desktop
-
భారతీయులకు టెక్ దిగ్గజం హెచ్‌పీ శుభవార్త!!
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌పీ భారతీయులకు శుభవార్త చెప్పింది. దేశీయంగా హెచ్‌పీ ల్యాప్‌ట్యాప్‌లను తయారు చేయడం ప్రారంభించినట్లు తెలిపింది. దేశీయం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌ల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటీవ్(పీఎల్ఐ) స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పథకం సత్పలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పథకంలో భాగంగా హెచ్ పీ సంస్థ మన దేశంలో డెస్క్‌టాప్ లు, మినీ డెస్క్‌టాప్‌లు, డిస్ప్లే మానిటర్లు, ల్యాప్‌టాప్‌లను తయారు చేయడం ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ గణాంకాల ప్రకారం..2020నుంచి హెచ్‌పీ భారత్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగినట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ మార్కెట్‌ను మరింత పెంచేందుకు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తుంది. హెచ్‌పీ ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చర్ కంపెనీ ఫ్లెక్స్ కంపెనీతో చేతులు కలిపింది. తమిళనాడులో చెన్నైకి చెందిన శ్రీపెరంబుదూర్‌లోని హెచ్‌పీ తయారీ యూనిట్లను పెంచేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లు హెచ్‌పీ ఇండియా మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ కేతన్ పటేల్ అన్నారు. వాస్తవానికి హెచ్‌పీ భారత్‌లో కమర్షియల్ డెస్క్ టాప్‌లను తయారు చేస్తుంది. అయితే తాజా పెట్టుబడలతో హెచ్‌పీ ఎలైట్ బుక్స్, ప్రో బుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్‌తో పాటు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్నట్లు హెచ్ పీ వెల్లడించింది.. -
యూట్యూబ్ సూపర్ ఫీచర్..ఇప్పుడు మొబైల్‌తో పాటుగా...!
యూట్యూబ్ డెస్క్‌టాప్ యూజర్లకు త్వరలోనే గుడ్‌న్యూస్‌ను అందించనుంది. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో యూట్యూబ్‌లో వీడియోలను చూడడం కోసం మనం ముందుగానే వైఫై, లేదా మొబైల్ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లోనే వీడియోలను డౌన్లోడ్ చేసి...తరువాత ఆఫ్‌లైన్‌లో వీడియోలను చూస్తూంటాం. యూట్యూబ్‌లో ఆఫ్‌లైన్ వీడియో ఫీచర్ కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్ ఫీచర్‌ను త్వరలోనే డెస్క్‌టాప్ యూజర్లకోసం అందించే ప్రయత్నాలను యూట్యూబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్ కేవలం యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! మీరు యూట్యూబ్ ప్రీమియం యూజర్ అయితే ఈ కొత్త ఫీచర్‌ను ‘https://www.youtube.com/new’ సైట్‌కు వెళ్లి ప్రయత్నించవచ్చును. క్రోమ్, ఎడ్జ్ లేదా ఒపెరా బ్రౌజర్ల తాజా వెర్షన్ డెస్క్‌టాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. డెస్క్‌టాప్‌లో డౌన్‌లోడ్‌చేసిన వీడియోలను తర్వాత ఆఫ్‌లైన్‘ youtube.com/feed/download’లో చూడవచ్చు, ఇది సైడ్ నావిగేషన్ ప్యానెల్లో కూడా అందుబాటులో ఉంటుంది. యూజర్లు గరిష్టంగా 1080పీ నాణ్యతతో వీడియోను డౌన్లోడ్ చేసుకోవచ్చును. కాగా యూజర్లు తమ ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసిన వీడియోలను తమ హార్డ్ డ్రైవ్‌లో శాశ్వతంగా ఉంచడానికి యూట్యూబ్ అనుమతించదు. దాంతో పాటుగా యూట్యూబ్ పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మినీ ప్లేయర్లో వీడియోలను చేసే ఫీచర్‌ను కూడా పరిక్షిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! -
ఇన్‌స్టా యూజర్లకు ఫేస్బుక్ శుభవార్త..! ఇకపై..
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ఫేస్బుక్ శుభవార్తను అందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏవైనా ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేయాలంటే కచ్చితంగా ఆండ్రాయిడ్ లేదా ఐవోస్ ఫోన్లనుంచి మాత్రమే ఆప్‌లోడ్ చేసే వీలు ఉండేది. డెస్క్‌టాప్ బ్రౌజర్ నుంచి ఫోటోలను, వీడియోలను యూజర్లు పోస్ట్ చేసే అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం రానున్న రోజుల్లో ఇకపై డెస్క్‌టాప్ బ్రౌజర్ నుంచి నేరుగా ఫోటోలను , వీడియోలను పోస్ట్ చేసే సౌలభ్యాన్ని యూజర్ల కోసం తీసుకురానుంది ఫేస్బుక్. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్‌తో నేరుగా డెస్క్‌టాప్ నుంచి ఫోటోలకు ఫిల్టర్లు, ఎడిటింగ్, క్రాప్ ఆప్షన్లను చేయవచ్చును. కాగా డెస్క్‌టాప్ బ్రౌజర్‌తో నేరుగా వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేసే ఫీచర్‌ను టిప్‌స్టర్ అనే బ్లాగర్ కొన్ని రోజుల క్రితం ఆన్లైన్లో లీక్ చేశాడు. ఈ ఫీచర్ రానున్న రోజుల్లో యూజర్ల ముందుకు వస్తోందనే విషయాన్ని ఫేస్బుక్ ధృవీకరించింది. ఫేస్బుక్ ప్రతినిధి ఒక ప్రకటనలో..చాలా మంది యూజర్లు తమ కంప్యూటర్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేస్తున్నారని మాకు తెలుసు. వారి కోసం డెస్క్‌టాప్ ఇన్స్టాగ్రామ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొబైల్ యాప్‌ల్లో వచ్చే అన్ని ఫీచర్లను డెస్క్‌టాప్ బ్రౌజర్‌తో ఇన్స్టాగ్రామ్ ఫీచర్లు వచ్చేలా చేస్తోన్నామని పేర్కొన్నారు. NEW! @Instagram lets you create + publish posts via desktop! pic.twitter.com/JWzwKg1kyO — Matt Navarra (@MattNavarra) June 24, 2021 చదవండి: ప్రపంచంలో శక్తివంతమైన మైక్రోచిప్ అభివృద్ధి చేసిన టెస్లా -
మరో ఫీచర్, ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్
వినియోగదారులకు అనుగుణంగా సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లకే పరిమితమైన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు డెస్క్ టాప్‌పై దర్శనమివ్వబోతున్నాయి."మాకు తెలుసు వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ తో పాటు డెస్క్‌టాప్‌లో రీల్స్‌ను షేర్ చేయాలని చూస్తున్నారు. వారి కోసమే డెస్క్‌టాప్ ఫీచర్‌ను అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రీల్స్‌ను రికార్డ్ చేసి.. డెస్క్ టాప్ ద్వారా అప్లోడ్ చేయోచ్చు"అని ఇన్స్టాగ్రామ్ స్పోక్ పర్సన్ అధికారికంగా ప్రకటించారు. రీల్స్‌ను ఎలా అప్లోడ్ చేయాలి. ♦ ఇన్స్టాగ్రామ్ ను మీకంప్యూటర్లో, లేదంటే ల్యాప్‌ట్యాప్ లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత ఇన్ స్టాగ్రామ్ ఇంటర్ ఫేస్‌లో ప్లస్ సింబల్‌ను క్లిక్ చేయాలి ♦ క్లిక్ చేసి సెలక్ట్ ఫ్రమ్ కంప్యూటర్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ♦ అనంతరం మీకు కావాల్సిన ఒరిజనల్ స్కైర్,ల్యాండ్ స్కేప్, పోట్రేట్ సైజ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ♦ సెలక్ట్ చేసుకున్న అనంతరం క్లిక్ నెక్ట్స్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. ♦ అలా ట్యాప్ చేస్తే ఫిల్టర్, ఎడిట్ బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ ఆప్షన్లు మనకు కనిపిస్తాయి. ♦ అనంతరం మీ వీడియోలకు, ఫోటోలకు క్యాప్షన్ రాసి, లోకేషన్ యాడ్ చేయాలి. ఆ తరువాత వీడియోని షేర్ చేసుకునే సదుపాయాన్ని ఇన్ స్టాగ్రామ్ కల్పించింది. చదవండి: రేజర్‌పేతో ట్విటర్ జట్టు -
డెస్క్ టాప్లోనూ వాయిస్, వీడియో కాల్స్
వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల ఆకట్టుకోవడానికి మరో కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది. వాయిస్, వీడియో కాల్స్ సౌకర్యాన్ని డెస్క్ టాప్ యాప్‌నకూ కలిపించినట్టు వాట్సాప్ గురువారం ప్రకటించింది. ఈ సౌకర్యాన్ని పొందాలంటే డెస్క్ టాప్/ల్యాప్ ట్యాప్‌తో పాటు మొబైల్ కూడా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉండాలి. కస్టమర్లకు నమ్మదగిన, అత్యంత నాణ్యమైన అనుభూతి కలిపిస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. డెస్క్ టాప్ యాప్‌నకూ గ్రూప్ వాయిస్, వీడియో కాల్స్‌ను రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్టు వివరించింది. ఏడాదిగా వాట్సాప్ కాల్స్ పెరుగుతున్నాయని, నూతన సంవత్సర వేడుక నాడు 140 కోట్ల వాయిస్, వీడియో కాల్స్ నమోదయ్యాయని వెల్లడించింది. చదవండి: భూమికి దగ్గరగా దూసుకెళ్లనున్న ఆస్టరాయిడ్ ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ -
లెనోవో నుంచి నూతన థింక్‌ప్యాడ్‌లు
న్యూఢిల్లీ: లెనోవో నూతన తరం థింక్‌ప్యాడ్, థింక్ సెంటర్‌పీసీలను మంగళవారం విడుదల చేసింది. వాణిజ్య ఐవోటీ, సెక్యూరిటీ సొల్యూషన్లలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది. థింక్‌ప్యాడ్ టీ490, థింక్‌ప్యాడ్ ఎక్స్390, థింక్‌సెంటర్ నానో, థింక్‌సెంటర్ నానో ఐవోటీ ఆవిష్కరించిన వాటిల్లో ఉన్నాయి. సులభమై, భద్రతతో కూడిన, వేగవంతమైన, అధిక పనితీరు చూపించే పరికరాలను నేడు ఉద్యోగులు కోరుకుంటున్నారని, థింక్‌ప్యాడ్ ఈ అవసరాలను తీరుస్తుందని ఈ ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా లెనోవో ఇండియా ఎండీ, సీఈవో రాహుల్ అగర్వాల్ పేర్కొన్నారు. కళ్లను సురక్షితంగా ఉంచే టెక్నాలజీతో వీటిని రూపొందించినట్టు వెల్లడించారు. -
ఇక వాట్స్‌యాప్ @ డెస్క్‌టాప్
గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో అందుబాటులోకి శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్... డెస్క్‌టాప్, పర్సనల్ కంప్యూటర్లలోనూ గురువారం నుంచి తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. తద్వారా యూజర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకునే వ్యూహాలకు కంపెనీ తెరతీసింది.గతేడాది సుమారు 19 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని వెచ్చించి వాట్స్‌యాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్బుక్... ఈ కొత్త వెబ్ బ్రౌజర్ వెర్షన్ సర్వీసును ప్రారంభించింది. అయితే, ప్రస్తుతానికి దీన్ని గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ నుంచి అదీ ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు మాత్రమే వినియోగించుకునే వీలుంటుంది. ఐఫోన్లో వాట్స్‌యాప్ వాడుతున్న యూజర్లకు యాపిల్ కంపెనీ ప్లాట్‌ఫామ్ పరిమితుల కారణంగా ఈ వెబ్ సేవలు లభించవని వాట్స్‌యాప్ బ్లాగ్‌లో వెల్లడించింది. మొబైల్‌తో అనుసంధానం... యూజర్ తన ఫోన్లోని వాట్స్‌యాప్ అకౌంట్‌నే కంప్యూటర్లోని వెబ్ బ్రౌజర్ ద్వారా ఉపయోగించుకునేలా(మిర్రర్) ఈ సర్వీసు వీలుకల్పిస్తుందని వాట్స్‌యాప్ సంస్థ బ్లాగ్‌లో వెల్లడించింది. అంటే మొబైల్లోని వాట్స్యాప్కు ఎక్స్టెన్షన్ కింద లెక్క. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్స్యాప్కు 60 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నట్లు అంచనా. భారత్‌లో వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 7 కోట్లు. ఈ సేవలను వినియోగించుకోవాలంటే.. యూజర్లు క్రోమ్ బ్రౌజర్లో ‘వెబ్.వాట్స్‌యాప్.కామ్’ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులోని క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేయాలి. దీంతో మొబైల్ ఫోన్లోని వాట్స్‌యాప్ అకౌంట్ బ్రౌజర్లో ప్రత్యక్షమవుతుంది. ఫోన్లో మెసేజ్‌లు పంపుకున్నట్లే బ్రౌజర్‌లోనూ దీన్ని ఉపయోగించొచ్చు. అయితే, మొబైల్లో తాజా వాట్స్‌యాప్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవడంతో పాటు మొబైల్‌ను నెట్‌తో కనెక్ట్ చేసి ఉంచడం తప్పనిసరి.