
ఈ మార్చి (March 2025) నెల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పాలిట దారుణంగా ఉండబోతోంది. ఈనెలలో దాదాపు 100 కంపెనీలు ఉద్యోగుల తొలగింపును (Lay Off) ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఈ తొలగింపులు వివిధ పరిశ్రమలలో విస్తరించి ఉన్నాయి. ఇది మహమ్మారి అనంతరం వ్యాపారాలు ఎదుర్కొంటున్న విస్తృత ఆర్థిక సవాళ్లను ప్రతిబింబిస్తుంది.
వార్నింగ్ నోటీసులు
ఈ మేరకు ప్రభావిత ఉద్యోగులకు ఇప్పటికే యాజమాన్యాలు వార్న్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఎస్‌లోని వర్కర్ అడ్జస్ట్ మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (వార్న్) చట్టం ప్రకారం జాబ్స్ రిస్క్‌లో ఉంటే ఆయా కంపెనీలు ఉద్యోగులకు ముందస్తు నోటీసు ఇవ్వాలి. పెద్ద ఎత్తున తొలగింపులు, మూసివేతలకు ఉద్యోగులు, యాజమాన్యాలు, కమ్యూనిటీలు సిద్ధం కావడానికి ఈ చట్టపరమైన ఆవశ్యకత సహాయపడుతుంది. ఈ తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్య ఒక్కో కంపెనీకి 10 నుంచి 500 వరకు ఉంటుంది.
కొన్ని ప్రముఖ కంపెనీలు ఇవే..
టెక్ లేఆఫ్స్ పతాక శీర్షికల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, తొలగింపులు టెక్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జోన్ ఫ్యాబ్రిక్స్, వాల్గ్రీన్స్ వంటి రిటైలర్లు ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉంది. ఇంటెల్, ఫెడెక్స్, నీమన్ మార్కస్, జాన్ డీర్ ఈ జాబితాలోని ఇతర గుర్తించదగిన కంపెనీలుగా ఉన్నాయి.

వచ్చే మూడేళ్లలో 150 స్టోర్లను మూసివేసే బృహత్తర వ్యూహంలో భాగంగా 66 స్టోర్లను మూసివేసే యోచనలో ఉన్నట్లు మాకీస్ ప్రకటించింది. రిటైల్ పరిశ్రమలో మార్పులకు అనుగుణంగా కాలిఫోర్నియా, ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగులను కూడా వాల్గ్రీన్స్ వదులుకుంటోంది.
ఇది చదివారా? ఈసారి బ్యాడ్ న్యూస్ కాగ్నిజెంట్ ఉద్యోగులకు..
ఆర్థిక కారకాలు
ఈ విస్తృతమైన తొలగింపులకు అనేక అంశాలు దోహదం చేస్తాయి. పెరుగుతున్న వడ్డీ రేట్లు రుణాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని పెంచాయి. అదనంగా, ద్రవ్యోల్బణం నిర్వహణ ఖర్చులను పెంచింది. వ్యాపారాలు లాభదాయకంగా ఉండటం సవాలుగా మారింది. వినియోగదారుల ప్రవర్తన, డిమాండ్ లో మార్పులు కూడా అనేక కంపెనీల ఆర్థిక కష్టాలకు కారణమయ్యాయి.
ఆటోమేషన్.. పునర్నిర్మాణం
ఆటోమేషన్‌కు ఊతమివ్వడమే ఈ ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి కంపెనీలు ఉద్యోగాలను ఆటోమేటెడ్ సొల్యూషన్లతో భర్తీ చేయాలని చూస్తున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా కంపెనీలు తమ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment