Offline videos
-
యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్!
ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఫ్రీగా చూసిన వీడియోల్ని ఇకపై డబ్బులు చెల్లించి వీక్షించాలని యూట్యూబ్ కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది. రాబోయే రోజుల్లో యూట్యూబ్‌లో ఎంటర్టైన్మెంట్ కాస్త మరింత కమర్షియల్‌గా మారనుంది. ఇప్పటికే యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలి. మనకు నచ్చిన సినిమానో లేదంటే వెబ్ సిరీస్ చూసే సమయంలో యాడ్స్ రాకుండా ఉండాలంటే పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇకపై డౌన్లోడ్ చేసుకున్న వీడియోలకు డబ్బులు కట్టాలని యూట్యూబ్ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. బఫరింగ్ సమస్య , డేటా అయిపోతుందనే బాధలేకుండా విద్యార్ధులు, ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల కోసం నచ్చిన వీడియోల్ని చూపించేలా యూట్యూబ్ వీడియోల్ని డౌన్లోడ్ పెట్టి మరి ఆ వీడియోల్ని చూపించే వారు. విద్యార్ధులు సైతం వారికి కావాల్సిన ఏదైనా కోర్స్ ట్యుటోరియల్ వీడియోల్ని డౌన్లోడ్ పెట్టుకొని వీక్షించేవారు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభంలో ఈ డౌన్లోడ్ సదుపాయాన్ని వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువైంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేలా యూట్యూబ్' డౌన్లోడ్ వీడియోలకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలని సూచించింది. దీంతో తాజా యూట్యూబ్ నిర్ణయంపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది -
యూట్యూబ్ సూపర్ ఫీచర్..ఇప్పుడు మొబైల్‌తో పాటుగా...!
యూట్యూబ్ డెస్క్‌టాప్ యూజర్లకు త్వరలోనే గుడ్‌న్యూస్‌ను అందించనుంది. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో యూట్యూబ్‌లో వీడియోలను చూడడం కోసం మనం ముందుగానే వైఫై, లేదా మొబైల్ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లోనే వీడియోలను డౌన్లోడ్ చేసి...తరువాత ఆఫ్‌లైన్‌లో వీడియోలను చూస్తూంటాం. యూట్యూబ్‌లో ఆఫ్‌లైన్ వీడియో ఫీచర్ కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్ ఫీచర్‌ను త్వరలోనే డెస్క్‌టాప్ యూజర్లకోసం అందించే ప్రయత్నాలను యూట్యూబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్ కేవలం యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! మీరు యూట్యూబ్ ప్రీమియం యూజర్ అయితే ఈ కొత్త ఫీచర్‌ను ‘https://www.youtube.com/new’ సైట్‌కు వెళ్లి ప్రయత్నించవచ్చును. క్రోమ్, ఎడ్జ్ లేదా ఒపెరా బ్రౌజర్ల తాజా వెర్షన్ డెస్క్‌టాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. డెస్క్‌టాప్‌లో డౌన్‌లోడ్‌చేసిన వీడియోలను తర్వాత ఆఫ్‌లైన్‘ youtube.com/feed/download’లో చూడవచ్చు, ఇది సైడ్ నావిగేషన్ ప్యానెల్లో కూడా అందుబాటులో ఉంటుంది. యూజర్లు గరిష్టంగా 1080పీ నాణ్యతతో వీడియోను డౌన్లోడ్ చేసుకోవచ్చును. కాగా యూజర్లు తమ ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసిన వీడియోలను తమ హార్డ్ డ్రైవ్‌లో శాశ్వతంగా ఉంచడానికి యూట్యూబ్ అనుమతించదు. దాంతో పాటుగా యూట్యూబ్ పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మినీ ప్లేయర్లో వీడియోలను చేసే ఫీచర్‌ను కూడా పరిక్షిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! -
నెట్ ఫ్లిక్స్ లో నచ్చిన సినిమాల్ని డౌన్ లోడ్ చేయడం ఎలా?!
మనం ఇప్పుడంటే ఇంటికి పరిమితం అయ్యాం' కానీ పరిస్థితులు చక్కబడితే బిజి అయిపోతాం. ఉరుకులు పరుగుల జీవితం.ఆఫీస్, ఇల్లు, ప్రయాణలతో అలసిపోతాం. అయితే అలా అలసిపోయే మనసుకు స్వాంతన చేకూర్చేది సంగీతమో లేదంటే సినిమాలు. కాస్త టైం దొరికినా, బస్సులో ప్రయాణిస్తున్నా నచ్చిన మ్యూజిక్ వింటూనే, సినిమాలు చూస్తూనో ఒత్తిడి నుంచి బయటపడుతుంటాం. ముఖ్యంగా ప్రయాణాల్లో మ్యూజిక్ వినాలన్నా, సినిమాలు చూడాలన్నా నెట్ బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే వైఫై సౌకర్యం ఉండాలి. కానీ కొన్ని సార్లు ఆ సౌలభ్యం ఉండదు. ఉదాహరణకు ఓటీటీలో నచ్చిన సినిమా చూసే సమయంలో సడెన్ వైఫ్ ఇష్యూ వస్తే ఆఫ్ చేసి ఇదేదో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉందే అని తిట్టుకుంటుంటాం. కానీ ఇకపై ఈ ఆప్షన్ తో నెట్ ఫ్లిక్స్ లో మీరు నచ్చిన సినిమాను చూడొచ్చు. ఫ్రీగా ఉన్నప్పుడు అదే సినిమాను డౌన్ లోడ్ చేసి చూసుకోవచ్చు. కాకపోతే ఆ సినిమాల్లో కొన్ని మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ లో షోలు / సినిమాల్ని డౌన్లోడ్ చేయడం ఎలా? • ముందుగా నెట్‌ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేయండి • వెస్ సిరీస్ , సినిమాల్ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే డీటెయిల్స్ పేజీలోకి వెళ్లాలి. • డౌన్లోడ్ బటన్ ను క్లిక్ చేస్తే మీకు నచ్చిన సినిమా డౌన్ లోడ్ అవుతుంది. • నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలను ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ వెబ్ సిరీస్ మొత్తం ఏపీసోడ్ లను ఒకేసారి డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యం కాదు. ఏపీసోడ్ వైజ్ గా డౌన్ లోడ్ చేసుకోవాలి. పైన మనం చెప్పుకున్నట్లుగా కొన్ని సినిమాలకి మాత్రమే డౌన్ లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్ లోడ్ కాని సినిమాల్ని ఆన్ లైన్ లో చూడాల్సి వస్తుంది. చదవండి : ఈ టెక్నిక్ తో మీకు నచ్చిన సినిమాల్ని ఒక్క క్లిక్ తో చూడొచ్చు -
ఆఫ్‌లైన్‌లో ఫేస్బుక్ వీడియోలు చూడొచ్చు
న్యూయార్క్: ఈ రోజుల్లో ఫేస్బుక్ ఖాతా లేని యువత చాలా అరుదు. స్మార్ట్ఫోన్లు వచ్చేశాక తమ జీవితంలోని విశేషాలన్నింటిని ఫేస్బుక్ ద్వారా వీడియోలు, ఫొటోల రూపొలో స్నేహితులతో పంచుకుంటున్నారు. అయితే ఈ వీడియోలు చూడాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేదంటే వైఫై ఉండాల్సిందే. త్వరలో ఈ రెండూ లేకపోయినా ఫేస్బుక్లో వీడియోలు చూడొచ్చు. దీని కోసం ఫేస్బుక్ కొత్త టూల్‌ను సిద్ధం చేస్తోంది. యూట్యూబ్‌లోని ఆఫ్‌లైన్ వీడియోల తరహాలోనే ఇదీ పని చేస్తుంది. వైఫై పరిధిలో మీ మొబైల్ ఉన్నప్పుడు యాప్‌లో కొన్ని వీడియోలు డౌన్లోడ్ అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ వీడియోలను నెట్ కనెక్షన్ లేకుండానే వీక్షించొచ్చు. వీడియోలను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతం కూడా ఉంది. అయితే ఇందులో ఆయా వీడియోలను మీరే డౌన్ లోడ్ చేసుకోవాలి. కొత్త ఆప్షన్లో మీ ప్రమేయం లేకుండానే వీడియోలు డౌన్లోడ్ అవుతాయి. ఏవి ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాలనేది మీరే ఎంచుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ అయిన వీడియోలపైన లైట్నింగ్ గుర్తు ఉంటుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
ఆఫ్ లైన్ లోనూ ఫేస్ బుక్ వీడియోలు!
యూట్యూబ్ తో పోటీని ఉధృతం చేయడానికి ఫేస్ బుక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆఫ్ లైన్ లో కూడా భారత యూజర్లు వీడియోలు వీక్షించేలా అవకాశం కల్పించనున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది. జూలై 11 నుంచి భారత్ లో ఈ టెస్టింగ్ ను ప్రారంభించబోతున్నట్టు వెల్లడించింది. ఈ ఫీచర్ ను మొదట తక్కువ మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి అనంతరం ఫేస్ బుక్ వినియోగదారులందరికీ ఈ అవకాశం కల్పించాలని ఫేస్ బుక్ యోచిస్తోంది. భారత్ లో ఎంపిక చేసిన మీడియా పార్టనర్లకు ఫేస్ బుక్ తన ప్లాన్ గురించి తెలుపుతూ ఈ-మెయిల్స్ పంపింది. దీంతో ఫేస్ బుక్ అందించబోయే ఆఫ్ లైన్ వీడియోలు ప్రస్తుతం మీడియా హౌజ్ లకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఫేస్ బుక్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో ఉన్నప్పుడు యూజర్లు వీడియోలను డౌన్ లోడ్ చేసుకుని, ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఆ వీడియోలను వీక్షించేలా ఈ కొత్త ఆప్షన్ ను ఫేస్ బుక్ ప్రవేశపెట్టనుంది. పబ్లిషర్లు తమ అప్ లోడెడ్ వీడియోలు, డౌన్ లోడ్ కు అవకాశం కల్పించొద్దు అనుకుంటే ఆ స్వేచ్చను కూడా పబ్లిషర్లకు ఫేస్ బుక్ కల్పించనుంది. యూట్యూబ్ 2014లోనే ఆఫ్ లైన్ వీడియో సేవలను భారత్ లో ప్రారంభించింది. డౌన్ లోడ్ చేసుకున్న 48 గంటల అనంతరం నుంచి యూజర్లు ఆ వీడియోలను ఆఫ్ లైన్ లో చూడొచ్చు. అయితే ఈ విషయంలో ఫేస్ బుక్ ఎలాంటి పరిమితులను విధించలేదు. వీడియో స్ట్రీమింగ్ సర్వీసుతో ఫేస్ బుక్ కు క్రేజ్ పెరుగుతోంది. కొత్త ఫీచర్లు, సర్వీసులతో ఫేస్ బుక్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను విస్తరిస్తూ వస్తోంది. యూజర్లు తన యాప్, వెబ్ సైట్ ద్వారా 1000 లక్షల గంటలు వీడియోలు చూస్తున్నారని ఫేస్ బుక్ రికార్డుల్లో ఇటీవలే తేలింది.