ఆఫ్‌లైన్‌లో ఫేస్‌బుక్‌ వీడియోలు చూడొచ్చు | Facebook for Android now lets you save videos to watch offline | Sakshi
Sakshi News home page

ఆఫ్‌లైన్‌లో ఫేస్‌బుక్‌ వీడియోలు చూడొచ్చు

Published Tue, Sep 12 2017 11:35 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఆఫ్‌లైన్‌లో ఫేస్‌బుక్‌ వీడియోలు చూడొచ్చు - Sakshi

ఆఫ్‌లైన్‌లో ఫేస్‌బుక్‌ వీడియోలు చూడొచ్చు

న్యూయార్క్‌: ఈ రోజుల్లో ఫేస్‌బుక్‌ ఖాతా లేని యువత చాలా అరుదు. స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాక తమ జీవితంలోని విశేషాలన్నింటిని ఫేస్‌బుక్‌ ద్వారా వీడియోలు, ఫొటోల రూపొలో స్నేహితులతో పంచుకుంటున్నారు. అయితే ఈ వీడియోలు చూడాలంటే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేదంటే వైఫై ఉండాల్సిందే. త్వరలో ఈ రెండూ లేకపోయినా ఫేస్‌బుక్‌లో వీడియోలు చూడొచ్చు. దీని కోసం ఫేస్‌బుక్‌ కొత్త టూల్‌ను సిద్ధం చేస్తోంది. యూట్యూబ్‌లోని ఆఫ్‌లైన్‌ వీడియోల తరహాలోనే ఇదీ పని చేస్తుంది.

వైఫై పరిధిలో మీ మొబైల్‌ ఉన్నప్పుడు యాప్‌లో కొన్ని వీడియోలు డౌన్‌లోడ్‌ అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ వీడియోలను నెట్‌ కనెక్షన్‌ లేకుండానే వీక్షించొచ్చు. వీడియోలను ఆఫ్‌లైన్‌లో సేవ్‌ చేసుకునే ఆప్షన్‌ ప్రస్తుతం కూడా ఉంది. అయితే ఇందులో ఆయా వీడియోలను మీరే డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. కొత్త ఆప్షన్‌లో మీ ప్రమేయం లేకుండానే వీడియోలు డౌన్‌లోడ్‌ అవుతాయి. ఏవి ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాలనేది మీరే ఎంచుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్‌ అయిన వీడియోలపైన లైట్నింగ్‌ గుర్తు ఉంటుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement