ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఫ్రీగా చూసిన వీడియోల్ని ఇకపై డబ్బులు చెల్లించి వీక్షించాలని యూట్యూబ్ కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది.
రాబోయే రోజుల్లో యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్మెంట్ కాస్త మరింత కమర్షియల్‌గా మారనుంది. ఇప్పటికే యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలి. మనకు నచ్చిన సినిమానో లేదంటే వెబ్ సిరీస్ చూసే సమయంలో యాడ్స్ రాకుండా ఉండాలంటే పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇకపై డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోలకు డబ్బులు కట్టాలని యూట్యూబ్ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.
బఫరింగ్ సమస్య , డేటా అయిపోతుందనే బాధలేకుండా విద్యార్ధులు, ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల కోసం నచ్చిన వీడియోల్ని చూపించేలా యూట్యూబ్ వీడియోల్ని డౌన్‌లోడ్ పెట్టి మరి ఆ వీడియోల్ని చూపించే వారు. విద్యార్ధులు సైతం వారికి కావాల్సిన ఏదైనా కోర్స్ ట్యుటోరియల్ వీడియోల్ని డౌన్‌లోడ్ పెట్టుకొని వీక్షించేవారు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభంలో ఈ డౌన్‌లోడ్ సదుపాయాన్ని వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువైంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేలా యూట్యూబ్' డౌన్‌లోడ్ వీడియోలకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలని సూచించింది. దీంతో తాజా యూట్యూబ్ నిర్ణయంపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది
Comments
Please login to add a commentAdd a comment