
న్యూయార్క్: ఫేస్‌బుక్ యూజర్లకు త్వరలో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేవరకు ఫేస్‌బుక్‌లో ఏయే పోస్టింగులు చూశాం? ఎవరెవరికి మెసేజ్‌లు, ఫొటోలు షేర్ చేశాం? తదితర విషయాలు ఇతరులెవరూ తెలుసుకోకుండా ఉండాలంటే మన ఖాతా హిస్టరీని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఇంటర్నెట్ బ్రౌజర్లను వినియోగించిన తర్వాత మాత్రమే క్లియర్ హిస్టరీ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఫేస్‌బుక్ వినియోగదారులకు కూడా క్లియర్ హిస్టరీ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లో బ్రౌజింగ్ హిస్టరీ మొత్తాన్ని చాలా సులభంగా క్లియర్ చేసుకోవచచ్చు. దీని వల్ల యూజర్లకు మరింత ప్రైవసీ లభిస్తుంది. వారి సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది. దీంతో యూజర్లు ఫేస్‌బుక్‌లో ఏమేం చేశారో హ్యాకర్లకు కూడా తెలిసే అవకాశం ఉండదు. అయితే ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది ఫేస్‌బుక్ వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment