గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ భాగస్వామ్యంలో హెచ్‌పీ సాయంతో క్రోమ్‌బుక్ తయారీ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా తొలిసారి భారత్‌లో క్రోమ్‌బుక్‌లు తయారు చేసేందుకు హెచ్‌పీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. తద్వారా భారతీయ విద్యార్ధులకు అనువుగా, బడ్జెట్ ధరలో సురక్షితమైన కంప్యూటింగ్ అవకాశాలు మెరుగవుతాయి’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.
We’re partnering with HP to manufacture Chromebooks in India - These are the first Chromebooks to be made in India and will make it easier for Indian students to have access to affordable and secure computing. https://t.co/PuzZnck1wo
— Sundar Pichai (@sundarpichai) October 2, 2023
చెన్నై సమీపాన ఫ్లెక్ ఫెసిలిటీ ప్లాంట్ వద్ద సెప్టెంబర్ 2నుంచి క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభమైందని హెచ్‌పీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే 2020 నుంచి ఫ్లెక్ ఫెసిలిటీ ప్లాంట్‌లో పలు రకాల లాప్‌టాప్‌లు, డెస్క్ టాప్ కంప్యూటర్లను హెచ్‌పీ తయారు చేస్తుందని పేర్కొన్నారు. కాగా రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంలో విడుదల కానున్న క్రోమ్ బుక్ ధర రూ.15,990 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment