ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ యూజర్లకు ఫేస్‌బుక్ శుభవార్తను అందించింది. క్లబ్‌హౌజ్, ట్విటర్ స్పేస్ తరహాలో ఫేస్‌బుక్ లైవ్ ఆడియో రూమ్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ లైవ్ ఆడియో రూమ్స్ ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లైవ్ ఆడియో రూమ్స్ సెలబ్రిటీలకు, కొన్ని గ్రూప్‌లకు అందుబాటులో ఉంది.
చదవండి: బ్లూ ఆరిజిన్ రెండో టూర్ సక్సెస్: అద్భుతమన్న నటుడు.. అంతరిక్షయానంలో అత్యంత వయస్కుడిగా రికార్డు
ఆండ్రాయిడ్ యూజర్లు సపరేట్‌గా లైవ్ ఆడియో రూమ్స్ క్రియోట్ చేసే ఫీచర్‌ను త్వరలోనే తెచ్చేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఫేస్‌బుక్ క్లబ్ హౌజ్, ట్విటర్‌స్పేస్ తరహా లాంటి ఆడియో రూమ్స్‌ను క్రియోట్ చేసేందుకు సమయాత్తమైంది. అందులో భాగంగా యూజర్లకు లైవ్ ఆడియో రూమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. లైవ్ ఆడియో రూమ్స్‌లో స్పీకర్‌గా చేరడానికి ప్రజలను ఆహ్వానించే శక్తి హోస్ట్‌కి ఉంది. కాగా స్పీకర్ చేసే సంభాషణను ఎవరైనా వినవచ్చు.
50 మందితో...!
ఫేస్‌బుక్ లైవ్ ఆడియో రూమ్స్ ప్రస్తుతం 50 మంది స్పీకర్స్‌ను మాత్రమే ఆలో చేస్తుంది. వీరి సంభాషణను వినేవారికి ఎలాంటి పరిమితిని విధించలేదు. ఫేస్‌బుక్ లైవ్ ఆడియో రూమ్స్‌ను క్రియోట్ చేసే ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. లైవ్ ఆడియో రూమ్స్‌ను గ్రూప్ అడ్మిన్స్ కంట్రోల్ చేయవచ్చును. లైవ్ ఆడియో రూమ్స్ ఫీచర్ యాప్‌లో ఫేస్‌బుక్ వాచ్ ట్యాబ్ దగ్గర కన్పిస్తోంది. ఈ ఫీచర్ పరిచయంతో యూజర్లకు కొంత తిప్పలు తప్పనుంది. ఆడియో కన్వర్‌సేషన్ చేసుకునే వారు సపరేట్‌గా ట్విటర్ స్పేస్, క్లబ్ హౌజ్ వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంలో యూజర్లకు కాస్త ఉపశమనం కల‍్గనుంది. క్లబ్‌హౌజ్‌లో జరిగిన గోల ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కన్పించనుంది.
చదవండి: ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..!
Comments
Please login to add a commentAdd a comment