HP
-
హెచ్‌పీ సీఈఎస్‌లో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు
టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. టెక్ యుగంలో ల్యాప్‌టాప్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో సేవలందిస్తున్న హెచ్‌పీ(HP) కంపెనీ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES)-2025లో వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇవి కృత్రిమమేధ సాయంతో పని చేస్తాయని కంపెనీ తెలిపింది. దాంతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంది. 2025వ సంవత్సరానికిగాను సీఈఎస్ లాస్‌వెగాస్‌లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది.హెచ్‌పీ ఎలైట్ బుక్ అల్ట్రా జీ1ఐ: ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 ప్రాసెసర్‌తో 48 టాప్స్ ఎన్పీయూ టెక్నాలజీతో వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా పనిచేసే ఏఐ బిజినెస్ నోట్ బుక్ అని కంపెనీ తెలిపింది.హెచ్‌పీ జెడ్ బుక్ అల్ట్రా జీ 1ఎ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 14 అంగుళాల ల్యాప్‌టాప్ ఇది. ఏంఎడీ ప్రాసెసర్‌తో వచ్చే ఈ డివైజ్‌తో హై-పెర్ఫార్మెన్స్ వర్క్ ఫ్లోలకు ఎంతో సమర్థంగా నిర్వహించవచ్చని కంపెనీ పేర్కొంది.హెచ్‌పీ జెడ్2 మినీ జీ1ఏ: ఏఎండీ రైజెన్ ఏఐ మ్యాక్స్ ప్రో ప్రాసెసర్లు, 6-కోర్/12-థ్రెడ్ నుంచి 16-కోర్/32-థ్రెడ్ కాన్ఫిగరేషన్లతో దీన్ని ఆవిష్కరించారు. ఏఎండీ రేడియన్ 8060ఎస్, 8050ఎస్, 8040ఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయం ఉండేలా దీన్ని తయారు చేశారు.ఇదీ చదవండి: మడిచే స్క్రీన్.. వాక్ చేయించే షూస్!హెచ్‌పీ జెడ్ క్యాప్టిస్: మెటీరియల్స్ డిజిటలైజ్ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి దీన్ని రూపొందించారు. ఏఐ(AI) ఆధారిత డిజిటల్ మెటీరియల్ క్యాప్చర్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఇది ఎన్వీడియోకు చెందిన జెట్సన్ ఏజీఎక్స్ జేవియర్ మాడ్యూల్, ఫోటోమెట్రిక్ కంప్యూటర్ విజన్ సిస్టమ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.హెచ్‌పీ థండర్ బోల్ట్ 4 అల్ట్రా జీ6 డాక్: ఇది డాకింగ్ స్టేషన్‌గా పని చేస్తుంది. రెండు వెర్షన్లలో ఒకటి 180 వాట్లు, మరొకటి 280 వాట్ల శక్తిని అందిస్తుంది. -
డ్రీమ్‌హాక్ ఇండియా 2024: హైదరాబాద్‌లో గ్రాండ్ ఫినాలే..
డ్రీమ్‌హాక్ ఇండియాలో ఒమెన్ ఇంటెల్ క్యాంపస్ క్వెస్ట్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేను హెచ్‌పీ ప్రకటించింది. గత మూడు నెలలుగా.. భారతదేశం అంతటా 1,600 జట్లకు చెందిన 8,000 మంది ప్లేయర్స్ వివిధ రౌండ్లలో పోరాడారు. కాగా ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫినాలేలో టాప్ ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఇందులో విజేతకు రూ.5 లక్షల బహుమతిని అందజేస్తారు.గ్రాండ్ ఫినాలే నవంబర్ 15 నుంచి 17వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్లో సందర్శకులు హెచ్‌పీ ఇంటరాక్టివ్ ప్రోడక్ట్ బూత్‌లలో బ్రాండ్ గేమింగ్ సొల్యూషన్లకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా పొందవచ్చు. ఆసక్తి కలిగిన సందర్శకులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొనవచ్చు. దీనికోసం టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సందర్శకులు తమ అభిమాన ప్రో ప్లేయర్లు, గేమింగ్ ఇన్ఫ్లుయెన్సర్లను కలవడానికి కూడా ఓ మంచి అవకాశాన్ని పొందుతారు.•తేదీ: 2024 నవంబర్ 15 నుంచి 17•వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్•టిక్కెట్ ప్రారంభ ధర: రూ. 1,699 -
భారత్‌లో హెచ్‌పీ ఏఐ ల్యాప్‌టాప్ లాంచ్: ఇదిగో వివరాలు
