతం డేటా లీక్‌లు, హ్యాక్‌లు లేదా ఉల్లంఘన బారిన పడుతున్నాయని మొజిల్లా ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్టడీపై టాప్ కంపెనీలేవీ ఇంకా ఎలాంటి స్పందన ప్రకటించలేదు. (రోజుకు రూ. 64 లక్షలు: ఇన్స్పిరేషనల్ సంజయ్ సక్సెస్ స్టోరీ తెలుసా?) కాగా ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్లు, భద్రత, డేటా నియంత్రణ, ఏఐ కి సంబంధించిన అన్ని రివ్యూల్లో ఫెయిల్ అనే విమర్శలను ఎదుర్కొంది. కస్టమర్ల కార్లలోని కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు,ఫోటోలు ను ఉద్యోగులు పంచుకోవడం దుమారాన్ని రేపింది. అయితే 2021లో, భద్రతాపరమైన ఆందోళనల కారణంగా చైనా సైనిక మిలిటరీకి ఈ వాహనాలను నిషేధించిన తర్వాత చైనాలో కెమెరాలు నిలిపివేసినట్టు టెస్లా ప్రకటించింది. -
పౌరుల డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధం : నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి, ఉపాధి కల్పనే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం దారికొస్తోందని, దీనిపై దీర్ఘకాలంపాటు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని కూడా ఈ సందర్భంగా విశ్లేషించారు. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వృద్ధి, దేశ సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశంగా పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీని కట్టడే లక్ష్యంగా మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 1.4 శాతం (ప్రస్తుతం 5.4 శాతానికి పెరుగుదల) పెంచిన నేపథ్యంలో సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. రెపో రేటు పెంపునకు తక్షణం ఇక ముగింపు పడినట్లేనా అన్న సందేహాలకు ఆమె ప్రకటన తావిస్తోంది. ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ►రిటైల్ ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా దిగివస్తోంది. దీనిని మనం నిర్వహించగలిగిన స్థాయికి తీసుకురాగలుగుతున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యతలు ఉపాధి కల్పన, వృద్ధికి ఊపును అందించడం. (ఆర్బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో 7.79 శాతం, మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతానికి దిగివచ్చింది. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4శాతం, 5.8శాతాలుగా నమోదవుతాయని ఆర్బీఐ పాలసీ అంచనావేసింది. 2023– 24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది. ► అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు వైఖరి నుండి ఉద్భవిస్తున్న అస్థిరతను ఎదుర్కొనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. భారత్ ద్రవ్య విధానాన్ని పెద్ద అవాంతరాలు లేదా తీవ్ర ఒడిదుడుకులు లేకుండా నిర్వహించగలమన్న ఆర్బీఐ అధికారులు విశ్వసిస్తున్నారు. ►కోవిడ్–19 కాలంలో కేంద్రం ఆర్థిక నిర్వహణ పటిష్టంగా ఉంది. లక్ష్యంతో కూడిన ఆర్థిక విధానంతో భారత్ డబ్బును ముద్రించకుండా సవాళ్లతో కూడిన సమాయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. ►రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభ వల్ల ముడి చమురు, సహజ వాయువు లభ్యతపై అనిశ్చితి కొనసాగుతోంది. ►చెల్లింపులకు సంబంధించి సాంకేతికతతో సహా అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్– అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. భారత్, అమెరికాలు కలిసి పని చేస్తే, మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 30 శాతానికి చేరుకుంటాం. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో 30 శాతం వాటాను అందిస్తాము. ఈ పరిస్థితి భారత్–అమెరిలను ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా మారుస్తుంది. ►భారత్ డేటా డేటా గోప్యత, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్రం కొత్త డేటా గోప్యతా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ►అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతల ను తీసుకోనుంది. డిసెంబర్ 1నుంచి 2023 న వంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల స మయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఐఎంఎఫ్ కోటా సమీక్ష సకాలంలో జరగాలి... కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్‌కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. జీ20 బాధ్యతలు స్వీకరించనున్న భారత్‌తో పలు అంశాలపై చర్చించడానికి దేశంలో పర్యటిస్తున్న ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివాతో సమావేశం అనంతరం కోటా అంశంపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
తప్పు చేశావ్ ట్విటర్! రూ.1163 కోట్ల ఫైన్ కట్టాల్సిందే?
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌కి షాక్ మీద షాక్ తగులుతోంది. ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించారంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. చేసిన తప్పులకు జరిమానాగా 150 మిలియన్ డాలర్లు (రూ. 1,163 కోట్లు) ఫైన్ కట్టాలంటూ తీర్పు ఇచ్చింది. ట్విటర్ సంస్థ 2013 మే నుంచి 2019 సెప్టెంబరు మధ్యలో ట్విటర్ యూజర్లకు సంబంధించిన ఫోన్ నంబరు ఇతర కీలక సమాచారాన్ని అడ్వెర్‌టైజర్లకు ఇచ్చిందనే ఆరోపణల మీద యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ)లు విచారణ చేపట్టాయి. సుదీర్ఘ కాలం కొనసాగిన విచారణ అనంతరం యూజర్ల డేటా ప్రైవసీ కాపాడటంతో ట్విటర్ విఫలమైనట్టుగా తేల్చాయి. దీంతో 150 మిలియన్ డాలర్లు ఫైన్‌గా విధించింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామని, అదే విధంగా యూజర్ల డేటా సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో న్యాయస్థానం చేసిన సూచనలకు తప్పకుండా పాటిస్తామని ట్విటర్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియేన్ కైరన్ తెలిపారు. గతంలో ప్రైవసీ హక్కుల ఉల్లంఘన విషయంలో ఫేస్బుక్ 2019లో 5 బిలియన్ డాలర్లను జరిమానాగా చెల్లించింది. చదవండి: గుడ్‌బై ట్విటర్.. ఇక సెలవు.. -
ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త..! సరికొత్త ప్రణాళికతో గూగుల్..అదే జరిగితే..!
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ త్వరలోనే శుభవార్తను అందించనుంది. యూజర్ల ప్రైవసీ విషయంలో భారీ మార్పులను తెచ్చేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. దీంతో ఆండ్రాయిడ్ యూజర్లకు యాపిల్ తరహాలో భద్రత కలగనుంది. యాపిల్ బాటలో... యాపిల్ బాటలోనే గూగుల్ నడవనుంది. ఐఫోన్లకు అందించే యూజర్ ప్రైవసీను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు తెచ్చేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. 2021 ఏప్రిల్‌లో ఐఫోన్ల కోసం కొత్త యూజర్ ప్రైవసీ పాలసీని యాపిల్ తీసుకొచ్చింది. దీని సహాయంతో థర్డ్ పార్టీ యాప్స్ సదరు యూజర్‌ను ట్రాక్ చేయకుండా చేసే ఫీచర్‌ను యాపిల్ అందిస్తోంది. ఇదే ఫీచర్ ను గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు తెచ్చే పనిలో పడింది. ప్రైవసీ సాండ్ బాక్స్..! థర్డ్ పార్టీ యాప్ యూజర్ల డేటాను షేర్ చేసే విషయంలో గూగుల్ కొత్తగా ప్రైవసీ సాండ్ బాక్స్ ఫీచర్ ను తీసుకురానుంది. ప్రైవసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆంథోనీ చవెజ్ ఓ బ్లాగ్‌లో అభిప్రాయాలను వెల్లడించారు. ప్రైవేట్ అడ్వర్టయిజింగ్ సొల్యూషన్లు, కొత్త ప్రైవసీని తీసుకొచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని మేం ప్రకటిస్తున్నమని చెప్పారు. థర్డ్ పార్టీలతో డేటాను షేర్ చేయడాన్ని తగ్గిస్తామని చెప్పారు. కాగా ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. అయితే ఈ పాలసీల్లో ఈ మార్పులను తీసుకొచ్చేందుకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని, దీన్ని అమలు చేసేందుకు భాగస్వాములతో కలిసి గూగుల్ పని చేస్తుందని ఆంథోని వెల్లడించారు. మరో వైపు ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో ట్రాకింగ్‌ను కట్టడి చేస్తే చాలా సంస్థలకు ఇబ్బందిగా మారే అవకాశము ఉన్నట్లు తెలుస్తోంది. -
చైనాకు భారత్ మరో షాక్.. 54 చైనా యాప్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: దేశ భద్రతకు, ప్రైవసీకి ప్రమాదంగా మారుతున్నాయంటూ మరో 54 చైనా మొబైల్ యాప్‌లను సోమవారం కేంద్రం నిషేధించింది. కేంద్ర హోం శాఖ సిఫార్సు మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ‘‘ఈ యాప్స్ యూజర్ల తాలూకు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని, ఎప్పటికప్పుడు శత్రు దేశపు సర్వర్లకు పంపుతున్నాయి. తద్వారా దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి సమస్యగా మారాయి. దేశ రక్షణకు కూడా ముప్పుగా తయారయ్యాయి’’ అని వివరించాయి. గెరెనా ఫ్రీ ఫైర్–ఇల్యుమినేట్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, నైస్‌వీడియో బైదు, వివా వీడియో ఎడిటర్, బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్డీ, మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ప్లస్, వాల్యూమ్ బూస్టర్, వీడియో ప్లేయర్స్, యాప్‌లాక్, మూన్‌చాట్, బార్కోడ్ స్కానర్–క్యూఆర్ కోడ్‌స్కాన్ వంటివి ఈ జాబితాలో ఉన్నట్టు వివరించాయి. -
Facebook Whatsapp: దొంగచాటుగా మెసేజ్‌లు చదువుతూ..
ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్.. వాట్సాప్ మొదటి నుంచి ఇస్తున్న భద్రత హామీ. యూజర్ల మధ్య జరిగే వాట్సాప్ చాట్, అందులోని ఇతరత్ర సమాచారం ఎట్టిపరిస్థితుల్లో మూడో మనిషి చేతికి వెళ్లదంటూ చెప్తూ వస్తోంది. అయితే వాట్సాప్ ఓనర్ కంపెనీ ఫేస్బుక్ ఈ విషయంలో నైతిక విలువల్ని పక్కనపెట్టిందన్న ఆరోపణలు ఫేస్‌బుక్‌పై వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఇన్వెస్టిగేషన్ మీడియా సంస్థ ‘ప్రొపబ్లికా ఇన్వెస్టిగేషన్’ కథనం ప్రకారం.. కోట్లలో యూజర్ల వాట్సాప్ అకౌంట్లపై ఫేస్బుక్ కన్నేసిందని, ఆస్టిన్, టెక్సాస్, డబ్లిన్, సింగపూర్లలో వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఈ వ్యవహారం నడిపిస్తోందని ఆరోపించింది. వాట్సాప్ నిఘాపై కన్నేయడంతో పాటు ఈ వ్యవహారం కోసం ఫేస్బుక్ తన సొంత ఆల్గారిథంనే ఉపయోగిస్తోందని ఈ కథనం వెల్లడించింది. చదవండి: యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ కన్నా దారుణంగా ఫేస్బుక్లో.. అయితే దొంగచాటుగా మెసేజ్‌లు చదువుతోందన్న ఆరోపణల్ని ఫేస్బుక్ ఖండించింది. కథనంలో ఆరోపిస్తున్న టీం.. వాట్సాప్ యూజర్ల ప్రైవసీని పరిరక్షించడమే పనిగా పెట్టుకుందని, యూజర్లు పంపించే రిపోర్ట్ అబ్యూజ్.. ఇతరత్ర ఫిర్యాదుల్ని సమీక్షించడం కోసమేనని చెప్పింది. ఎన్క్రిప్షన్ కారణంగా.. వాట్సాప్ కాల్స్, వ్యక్తిగత మెసేజ్‌లను ఫేస్బుక్ ఎట్టిపరిస్థితుల్లో చదవలేదని స్పష్టం చేసింది ఫేస్బుక్. అంతేకాదు ఫేస్బుక్ యూజర్ల విషయంలోనూ తాము భద్రతకు కట్టుబడి ఉన్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. 2014లో నాస్సెంట్ నుంచి వాట్సాప్ మెసేజింగ్ యాప్‌ను 19 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది ఫేస్బుక్. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి పైగా వాడుతున్న వాట్సాప్‌లో.. మొత్తంగా రోజుకి వెయ్యి కోట్లకి పైగా మెసేజ్‌లు పంపించుకుంటున్నారని అంచనా. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ల మధ్య సురక్షితమైన ఛాటింగ్ ఉంటుందని, యూజర్ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగబోదని ఫేస్బుక్-వాట్సాప్ ఎప్పటి నుంచో చెప్తోంది. క్లిక్: వాట్సప్ యూజర్లకు షాక్ -
మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు: సిద్ధార్థ్ కుటుంబం
బాలీవుడ్ నటుడు , బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 40 ఏళ్ల ఈ నటుడి మరణవార్త విని ఎందరో బాలీవుడ్ ప్రముఖులు, అతని అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఈ క్రమంలో నటుడి అంత్యక్రియల అనంతరం అభిమానులు, సన్నిహితులను ఉద్దేశించి సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. సిద్ధార్థ్ మరణంతో తాము షాక్‌లో ఉన్నామని.. ఈ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అతని జీవితంలో భాగమైన అందరికి సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్) "సిద్ధార్థ్ జీవితంలో భాగమై, అంతులేని ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఇక్కడితో ముగిసిపోలేదు. సిద్ధార్థ్ ఎల్లప్పుడూ మన గుండెల్లోనే నిలిచి ఉంటాడని’’ ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా సిద్ధార్థ్ తన ప్రైవసీకి ఎంతో విలువ ఇచ్చేవాడని, తాము అలాగే ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఆ విషయంలో తమను ఇబ్బంది పెట్టవద్దని సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు కోరారు. అతని అంతిమయాత్రకు సంబంధించి ఎంతో ఓపికతో వ్యవహారించిన ముంబై పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు. (చదవండి: 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు') హిందీలో హిట్ సీరియల్ బాలిక వధుతో గుర్తింపు పొందిన సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల్లో ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతోమంది సెలబ్రీటీలు సంతాపం తెలిపారు. సిద్ధార్థ్ మరణ వార్త తెలిసి అతని ప్రేయసీ, బిగ్‌బాస్ 13 పార్టిసిపెంట్ షెహనాజ్ కంటతడి పెట్టిన వీడియోలు నెటిజన్లను కలిచివేశాయి. వారిద్దరూ ఆ షో నుంచి "సిద్నాజ్"గా గుర్తింపు పొందారు. కాగా, వరుణ్ ధావన్, అలియా భట్ జంటగా నటించిన హంప్టీ శర్మకి దుల్హనియా సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైన సిద్ధార్థ్ అనతరం కొన్ని ప్రైవేట్ వీడియోల్లో నటించాడు. అందులో రెండింట్లో తన ప్రేయసి షెహనాజ్‌తో చేశాడు. సిద్ధార్థ్ తండ్రి చినప్పుడే మరణించగా ప్రస్తుతం తల్లితో పాటు ఇద్దరు అక్కలు ఉన్నారు. -
వాట్సాప్ స్కాన్.. ఫోన్లోని ఫొటోలన్నీ లీక్??
