hp company
-
మార్కెట్లోకి హెచ్‌పీ స్మార్ట్ట్యాంక్ ప్రింటర్స్
సాక్షి, హైదరాబాద్: హ్యూలెట్ప్యాకర్డ్ (హెచ్‌పీ) సంస్థ..‘హెచ్‌పీ స్మార్ట్ట్యాంక్’ పేరుతో బుధవారం సరికొత్త ప్రింటర్లను విడుదల చేసింది. సులువుగా వా డు కోగలగడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సురక్షితం వంటి మూడు అంశాల ప్రాతిపదికగా తయారైన ఈ కొత్త ప్రింటర్లు ప్రస్తుతం మూడు మోడళ్లలో లభిస్తున్నట్లు హెచ్‌పీ ప్రింటింగ్ విభాగం ప్రెసిడెంట్ సునీశ్ రాఘవన్ తెలిపారు. హెచ్‌పీ స్మా ర్ట్ ట్యాంక్ 521 కేవలం ప్రింటింగ్‌కు ఉపయోగపడుతుందని, హెచ్‌పీ 510, హెచ్‌పీ 580లు ప్రింట్, స్కానింగ్, కాపీ పనులు చేయగలవ ని చె ప్పారు. ఈ మూడు మోడళ్ల ధరలు రూ. 13,000 –19,000 మధ్యలో ఉంటాయని ఆయన తెలిపారు. చదవండి: ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి: కేంద్రం షాకింగ్ న్యూస్ -
మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?
న్యూఢిల్లీ: రానున్న సంవత్సరాల్లో టెక్ సంస్థల ఉద్యోగులకు మరిన్ని కష్టాలు పొంచి ఉన్నట్టు గోచరిస్తోంది. ఇప్పటికే మెటా, ట్విటర్, అమజాన్ లాంటి పాపులర్ సంస్థలు ఉద్యోగుల తొలగింపులకు నిర్ణయించగా, తాజాగా మరో ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించింది. (Vu GloLED TV: క్రికెట్, సినిమా మోడ్‌తో అదిరిపోయే వీయూ టీవీ, ధర రూ. 30 వేలే!) ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్స్ తయారీదారు హెచ్‌పీ సంస్థ దాదాపు 6,000 ఉద్యోగాలను కోతను ప్రకటించింది. ఫ్యూచర్ రెడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్‌లో భాగంగా 2025 ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఉద్యోగుల తొలగింపులను విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 12 శాతం మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. (జియో జోరు, వొడాఫోన్ ఐడియాకు 40 లక్షల యూజర్లు గోవిందా!) హెచ్‌పీ కంపెనీలో ప్రస్తుతం దాదాపు 50,000 మంది ఉద్యోగులున్నారు. రాబోయే సంవత్సరాల్లో 12 శాతం అంటే దాదాపు 4 నుంచి 6వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో కొంతమందిని తొలగించాలని భావిస్తోంది. 2022 పూర్తి సంవత్సర నివేదిక సందర్భంగా ఈ ప్రకటన చేసింది. మహమ్మారి సమయంలో ల్యాప్టాప్స్ విక్రయాలు కాస్త పుంజుకున్నప్పటికీ, ప్రస్తుతం పడిపోయిన ఆదాయాలు, ప్రపంచ ద్రవ్యోల్బణం మాంద్యం ఆందోళనల మధ్య ఉద్యోగాలను తగ్గించాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు బలహీనమైన డిమాండ్ కారణంగా మొదటి త్రైమాసికంలో ఆశించిన దానికంటే తక్కువ లాభాలను అంచనా వేస్తోంది. (ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ జోరు: అదరగొట్టిన శాంసంగ్ ) -
భారతీయులకు టెక్ దిగ్గజం హెచ్‌పీ శుభవార్త!!
ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌పీ భారతీయులకు శుభవార్త చెప్పింది. దేశీయంగా హెచ్‌పీ ల్యాప్‌ట్యాప్‌లను తయారు చేయడం ప్రారంభించినట్లు తెలిపింది. దేశీయం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌ల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటీవ్(పీఎల్ఐ) స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పథకం సత్పలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పథకంలో భాగంగా హెచ్ పీ సంస్థ మన దేశంలో డెస్క్‌టాప్ లు, మినీ డెస్క్‌టాప్‌లు, డిస్ప్లే మానిటర్లు, ల్యాప్‌టాప్‌లను తయారు చేయడం ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ గణాంకాల ప్రకారం..2020నుంచి హెచ్‌పీ భారత్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగినట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ మార్కెట్‌ను మరింత పెంచేందుకు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తుంది. హెచ్‌పీ ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చర్ కంపెనీ ఫ్లెక్స్ కంపెనీతో చేతులు కలిపింది. తమిళనాడులో చెన్నైకి చెందిన శ్రీపెరంబుదూర్‌లోని హెచ్‌పీ తయారీ యూనిట్లను పెంచేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లు హెచ్‌పీ ఇండియా మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ కేతన్ పటేల్ అన్నారు. వాస్తవానికి హెచ్‌పీ భారత్‌లో కమర్షియల్ డెస్క్ టాప్‌లను తయారు చేస్తుంది. అయితే తాజా పెట్టుబడలతో హెచ్‌పీ ఎలైట్ బుక్స్, ప్రో బుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్‌తో పాటు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్నట్లు హెచ్ పీ వెల్లడించింది.. -
ఆ టెక్ కంపెనీలో 5 వేల ఉద్యోగాలు ఔట్
అమెరికన్ మల్టినేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌పీ తన ఉద్యోగులపై వేటు వేస్తోంది. 2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ నుంచి 4500 నుంచి 5000 మంది ఉద్యోగులు వీడాల్సి ఉంటుందని కంపెనీ హెచ్చరించింది. ప్రస్తుతం నడుస్తున్న పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను తీసేస్తున్నట్టు ఈ పీసీ తయారీదారి మంగళవారం తెలిపింది. 2016 అక్టోబర్‌లోనే హెచ్‌పీ బోర్డు తన పునర్నిర్మాణ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. ఈ ప్లాన్‌లో భాగంగా సుమారు 4000 మందిని తీసేస్తామని అంచనావేసింది. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య మరో 1 శాతం నుంచి 2 శాతం పెరిగే అవకాశముందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్ 31 నాటికి కంపెనీలో 49వేల మంది ఉద్యోగులున్నారు. హెచ్‌పీ రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్‌లో లేఆఫ్స్‌కు సంబంధించి ప్రీట్యాక్స్ ఛార్జీలు సుమారు రూ.4700 కోట్లు(700మిలియన్ డాలర్లు) గా ఉంటాయని కంపెనీ తెలిపింది. అంతకముందు ఇవి 500 మిలియన్ డాలర్లుగా కంపెనీ అంచనావేసింది. హెచ్‌పీ అంచనావేస్తున్న ప్రీట్యాక్స్ ఖర్చుల్లో సగం సెవరెన్స్కు సంబంధించినవి కాగ, మిగతావి ఇన్ఫ్రాక్ట్రక్చర్, నాన్-లేబర్ యాక్షన్స్, ఇతర ఛార్జీలున్నాయి. ఎప్పుడైతే హ్యూలెట్ ప్యాకర్డ్ రెండు చీలిందో ఇక అప్పటి నుంచి హెచ్‌పీ ఇంక్ పీసీలు, ప్రింటర్ల అమ్మకం వంటి హార్డ్‌వేర్ బిజినెస్‌లపై దృష్టిసారిస్తోంది. హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ కో కంపెనీకి చెందిన డెడ్-సెంటర్, సాఫ్ట్వేర్, సర్వీసు యూనిట్లను నిర్వహిస్తోంది. 2018లో 22.6 శాతం మార్కెట్ షేరుతో హెచ్‌పీ ప్రపంచవ్యాప్తంగా పీసీ సరుకు రవాణాల్లో టాప్ స్థానంలో ఉంది. క్వార్టర్ ముగింపు నాటికి అంచనావేసిన దానికంటే మెరుగైన విక్రయాలనే ఈ కంపెనీ నమోదు చేసింది. -
శామ్సంగ్ ప్రింటర్స్ వ్యాపారం హెచ్‌పీ గూటికి...
బిలియన్ డాలర్లకు కొనుగోలు న్యూయార్క్: ప్రింటర్స్ విభాగంలో హెచ్‌పీ కంపెనీ అతిపెద్ద కొనుగోలుకు తెరతీసింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ప్రింటర్స్ వ్యాపారాన్ని 1.05 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్టు సోమవారం ప్రకటించింది. 55 బిలియన్ డాలర్ల ఏ3 ప్రింటర్స్ విభాగంలో హెచ్‌పీ స్థానం మరింత బలపడేందుకు ఈ కొనుగోలు దోహదం చేయనుంది. ఈ డీల్‌లో భాగంగా 6,500కు పైగా ప్రింటర్ పేటెంట్లు సైతం హెచ్‌పీ పరం అవుతాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులు హెచ్‌పీ గూటి కిందకు వస్తారు. వీరిలో 1,300 మంది ఇంజనీర్లు సైతం ఉన్నారు. శామ్సంగ్కు దక్షిణ కొరియాలో ప్రధాన ఇంజనీరింగ్ కేంద్రం ఉండగా, అమెరికా, భారత్, చైనా, జపాన్, రష్యా, కెనడా తదితర దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హెచ్‌పీకి దేశీయంగా బెంగళూరులో ఆర్అండ్డీ కేంద్రం ఉండగా, ప్రింటర్స్ విభాగంలో మొత్తం 2వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ డీల్ 12 నెలల్లో ముగుస్తుందని భావిస్తున్నారు. ఈ డీల్ అనంతరం ఓపెన్ మార్కెట్ ద్వారా 10 నుంచి 30 కోట్ల డాలర్లను మూలధన పెట్టుబడిగా పెట్టేందుకు శామ్సంగ్ అంగీకరించినట్టు హెచ్‌పీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రింటర్స్ విభాగంలో ఇది తమకు అతిపెద్ద కొనుగోలు అని, దీంతో కాపీయర్ విభాగంలో వృద్ధి అవకాశాలు పెరుగుతాయని హెచ్‌పీ ప్రకటించింది. ఐటీ సేవల్లో ప్రముఖ కంపెనీ అయిన హ్యులెట్పేకర్డ్ నుంచి పది నెలల క్రితమే ప్రింటర్, కంప్యూటర్ల వ్యాపారం విడివడి హెచ్‌పీగా ఏర్పడింది. కంపెనీ లాభాల్లో అత్యధిక శాతం ప్రింటర్ ఇంక్, టోనర్ల విక్రయాల ద్వారానే వస్తోంది. -
ప్రపంచంలోనే పలుచనైన లాప్టాప్!
న్యూయార్క్: ప్రపంచంలోకెల్లా అత్యంత పలుచనైన లాప్‌టాప్‌ను హెచ్‌పీ కంపెనీ బుధవారం అమెరికాలో ఆవిష్కరించింది. కేవలం 10.4 మిల్లీ మీటర్ల మందం,1.11 కిలోల బరువుగల ఈ లాప్టాప్కు స్పెక్టర్ 13 అల్ట్రాబుక్‌గా నామకరణం చేశామని, ఆపిల్ 13 మ్యాక్‌బుక్ ఎయిర్కన్నా, త్రిబుల్ ఏ బ్యాటరీలకన్నా ఇది పలుచగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. 1080 పిక్సల్స్ డిస్ప్లే కలిగిన ఈ లాప్టాప్లో 8జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్, 10 గంటల బ్యాటరీ సామర్థ్యంతోపాటు ఇంటెల్ కోర్ ఐ5, ఐ7 ప్రాసెసర్లు ఉన్నాయని హెచ్‌పీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మైక్ నాష్ తెలిపారు. అల్యూమినియంతో చేసిన బాడీ ముదురు బూడిదరంగులో, అంచులు ఇత్తడితో ఉండి లగ్జరీ లుక్‌తో కనిపిస్తుందని వివరించారు. అమెరికాలో వీటి అమ్మకాల బుకింగ్‌ను ఏప్రిల్ 25 తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని, మే నెలలో డెలవరి చేస్తామని, ధర దాదాపు 80 వేల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. బ్రిటన్‌లో మాత్రం జూలై నెలలో అమ్మకాలను ప్రారంభిస్తామని, అక్కడ ధర మాత్రం లక్షా పది వేల రూపాయల నుంచి మొదలవుతుందని మైక్ తెలిపారు. స్థలం కలసి రావడం కోసం బ్యాటరీ చిన్న, పలుచనైనా పలుకలుగా ఉంటుందని అన్నారు. ఇందులో సంగీత ప్రియుల కోసం ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయని, సౌండ్ వినసొంపుగా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంగ్ అండ్ ఒలుఫ్సేన్ సహకారం తీసుకున్నామని మైక్ తెలిపారు. వేడిని ఎప్పటికప్పుడు బయటకు పంపించేందుకు రెండు ఫ్యాన్లు ఉంటాయని, వేడిని పంపేందుకు ప్రాసెసర్‌కు హీట్ పైప్ అనుసంధానించి ఉంటుందని చెప్పారు. ఈ ల్యాప్‌టాప్ అత్యంత పలుచగా ఉన్నప్పటికీ మ్యాక్బుక్లాగా ఏ విషయంలోను రాజీ పడలేదని, యూఎస్బీ-సీ పోర్ట్స్తోపాటు హెడ్‌ఫోన్ జాక్ ఉంటుందని, డీప్ కీ బోర్డును కూడా ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని ఆయన వివరించారు.