హెచ్‌పీ భారతదేశంలో తన మొదటి 2 ఇన్ 1 ఏఐ బేస్డ్ 'ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్' అనే కొత్త ల్యాప్‌టాప్ లాంచ్ చేసింది. ఇది ఇంటెల్ లూనార్ లేక ప్రాసెసర్ కోర్ అల్ట్రా సిరీస్ 2 పొందుతుంది. ఈ ప్రాసెసర్లు ఆన్-డివైస్ ఏఐ వర్క్‌లోడ్‌ల కోసం డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)ని కలిగి ఉంటాయి. క్వాలిటీ వీడియోలను ఆస్వాదించడానికి అనుమతించే.. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది.హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 7 ప్రారంభ ధర రూ.1,81,999. ఇది ఎక్లిప్స్ గ్రే, అట్మాస్ఫియరిక్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది భారతదేశంలో కంపెనీ ఆఫ్‌లైన్ స్టోర్లలో మాత్రమే కాకుండా.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 9 కూడా రూ.1,91,999 వద్ద అందుబాటులో ఉంది. ఇది అట్మాస్ఫియరిక్ బ్లూ కలర్లో మాత్రమే లభిస్తుంది.హెచ్‌పీ లాంచ్ చేసిన ఈ కొత్త ల్యాప్‌టాప్‌లను ఈ నెల చివరి (అక్టోబర్ 31) లోపల కొనుగోలు చేస్తే రూ.9,999 విలువైన అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్, ప్రైమరీ ఎలిమెంట్స్ వంటి వాటిని ఉచితంగా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు బజాజ్ ఫైనాన్స్‌తో నో కాస్ట్ ఈఎమ్ఐ కింద కూడా కొనుగోలు చేయవచ్చు.హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 ఇంచెస్ 2.8కే ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. మెరుగైన వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం హాప్టిక్ టచ్‌ప్యాడ్, 9 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది 32 జీబీ ర్యామ్, 64 వాట్స్ బ్యాటరీ (21 గంటలు) పొందుతుంది. ఇది వైఫై, బ్లూటూత్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది.కొత్త హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ ల్యాప్‌టాప్‌లో డేటా రక్షణ, సైబర్ సెక్యూరిటీ వంటి వాటి కోసం ఫిజికల్ సెక్యూరిటీ చిప్ ఉన్నాయి. డీప్‌ఫేక్ డిటెక్టర్ కూడా ఇందులో ఉంటుంది. ఇవన్నీ డేటాను రక్షించడానికి, ఇతరులు హ్యాక్ చేయకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. -
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆర్థిక వృద్ధి
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడిన టెక్నాలజీతోనే ఆర్థిక వృద్ధి సాధ్యం. ఇది అత్యధిక మంది భారతీయులు నమ్ముతున్న మాట. సాంప్రదాయకంగా ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న జనాభాను ఏకీకృతం చేయడంలో 89 శాతం మంది భారతీయులు సాంకేతికతను కీలక అంశంగా భావిస్తున్నారని హెచ్‌పీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచ సగటు 76 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇది సాంకేతికత పరివర్తన శక్తిపై భారత్ బలమైన నమ్మకాన్ని నొక్కిచెబుతోందని హెచ్‌పీ ఒక ప్రకటనలో తెలిపింది.పర్యావరణ, సామాజిక లక్ష్యాల దిశగా తన పురోగతిని తెలియజేస్తూ హెచ్‌పీ తన సుస్థిర ప్రభావ నివేదిక 2023తో పాటు ఈ ఫలితాలను ఆవిష్కరించింది. టెక్నాలజీ అందుబాటును పెంచడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి సానుకూల సామాజిక ప్రభావం కోసం కృత్రిమ మేధను ఉపయోగించడానికి హెచ్‌పీ చేస్తున్న ప్రయత్నాలను నివేదికలో వివరించింది. ఈ అంశంపై స్వతంత్ర పరిశోధనలు జరిపేందుకు హెచ్‌పీ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్‌ను నియమించింది. 2023 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు నిర్వహించిన ఈ సర్వేలో అమెరికా, ఫ్రాన్స్, ఇండియా, యూకే, జర్మనీ, జపాన్, చైనా, మెక్సికో, బ్రెజిల్, కెనడా వంటి 10 దేశాలకు చెందిన 1,036 మంది బిజినెస్ లీడర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.భారత్‌లో ఉచిత ఏఐ శిక్షణ ఇవ్వనున్న హెచ్పీతన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా తన డిజిటల్ బిజినెస్ స్కిల్స్ ‘హెచ్‌పీ లైఫ్’ ప్రోగ్రామ్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉచిత కృత్రిమ మేధ శిక్షణను మిళితం చేయాలని హెచ్‌పీ యోచిస్తోంది. వర్క్, సృజనాత్మక ప్రక్రియలను పెంచడానికి హెచ్‌పీ భారత్‌లో నెక్ట్స్ జనరేషన్ ఏఐ పీసీలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.అదనంగా 2030 నాటికి హెచ్‌పీ లైఫ్ ఉచిత నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమంలో 27.5 లక్షల మంది వినియోగదారులను నమోదు చేయాలనే తన లక్ష్యాన్ని హెచ్‌పీ విస్తరిస్తోంది. ఈ కార్యక్రమాన్ని హెచ్‌పీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2016 నుంచి ఇప్పటికే 12 లక్షల మంది యూజర్లు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా భారత్ అత్యధికంగా కొత్త యూజర్లను కలిగి ఉంది.టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండాలని హెచ్‌పీ గ్లోబల్ హెడ్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్, హెచ్‌పీ ఫౌండేషన్ డైరెక్టర్ మిషెల్ మాలెజ్కీ సూచించారు. డిజిటల్ ఎకానమీలో వృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలను యాక్సెస్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. "పురోగతిని నడిపించడానికి సాంకేతికత ఒక గొప్ప శక్తివంతమైన సాధనం" అని మాలెజ్కీ పేర్కొన్నారు. -
‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లు ప్రారంభించిన ప్రముఖ కంపెనీ
హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ (హెచ్‌పీఈ) తాజాగా దేశవ్యాప్తంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సర్వర్లను మనేసర్‌లోని వీవీడీఎన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తయారుచేసినట్లు చెప్పింది. గత ఏడాది జూలైలో హెచ్‌పీఈ, వీవీడీఎన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో మేక్ ఇన్ ఇండియా ప్రణాళికలను వెల్లడించింది. అందులో భాగంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లను తయారుచేస్తామని హామీ ఇచ్చింది. దాంతో అలా హామీ ఇచ్చిన ఏడాదికాలంలోపే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న ఐదు ఏళ్లలో భారత్‌లో సుమారు 1 బిలియన్ డాలర్ల(రూ.8300 కోట్లు) విలువైన హైవాల్యూమ్ సర్వర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. హెచ్‌పీఈ సర్వర్లు ఐటీ పరిశ్రమ అంతటా పనిభారాన్ని తగ్గిస్తూ విస్తృత శ్రేణి అప్లికేషన్ల కోసం ఉపయోగపడుతాయని కంపెనీ తెలిపింది. వీవీడీఎన్ టెక్నాలజీ హెచ్‌పీఈ తయారుచేస్తున్న సర్వర్ మదర్‌బోర్డులను రూపొందించడానికి పూర్తి స్థాయి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్ఎంటీ)ని అందిస్తున్నట్లు తెలిసింది. ప్రాసెసర్లు, మెమరీలు, డిస్క్‌లు, డ్రైవ్‌లతో సర్వర్ మదర్‌బోర్డులను తయారు చేయడానికి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ)కి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అవసరం అవుతుంది. ఇదీ చదవండి: కొత్త యూజర్లు ఫీజు చెల్లించాల్సిందే.. ఎందుకంటే.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎస్ఐ) పథకం ద్వారా విదేశీ కంపెనీలను భారత్‌లోకి ఆహ్వానించి ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు ప్రోత్సాహకాలు కల్పించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని హెచ్‌పీఈ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ సోమ్ సత్సంగి అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ)కి అభినందనలు తెలియజేశారు. -
అలా తీసి ఇలా పట్టుకెళ్లిపోవచ్చు.. ధర ఎంతంటే?
అమెరికన్ కంప్యూటర్స్ తయారీ సంస్థ 'హెచ్‌పీ' ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త 'ఎన్వీ మూవ్' (Envy Move) ఆల్ ఇన్ వన్ పీసీ లాంచ్ చేసింది. ఈ పీసీను మనతోపాటు తీసుకెళ్లడానికి అనుగుణంగా ఉండేందుకు కంపెనీ హ్యాండిల్, ఫీట్ వంటి వాటిని అందించింది. దీంతో మనం ఒక బ్రీఫ్‌కేస్ మాదిరిగా తీసుకెళ్లవచ్చు. కొత్త హెచ్‌పీ ఎన్వీ మూవ్ ప్రారంభ ధర రూ.124990. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 అయిన ఈ కంప్యూటర్ టచ్ నావిగేషన్‌కు సపోర్ట్ చేసే 23.8 ఇంచెస్ క్యూహెచ్డీ డిస్ప్లే పొందుతుంది. ఆడియో కోసం బ్యాంగ్ & ఒలుఫ్సెన్ మేకర్స్ ఆడియో సిస్టమ్స్ పొందుపరిచారు. ఈ లేటెస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఓన్ వైడ్ విజన్ టెక్నాలజీతో అడ్జస్టబుల్ 5 మెగా పిక్సెల్ కెమెరా పొందుతుంది. ఈ కంప్యూటర్ భద్రతను లేదా సేఫ్టీకి దృష్టిలో ఉంచుకుని సంస్థ మాన్యువల్ ప్రైవేట్ షట్టర్, వాక్ అవే లాక్ వంటి మరిన్ని ఫీచర్స్ అందిస్తోంది. డిస్ప్లే: 23.8 ఇంచెస్ QHD IPS డిస్ప్లే, టచ్, 300 నిట్స్ బ్రైట్నెస్ ప్రాసెసర్: 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 గ్రాఫిక్స్: ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ర్యామ్: 16జీబీ LPDDR5 వరకు స్టోరేజ్: 1 టీబీ PCIe NVMe M.2 SSD కెమెరా: హెచ్‌పీ వైడ్ విజన్ 5ఎంపీ ఓఎస్: విండోస్ 11 హోమ్ పోర్ట్స్: 1 యూఎస్బీ టైప్-ఏ, 1 యూఎస్బీ టైప్-సీ, 1 HDMI పోర్ట్ కనెక్టివిటీ: Wi-Fi 6E, బ్లూటూత్ v5.3 ఛార్జింగ్: 90W బరువు: 4.1 కేజీలు హెచ్‌పీ కంపెనీ లాంచ్ చేసిన 'ఎన్వీ మూవ్' లాంటి కంప్యూటర్లు బహుశా ఇండియన్ మార్కెట్లో లేదనే చెప్పాలి, ఎందుకంటే పర్సనల్ కంప్యూటర్ మనతోపాటు తీసుకెళ్లడం అంటే కొంత కష్టమే, అయితే దీనికి హ్యాండిల్ ఉండటం వల్ల బ్రీఫ్‌కేస్ మాదిరిగా తీసుకెళ్లిపోవచ్చు. కాబట్టి ఇలాంటి కంప్యూటర్ దేశంలో ఇదే మొదటిదై ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఎన్వీ మూవ్ కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న PCలు చాలానే అందుబాటులో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. -
CES 2024: హెచ్‌పీ నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లు
ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హెచ్‌పీ సరికొత్త గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లను ఆవిష్కరించింది. లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2024)లో తమ OMEN, HyperX సబ్-బ్రాండ్ల కింద కొత్త గేమింగ్ పోర్ట్‌ఫోలియోను పరిచయం చేసింది. కంపెనీ కొత్త లాంచ్‌లలో గేమర్లకు గేమింగ్, ఇతర క్రియేటివ్ టాస్క్‌ల కోసం ఒమెన్ ట్రాన్సెండ్ 14 (Omen Transcend 14) గేమింగ్ ల్యాప్‌టాప్ ఉంది. దీంతోపాటు 240Hz రిఫ్రెష్ రేట్‌తో 2.5K OLED డిస్ప్లేతో OMEN ట్రాన్స్‌సెండ్ 16-అంగుళాల ల్యాప్‌టాప్‌ను కూడా హెచ్‌పీ ఆవిష్కరించింది. HP Omen 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్, Victus 16 అంగుళాల గేమింగ్ ల్యాప్‌టాప్ రెండూ సరికొత్త Intel i7 HX ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. హెచ్‌పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 ముఖ్యమైన ఫీచర్లు.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, కంటెంట్ క్రియేషన్‌కు అనువైన IMAX కూడిన సర్టిఫైడ్ 2.8K OLED డిస్ప్లే లాటిస్-లెస్ స్కై-ప్రింటెడ్ RGB కీబోర్డ్ ఎక్కడికైనా తీసుకెళ్ళేందుకు వీలుగా 1.6 కేజీల బరువుతో తేలికనది 140W ఛార్జింగ్ అడాప్టర్‌తో 11.5 గంటల బ్యాటరీ లైఫ్ NVIDIA GeForce RTX 4070 GPUతో ఇంటెల్ అల్ట్రా 9 185H ప్రాసెసర్ -
27 సంస్థలకు ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీము
