యూట్యూబ్‌ సూపర్‌ ఫీచర్‌..ఇప్పుడు మొబైల్‌తో పాటుగా...! | Youtube For Desktop Could Soon Allow Premium Users To Download Videos | Sakshi
Sakshi News home page

Youtube: యూట్యూబ్‌ సూపర్‌ ఫీచర్‌..ఇప్పుడు మొబైల్‌తో పాటుగా...!

Published Thu, Sep 23 2021 6:06 PM | Last Updated on Thu, Sep 23 2021 6:17 PM

Youtube For Desktop Could Soon Allow Premium Users To Download Videos - Sakshi

యూట్యూబ్‌ డెస్క్‌టాప్‌ యూజర్లకు త్వరలోనే గుడ్‌న్యూస్‌ను అందించనుంది. నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లో యూట్యూబ్‌లో వీడియోలను చూడడం కోసం మనం ముందుగానే వైఫై, లేదా మొబైల్‌ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాల్లోనే వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి...తరువాత ఆఫ్‌లైన్‌లో వీడియోలను చూస్తూంటాం. యూట్యూబ్‌లో ఆఫ్‌లైన్‌ వీడియో ఫీచర్‌ కేవలం మొబైల్‌ యూజర్లకు  మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌ ఫీచర్‌ను త్వరలోనే డెస్క్‌టాప్‌ యూజర్లకోసం అందించే ప్రయత్నాలను యూట్యూబ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్‌ కేవలం యూట్యూబ్‌ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. 
చదవండి: జేమ్స్‌బాండ్‌-007 భాగస్వామ్యంతో స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌..! 



మీరు యూట్యూబ్‌ ప్రీమియం యూజర్‌ అయితే ఈ  కొత్త ఫీచర్‌ను ‘https://www.youtube.com/new’ సైట్‌కు వెళ్లి ప్రయత్నించవచ్చును. క్రోమ్, ఎడ్జ్ లేదా ఒపెరా బ్రౌజర్‌ల తాజా వెర్షన్‌ డెస్క్‌టాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

డెస్క్‌టాప్‌లో డౌన్‌లోడ్‌చేసిన వీడియోలను తర్వాత ఆఫ్‌లైన్‌‘ youtube.com/feed/download’లో చూడవచ్చు, ఇది సైడ్ నావిగేషన్ ప్యానెల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. యూజర్లు గరిష్టంగా 1080పీ నాణ్యతతో వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. కాగా  యూజర్లు తమ ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసిన వీడియోలను తమ హార్డ్ డ్రైవ్‌లో శాశ్వతంగా ఉంచడానికి యూట్యూబ్‌ అనుమతించదు. దాంతో పాటుగా యూట్యూబ్‌ పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మినీ ప్లేయర్‌లో వీడియోలను చేసే ఫీచర్‌ను కూడా పరిక్షిస్తున్నట్లు తెలుస్తోంది. 
చదవండి: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement