అమెరికన్ మల్టినేషనల్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌పీ తన ఉద్యోగులపై వేటు వేస్తోంది. 2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ నుంచి 4500 నుంచి 5000 మంది ఉద్యోగులు వీడాల్సి ఉంటుందని కంపెనీ హెచ్చరించింది. ప్రస్తుతం నడుస్తున్న పునర్‌నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను తీసేస్తున్నట్టు ఈ పీసీ తయారీదారి మంగళవారం తెలిపింది. 2016 అక్టోబర్‌లోనే హెచ్‌పీ బోర్డు తన పునర్‌నిర్మాణ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. ఈ ప్లాన్‌లో భాగంగా సుమారు 4000 మందిని తీసేస్తామని అంచనావేసింది. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య మరో 1 శాతం నుంచి 2 శాతం పెరిగే అవకాశముందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్ 31 నాటికి కంపెనీలో 49వేల మంది ఉద్యోగులున్నారు.
హెచ్‌పీ రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్‌లో లేఆఫ్స్‌కు సంబంధించి ప్రీట్యాక్స్ ఛార్జీలు సుమారు రూ.4700 కోట్లు(700మిలియన్ డాలర్లు) గా ఉంటాయని కంపెనీ తెలిపింది. అంతకముందు ఇవి 500 మిలియన్ డాలర్లుగా కంపెనీ అంచనావేసింది. హెచ్‌పీ అంచనావేస్తున్న ప్రీట్యాక్స్ ఖర్చుల్లో సగం సెవరెన్స్‌కు సంబంధించినవి కాగ, మిగతావి ఇన్‌ఫ్రాక్ట్రక్చర్, నాన్-లేబర్ యాక్షన్స్, ఇతర ఛార్జీలున్నాయి. ఎప్పుడైతే హ్యూలెట్ ప్యాకర్డ్ రెండు చీలిందో ఇక అప్పటి నుంచి హెచ్‌పీ ఇంక్ పీసీలు, ప్రింటర్ల అమ్మకం వంటి హార్డ్‌వేర్ బిజినెస్‌లపై దృష్టిసారిస్తోంది. హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ కో కంపెనీకి చెందిన డెడ్-సెంటర్, సాఫ్ట్‌వేర్, సర్వీసు యూనిట్లను నిర్వహిస్తోంది. 2018లో 22.6 శాతం మార్కెట్ షేరుతో హెచ్‌పీ ప్రపంచవ్యాప్తంగా పీసీ సరుకు రవాణాల్లో టాప్ స్థానంలో ఉంది. క్వార్టర్ ముగింపు నాటికి అంచనావేసిన దానికంటే మెరుగైన విక్రయాలనే ఈ కంపెనీ నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment