![Upcoming whatsapp interesting feature details - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/8/new%20feature1.jpg.webp?itok=08am7jlY)
ప్రస్తుతం మొబైల్ లేకుండా మనకు రోజే గడవదు, అందులోనూ వాట్సాప్, ఫేస్‌బుక్ వంటివి లేకుండా కాలం ముందుకు సాగదు. అయితే మనకు నచ్చిన వీడియోలు లేదా ఫోటోలు సోషల్ మీడియాలో స్టేటస్‌లగా పెట్టుకోవడం సర్వసాధారణమయిపోయింది. అయితే ఇప్పటివరకు వాట్సాప్‌లో వేరుగా ఫేస్‌బుక్‌లో వేరుగా స్టేటస్‌లు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇలాంటి పద్దతికి చరమగీతం పాడే సమయం వచ్చేసింది.
వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లో స్టోరీగా పెట్టుకోవాలంటే మన స్టేటస్‌లో షేర్ ఆప్షన్ వాడాలి. లేదంటే మళ్లీ ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా అప్‌లోడ్ చేయాలి. అలా కాకుండా వాట్సాప్ తీసుకు వస్తున్న కొత్త ఫీచర్ ద్వారా ఇకపై ఒకే సమయంలో వాట్సాప్ స్టోరీతో పాటు ఫేస్‌బుక్ స్టోరీని పెట్టుకోవచ్చు.
ప్రస్తుతానికి మన వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్స్‌ప్ట్, ఓన్లీ షేర్ విత్ మీ అనే మూడు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి. అయితే త్వరలో వాటి కింద ఫేస్‌బుక్ అనే కొత్త ఆప్షన్ కూడా రానుంది. వాట్సాప్ అండ్ ఫేస్‌బుక్‌లో స్టేటస్ పెట్టాలనుకొనే వారు ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకొని ఫేస్‌బుక్ అకౌంట్‌కి యాడ్ చేసుకోవచ్చు.
(ఇదీ చదవండి: గుడ్ న్యూస్: భారీగా తగ్గిన సీఎన్‌జీ, పీఎన్‌జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా ఉన్నాయి)
వాట్సాప్‌లో రానున్న ఈ కొత్త ఫీచర్ వల్ల మనం ప్రత్యేకంగా ఫేస్‌బుక్‌లో స్టేటస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి రెండింటిలోనూ స్టేటస్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment