
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఫేస్‌బుక్ శుభవార్తను అందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏవైనా ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేయాలంటే కచ్చితంగా ఆండ్రాయిడ్ లేదా ఐవోస్ ఫోన్లనుంచి మాత్రమే ఆప్‌లోడ్ చేసే వీలు ఉండేది. డెస్క్‌టాప్ బ్రౌజర్ నుంచి ఫోటోలను, వీడియోలను యూజర్లు పోస్ట్ చేసే అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం రానున్న రోజుల్లో ఇకపై డెస్క్‌టాప్ బ్రౌజర్ నుంచి నేరుగా ఫోటోలను , వీడియోలను పోస్ట్ చేసే సౌలభ్యాన్ని యూజర్ల కోసం తీసుకురానుంది ఫేస్‌బుక్. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్‌తో నేరుగా డెస్క్‌టాప్ నుంచి ఫోటోలకు ఫిల్టర్‌లు, ఎడిటింగ్, క్రాప్ ఆప్షన్లను చేయవచ్చును.
కాగా డెస్క్‌టాప్ బ్రౌజర్‌తో నేరుగా వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేసే ఫీచర్‌ను టిప్‌స్టర్ అనే బ్లాగర్ కొన్ని రోజుల క్రితం ఆన్‌లైన్‌లో లీక్ చేశాడు. ఈ ఫీచర్ రానున్న రోజుల్లో యూజర్ల ముందుకు వస్తోందనే విషయాన్ని ఫేస్‌బుక్ ధృవీకరించింది. ఫేస్‌బుక్ ప్రతినిధి ఒక ప్రకటనలో..చాలా మంది యూజర్లు తమ కంప్యూటర్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేస్తున్నారని మాకు తెలుసు. వారి కోసం డెస్క్‌టాప్ ఇన్‌స్టాగ్రామ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొబైల్ యాప్‌ల్లో వచ్చే అన్ని ఫీచర్లను డెస్క్‌టాప్ బ్రౌజర్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్లు వచ్చేలా చేస్తోన్నామని పేర్కొన్నారు.
NEW! @Instagram lets you create + publish posts via desktop! pic.twitter.com/JWzwKg1kyO
— Matt Navarra (@MattNavarra) June 24, 2021
చదవండి: ప్రపంచంలో శక్తివంతమైన మైక్రోచిప్ అభివృద్ధి చేసిన టెస్లా