premium users
-
వారికోసం యస్ బ్యాంక్ ప్రైవేట్ డెబిట్ కార్డు, బెనిఫిట్స్ ఏంటి?
ముంబై: అత్యంత సంపన్న కస్టమర్ల (హెచ్ఎన్ఐ) కోసం మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యంతో యస్ బ్యాంక్ కొత్తగా ప్రైవేట్ డెబిట్ కార్డును ఆవిష్కరించింది. సంపన్న ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్ల అవసరాలకు తగినట్లుగా ఇందులో ఫీచర్లు ఉంటాయని యస్ బ్యాంక్ గ్లోబల్ హెడ్ రాజన్ పెంటాల్ తెలిపారు. ట్రావెల్, వెల్నెస్, లైఫ్‌స్టయిల్ వంటి వివిధ విభాగాల్లో ప్రత్యేక ప్రయోజనాలు అందు కోవచ్చని పేర్కొన్నారు. ఓబెరాయ్ హోట ల్స్ నుంచి ఈ-గిఫ్ట్ వోచర్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, ఎయిర్పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ పొందవచ్చని వివరించారు. ఆసి యా పసిఫిక్ దేశాల్లో ఈ తరహా వర ల్డ్ ఎలైట్ డెబిట్ కార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ తెలిపారు. -
యూట్యూబ్ సూపర్ ఫీచర్..ఇప్పుడు మొబైల్‌తో పాటుగా...!
యూట్యూబ్ డెస్క్‌టాప్ యూజర్లకు త్వరలోనే గుడ్‌న్యూస్‌ను అందించనుంది. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో యూట్యూబ్‌లో వీడియోలను చూడడం కోసం మనం ముందుగానే వైఫై, లేదా మొబైల్ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లోనే వీడియోలను డౌన్లోడ్ చేసి...తరువాత ఆఫ్‌లైన్‌లో వీడియోలను చూస్తూంటాం. యూట్యూబ్‌లో ఆఫ్‌లైన్ వీడియో ఫీచర్ కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్ ఫీచర్‌ను త్వరలోనే డెస్క్‌టాప్ యూజర్లకోసం అందించే ప్రయత్నాలను యూట్యూబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్ కేవలం యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! మీరు యూట్యూబ్ ప్రీమియం యూజర్ అయితే ఈ కొత్త ఫీచర్‌ను ‘https://www.youtube.com/new’ సైట్‌కు వెళ్లి ప్రయత్నించవచ్చును. క్రోమ్, ఎడ్జ్ లేదా ఒపెరా బ్రౌజర్ల తాజా వెర్షన్ డెస్క్‌టాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. డెస్క్‌టాప్‌లో డౌన్‌లోడ్‌చేసిన వీడియోలను తర్వాత ఆఫ్‌లైన్‘ youtube.com/feed/download’లో చూడవచ్చు, ఇది సైడ్ నావిగేషన్ ప్యానెల్లో కూడా అందుబాటులో ఉంటుంది. యూజర్లు గరిష్టంగా 1080పీ నాణ్యతతో వీడియోను డౌన్లోడ్ చేసుకోవచ్చును. కాగా యూజర్లు తమ ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసిన వీడియోలను తమ హార్డ్ డ్రైవ్‌లో శాశ్వతంగా ఉంచడానికి యూట్యూబ్ అనుమతించదు. దాంతో పాటుగా యూట్యూబ్ పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మినీ ప్లేయర్లో వీడియోలను చేసే ఫీచర్‌ను కూడా పరిక్షిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! -
యూజర్లపై స్నాప్‌చాట్ సీఈవో తలపొగరు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఒకవైపు సోషల్‌మీడియా దిగ్గజాలు భారత మార్కెట్లో పాగా వేసేందుకు పోటీ పడుతోంటే స్నాప్‌చాట్ సీఈవో ఇవాన్ స్పీగెల్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ వ్యాపారాన్ని విస్తరించేంత సీన్ భారత్‌కు లేదన్నట్టు ప్రవర్తించాడు. భారతదేశంలాంటి పేద దేశంలో స్నాప్‌చాట్ వ్యాపార విస్తరణ అవసరం లేదని వ్యాఖ్యానించాడు. తమ యాప్ కేవలం ధనికులకోసతే తప్ప పేదోళ్లకి కాదంటూ నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించడం విస్తుగొలిపింది. అంతేకాదు ఇండియా, స్పెయిన్ లాంటి పేద దేశాల్లో విస్తరించాలని తాను కోరుకోవడంలేదని పేర్కొన్నాడు. తన మెసేజింగ్ యాప్ స్నాప్ చాట్ ధనవంతులకే తప్ప పేదవాళ్లకి కాదని ఇవాన్ పేర్కొన్నాడు. కేవలం ప్రీమియం యూజర్లపైనే తాము దృష్టి పెట్టినట్టు చెప్పాడు. ఇండియా, స్పెయిన్ పేద దేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించదల్చుకోలేదంటూ అహంకారాన్ని ప్రదర్శించాడు.2015 సం.రంలో స్నాప్ చాట్ యూజర్ బేస్ వృద్ధిపై నిర్వహించిన సమావేశాలో ఇవాన్ స్పీగెల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వెరైటీ మీడియా రిపోర్ట్ చేసింది. కాగా స్నాప్ చాట్ మాజీ ఉద్యోగి ఆంథోనీ పాంప్లియానో ఇన్వెస్టర్లను, వ్యాపార భాగస్వాములను మోసం చేస్తోందని ఆరోపిస్తూ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇండియా, స్పెయిన్ లాంటి దేశాల్లో పొటెన్షియల్ గ్రోత్ పై దృష్టి పెట్టాలని సూచించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వెరైటీ మీడియా నివేదించింది. భారత్, స్పెయిన్ వంటి దేశాల్లో స్నాప్‌చాట్‌కు వృద్ధి అవకాశాలు ఉన్నాయని చెప్పానని, అప్పుడు స్పీగెల్ జోక్యం చేసుకుని ‘‘స్నాప్‌చాట్ కేవలం సంపన్నులకు మాత్రమే’’నని చెప్పి, తన మాటలను అడ్డుకున్నారని ఫిర్యాదులో ఆంథోనీ ఆరోపించినట్లు ‘వెరైటీ’ కథనం తెలిపింది.