ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌పీ భారతీయులకు శుభవార్త చెప్పింది. దేశీయంగా హెచ్పీ ల్యాప్‌ట్యాప్‌లను తయారు చేయడం ప్రారంభించినట్లు తెలిపింది. దేశీయం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌ల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రొడక్ట్ లింక్‌డ్ ఇన్సెంటీవ్(పీఎల్ఐ) స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పథకం సత్పలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పథకంలో భాగంగా హెచ్ పీ సంస్థ మన దేశంలో డెస్క్‌టాప్ లు, మినీ డెస్క్‌టాప్‌లు, డిస్‌ప్లే మానిటర్‌లు, ల్యాప్‌టాప్‌లను తయారు చేయడం ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ గణాంకాల ప్రకారం..2020నుంచి హెచ్‌పీ భారత్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగినట్లు తెలిపింది.
అయితే ఇప్పుడు ఆ మార్కెట్‌ను మరింత పెంచేందుకు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తుంది. హెచ్‌పీ ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చర్ కంపెనీ ఫ్లెక్స్ కంపెనీతో చేతులు కలిపింది. తమిళనాడులో చెన్నైకి చెందిన శ్రీపెరంబుదూర్‌లోని హెచ్‌పీ తయారీ యూనిట్లను పెంచేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లు హెచ్‌పీ ఇండియా మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ కేతన్ పటేల్ అన్నారు. వాస్తవానికి హెచ్‌పీ భారత్‌లో కమర్షియల్ డెస్క్ టాప్‌లను తయారు చేస్తుంది. అయితే తాజా పెట్టుబడలతో హెచ్‌పీ ఎలైట్ బుక్స్, ప్రో బుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్‌తో పాటు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్నట్లు హెచ్ పీ వెల్లడించింది..
Comments
Please login to add a commentAdd a comment