సోషల్ మీడియా యాప్‌లలో అభ్యంతకర కంటెంట్ వైరల్ కావడం ఈమధ్య కాలంలో పెరిగింది. ఈ తరుణంలో వాట్సాప్‌లోనూ అలాంటి వ్యవహారాలు నడుస్తుండగా.. ‘రిపోర్టింగ్’ ద్వారా సదరు యూజర్ అకౌంట్, గ్రూపుల మీద చర్యలు తీసుకుంటోంది వాట్సాప్. అయితే ఇలాంటి కంటెంట్ కట్టడి కోసం యాపిల్ తీసుకున్న ఓ నిర్ణయం.. యూజర్ ప్రైవసీకి భంగం కలిగించేదిగా ఉందన్న చర్చకు దారితీసింది. ఫొటో ఐడెంటిఫికేషన్ ఫీచర్ పేరిట ఐఫోన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలని.. తద్వారా వాట్సాప్ ఫొటోలను స్కాన్ చేసి ఆటోమేటిక్‌గా అభ్యంతరకర ఫొటోలను తొలగించే దిశగా యాపిల్ చర్యలు చేపట్టింది. కానీ, ఈ నిర్ణయాన్ని గట్టిగానే వ్యతిరేకిస్తోంది వాట్సాప్. ఈమేరకు వాట్సాప్ హెడ్ విల్క్యాథ్కార్ట్.. యాపిల్ కంపెనీ మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. అశ్లీలత కంటెంట్ గుర్తింపు-కట్టడి కోసం యాపిల్ ఎంతో కాలంగా కృషి చేస్తోంది. ఈ ప్రయత్నం అభినందనీయమే. కానీ, ఫొటో ఐడెంటిఫికేషన్ సాప్ట్వేర్ అనేది యూజర్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించాలనే ప్రయత్నంగా భావించాల్సి వస్తుంది అని విల్ పేర్కొన్నాడు. యాపిల్ రూపొందించబోయే సాఫ్ట్వేర్ కేవలం వాట్సాప్ స్కానింగ్‌తోనే ఆగదు. ఫోన్లోని వ్యక్తిగత ఫొటోలను, డేటాను సైతం స్కాన్ చేసే అవకాశం లేకపోలేదు. అంటే.. ఇది భద్రతాపరంగా కాకుండా.. యూజర్‌పై నిఘా వ్యవస్థలా పని చేస్తుంది. కాబట్టి ఇలాంటి టూల్స్‌ను వాట్సాప్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోదు. అని స్పష్టం చేశాడు విల్. మరోవైపు సైబర్ నిపుణులు కూడా వాట్సాప్ వాదనతో ఏకీభవిస్తున్నారు. ఇదిలా అశ్లీల కంటెంట్, ముఖ్యంగా చైల్డ్ ఎబ్యూజ్ కంటెంట్ కట్టడి కోసం చేసే ప్రయత్నమని యాపిల్ బలంగా చెప్తోంది. అయినప్పటికీ ‘రిపోర్ట్’ చేసే ఆప్షన్ యూజర్‌కి ఉండగా, వాళ్ల అనుమతి లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా ఫోన్‌ను, డివైజ్‌లను స్కానింగ్ చేయడం సరైందని కాదని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యాపిల్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. యూజర్ వ్యక్తిగత భద్రతపై ఎలాంటి హామీ ఇవ్వకుండానే.. ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఐవోస్, మాక్‌ఓస్, వాచ్ఓస్, ఐమెసేజ్ డివైజ్‌లలో వీలైనంత తొందరగా ఈ సాఫ్ట్‌వేర్‌ను యూజర్లకు అందించనున్నట్లు ప్రకటించింది. కొత్త వెర్షన్ అప్డేట్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ కథనాల మ్యాగజీన్ ‘ది వర్జ్’ ఓ కథనం ప్రచురించింది. -
మీ ఫేస్బుక్ అకౌంట్ భద్రమేనా..ఇలా చేస్తే బెటర్..!
ఇంటర్నెట్ యుగంలో ఫేస్బుక్ అకౌంట్ లేని వారు చాలా అరుదు. ఇతరులతో ఫేస్బుక్ మమేకమవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత్‌లో ఫేస్బుక్ అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, మనలో చాలా మంది ఫేస్బుక్లో కాలక్షేపం చేస్తూ అందులో మునిగితేలుతాము. కాగా ప్రస్తుతం హాకర్లు ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో యూజర్ల ఖాతాలనుంచి విలువైన సమాచారాన్ని పొందడానికి అనేక పద్దతులను వాడుతున్నారు. మన ఫేస్బుక్ ఖాతాలు హాకర్ల బారినుంచి తప్పించుకోవడానికి ఫేస్బుక్లో ఉండే సెట్టింగ్‌లతో హాకింగ్‌కు గురికాకుండా చూసుకోవచ్చును. మీ ఫేస్బుక్ ఖాతాను ఇలా భద్రపర్చుకోండి... స్టెప్ 1: ముందుగా మీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తరువాత కుడివైపు ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయండి. తరువాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీపై క్లిక్ చేయండి. స్టెప్ 2: మెను బార్ నుంచి ‘సెక్యూరిటీ అండ్ లాగిన్’పై క్లిక్ చేయండి. స్టెప్ 3: అందులో ‘వేర్ యూఆర్ లాగ్డ్ ఇన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్ మీరు ఫేస్బుక్లో లాగిన్ అయిన సెషన్లను చూపిస్తోంది. అందులో మీరు గుర్తించని లాగిన్ సెషన్లు ఏమైనా ఉంటే, త్రీ-డాట్ మెనుపై క్లిక్ చేసి, ‘లాగ్ అవుట్’ను ఎంచుకోవడం ద్వారా వెంటనే సంబంధిత సెషన్ నుండి లాగ్ అవుట్ అవ్వండి. ఒకవేళ మీరు అన్ని సెషన్ల నుంచి ఒకేసారి లాగ్అవుట్ అయ్యే అప్షన్ కూడా ఉంటుంది. స్టెప్ 4: తరువాత, ‘లాగిన్’ ఆప్షన్ కింద ఉన్న , ‘సేవ్ యూవర్ లాగిన్ ఇన్ఫర్మేషన్’ పై క్లిక్ చేయండి. ఇలా చేయడంతో మీరు లాగిన్ సమాచారం సేవ్ అవుతుంది. ఇది కేవలం మీరు మీ పర్సనల్ కంప్యూటర్ ఐతేనే ఇలా చేయాలి. స్టెప్ 5: సెట్టింగ్ మెనులో ఉన్న ‘టూ ఫ్యాక్టర్ అథనిటికేషన్( 2FA)’పై క్లిక్ చేసిన తరువాత ‘యూజ్ టూ ఫ్యాక్టర్ అథనిటికేషన్’ పై ఎడిట్ అప్షన్‌ను క్లిక్ చేయాలి. అథనిటికేటర్ యాప్‌తో లాగిన్ కోడ్‌ను జనరేట్ చేయవచ్చును. లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చును. ఈ ప్రాసెస్‌లో వచ్చిన బ్యాక్‌ఆప్ కోడ్స్‌ను మర్చిపోకూడదు. ఇలా చేయడంతో మీరు ఎక్కడైనా లాగిన్ కావాల్సిఉంటే 2FA ద్వారా లాగిన్ అవాల్సి ఉంటుంది. ముందుగా మీ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసిన తరువాత మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. లాగిన్ అయ్యే సమయంలో ఆరు అంకెల ఓటీపీ ఎంటర్ చేసిన తరువాతనే మీ అకౌంట్ మీ ముందు ప్రత్యక్షమైతుంది. స్టెప్ 6: ‘సెట్టింగ్ ఆప్ ఎక్సట్రా సెక్యూరిటీ’ అప్షన్ మీద క్లిక్ చేసి, లాగిన్ అలర్ట్ సెట్టింగ్‌ను అన్ చేయాలి. ఇది లాగిన్ అలర్ట్ ను అందిస్తోంది. ఒకవేళ మీ ఫేస్బుక్ అకౌంట్లోకి వేరే మొబైల్ నుంచి లాగిన్ అయితే వెంటనే గుర్తించి మీకు ఈ-మెయిల్ లేదా ఫేస్బుక్ మెసేంజర్‌కు మెసేజ్‌ను పంపి హెచ్చరిస్తుంది. స్టెప్ 7: చివరగా, ‘సెట్టింగ్ ఆప్ ఎక్సట్రా సెక్యూరిటీ’ ఆప్షన్లో భాగంగా ఫేస్‌బుక్‌లోని మీ ముగ్గురు నుంచి ఐదు స్నేహితులను ఎంచుకోండి. దీంతో మీరు ఎప్పుడైనా మీ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతే వారి అకౌంట్లనుపయోగించి లాగిన్ అవ్వచ్చును. చదవండి: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కొత్త బెడద..! వారికి మాత్రం పండగే... -
భర్త ఫోన్‌పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు
దుబాయ్: ''నా అనుమతి లేకుండా భార్య తన ఫోన్లోని ఫోటోలను వేరేవాళ్లకు పంపించి ప్రైవసీకి భంగం కలిగించింది. నాపై నిఘా పెట్టిందని.. అది నాకు ఇష్టం లేదని.. నష్ట పరిహారం ఇప్పించాలంటూ'' కోర్టుకెక్కాడు. అతని వాదనలు విన్న కోర్టు వ్యక్తి భార్యకు 5,400 దిర్హమ్లను నష్టపరిహారంగా చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. ఈ వింత ఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. అబుదాబికి చెందిన దంపతులు పెళ్లైన కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కాలం గడిచు కొద్ది భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. తన భర్త ఆమెకు తెలియకుండా ఫోన్లో ఏవో సీక్రెట్స్ దాస్తున్నాడని తనలో తాను భావించింది. ఈ క్రమంలో ఆమె తన భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది. అంతటితో ఊరుకోకుండా తన భర్త ఫోన్లో ఉన్న ఫోటోలను అతనికి తెలియకుండా తన వాళ్లకే పంపించింది. విషయం తెలుసుకున్న భర్త భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. భర్త తరపు లాయర్ మాట్లాడుతూ... '' తన క్లయింట్ వ్యక్తిగత గోప్యతను అతని భార్య హరించింది. అతని అనుమతి లేకుండా ఫోటోలను కుటుంబసభ్యులకు పంపించి అతన్ని మానసిక ఒత్తిడికి గురయ్యేలా చేసింది. ఈ కేసు కారణంగా అతను ఉద్యోగానికి కూడా వెళ్లలేకపోయాడని.. దీంతో అతను ఆర్థికంగా నష్టపోయాడు'' అని తన వాదన వినిపించాడు. ఇంతలో భార్య తరపు లాయర్ మాట్లాడుతూ.. తన క్లయింట్ ఎటువంటి తప్పు చేయలేదని.. భర్త చేతిలో తాను మానసిక క్షోభను అనుభవించిందని తెలిపాడు. ఇరువరి వాదనలు విన్న కోర్టు భర్త ప్రైవసీకి భంగం కలిగించి అతని గోప్యతను దెబ్బతీసిన అతని భార్యకు 5,400 దిర్హమ్లు( రూ. లక్ష) నష్టపరిహారంగా చెల్లించాలంటూ వినూత్న తీర్పు ఇచ్చింది. చదవండి: ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్ ‘క్యూబూల్ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు -
కేంద్రం కొత్త నిబంధనలపై వాట్సాప్ న్యాయపోరాటం
-
WhatsAp: కొత్త ఐటీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చిన నూతన డిజిటల్ (ఐటీ) నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలియజేసింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్‌ల సదుపాయం తమ ఖాతాదారులకు ఉందని గుర్తుచేసింది. సందేశం పంపినవారు, స్వీకరించిన వారు తప్ప ఇతరులు ఆ మెసేజ్‌లను చదివే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం కోరినపుడు లేదా కోర్టులు అడిగినపుడు తొలుత సందేశాన్ని సృష్టించిన వారిని గుర్తించాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయని, ఇది సరైన విధానం కాదని వెల్లడించింది. దీనివల్ల ఖాతాదారుల గోప్యతకు భంగం కలుగుతుందని వాట్సాప్ ఆందోళన వ్యక్తం చేసింది. వాట్సాప్‌లో ఒక సందేశం మొదట ఎక్కడ పుట్టింది, దాన్ని మొదట ఎవరు సృష్టించారు అనేది గుర్తించి, ధ్రువీకరించాలని ఆదేశించడం... గోప్యత హక్కుకు భంగకరమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. పౌర సమాజంతో కలిసి పనిచేస్తాం: వాట్సాప్ కొత్త ఐటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో తాము వ్యాజ్యం దాఖలు చేయడం నిజమేనని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలియజేశారు. ‘‘కొత్త డిజిటల్ నిబంధనలు అనుచితంగా ఉన్నాయి. వాట్సాప్‌లో ఒకరికొకరు పంపుకొనే మెసేజ్‌లను ట్రేస్ చేయాలని, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వం చెబుతోంది. ఇలా చేయడం అంటే వాట్సాప్‌లో షేర్ అయ్యే ప్రతి ఒక్క మెసేజ్ తాలూకు సమాచారాన్ని భద్రపర్చమని కోరడమే. అలాగే ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేసినట్లు అవుతుంది. కోట్లాది మంది ప్రజల గోప్యత హక్కును కూడా పణంగా పెట్టినట్లే. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులైన... గోప్యత హక్కు, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే హక్కును ఉల్లంఘించడమే’ అని బుధవారం వాట్సాప్ పేర్కొంది. డాక్టర్లు– పేషెంట్లు, లాయర్లు– కక్షిదారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు... ఇలా ఎందరో వాట్సాప్ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని పంచుకుంటారంది. తమ ఖాతాదారుల ప్రైవసీని కాపాడడానికి పౌర సమాజంతో, ప్రపంచవ్యాప్తంగా నిపుణులతో కలిసి పని చేస్తామని తెలిపింది. 36 గంటల్లోగా తొలగించాల్సిందే.. సామాజిక మాధ్యమాల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు–2021ను ప్రకటించింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఏదైనా కంటెంట్‌ను తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే సోషల్ మీడియా కంపెనీలు 36 గంటల్లోగా తొలగించాలి. ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిపై స్పందించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్టు ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. అభ్యంతరకరమైన సందేశాలు, అశ్లీల ఫొటోలు, వీడియోలను (పోర్నోగ్రఫీ) తొలగించడానికి ఆటోమేటెడ్ ప్రాసెస్ వాడాలి. ఏదైనా సందేశాన్ని/ సమాచారాన్ని మొదట ఎవరు సృష్టించారనేది గుర్తించే ఏర్పాటు ఉండాలని కొత్త నిబంధనల్లోని రూల్ 4(2) చెబుతోంది. దీనినే వాట్సాప్ కోర్టులో సవాల్ చేసింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి నూతన ఐటీ నిబంధనలను అంగీకరించడానికి కేంద్రం 3నెలల గడువిచ్చింది. ఇది మంగళవారంతో ముగిసింది. సోషల్ మీడియా సంస్థలకు ఇదివరకు ‘మధ్యవర్తి హోదా’తో రక్షణ ఉండేది. తమ ఖాతాదారులు పోస్ట్ చేసే కంటెంట్‌కు సంబంధించి వీటిపై క్రిమినల్ కేసులు, నష్టపరిహారం కేసులకు వీల్లేకుండా ఈ మధ్యవర్తి హోదా కాపాడేది. కొత్త ఐటీ నిబంధనలను అంగీకరించకపోతే ఈ ‘మధ్యవర్తి హోదా’ను కోల్పోతాయి. ఫలితంగా ఎవరు, ఏది పోస్ట్ చేసినా దానికి ఈ సామాజిక మాధ్యమాలు బాధ్యత వహించాల్సి వస్తుంది. అత్యంత తీవ్ర నేరాలను అడ్డుకునేందుకే! కొత్త నిబంధనలన్న ఐటీ శాఖ న్యూఢిల్లీ: దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే అత్యంత తీవ్ర నేరాలకు సంబంధించిన విషయాల్లో సోషల్ మీడియాలో ప్రచారమైన సందేశాల మూలం తెలుసుకునేందుకే కొత్త డిజిటల్ నిబంధనలను తీసుకువచ్చామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. వ్యక్తుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర ఐటీ శాఖ పేర్కొంది. విదేశాలతో సత్సంబంధాలు, దేశ రక్షణ, దేశంలో శాంతి భద్రతలు మొదలైనవాటికి విఘాతం కలిగించే అవకాశమున్న నేరాలు, లైంగిక నేరాలు, చిన్నారులపై లైంగిక దాడులు తదితరాలను అడ్డుకోవడానికి, అలాంటి తీవ్ర నేరాల విచారణకు సంబంధిత సోషల్ మీడియా సందేశాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో, ఎలా వ్యాప్తి చెందాయో తెల్సుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాంటి సందేశాల వివరాలు వాట్సాప్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పంచుకోవాల్సి ఉంటుందని వివరించింది. డిజిటల్ నిబంధనలను ‘వాట్సాప్’ చివరి నిమిషంలో కోర్టులో సవాలు చేయడం దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల్లో అమల్లో ఉన్న నిబంధనలతో పోలిస్తే.. భారత్ ప్రతిపాదిస్తున్న నిబంధనలు అంత తీవ్రమైనవి కావని వెల్లడించింది. ప్రైవసీ హక్కును ప్రాథమిక హక్కుగా తమ ప్రభుత్వం గుర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనలతో వాట్సాప్ సాధారణ కార్యకలాపాలకు, వాట్సాప్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఐటీ మంత్రి రవిశంకర్ తెలిపారు. వారి కాంటాక్ట్ వివరాలు ఇవ్వండి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలను పాటించే విషయంలో తాజా పరిస్థితిని తక్షణమే తమకు తెలియజేయాలని కేంద్ర ఐటీ శాఖ ప్రధాన సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. అప్రమత్తతతో వ్యవహరించాలంది. తాజా సోషల్ మీడియా నిబంధనల్లో పేర్కొన్న మేరకు.. భారత్‌లోని తమ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్ల వివరాలను తమకు అందించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. సంబంధిత సామాజిక మాధ్యమానికి చెందిన యాప్ పేరు, వెబ్సైట్ పేరు, అందించే సేవలు వివరాలను తెలియజేయాలంది. ఒకవేళ తాము ఈ నిబంధనల పరిధిలోకి రామని భావిస్తే అందుకు కారణాలను వెల్లడించాలి. సాధ్యమైనంత త్వరగా, వీలైతే ఈ రోజే తాము కోరిన వివరాలను అందించాలని బుధవారం ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర ప్రధాన సోషల్ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఆదేశాలను పాటించని పక్షంలో అవి ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌలభ్యాలను కోల్పోవడంతో పాటు, వాటిపై వచ్చే ఫిర్యాదులపై చట్టబద్ధంగా క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని హెచ్చరించింది. ఇదీ ‘సోషల్ పవర్’ సోషల్ మీడియా వేదికలకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలో వివిధ సంస్థలకు ఉన్న వినియోగదారుల సంఖ్య ఇలా ఉంది. వాట్సాప్ 53 కోట్లు ఫేస్బుక్ 41 కోట్లు యూట్యూబ్ 44.8 కోట్లు ఇన్స్టాగ్రామ్ 21 కోట్లు ట్విట్టర్ 1.75 కోట్లు -
ప్రమాదంలో 10 కోట్ల మంది మొబైల్ యూజర్ల డేటా
స్మార్ట్ఫోన్ల వాడకం రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూ పోతుంది. దీని వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పనులు ఈజీగా మారాయని సంతోషించే లోపే సైబర్ నేరగాళ్ల దాడితో భద్రత కరువై పోతోంది. కరోనా కాలంలో సైబర్ దాడులు ఎక్కువ అయ్యాయి. తాజాగా చెక్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు కొన్ని ఆండ్రాయిడ్ యాప్‌లు స్మార్ట్ ఫోన్ యూజర్ల డేటాను కాజేస్తున్నట్లు వెల్లడించారు. చెక్‌పాయింట్ రీసెర్చ్ పరిశోధకులు ఈ యాప్‌ల జాబితాను విడుదల చేశారు. భారీగా డౌన్లోడ్ చేసిన కొన్ని ప్రసిద్ధ యాప్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి పలు యాప్‌లను 10 కోట్ల మంది తమ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ యాప్‌ల్లో కొన్ని ఆస్ట్రాలజీ, ఫ్యాక్స్, ట్యాక్సీ సర్వీసెస్, స్క్రీన్ రికార్డింగ్ కు సంబంధించినవి ఉన్నాయని చెక్‌పాయింట్ రీసెర్చ్ నివేదిస్తుంది. వీటిలో ముఖ్యంగా ఆస్ట్రోగురు, టీలావా (ట్యాక్సీ యాప్), యాప్ లోగో మేకర్ వంటి యాప్‌లున్నాయి. ఈ యాప్‌ల్లోని లోపాల కారణంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉంది. ఈ-మెయిల్, పాస్వర్డ్, పేరు, పుట్టిన తేదీ, లింగ సమాచారం, ప్రైవేట్ చాట్, పరికర స్థానం, వినియోగదారు ఐడెంటిఫైయర్లు వంటి సమాచారం ఇందులో ఉంది. ఆ మాల్వేర్ యాప్‌లు వినియోగదారు సమాచారం, డేటాను సేకరిస్తున్నాయి కాబట్టి ఈ యాప్స్ ను వెంటనే డిలీట్ చేయాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న వాట్సాప్ -
రెండు స్మార్ట్ఫోన్లు.. అద్భుత కెమెరా (స్పాన్పర్డ్)
వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై శాంసంగ్ పలు అప్డేట్స్ అందిస్తోంది. వీటిలో మీ గ్యాలరీ, వెబ్‌బ్రౌజర్, వాట్సాప్ వంటి యాప్స్‌ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్స్ మధ్య మార్చేందుకు వెసులుబాటు కల్పించే క్విక్ స్విచ్ కీలకమైనది. ఫీచర్ భాగస్వామి, హెచ్‌టీ బ్రాండ్ స్టూడియో మనం తీపిజ్ఞాపకాలను నిక్షిప్తం చేయడం, ఫ్రెండ్స్‌తో గేమ్స్ ఆడటం, ఓటీటీ కంటెంట్ వీక్షించడం, స్కూల్/వర్క్ కోసం వీడియో కాల్స్ మాట్లాడటం, నోట్స్ రాసుకోవడం వంటి పలు పనులను చక్కబెట్టేందుకు మనం స్మార్ట్ఫోన్లను వాడుతుంటాం. నిత్య జీవితంలో ప్రతి విషయంలోనూ స్మార్ట్ఫోన్లు మనకు ఉపకరిస్తున్నాయి గేమింగ్, ఫోటోలను క్లిక్ చేయడం, ప్రొఫెషనల్ వర్క్ పూర్తి చేయడం వంటి అన్ని అవసరాలను నెరవేర్చేలా శాంసంగ్ గెలాక్సీ ఏ51, దీని బిగ్ బ్రదర్ గెలాక్సీ ఏ71అందుబాటులోకి వచ్చాయి. రెండు స్మార్ట్ఫోన్లు అద్భుతమైన స్క్రీన్, అత్యద్భుత కెమేరా, దీర్ఘకాలం మన్నే బ్యాటరీ లైఫ్ అనుభవాన్ని మనకు అందస్తాయని శాంసంగ్ భరోసా ఇస్తోంది. ►గెలాక్సీ ఏ51 ఈఏడాది తొలి క్వార్టర్లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచిందని పరిశోధన సంస్థ స్ట్రేటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది ►మరి వీటిలో ఇంకా మెరుగైన విషయం ఏంటంటే ఈ స్మార్ట్ఫోన్లతో మీరు మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచే అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. అల్ట్ జడ్ జీవితం : ప్రైవసీకి ప్రాధాన్యం నేటి ఆధునిక జీవితంలో జనరేషన్ జడ్, మిలీనియల్స్ వారి స్మార్ట్ఫోన్లకు సంబంధించి పలు ప్రైవసీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ అల్ట్ జడ్ జీవితానికి మార్గం సుగమం చేసింది. మీ ప్రైవసీపై ఎలాంటి ఆందోళనకు గురవకుండా గెలాకీ ఏ51, గెలాక్సీ ఏ71తో మీరు అన్ని ఫీచర్లను మీరు ఆస్వాదించవచ్చు. ►మీ స్మార్ట్‌ఫోన్‌ను చూస్తామని మీ స్నేహితులు, సోదరులు అడిగిన ప్రతిసారీ ఎంతో అసౌకర్యంగా ఫీలవుతుంటా. వారు మీరు తీసిన ఓ ఫోటో కోసమో, మీరు సూచించిన గేమ్‌ను ఆడేందుకో వారు మీ స్మార్ట్‌ఫోన్‌ను అడిగినా మీరు కొంత అసౌకర్యానికి లోనవుతుంటారు. ►ఈ సమయాల్లో మీరు ఎలాంటి ఆందోళన, విచారం లేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ను వారికి అందించే రెండు ఫీచర్లను శాంసంగ్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై ప్రవేశపెట్టింది. ►క్విక్ స్విచ్ పేరుకు తగ్గట్టే మీ స్మార్ట్‌ఫోన్‌లో మీరు గ్యాలరీ, వాట్సాప్, ఇతర యాప్స్‌ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్‌లోకి వేగంగా మార్చేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. పవర్ బటన్‌ను రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆఫీస్‌లో మీరు ప్రెజెంటేషన్ ఇవ్వడం, మీ ఆఫీస్‌లో పార్టీకి సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులకు చూపే సందర్భాల్లో క్విక్ స్విచ్ మీకు మీ జీవితాన్ని కాపాడే కీలక ఫీచర్‌గా ముందుకొస్తుంది. ►ఇక స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన ఏఐ ఆధారిత సొల్యూషన్‌గా ఇంటెలిజెంట్ సజెషన్స్ గ్యాలరీలో ప్రైవేట్ వెర్షన్లో భద్రంగా కాపాడే ఫోటోలను గుర్తించి సూచనలు చేస్తుంది. వారాంతం వెకేషన్ నుంచి నేరుగా ఆఫీస్‌కు వెళ్లడం వంటి పలు సందర్భాల్లో ఈ ఫీచర్ మీకు ఉపకరిస్తుంది. ప్రైవేట్‌గా ఉంచదలిచిన ఫోటోలు,ఇమేజ్‌లను మీరు ఎంపిక చేస్తే వాటిని ఎవరి కంటా పడకుండా ఏఐ మిగిలిన పని చక్కబెడుతుంది. ప్రముఖ వినూత్న ప్రైవసీ ఫీచర్లు ►నటి రాధికా మదన్ క్విక్ స్విచ్ పవర్‌ను ఉపయోగించి తన సోదరి (శిఖా తల్సానియ) ఆమె ఊహించిన దాని కంటే భిన్నమైనవి చూసేలా చేశారో గమనించవచ్చు ►ఫీచర్లను మరింత మెరుగ్గా అర్దం చేసుకోవడానికి వీడియోను వీక్షించండి ►ఈ తరహా ప్రైవసీని ఆస్వాదించేందుకు ఎవరు మాత్రం ఇష్టపడరు? గెలాక్సీ ఏ51, ఏ71 స్మార్ట్ఫోన్ల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో బహుళ భద్రత లేయర్లతో కూడిన శాంసంగ్ నాక్స్ భద్రతతో క్విక్ స్విచ్ రూపొందింది. విశిష్ట కెమెరా ఫీచర్లు ఈ రెండు ఫోన్ల విశిష్ట కెమెరా ఫీచర్లను పరిశీలిద్దాం ►మీ ఫ్రెండ్ రన్నింగ్ రేస్ ఫోటోను సమగ్రంగా కెమెరాలో క్లిక్ చేయాలనుకుంటున్నారా? ఇండియా గేట్ వైడ్ యాంగిల్ షాట్ తీయాలనుకుంటున్నారా? మీ ఫ్రెండ్ పోర్ట్రయిట్‌ను కెమెరాలో బంధించాలనుకుంటున్నారా? ఆకుపై వాలిన కీటకాన్ని ఫోటో తీయాలనుకుంటున్నారా? గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71తో ఇవన్నీ సాధ్యమే. ఈ రెండు స్మార్ట్ఫోన్లు తమ సొంతవైన క్వాడ్-కెమెరా సెటప్స్‌తో ముందుకొచ్చాయి. ►గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 12-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో ముందుకొచ్చింది. ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ►ఇక గెలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్‌పై 64-మెగాపిక్సెల్ లెన్స్, 12-మెగాపిక్సెల్ అల్ర్టా-వైడ్ లెన్స్‌లు, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, రియర్పై 5-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ►గెలాక్సీ ఎస్20 నుంచి అద్భుత కెమెరా ఫీచర్లను గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లకు శాంసంగ్ అందిస్తోంది. మిమ్మల్ని ఉద్వేగానికి గురిచేసే ఫీచర్లను ఓసారి ప్రయత్నించండి సింగిల్ టేక్ : ఇది గెలాక్సీ ఎస్20ల్లో ఉత్తమ ఫీచర్, ఇది ఇప్పుడు గెలాక్సీ ఏ51పై అందుబాటులో ఉండటం వినియోగదారులకు సంతోషకరమైన అంశం. సింగిల్ టేక్ ఫీచర్ 10 ఫోటోలు, వీడియోల వరకూ క్యాప్చర్ చేస్తుంది. సరైన ఫోటోను ఎలా ఫ్రేమ్ చేయాలని మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. కెమెరాను ఓపెన్ చేసి సింగిల్ టేక్‌ను సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ►ఫోటోలను చూసేందుకు గ్యాలరీకి వెళ్లడం మామూలే. శాంసంగ్ సింగిల్ టేక్ ఫీచర్ మీ ఫోటోల్లో బెస్ట్ షాట్స్, మొమెంట్స్ను ఎంపిక చేసి వాటన్నింటినీ ఒక ఆల్బమ్‌లో అమర్చుతుంది. ఏఐని వాడుతూ మీరు షార్ట్ మూవీని, జీఐఎఫ్ యానిమేషన్స్ను, పలు స్టైలైజ్డ్ ఇమేజ్‌లను పొందవచ్చు. నైట్ హైపర్‌లాప్స్ : పర్యాటకుడిగా నగరాన్ని చుట్టిరావడం గొప్ప అనుభూతి. ఆ క్షణాలను ఫోటోలుగా మలచి ఆ తర్వాత వాటిని చూసి మురిసిపోవడం మనందరం ఇష్టంతో చేసే పనే. ప్రజలు తమ సమయాన్ని ఆస్వాదించే వీడియోలను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించే హైపర్‌లాప్స్ ఫీచర్‌కు ఆదరణ పెరుగుతోంది ►శాంసంగ్ నైట్ హైపర్‌లాప్స్ ఫీచర్ ద్వారా గెలాక్సీ ఏ51పై హైపర్‌లాప్స్ వీడియోలు అర్ధరాత్రిలో క్యాప్చర్ చేసినా అత్యంత స్పష్టంగా, బ్రైట్‌గా ఉంటాయి. లాంగ్-ఎక్స్పోజర్ షాట్లను కాంతి, చలన మార్గాలతో వీడియో ఆర్ట్ పనిగా మార్చబడతాయి. కస్టమ్ ఫిల్టర్ : మీ ఫోటోలపై మీరు సొంతంగా వినూత్నంగా తీర్చిదిద్దుకునే నూతన పద్ధతిని ఇది అందుబాటులోకి తీసుకువస్తుంది. కలర్స్‌ను ఎంపిక చేసుకోవడం నుంచి భిన్నమైన షేడ్స్‌తో కూడిన బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడం వరకూ మీకు వెసులుబాటు కల్పిస్తుంది. న్యూ కస్టమ్ ఫిల్టర్ మోడ్ మీకు విస్తృత ఊహాశక్తికి ఊతమిస్తుంది. స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ : ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్‌లో ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటే కెమెరా తెలివిగా వైడ్ యాంగిల్ మోడ్‌లోకి వెళుతుంది. ప్రతిసారి అద్భుత సెల్ఫీలు తీసుకోవచ్చు. క్విక్ వీడియో : కెమెరా బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా క్విక్ వీడియోను తీసుకోవచ్చు. వీడియో మోడ్‌ను పొందేందుకు సెట్టింగ్స్‌లో కుస్తీ పడుతూ వీడియో తీసే సమయాన్ని మిస్ అవడం వంటి రోజులకు కాలం చెల్లింది. మీ స్మార్ట్‌ఫోన్ తీసుకుని కెమెరా బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ప్రత్యేక క్షణాలను వెంటనే రికార్డ్ చేయవచ్చు. మీ ఫ్రెండ్ రన్నింగ్ రేసు లేదా మీ బర్త్‌డే పార్టీలో మీ బంధువు పాట పాడటం వంటివి ఏవైనా వెంటనే వీడియో రికార్డు చేయవచ్చు. రికార్డింగ్‌లో స్విచ్ కెమెరా : ఫ్రంట్ నుంచి రియర్ కెమెరాకు మారేందుకు రికార్డింగ్‌ను నిలిపివేయడం, మళ్లీ ఫ్రంట్ కెమెరాకు మారడం వంటివి ఏమంత సౌకర్యంగా ఉండవు. గెలాక్సీ ఏ51లో లభించే ఫీచర్‌తో మీ మధురమైన క్షణాలను ఎలాంటి అవాంతరం లేకుండా రికార్డింగ్ చేస్తూనే ఫ్రంట్, రియర్ కెమెరాలకు మారే వెసులుబాటు ఉంటుంది ఏఐ గ్యాలరీ జూమ్: ఏఐ గ్యాలరీ జూమ్‌తో మీ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ తక్కువ రిజల్యూషన్ కలిగిన ఇమేజ్‌ల నాణ్యతను మెరుగుపరిచేందుకు అనుమతిస్తుంది. బ్లర్, పిక్సలేటెడ్ ఇమేజ్‌లను ఆర్ట్ వర్క్స్‌గా మెరుగుపరుస్తుంది గెలాక్సీ ఏ51 గురించి మరిన్ని వివరాలు ►ఇది రెండు వెర్షన్లలో లభిస్తుంది ►6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ - రూ . 22,999 ►8జీబీ ర్యామ్ మరియు 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ - రూ . 24,499 ►ఈ రెండు వెర్షన్లు ప్రిస్మ్ క్రష్ వైట్, ప్రిస్మ్ క్రష్ బ్లాక్, ప్రిస్మ్ క్రష్ బ్లూ, హేజ్ క్రష్ సిల్వర్ వంటి నాలుగు రంగుల్లో లభిస్తాయి. గెలాక్సీ ఏ51 కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ►గెలాక్సీ ఏ51 6.5 ఇంచ్‌ల సూపర్ అమోల్డ్ ఫుల్- హెచ్డీ+ (1080x2400 పిక్సెల్స్) డిస్ప్లేతో ముందుకొస్తోంది. ఆక్టా-కోర్ ఎక్సినాక్స్9611 ఎస్ఓసీ ఆధారిత పంచీ డిస్ప్లేతో అందుబాటులో ఉంది. మీరు మీ స్నేహితులు ఎలాంటి అసౌకర్యానికి లోనవకుండా ఫోటోలను, యూట్యూబ్ వీడియోలను వీక్షించదగిన గొప్ప వీక్షణా యాంగిల్స్‌తో కూడిన డిస్ప్లే ఆకట్టుకుంటుంది. ►ఈ స్మార్ట్‌ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందుబాటులో ఉంది. దీర్ఘకాలం గేమింగ్, అపరిమిత వాచింగ్ సెషన్స్‌కు సరిపడా చార్జింగ్ సామర్ధ్యం కలిగిఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఒన్ యూఐ 20 సాఫ్ట్‌వేర్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. గెలాక్సీ ఏ 71పై ఇతర మెరుగైన ఫీచర్లు ►గెలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచ్‌ల (1080x2400 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-0 సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730 ఓక్టా-కోర్ చిప్సెట్తో ముందుకొచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో దైనందిన జీవితంలో భిన్నమైన టాస్క్‌లను నిర్వర్తించే వెసులుబాటు కల్పిస్తుంది. ►4500 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కల్పిస్తుంది. గెలాక్సీ ఏ71 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ . 29,499 ►ఆకర్షణీయ ప్యాకేజ్, దీర్ఘకాల వీక్షణ, కాల్ ఆఫ్ డ్యూటీ : రెండు స్మార్ట్ఫోన్లపై మొబైల్ సెషన్లు, ఫోటో షూట్లు ఆహ్లాదభరిత అనుభూతిని అందిస్తాయి. వాటిపై ఏ టాస్క్‌ను మీరు ప్రయత్నించినా విశ్వాసంతో వాటిని నిర్వర్తిస్తాయి. అంతేనా..మీ స్మార్ట్‌ఫోన్ గోప్యతను చెక్కుచెదరకుండా ఉంచడం గురించి మీరు ఇక బాధపడరు! -
ఇది చాలా సరళమైన ప్రక్రియ! (స్పాన్పర్డ్)
మీ స్మార్ట్‌ఫోన్ ప్రైవసీ కష్టాలన్నింటికీ శాంసంగ్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ సరైన సమాధానం. జనరేషన్ జడ్, మిలీనియల్స్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫీచర్లు యూజర్‌కు పూర్తి ప్రైవసీని అందించడమే కాకుండా మనశ్శాంతిని అందిస్తాయి. పూర్తి వివరాలను పరిశీలిద్దాం.. ఫీచర్ భాగస్వామి : హెచ్‌టీ బ్రాండ్ స్టూడియో ఇలా ఊహించుకోండి : మీరు ఆఫీసులో ఉండగా మీ బాస్‌పై చేసిన మీమ్స్‌ను చూసేందుకు మీ కొలీగ్స్ మీ ఫోన్ చుట్టూ గుమికూడారు. మీతో సహా వారంతా ఆ మీమ్స్ చూసి నవ్వు ఆపుకోలేని పరిస్ధితి. హఠాత్తుగా మీ బాస్ అక్కడ ప్రత్యక్షం కావడంతో మీరు అచేతనంగా చూస్తుండిపోయారు. బాస్ నా ఫోన్ అడిగితే అప్పుడు ఏం చేయాలి? తర్వాత ఏమవుతుంది? అని మీ మనసులో అలజడి రేపుతుంది. ఇలాంటి క్షణాల్లో మీమ్ కనిపించని వెర్షన్‌లోకి మారిపోయే ఫీచర్ మీ ఫోన్లో ఉండటం మీరు ఇష్టపడతారు కదా? దీన్ని మీకు మేం అందిస్తాం! క్విక్ స్విచ్ : కేవలం డబుల్ క్లిక్‌తో మీ ప్రైవసీ పటిష్టం క్విక్ స్విచ్ పేరిట శాంసంగ్ వినూత్నమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్లో క్షణాల వ్యవధిలో ఫోటోలను ప్రైవేట్ నుంచి మెయిన్ గ్యాలరీకి తరలించవచ్చు. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడంతోనే ఈ వెసులుబాటు లభిస్తుంది. ఇది చాలా సరళమైన ప్రక్రియ! ఈ ఫీచర్ నటి రాధికా మోహన్‌కు ఎలా ఉపయోగపడిందో చూద్దాం. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై అందుబాటులో ఉన్న క్విక్ స్విచ్ వాట్సాప్, బ్రౌజర్, ఇతర యాప్ప్పైనా పనిచేస్తుంది. దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. జనరేషన్ జడ్, మిలీనియల్స్ కోరుకునే వెసులుబాటు, అవాంతరాలు లేని అనుభూతిని క్విక్ స్విచ్ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇది మీ వ్యక్తిగత జీవితానికి రహస్య లాకర్‌గా మీరు భావించవచ్చు ఫ్రెండ్ లేదా కొలీగ్‌కు స్మార్ట్ఫోన్లు ఇవ్వాలంటే తటపటాయించే రోజులు పోయాయి. వారికి ఫోన్ ఇస్తే వారు నా కంటెంట్, చాట్లను చూస్తారు కదా ? అనే భయాలు యూజర్ మనసులో మెదిలేవి. వీటన్నింటికీ క్విక్ స్విచ్ సరైన సమాధానంగా ముందుకొచ్చింది. మరోవైపు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై ఉండే సెక్యూర్ ఫోల్డర్లో ఉండే ఆయా యాప్స్ ప్రైవేట్ వెర్షన్లను శాంసంగ్ నాక్స్ భద్రత కాపాడుతుంది. క్విక్ స్విచ్‌తో కూడిన మీ స్మార్ట్‌ఫోన్‌ను నిరభ్యంతరంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఎవరికైనా ఇవ్వవచ్చు. మీ ఫోన్ లాక్ చేయడం మరిచిపోయినా భయపడాల్సిన పనిలేదు! మీ ప్రైవేట్ సమాచారాన్ని మీరు మినహా మరెవరూ చూడకుండా క్విక్ స్విచ్ కాపాడుతుంది. ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ - మీకు అవసరమని మీరు ఊహించని వినూత్న ఆవిష్కరణ శాంసంగ్ ప్రైవసీ వినూత్న ఫీచర్లకు జోడింపుగా ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో నిర్మితమైన ఏఐ ఫీచర్‌గా ఇది గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లకు పూర్తి ప్రైవసీని కల్పిస్తుంది. ముందుగా గుర్తించిన ఫోటోల ఆధారంగా ఆయా ఫోటోలను సెక్యూర్ ఫోల్డర్‌కు ఇది తరలిస్తుంది. మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ వీడియో వీక్షించండి మీరు మీ సోదరికి చెప్పకుండా హాజరైన పార్టీకి సంబంధించిన ఫోటోలను ఆమె కంటపడటం నుంచి ఈ ఫీచర్ మిమ్మల్ని కచ్చితంగా కాపాడుతుంది. మధ్యశ్రేణి సెగ్మెంట్‌ను బలోపేతం చేసిన శాంసంగ్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లతో ఒత్తిడి రహిత అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్‌తో మీ స్పేస్ ఎప్పటికీ మీకు సురక్షితమైన స్పేస్గానే ఉంటుంది. జనరేషన్ జడ్, మిలీనియల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ ఫీచర్లు యూజర్‌కు పూర్తి ప్రైవసీని, మనశ్శాంతిని అందిస్తాయి. స్మార్ట్ఫోన్లలో నిక్షిప్తమైన వ్యక్తిగత, వృత్తిగత డేటా అంతటినీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచడాన్ని దృష్టిలో ఉంచుకుని నిల్వ చేయడం సవాళ్లతో కూడినదే. ఈ వినూత్న ఫీచర్లతో ఈ సమస్యను శాంసంగ్ దీటుగా పరిష్కరించింది. నేటి ప్రపంచంలో గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 నిజమైన ఆల్రౌండర్లుగా ముందుకొస్తున్నాయి. ఈ ఫోన్లతో జీవితాన్ని వినోదభరితంగా స్వేచ్ఛాయుతంగా మార్చుకోవచ్చు. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లను సొంతం చేసుకుంటే ఇక మీరు ఎన్నడూ వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. (Advertorial) -
ఇకపై నిశ్చింతగా ఉండవచ్చు.. (స్పాన్సర్డ్)
శాంసంగ్ గలాక్సీ ఏ 51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్లలో ప్రవేశపెట్టిన ప్రైవసీ ఫీచర్‌ను జెడ్ జనరేషన్, మిలీనియల్స్ అత్యధికంగా ఇష్టపడుతున్నారు. క్విక్ స్విచ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫీచర్ ద్వారా గ్యాలరీ, వెబ్ బ్రౌజర్, వాట్సాప్ తదితర యాప్స్ వినియోగంలో ప్రైవేట్ నుంచి వేగంగా పబ్లిక్ వెర్షన్‌కు మారేందుకు వీలుంటుంది. ఇందుకు పవర్ కీని రెండుసార్లు క్లిక్ చేస్తే సరిపోతుంది! ఫీచర్ భాగస్వామి, హెచ్‌టీ బ్రాండ్ స్టూడియో జెడ్ జనరేషన్, మిలీనియల్స్ తమ స్మార్ట్ఫోన్లపై అత్యధిక సమయాన్ని గడుపుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లేదా స్నాప్‌చాట్‌లో ఫొటోలను అప్లోడ్ చేయడం, లేకుంటే.. ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్‌లలో చాట్ చేయడం కోసం అధిక సమయాన్ని వినియోగిస్తున్నారు. రోజువారీ జీవనంలో మరే ఇతర గాడ్జెట్కంటే స్మార్ట్ఫోన్పైనే అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఆధునిక శాంసంగ్ గలాక్సీ ఏ 51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్ల ద్వారా జెడ్ జనరేషన్, మిలీనియల్స్‌కు సరికొత్త ప్రపంచం పరిచయమవుతుంది. ఈ స్మార్ట్ఫోన్లు అమోలెడ్ డిస్ప్లేలతోపాటు.. క్యాడ్ కెమెరా సెటప్, అధిక సమయం నిలిచే బ్యాటరీ శక్తితో లభిస్తాయి. ఎలాంటి టాస్క్‌నైనా సులభంగా నిర్వహించుకోవచ్చు. ఆల్ట్ జెడ్ జీవితంలో శాంసంగ్ స్మార్ట్ఫోన్లతో ఒత్తిడిని దూరం(స్ట్రెస్ ఫ్రీ) చేసుకోవచ్చు. మీ జీవితంలో ప్రైవేట్ మొమెంట్స్ను ప్రైవేట్‌గానే ఉంచుకోవచ్చు. మీరు మినహా ఎవరూ వీటిని పొందలేరు. క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ పేరుతో పరిశ్రమలోనే తొలిసారి రెండు ఆధునిక ప్రైవసీ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది. వీటితో వెనుదిరిగి చూడవలసిన అవసరం ఉండదు. ప్రైవసీ ఫస్ట్ స్మార్ట్ఫోన్లను రోజువారీ వినియోగించేందుకు ఇష్టపడేవారైతే.. అన్ని వేళలా మీ ప్రైవసీ రక్షణను కోరుకుంటారు. ఇతరులు ఫోటోలు తీసుకునేందుకు మీ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించుకోవడాన్ని చాలా సందర్భాలలో ఎదుర్కొనే ఉంటారు. తద్వారా మీకు సంబంధించిన ఫొటోలు తదితరాలను చూడటం జరుగుతూ ఉంటుంది. అయితే మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిశీలించడం ద్వారా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎవరైనా మీకు వచ్చిన మెసేజ్‌ను చదివే అవకాశముండవచ్చు. ఇలాంటి సందర్భంలో మనకు సంబంధించిన వ్యక్తిగత, ప్రైవేట్ డేటాను ఇతరులు చూస్తారన్న ఆందోళన కలుగుతుంది. ఇలాంటప్పుడు పవర్ బటన్‌ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఆందోళనకు చెక్ పెట్టవచ్చు. క్విక్ స్విచ్‌గా పిలిచే ఈ విశిష్ట ఫీచర్.. శాంసంగ్ గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ 71 స్మార్ట్ఫోన్లకు ప్రత్యేకం. నటి రాధికా మదన్ జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. ఈ ఫీచర్‌ను సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఈ వీడియోలో తన బాయ్‌ఫ్రెండ్(సన్నీ సింగ్ నటించారు)కు పుట్టిన రోజు పార్టీతో సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. అయితే ఊహించని విధంగా సన్నీ వచ్చాడు. అయితే రాధిక ఎలాంటి పరిస్థితుల్లోనూ సర్ప్రైజ్ పార్టీ ఆలోచనకు విఘాతం కలగకూడదనుకుంది. ఇందువల్ల ఆమె క్విక్ స్విచ్‌ను వినియోగించడం ద్వారా సీక్రెట్‌ను సేఫ్‌గా ఉంచగలిగింది. క్విక్ స్విచ్ ఫీచర్ కారణంగా ఎవరైనా తమ స్మార్ట్‌ఫోన్‌ను ఫొటో తీసేందుకు మరొకరికి సంకోచం లేకుండా ఇవ్వవచ్చు. లేదంటే యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న వీడియోను వీక్షించేందుకు ఇవ్వవచ్చు. ఫోన్ పవర్ బటన్‌ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఫోన్లోని యాప్స్- గ్యాలరీ, బ్రౌజర్, వాట్సాప్ వంటివన్నీ ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్‌కు మారిపోతాయి. అంతేకాకుండా మీరు ప్రైవసీ కోరుకునే ఇమేజ్‌లను ప్రైవేట్ చేయమంటూ ఏఐ ఆధారిత కంటెంట్ సజెషన్స్ సూచిస్తుంది. ఈ ఫీచర్ సులభంగా సెట్ చేసుకోవచ్చు. కొన్ని ముఖాలు లేదా ఇమేజిలను ఎంపిక చేసుకోవాలి. వీటిని ప్రైవేట్ ఫోల్టర్‌లోకి బదిలీ చేయాలి. శాంసంగ్ నాక్స్(Knox)ద్వారా కంటెంట్ సజెషన్స్కు డిఫెన్స్ ప్రమాణాల స్థాయిలో భద్రత ఉంటుంది. దీంతో మీ ప్రైవసీకి గతంలో ఎన్నడూలేని విధంగా రక్షణ లభిస్తుంది. ఇక కెమెరా విశిష్టతలను పరిశీలిస్తే.. సింగిల్ టేక్ కెమెరా ఫీచర్లలో మొదటిగా చెప్పుకోవలసింది సింగిల్ టేక్. ఫొటోలు తీసుకోవడంలో పెర్ఫెక్ట్ ఫ్రేమ్‌ను ఎంచుకునేందుకు వీలుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో సింగిల్ టేక్ ఫీచర్‌ను ఎంపిక చేసుకుంటే చాలు. మిగతా పని ఫోన్ చూసుకుంటుంది. ఈ ఫీచర్ ద్వారా 10 రకాల ఫొటోలు, వీడియోలను ఫోన్ క్యాప్చర్ చేస్తుంది. వీటిలో 7 ఫొటోలు, 3 వీడియోలు నమోదవుతాయి. ఇవి గ్యాలరీలో వెనువెంటనే లభ్యమవుతాయి. ఉత్తమ షాట్స్‌ను తీయడం ద్వారా సింగిల్ టేక్ ఒకే ఆల్బమ్కింద రూపొందిస్తుంది. ఏఐ సహకారంతో కెమెరా సాఫ్ట్వేర్.. షార్ట్ మూవీ, జిఫ్ యానిమేషన్స్, స్టైలిష్ ఇమేజెస్ తదితరాలను ఆటోమాటిక్‌గా తీయగలుగుతుంది. సింగిల్ టేక్ ఫీచర్‌తో అత్యుత్తమ ఫొటోను పొందగలుగుతారు. తద్వారా వీటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. సింగిల్ క్లిక్‌తో షేర్ చేయగలగడంతో సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. నైట్ హైపర్‌ల్యాప్స్ సింగిల్ క్లిక్ తదుపరి నైట్ హైపర్ల్యాప్స్ను ప్రస్తావించాలి. సోషల్ మీడియా ఫీడ్స్‌ను గమనిస్తే జెడ్ జనరేషన్, మిలీనియల్స్ ప్రతి రోజూ మరిన్ని ఫొటోలను తీసుకుంటూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. భోజనానికి ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లినా లేదా పార్క్‌లో కూర్చున్నా ఆ సమయాన్ని హైపర్ల్యాప్స్గా పిలవవచ్చు. మూవింగ్ టైమ్ ల్యాప్స్గా పేర్కొనే ఈ సమయంలో శాంసంగ్ నైట్ హైపర్‌లాప్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీంతో తక్కువ లైటింగ్ పరిస్థితుల్లోనూ అందమైన ఫొటోలను తీసుకునేందుకు వీలుంటుంది. కెమెరాలో గల ఇతర ఫీచర్ల విషయానికివస్తే.. కస్టమ్ ఫిల్టర్, క్విక్ వీడియో రికార్డింగ్, స్విచ్ కెమెరా వైల్ రికార్డింగ్(ప్రస్తుతం ఏ51లో లభ్యం), ఏఐ గ్యాలరీ జూమ్, స్మార్ట్ సెల్ఫీ యాంగిల్‌ను ప్రస్తావించవచ్చు. ఆల్ట్ జెడ్ లైఫ్‌లో రిలీఫ్ శాంసంగ్ స్మార్ట్ఫోన్ల ద్వారా ఇతరులకు ఫోన్ ఇచ్చే సమయంలో ఆందోళనలకు చెక్ పెట్టవచ్చు. ఈ విషయంలో ఇకపై నిశ్చింతగా ఉండవచ్చు. గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్లను సరికొత్త ఆవిష్కరణలుగా చెప్పవచ్చు. క్వాడ్ కెమెరా సెటప్‌తో సులభంగా ఫొటోలను తీయవచ్చు. దీనికితోడు అత్యుత్తమ డిస్ప్లే, అధిక సమయం నిలిచే బ్యాటరీ అండగా ఉంటాయి. ఇంతకంటే ఆశించడానికి ఇంకేముంటుంది? ఈ ఫీచర్లతో గలాక్సీ ఏ51, గలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్ల ద్వారా ఆల్ట్ జెడ్ జీవితాన్ని ఆనందించండి. మరింకెందుకు ఆలస్యం? (Advertorial) -
ఏ ఒక్కరికి మీ సమాచారం తెలియదు (స్పాన్సర్డ్)
ఆల్ట్ జడ్ జీవితంలో భాగంగా క్విక్ స్విచ్ పేరుతో శాంసంగ్ నూతన స్మార్ట్‌ఫోన్ ప్రైవసీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కేవలం పవర్ కీని డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఫోటోలు, యాప్స్ వంటివి ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్‌కు సులభంగా మార్చుకునే వెసులుబాటు లభిస్తుంది. ఫీచర్ భాగస్వామి, హెచ్‌టీ బ్రాండ్ స్టూడియో స్మార్ట్ఫోన్లు మన జీవితంలో అంతర్భాగమయ్యాయి- స్మార్ట్ఫోన్లు లేకుండా మనం ఏమీ చెయ్యలేం.. మిలీనియల్స్, జడ్ జనరేషన్ అయితే వారి స్మార్ట్ఫోన్ల పైనే పూర్తిగా ఆధారపడతారు. పని, ఆటల మధ్య సరైన సమతూకం పాటించేందుకు వారికి స్మార్ట్ఫోన్లు కీలకం. మీరు రోజంతా జర్నలిస్టుగా పనిచేసి సాయంత్రం డీజేగా మారితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. పనికి సంబంధించిన కీలక సమాచారం నుంచి వ్యక్తిగత ఫోటోల వరకూ మీ ఫోన్లో ఎన్నో నిక్షిప్తమై ఉంటాయి. ఇతరులు మీ ఫోన్ వంక చూస్తే మీరు ఎంత కంగారు పడతారో ఆలోచించండి? సరిగ్గా ఇక్కడే ప్రైవసీ ముందుకొస్తుంది. ప్రైవసీ కేవలం ఇతరులకే పరిమితం కాదు. ఇది మీ ప్రైవేట్ సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచడం కూడా. మిలీనియల్స్లా మనం మన ఫోన్లను ఏ ఒక్కరికీ ఇవ్వడానికి సంకోచిస్తాం. ఫోన్ ఎవరికైనా ఇచ్చినా, వారు మన ప్రైవేట్ సమాచారాన్ని చూస్తారా అనే భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. యూజర్ తన తొలి ప్రాధాన్యంగా భావించే శాంసంగ్ అందుకే మీకోసం గెలాక్సీ ఏ71, గెలాక్సీ ఏ51లపై క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ వంటి పరిశ్రమలోనే తొలి వినూత్న ప్రైవసీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. శాంసంగ్ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ ఫీచర్లను ప్రవేశపెట్టింది. యూజర్లు, ప్రత్యేకించి జడ్ జనరేషన్ వారి స్మార్ట్ఫోన్లను ఇతరులతో పంచుకున్న సందర్భాల్లో ఎదురయ్యే ఆందోళనను ఈ ఫీచర్లు తొలగించడమే కాకుండా వారి అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించేందుకు వెసులుబాటు కల్పిస్తాయి. మీ ప్రైవసీని ఎవరైనా హరిస్తారనే విచారం లేకుండా పూర్తి స్వేచ్ఛతో జీవితాన్ని అనుభవించడమే ఆల్ట్ జడ్ జీవిత సారాంశం. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీ చేతుల్లోనే ప్రైవసీ మిలీనియల్స్, జడ్ జనరేషన్ అసంఖ్యాక సెల్ఫీలు, వీడియోలు తీస్తుంటారన్నది తెలిసిందే. వాటిని ఏ ఒక్కరూ చూడరాదని కూడా వారు కోరుకుంటారు. గతంలో గ్యాలరీని లాక్ చేసే ఒకేఒక్క ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా మీ స్నేహితులు పాస్వర్డ్ అడిగితే ఇవ్వాల్సి వచ్చేది. మీకు అసౌకర్యం వాటిల్లినా మీ ప్రైవసీకి భంగం కలిగేది. క్విక్ స్విచ్‌తో మీరు ఇలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడంతో మీ ఫోటోలు, యాప్స్ సహా అన్నింటినీ ప్రైవేట్, పబ్లిక్ మోడ్‌లోకి మార్చేసుకోవచ్చు. అవును మీరు సరిగ్గానే విన్నారు! (ఏ ఒక్కరికి మీ సమాచారం తెలియదు) ఉదాహరణ తీసుకుంటే.. మీరు ఆఫీసులో ఉన్నారు... మీ బాస్‌పై మీరు చేసిన మీమ్స్ కొలీగ్స్‌కు చూపుతున్నారు.. అయితే ఇలా చేస్తే ఏమవుతుందో ఊహించండి. మీ బాస్ మీ దగ్గరకు వచ్చి మీ ఫోన్‌ను చూపించమని కోరితే.. మీరు ఏం చేస్తారు? ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు నటి రాధికా మోహన్ క్విక్ స్విచ్‌ను వాడే పద్ధతిని అనుసరించండి. రాధిక కూడా తన బాయ్‌ఫ్రెండ్, సోదరిల మధ్య తన ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఈ వినూత్న ఫీచర్‌ను వాడారు. మన జీవితాల్లోకి తొంగిచూసేందుకు ఇష్టపడుతూ, మన ఫోన్లలో మనం ఏం చేస్తున్నామో పసిగట్టాలని ఎవరో ఒకరు ప్రయత్నిస్తారని మనందరికీ తెలుసు కదా? వినూత్న ఫీచర్లకు పేరొందిన శాంసంగ్ క్విక్ స్విచ్ ఫీచర్‌తో మరోసారి విశిష్టతను నిరూపించుకుంది. సౌకర్యవంతమైన, అవరోధాలు లేని మేలుకలయికగా ఈ ఫీచర్లను యూజర్ల ముందుంచింది. శాంసంగ్ గెలాక్సీ ఏ71, ఏ51 స్మార్ట్ఫోన్లపై అందుబాటులో ఉన్న క్విక్ స్విచ్ మీకు ఆల్ట్ జడ్ జీవితాన్ని అనుభవంలోకి తీసుకువస్తుంది. క్విక్ స్విచ్‌కు కొనసాగింపుగా ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ లోపలే ఏఐ ఫీచర్‌గా కంటెంట్ సజెషన్స్ ఫోటోలను ప్రైవేట్ ఫోల్డర్‌కు తరలించాలని ఆటోమేటిగ్గా సజెస్ట్ చేస్తుంది. శాంసంగ్ నాక్స్ భద్రతతో ఇది పనిచేస్తుంది. మీరు ప్రైవేట్‌గా ఉంచదల్చుకున్న ఫోటోలు, వ్యక్తుల ముఖాలను ఎంపికచేసుకుంటే కంటెంట్ సజెషన్స్ ఫీచర్ ప్రైవేట్ గ్యాలరీకి తరలించాల్సిన ఫోటోలను తెలివిగా సూచిస్తుంది. ప్రైవేట్ గ్యాలరీలో ఫోటోలను ఏ ఒక్కరూ చూసే అవకాశం ఉండదు. అందుబాటు ధరల్లో అద్భుత ఫీచర్లు శాంసంగ్ మరోసారి మెరుగైన స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను అందుబాటు ధరల్లో ప్రవేశపెట్టింది. రెండు ఫోన్లు ఇన్ఫినిటీ-ఓ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే, స్లీక్ ప్రిస్మ్ క్రష్ డిజైన్, క్వాడ్ కెమెరా మాడ్యూల్, ఫ్లాగ్షిప్ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లతో ముందుకొచ్చాయి. సింగిల్ టేక్, నైట్ హైపర్‌లాప్స్ వంటి కెమెరా ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటాయి. సింగిల్ టేక్ ఫీచర్ మూడు నుంచి పది సెకన్లలో 14 రకాల ఫోటోలు, వీడియోల (పది ఫోటోలు, నాలుగు వీడియోలు)ను క్యాప్చర్ చేసేందుకు మిమ్మల్ని అనమతిస్తుంది. వీటిలో కొన్ని స్టైలైజ్డ్ ఫోటోలు, షార్ట్ మూవీ, కొన్ని జిఐఎఫ్ యానిమేషన్లు కూడా ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే మీరు వీటన్నింటినీ ఒకే ఆల్బమ్‌లో పొందవచ్చు. మీరు సింపుల్‌గా ఈ ఆప్షన్‌ను పిక్ చేసుకుని ఎంపిక చేసుకుంటే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం చూస్తారు. నైట్ హైపర్లాప్స్తో మీరు తక్కువ వెలుతురులో మెరుగైన హైపర్‌లాప్స్ వీడియోలను షూట్ చేసుకోవచ్చు. రాత్రిపూట వీడియోలు తీసేందుకు ఈ ఫీచర్ మెరుగ్గా ఉంటుంది. నైట్ లైఫ్‌కు పేరొందిన నగరాన్ని సందర్శించేందుకు మీరు ప్లాన్ చేస్తే ఈ ఫోన్లో మీరు తీసే వీడియోలు అద్భుతంగా ఉంటూ ఔరా అనిపిస్తాయి. గెలాక్సీ ఏ71 మెరుగైన ఫీచర్లలో బ్యాటరీ లైఫ్ కూడా ఒకటి. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ మీకు రోజుకుపైగా పనిచేస్తుంది! చదవడం, వీక్షించడం, గేమ్స్ ఆడటంతో పాటు మీ హృదయానికి దగ్గరైన కంటెంట్‌కు సంబంధించి ఏ పనులైనా ఎలాంటి అవాంతరం లేకుండా యాక్సెస్ చేసుకోవచ్చు. వెనుక వైపు 64 ఎంపీ కెమెరా, 25 వాట్స్ వైర్డ్ చార్జింగ్, 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఏ71 తరహా డిజైన్లోనే రూపొందిన గెలాక్సీ ఏ51 చిన్న ఛేసిస్తో ఉంటుంది. 6.5 ఇంచ్ అమోల్డ్ స్క్రీన్, 48 ఎంపీ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, ఒక యూఐ 2.0 ఫీచర్లతో ఏ51 అందుబాటులో ఉంది. శాంసంగ్ నాక్స్‌తో ముమ్మర భద్రత భద్రత విషయంలో మరింత ముందడుగు వేస్తూ పలు అంచెల భద్రతా ఫ్లాట్‌ఫాం నాక్స్‌తో శాంసంగ్ అదనపు భద్రతను కల్పిస్తోంది. స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్ చిప్‌లో దీన్ని నిర్మించారు. కీలక ఫైళ్లను, శాంసంగ్ పే లావాదేవీలు, పాస్వర్డ్లు, ఫోటోలు, వీడియోలు, ఫోన్ ఆరోగ్యం సహా మొత్తం డేటాను నాక్స్ సంపూర్ణంగా కాపాడుతుంది. ఇక ఈ ఫోన్లు మీకు ఏమేం అందిస్తారో తెలుసుకున్నారు, అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 రిటైల్ స్టోర్లు, శాంసంగ్.కాం, ఈకామర్స్ వేదికలపై అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ఏ71పై 2600 రూపాయల వరకూ, గెలాక్సీ ఏ51పై 1500 రూపాయల వరకూ అద్భుత క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రస్తుతం నడుస్తోంది. ఇది పరిమిత కాల ఆఫర్, ఇక వేచిచూడకండి! (Advertorial) -
మీ మొబైల్లో ఫొటోలు, చాట్ దాచేయండి ఇలా? (స్పాన్సర్డ్)
నా ఫోన్‌ను ఎవరు టచ్ చేశారు ? ఇక గెలాక్సీ ఏ51, ఏ71పై క్విక్ స్విచ్‌తో ఈ పీడకలను మీరు మరిచిపోవచ్చు. క్విక్ స్విచ్ ద్వారా మీరు గ్యాలరీ, వాట్సాప్, ఇన్స్టాగ్రాం, స్నాప్‌చాట్ వంటి యాప్స్‌లో తరచూ ప్రైవేట్, పబ్లిక్ మోడ్‌లోకి కేవలం పవర్ బటన్ డబుల్ క్విక్ ద్వారా మారిపోవచ్చు. ఇది ఇప్పుడు మీకు అద్భుత వెసులుబాటు కాదా? ఈరోజుల్లో స్మార్ట్ఫోన్లు మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రాంలో ఫోటోలు అప్లోడ్ చేయడం, ట్వీట్లు చేయడం, నోట్స్ తీసుకోవడం వరకూ అన్నింటినీ స్మార్ట్ఫోన్లలో చక్కబెడుతున్నాం. జడ్ జనరేషన్, మిలీనియల్స్ ఇప్పుడు ప్రతి పనికీ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. వారి వర్క్‌ను స్టోర్ చేసుకోవడం నుంచి ప్యాషన్‌లో మునిగితేలడం, వినోదం ఇలా అన్నిటికీ స్మార్ట్‌ఫోన్ వాడే వారిలో మీరూ ఒకరా? అయితే మేమంటే మీకు సరిగ్గా తెలుసు! మీరు జనసమ్మర్ధ ప్రాంతంలో ఉన్నారని ఇప్పుడు ఊహించుకోండి.. మీరు మీ ఫోన్లో ఏం చేస్తున్నారో చూసేందుకు ఒకరు ప్రయత్నిస్తుంటే మీరు ముందుగా ఏం చేస్తారు. అక్కడి నుంచి తప్పుకోవడమో..వారి నుంచి మీ ఫోన్‌ను దాచడమో చేస్తారు.. అంతేకదా? మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులు మీ ఫోన్‌ను చూడాలని కోరుకోవడం వంటి పరిస్థితులు మీకు గుర్తుకురావచ్చు, అయితే మీరు మీ ఫోన్‌ను వారికి ఇచ్చేందుకు అసౌకర్యానికి లోనయ్యే పరిస్థితి. మీ ఫోన్ వారి చేతిలోకి వెళితే మీ ప్రైవేట్ మేసేజ్‌లు, ఫోటోలు వారి కంటపడతాయే ఆందోళన సహజం కదా? ఇక ఈ ఆందోళనలకు గుడ్‌బై చెబుతూ అల్ట్ జడ్ లైఫ్‌ను స్వాగతించండి. అల్ట్ జడ్ లైఫ్‌తో మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్‌గానే స్వేచ్ఛగా ఆస్వాదించండి. అల్డ్ జడ్ లైఫ్‌లో భాగంగా శాంసంగ్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ పేరిట వినూత్న ప్రైవసీ ఫీచర్లను ముందుకు తీసుకువచ్చింది. ‘మేక్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్లు గెలాక్సీ ఏ51, ఏ71లపై అందుబాటులో ఉంటాయి మధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో తొలిసారిగా ఇలాంటి ఫీచర్లు ప్రవేశపెట్టడం ద్వారా శాంసంగ్ సరికొత్త నూతన ప్రమాణాలను నెలకొల్పింది. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 స్మార్ట్ఫోన్లు అద్భుత స్క్రీన్, అత్యద్భుత కెమెరా, దీర్ఘకాల లైఫ్‌తో కూడిన బ్యాటరీతో ముందుకొచ్చాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు సింగిల్ టేక్, నైట్హైపర్లాప్స్, ప్రొ కెమెరా మోడ్, కస్టమ్ ఫిల్టర్, స్మార్ట్ సెల్ఫీ యాంగిల్, క్విక్ వీడియో, ఏఐ గ్యాలరీ జూమ్ వంటి ఫ్లాగ్షిప్ కెమెరా ఫీచర్లతో కూడిన ఫీచర్ క్వాడ్ కెమెరా సెట్అప్లతో అందుబాటులో ఉన్నాయి. ప్రైవసీ ఫీచర్లు పరిశీలిద్దాం.. క్విక్ స్విచ్ - కేవలం డబుల్ క్లిక్‌తో మీ ప్రైవసీ పదిలం నేటి స్మార్ట్‌ఫోన్ యూజర్ల ప్రైవసీ అవసరాలను క్విక్ స్విచ్ పరిష్కరిస్తుంది. పేరుకు తగ్గట్టే క్విక్ స్విచ్ వేగంగా ప్రతిస్పందిస్తుంది. అల్ట్ జడ్ లైఫ్‌ను ఇది మరింత సరళతరం చేస్తుంది. ఇది గ్యాలరీ, వాట్సాప్, ఇన్స్టాగ్రాం, స్నాప్‌చాట్ సహా మీరు అధికంగా వాడే యాప్స్ నుంచి మీరు ప్రైవేట్, పబ్లిక్ మోడ్‌కు మారేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. క్విక్ స్విచ్ సౌకర్యవంతమే కాకుండా అవరోధాలు లేనిది కూడా. క్విక్ స్విచ్ కేవలం పవర్ బటన్‌ను డబల్ క్లిక్ చేయడంతో ఆన్ అవుతుంది. ఆపై మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులకు ఎలాంటి ఆందోళన లేకుండా ఇవ్వవచ్చు. ఆ తర్వాత వారు కూడా గెలాక్సీ ఏ51, ఏ71ను కొనుగోలు చేయవచ్చు. నటులు రాధికా మదన్, సన్నీ సింగ్‌లతో కూడిన ఈ వీడియోను చూడవచ్చు. ఇందులో సన్నీ గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపించిన రాధిక అతడు తన వద్దకు వస్తుండగా సన్నీ బర్త్‌డే పార్టీతో సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తారు. గెలాక్సీ ఏ71పై ఉన్న క్విక్ స్విచ్ ఫీచర్‌తో రహస్యం మాత్రం సురక్షితంగానే ఉంది. కంటెంట్ సజెషన్స్ - మీ ప్రైవేట్ ఫోటోలు ప్రైవేట్‌గానే మిగిలిపోతాయి. సంక్లిష్టమైన లుక్‌ను ఇంటెలిజెంట్స్ కంటెంట్ సజెషన్స్ సరళతరంగా మార్చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లో అమర్చబడిన ఏఐ ఆధారిత ఇంజెన్ ఫోటోలను సెక్యూర్ ఫోల్డర్లోకి తరలించాలని ఇది సూచిస్తుంది. ఈ ప్రక్రియను చాలా సులభంగా చేపట్టవచ్చు. మీరు ప్రైవేట్‌గా ఉంచదలుచుకున్న కొన్ని ముఖాలు లేదా ఫోటోలను ఒకసారి ట్యాగ్ చేస్తే ఏఐ మిగిలిన పని చూసుకుంటుంది. ఉదాహరణగా చూస్తే..మీరు పర్వత ప్రాంతంలో మీ భాగస్వామితో వెకేషన్‌కు వెళ్లి ఇంటికి తిరిగి చేరుకుంటారు. మీ ఫోన్లో ఎన్నో సెల్ఫీలు మీరు ఇతరులు చూడకూడదని మీరు భావించేవి ఉంటాయి. మీ బెస్ట్‌ఫ్రెండ్ కూడా వాటిని చూడకూడదని మీరు అనుకుంటారు. అయితే ఏం జరుగుతుందో ఊహించండి. ఓ శుక్రవారం రాత్రి మీరు మీ గ్రూప్‌తో సేదతీరుతుంటే ఎవరో ఒకరు ఈ ఫోటోలను చూసేస్తారు. దీంతో మీ ప్రైవసీ కాస్తా పోతుంది. ఇక ఇలా జరగదు. కంటెంట్ సజెషన్స్ మీరు ప్రైవేట్ ఫోటోలను ప్రైవేట్‌గానే ఉంచుతుంది. పైన ఉదహరించిన ఉదంతంలో మీ సెల్ఫీలు పబ్లిక్ గ్యాలరీలో కనిపించవు. ఎందుకుంటే మీ భాగస్వామి ముఖాన్ని మీరు ఇప్పటికే ప్రైవేట్ ఆప్షన్‌గా సెలెక్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలన్నీ మీ ప్రైవేట్ ఫోల్డర్‌కు తరలివెళ్తాయి. ఇంతకుముందు చూడని ప్రైవసీ ఫీచర్లు శాంసంగ్ నూతన ప్రైవసీ ఫీచర్లు వాటికవే సొంతమైన లీగ్‌లో చేరాయి. శాంసంగ్ ఆఫర్ చేస్తున్న వాటి దరిదోపుల్లోకి మరే ఇతర కంపెనీ రాలేదు. వ్యాపార, వినియోగదారులు సంతోషం కోసం ప్రైవసీకి శాంసంగ్ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుంది. పరిశ్రమలో నూతన ప్రమాణాలను నెలకొల్పేందుకు శాంసంగ్ ప్రయత్నిస్తోంది. గెలాక్సీ ఏ సిరీస్ ఇప్పటికే అద్భుత స్క్రీన్, అత్యద్భుత కెమెరా, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో ముందుకురాగా, ఈ వినూత్న ప్రైవసీ ఫీచర్లతో వీటిని సంతోషంగా సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 రెండూ ఈకామర్స్ ప్లాట్‌ఫాంలతో పాటు రిటైల్ స్టోర్స్, శాంసంగ్.కాంలో అందుబాటులో ఉన్నాయి అల్ట్ జడ్ లైఫ్‌తో జడ్ జనరేషన్, మిలీనియల్స్ ఎంతమాత్రం విచారించాల్సిన పనిలేదు. ఎంచక్కా ఈ ఫోన్లతో మీ ప్రైవసీ ఆందోళనలకు గుడ్‌బై చెప్పవచ్చు. (Advertorial) -
గెలాక్సీ ఏ71, ఏ51.. వినూత్న ఫీచర్లు
గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ వంటి పరిశ్రమలో తొలి వినూత్న ప్రైవసీ ఫీచర్లతో శాంసంగ్ నూతన ప్రమాణాలను నెలకొల్పింది. శాంసంగ్ ప్రైవసీ ఇన్నోవేషన్స్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ గెలాక్సీ ఏ51, ఏ 71లపై అందుబాటులోకి వచ్చాయి. మీ ప్రైవేట్ యాప్స్, కంటెంట్ భద్రతపై ఎలాంటి ఒత్తిడి, విచారం లేకుండా మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుతూనే అల్ట్‌జడ్ లైఫ్ మీకు వినోదం అందిస్తుంది. ఫీచర్ భాగస్వామి, హెచ్‌టీ బ్రాండ్ స్టూడియో మిలీనియల్స్, జడ్ జనరేషన్ వారి స్మార్ట్ ఫోన్లను ఫోటోలు తీసుకోవడం నుంచి గేమ్స్ ఆడటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండటం, గూగుల్ సమాచారం వెతకడం సహా అన్ని విషయాల్లోనూ వాడుతున్నారు. ఫోన్ మీ చేతిలో ఉన్నంతవరకూ సురక్షితంగా భావిస్తుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ స్మార్ట్ ఫోన్ వైపు చూస్తే మీరు నిజంగా వారికి ఇచ్చేందుకు తిరస్కరిస్తారా..? మీ ఫోన్‌ను వారు చేతుల్లోకి తీసుకుని కెమెరాతో ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తే మీ ప్రైవేట్ కంటెంట్ బయటకు వచ్చే అవకాశాలు అధికం. అల్ట్‌జడ్ లైఫ్‌లో చేరడం ద్వారా మీ వ్యక్తిగత జీవితం వ్యక్తిగతంగానే నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది. క్విక్ స్విచ్ పేరుతో పరిశ్రమలోనే తొలి ప్రైవసీ ఫీచర్‌ను శాంసంగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ స్మార్ట్ ఫోన్ మరొకరికి ఇచ్చినప్పుడు మీకుండే యాంగ్జైటీని ఇది నివారిస్తుంది. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. శాంసంగ్ ‘మేక్ ఫర్ ఇండియా’ కార్యక్రమం కింద క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫీచర్లు గెలాక్సీ ఏ71, గెలాక్సీ ఏ51లపై అందుబాటులో ఉంటాయి. (Advertorial) ఫీచర్లపై మరిన్ని వివరాలు.. క్విక్ స్విచ్ : మీ ప్రైవసీని కాపాడుకునేందుకు వేగవంతమైన మార్గం లంచ్, టీ బ్రేక్ సమయాల్లో స్మార్ట్ ఫోన్‌ను వర్క్ డెస్క్‌ల వద్ద వదిలేసి వెళ్లే వారిలో మీరూ ఒకరా? వారి ఫోన్లలో ఇతరులు వ్యాసాలు/ డాక్యుమెంట్లను చదివేందుకు అనుమతించే వారిలో మీరూ ఉన్నారా? అందుకు చింతించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగతంగా ఉంచేందుకు క్విక్ స్విచ్ ఫీచర్ అందుబాటులో ఉంది అల్ట్ జడ్ లైఫ్‌లో నివసించేందుకు ప్రతిఒక్కరి అవసరాలను క్విక్ స్విచ్ తీర్చేస్తుంది. ఇది సౌకర్యవంతంగా ఉండటంతో పాటు అవరోధాలు లేకుండా ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్‌ను ఇతరులతో పంచుకునే సమయంలో పవర్ కీని డబుల్ టాప్ చేస్తే సరిపోతుంది. ప్రైవేట్, పబ్లిక్ మోడ్స్‌లోకి వేగంగా మారే వెసులుబాటును క్విక్ స్విచ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ ఫీచర్‌ను గ్యాలరీకే కాకుండా వెబ్ బ్రౌజర్, వాట్సాప్ వంటి ఇతర యాప్స్ ప్రైవసీకి వాడవచ్చు. మీరు స్విచ్ ఆఫ్ మోడ్‌లో ఉంటే ఏ ఒక్కరూ పసిగట్టలేరు. మీ స్మార్ట్ ఫోన్ గ్యాలరీని చూడాలని ఎవరైనా అనుకుంటే మీరు వారికి పబ్లిక్ వెర్షన్ చూపవచ్చు. సెక్యూర్ ఫోల్డర్లో దాచిన ప్రైవేట్ కంటెంట్ మీ ఒక్కరే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇతరులతో పంచదలుచుకోలేని ఫోటోలను డిఫెన్స్ గ్రేడ్ శాంసంగ్ నాక్స్‌తో భద్రమైన సెక్యూర్డ్ ఫోల్డర్లో మీరు సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు. కంటెంట్ సజెషన్స్ : ప్రైవేట్, వ్యక్తిగత కంటెంట్ ఏదో నిర్ధారించేందుకు తెలివైన మార్గం కంటెంట్ సజెషన్స్ సెక్యూర్ ఫోల్డర్ లోపల ‘ఆన్ డివైజ్ ఏఐ’ ఫీచర్‌గా అందుబాటులో ఉంటుంది. కంటెంట్ సజెషన్స్ స్మార్ట్ ఫోన్లో నిక్షిప్తమైన ఏఐ ఆధారిత ఇంజిన్ ద్వారా నిర్ధిష్ట ఫోటోలను సెక్యూర్ ఫోల్డర్‌కు తరలించాల్సిందిగా సూచిస్తుంది. ఎలాంటి ఫోటోలు, ముఖాలు, ఏ తరహా ఫోటోలను ప్రైవేట్‌గా ట్యాగ్ చేయాలో యూజర్ నిర్ణయించుకోవచ్చు. ఆపై ఏ ఒక్కరూ వాటిని యాక్సెస్ చేయలేని విధంగా కంటెంట్ సజెషన్స్ తెలివిగా ఏయే ఫోటోలను ప్రైవేట్ గ్యాలరీకి పంపాలో సూచిస్తుంది. యూజర్ ప్రైవసీని పెంచేందుకు స్మార్ట్ ఫోన్ లోపలే ఏఐ సొల్యూషన్ ఈ పనులను చక్కబెడుతుంది. సర్వర్, క్లౌడ్‌తో ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండానే ఏఐ సొల్యూషన్ ఈ ప్రక్రియను చేపడుతుంది. శాంసంగ్ తొలిసారిగా ఈ ఫీచర్లను మధ్య శ్రేణి సెగ్మెంట్‌కు అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. జడ్ జనరేషన్, మిలీనియల్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ ఫీచర్లు యూజర్ల గోప్యత, ప్రశాంతతను కాపాడతాయి. నాక్స్ సెక్యూరిటీ గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై యూఐ సాఫ్ట్వేర్ ద్వారా నిర్మితిమైన డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ ఫ్లాట్‌ఫాం శాంసంగ్ నాక్స్ భద్రతతో గెలాక్సీ ఏ 51, గెలాక్సీ ఏ71 స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సైనిక తరహా గోప్యతా విధానం మీ స్మార్ట్ ఫోన్లో డేటా అంతటినీ పూర్తిగా కాపాడుతుంది. యూజర్ల గోప్యతపై ఇంతగా ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఆలోచించని రీతిలో పరిశ్రమలోనే తొలి గోప్యతా ప్రమాణాలను పాటిస్తూ శాంసంగ్ తనదైన లీగ్‌లో చేరింది. అల్ట్‌జడ్ లైఫ్‌లో నివసించేందుకు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లు మెరుగైన ఎంపికలు. (Advertorial) -
బ్యాలెట్ ఓట్లలో గోప్యతేది?
కాసిపేట(బెల్లంపల్లి) : రాజ్యాంగం పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ప్రజాస్వామ్యంలో వివాదాలకు తావివ్వకుండా రహస్యంగా ఓటు హక్కును వినియోగించే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం అదే తరహాలో సౌకర్యాలు కల్పించి శాంతియుతంగా ఓటు హక్కుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల విధుల నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కల్పించిన బ్యాలెట్ ఓటులో మాత్రం గోప్యత కరువైందని ఉద్యోగులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు జంకుతున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ముందస్తుగా వారికి కేటాయించిన ఓటును వినియోగించుకోవల్సి ఉంటుంది. గ్రామాలలో నలుగురైదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా అందులో ఎన్నికల విధులు నిర్వహించే వారు ఇద్దరు, ముగ్గురు ఉంటారు. ఈ క్రమంలో బ్యాలెట్ ఓట్లపై సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓటుకు దూరంగా ఉంటున్నారు. ముందస్తుగా వేసిన ఓటుకు సంబంధించి కనీసం బ్యాలెట్‌పై స్వస్తిక్ ముద్ర వేయాల్సి ఉండగా అది అందుబాటులో ఉంచడం లేదు. దీంతో సంబంధిత బ్యాలెట్‌పై నచ్చిన అభ్యర్థికి పెన్నుతో టిక్ మార్కు చేసి వదిలేస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఓట్లు కౌంటింగ్ చేసేటప్పుడు ఒకటి, రెండు ఓట్లు కావడంతో ఎవరికి వేశారని అభ్యర్థులు విచారించుకునే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొందరు ఆర్వోలు వచ్చిన రెండు, మూడు ఓట్లను వ్యాలెట్ ఓట్లు అంటూ అభ్యర్థులకు, ఏజెంట్లకు చూపిస్తున్నారని ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల మినహా సర్పంచ్, ఎంపీటీసీ , వార్డు ఎన్నికల్లో తక్కువ మంది బ్యాలెట్ ఓటు వినియోగించుకునే ఉద్యోగ ఓటర్లు ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఉద్యోగులకు బ్యాలెట్ ఓట్లలో గోప్యత లేకుండా పోయిందని గతంలో అభ్యర్థుల గెలుపు, ఓటములు నిర్దేశించే సమయంలో మాత్రమే బ్యాలెట్ ఓట్లు లెక్కించే వారని ప్రస్తుతం ప్రమాదకరంగా పరిస్థితులు మారాయని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. అన్ని కార్యాలయాల్లో స్వస్తిక్ మార్కు ముద్ర పెట్టడంతోపాటు ఓట్లను అభ్యర్థులకు మొదట చూపకుండా పూర్తి స్థాయి ఓట్లలో కలిపితేనే ఓటుకు విలువ ఉంటుంది. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్వస్తిక్ మార్కు అందుబాటులో ఉంచాలని లేదంటే చాలా గ్రామాల్లో ఉద్యోగులు ఓటుకు దూరంగా ఉండే పరిస్థితులు నెలకొంటాయని పలువురు పేర్కొంటున్నారు. -
ఇక యాపిల్ ‘క్రెడిట్ కార్డ్’!
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా క్రెడిట్ కార్డ్ సేవల్లోకి అడుగుపెట్టింది. ‘ఆపిల్ కార్డ్’ పేరుతో నూతనతరం ఆర్థిక సేవలకు శ్రీకారం చుట్టింది. తన సొంత వాలెట్ యాప్ ఆధారంగా సునాయాసంగా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలుకల్పిస్తోంది. కార్డు నెంబర్, సంతకం, సీవీవీ సెక్యూరిటీ కోడ్ వంటి సంప్రదాయ ఫిజికల్ క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. చిటికెలో చెల్లింపులు జరిగిపోయే అధునాతన డిజిటల్ కార్డును ఐఫోన్ వినియోగదారులకు అందిస్తోంది. ఎక్స్పైరీ డేట్ లేని ఈ కార్డు సహాయంతో అత్యంత సులువుగా షాపింగ్ పూర్తిచేయవచ్చని యాపిల్ ప్రకటించింది. ‘ఆపిల్ పే’ యాప్‌లో అభివృద్ధిచేసిన డిజిటల్ క్రెడిట్ కార్డు వినియోగంపై 3% వరకు క్యాష్‌బ్యాక్ అందుతుంది. ఇందుకు సంబంధించిన బ్యాంకింగ్ సేవలను గోల్డ్‌మన్ శాక్స్ అందిస్తుండగా.. అంతర్జాతీయ చెల్లింపుల నెట్‌వర్క్‌ను మాస్టర్‌కార్డ్ అందిస్తోంది. ‘ఐఫోన్‌లోని ఆపిల్ పే యాప్‌లో సైన్ఇన్ అయిన క్షణాల్లోనే ఈ క్రెడిట్ కార్డ్ సేవలను పొందవచ్చు. మెషీన్ లెర్నింగ్, ఆపిల్ మ్యాప్స్ ఆధారంగా చెల్లింపు జరిగిన స్థలం, మర్చెంట్ పేరు స్టోర్ అయి ఉంటాయి. కస్టమర్ల డేటాను ఇతరులకు విక్రయించేది లేదని గోల్డ్‌మన్ శాక్స్ స్పష్టంచేసింది. ఇందువల్ల కార్డు భద్రత విషయంలో ఎటువంటి అనుమానం అవసరం లేదఅని యాపిల్ పే వైస్ ప్రెసిడెంట్ జెన్నిఫర్ బైలీ పేర్కొన్నారు. ఈ వేసవి నుంచి అమెరికాలో క్రెడిట్ కార్డ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ఐఫోన్లో నెట్‌ఫ్లిక్స్ వార్తల సమాహారం మ్యూజిక్ సేవల్లో సంచలనం సృష్టించిన యాపిల్.. నెట్‌ఫ్లిక్స్ సహాయంతో ఇక నుంచి తాజా వార్తలను సైతం అందించే ప్రయత్నంచేస్తోంది. ‘నెట్‌ఫ్లిక్స్ ఫర్ న్యూస్’ పేరుతో 300 పైగా మేగజైన్లలోని ఆర్టికల్స్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు సమగ్ర వార్తలను అందిస్తోంది. నెలకు 10 డాలర్లను సబ్స్క్రిప్షన్ కింద చెల్లించడం ద్వారా యాపిల్ కస్టమర్లు ఈ సేవలు అందుకోవచ్చని వెల్లడించింది. -
ఫేస్బుక్లో కొత్త ఫీచర్!
న్యూయార్క్: ఫేస్బుక్ యూజర్లకు త్వరలో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేవరకు ఫేస్బుక్లో ఏయే పోస్టింగులు చూశాం? ఎవరెవరికి మెసేజ్‌లు, ఫొటోలు షేర్ చేశాం? తదితర విషయాలు ఇతరులెవరూ తెలుసుకోకుండా ఉండాలంటే మన ఖాతా హిస్టరీని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఇంటర్నెట్ బ్రౌజర్లను వినియోగించిన తర్వాత మాత్రమే క్లియర్ హిస్టరీ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఫేస్బుక్ వినియోగదారులకు కూడా క్లియర్ హిస్టరీ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ ఫేస్బుక్ అకౌంట్లో బ్రౌజింగ్ హిస్టరీ మొత్తాన్ని చాలా సులభంగా క్లియర్ చేసుకోవచచ్చు. దీని వల్ల యూజర్లకు మరింత ప్రైవసీ లభిస్తుంది. వారి సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది. దీంతో యూజర్లు ఫేస్బుక్లో ఏమేం చేశారో హ్యాకర్లకు కూడా తెలిసే అవకాశం ఉండదు. అయితే ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది ఫేస్బుక్ వెల్లడించలేదు. -
ఎవరితో పంచుకోకూడని 6 విషయాలు
సాక్షి, హైదరాబాద్: మహిళలు వారి భర్తలతో కంటే ఆప్త మిత్రులతోనే అన్నీ విషయాలు పంచుకుంటారని తాజాగా చేసిన ఓ సర్వేలో తేలింది. ఇద్దరు మహిళలు మిత్రులైతే గొడవల నుంచి ముద్దుల వరకు వారి వ్యక్తిగత విషయాలన్నింటినీ షేర్ చేసుకుంటారని ఆ సర్వే వెల్లడించింది. తమ స్నేహితురాళ్లు చెప్పిన విషయాలను అబ్బాయిలు కూడా పాటిస్తారని తెలిసింది. అయితే అతిగా షేర్ చేసుకోవడం మంచిది కాదని, ఈసారి మీ వ్యక్తిగత విషయాలను మిత్రులతో పంచుకునేటపుడు కింది విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 1. భాగస్వామితో జరిగిన గొడవలు.. రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తితోగానీ, భాగస్వామితో జరిగిన ప్రతీ గొడవను, మనస్పర్థను మిత్రులతో పంచుకోకూడదు. అలా చెబితే వారు అతన్ని లేదా అమెను చులకన భావంతో చూసే అవకాశం ఉంది. గొడవ తర్వాత ఇద్దరూ కలసిపోయినా, అవి విన్న వారు మాత్రం ఆ విషయాన్ని మరచిపోకుండా భవిష్యత్తులో మీపై రుద్దే అవకాశం ఉంది. అత్యవసరమైనవి మాత్రమే పంచుకోవాలి. 2. బాధపడిన ప్రతీసారీ... ఏదైనా విషయంలో మీరు బాధపడిన ప్రతీసారీ మీ మిత్రులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. అలా చెప్పడానికి అలవాటు పడితే వారు దగ్గర లేని సమయంలో ఇబ్బంది వస్తే మరింత ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఒంటరిగానే సమస్యను ఎదుర్కొనేలా మారాలని నిపుణులు సూచిస్తున్నారు. 3. కుటుంబ సమస్యలు... ప్రపంచంలోని ఏ కుటుంబానికి కూడా ఇబ్బందులు లేకుండా ఉండవు. కాబట్టి మీ కుటుంబంలో జరిగే మనస్పర్థలను, కలహాలను మిత్రులతో పంచుకోకపోవడమే మంచిది. కుటుంబంలో కనీసం ఒక్కరు కూడా వినే పరిస్థితిలో లేరు అనే సందర్భంలో మాత్రమే ఇతరులతో పంచుకోవాలి. అనుకోని పరిస్థితి ఎదురై మీ స్నేహితులు శత్రువులైతే కుటుంబ వ్యవహారాలు గుట్టురట్టయ్యే ప్రమాదం ఉంది. 4. చేసిన మంచి పనులు... మనం ఇతరుల పట్ల చూపిన జాలి, సహాయం అందరికి చెప్పుకుంటూ ఉంటే అది దాని లక్ష్యాన్ని చేరుకోలేదు. మన గొప్పదనాన్ని మనం చెప్పుకునే కంటే మన క్రియలే దాన్ని రూఢిపరిస్తే అది మరింత గౌరవాన్ని అందిస్తుంది. కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలీకూడదు అన్న సామెతను మరచిపోకూడదు. 5. లైంగిక జీవితం... లైంగిక జీవితంలో ఎదురయ్యే అనుభూతులు, సమస్యలను ఎవరితోనూ పంచుకోకూడదు. సమస్యలేమైనా ఉంటే సంబంధిత వైద్యులను కలవాలి తప్ప ఇతరుల సలహా అడగకపోవడమే మంచిది. అలా పంచుకోవడం వల్ల వేధింపులకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవడమే ఉత్తమం. 6. మిత్రుల విషయాలను.. మీ మిత్రుల గురించి ఏమైనా చెడుగా వింటే, వారితోనే చర్చించి తెలుసుకోండి. అవునో కాదో అని మధ్యవర్తులను ఆశ్రయించడం ఆ విషయాన్ని మరింతగా ప్రచారం చేయడమే అనే తెలుసుకోవాలి. మీరు తమ గురించి వాకబు చేస్తున్నారన్న విషయాన్ని వేరే వారి ద్వారా మీ మిత్రులు తెలుసుకుంటే మీ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోవచ్చు. అలాగే మీ మిత్రులు మిమ్మల్ని నమ్మి పంచుకున్న రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టవద్దు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయన్న చందాన మీ మిత్రులు కూడా ఏదో ఒకరోజు శత్రువులైతే మీరు పంచుకున్న రహస్యాలే వారికి బ్రహ్మాస్త్రాలవుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే పలు సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.