న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్‌పీ, ఫ్లెక్స్‌ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 95 శాతం కంపెనీలు (23) ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా నాలుగు కంపెనీలు వచ్చే 90 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించగలవని ఆయన వివరించారు. ‘ఈ 27 దరఖాస్తులతో దాదాపు రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు రాగలవు. అంతకన్నా ముఖ్యంగా విలువను జోడించే ఉత్పత్తుల తయారీ వ్యవస్థ భారత్ వైపు మళ్లగలదు‘ అని మంత్రి పేర్కొన్నారు. పీసీలు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ తయారీలో భారత్ దిగ్గజంగా ఎదిగేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. అదనంగా రూ. 3.5 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీకి, ప్రత్యక్షంగా 50,000 మంది .. పరోక్షగా 1.5 లక్షల మంది ఉపాధి పొందడానికి స్కీము దోహదపడగలదని మంత్రి చెప్పారు. -
ఆమె సక్సెస్ మంత్రా... వ్యూహ చతురత వృత్తి నిబద్ధత
అనుభవం నేర్పిన పాఠాలు అద్భుత విజయాలను సొంతం చేస్తాయి. రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలలో పని చేసిన ఇప్సితా దాస్‌గుప్తా ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకుంది. అమెరికాలో యాపిల్ సర్వీసెస్‌లో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్‌గా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా... అమెరికన్ మల్టీ నేషనల్ ఐటీ కార్పోరేషన్ ‘హెచ్‌పీ ఇండియా’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్వీపీ), మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం అయింది... పనిలోని కష్టమే ఇష్టమైతే అంతకంటే సుఖం ఏమున్నది? కొలంబియా యూనివర్శిటీలో మ్యాథ్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన ఈప్సితా ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేసింది. ముంబై రోడ్లపై ఉరుకులు, పరుగులు, పని భారంతో నిద్రలేని రాత్రులు ఆమెకు కొత్తేమీ కాదు. కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోడంలో సమస్యలు తలెత్తాయి. ‘నాకు కష్టంగా ఉంది’ అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఎన్నో కంపెనీలలో మార్కెటింగ్, స్ట్రాటజీ విభాగాలకు నేతృత్వం వహించి మన దేశంతో సహా బంగ్లాదేశ్, శ్రీలంకలలో పనిచేసింది ఈప్సితా. ఆఫీస్ గదికే పరిమితం కాకుండా జనాల్లోకి వెళ్లి క్లయింట్స్ అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేది. వాటికి అనుగుణంగా వ్యూహాలను రూ΄÷ందించుకునేది. యాపిల్‌కు ముందు స్టార్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ కార్పొరేట్ స్ట్రాటజీ, జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ దక్షిణ ఆసియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పని చేసిన ఈప్సితా వృత్తికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరితో చర్చిస్తుంది. ‘తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవచ్చునేమోగానీ, ఆ నిర్ణయం ఫలితంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను వెనక్కి తీసుకోలేదు. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ముందు వంద కోణాల్లో ఆలోచిస్తాను’ అంటుంది ఈప్సితా. ఉద్యోగంలోకి అప్పుడే వచ్చిన రోజుల్లో ఈప్సితాలాంటి కొత్త ఉద్యోగులకు సీనియర్ల నుంచి వినిపించిన మాట ‘ఇలా ఎవరైనా ఆలోచిస్తారా?’ అందరిలాగే ఈప్సితా ఆలోచించినట్లయితే ఆమెకు ఇంత పేరు వచ్చేది కాదేమో. ‘ఇలా కూడా చేయవచ్చు... అంటూ సంప్రదాయ విధానాలకు భిన్నంగా ఆలోచించేదాన్ని. ఇది సీనియర్లకు రుచించేది కాదు. అయితే నా ఆలోచనల్లో సత్తా ఉందని ఆ తరువాత నిరూపణ అయింది’ అంటుంది ఈప్సితా. వృత్తిరీత్యా ఈప్సితా దాస్గు΄్తా ఒక సమస్యకు పరిష్కారం వెదకగానే పని అక్కడితో ఆగి΄ోదు. ‘మేమున్నాం’ అంటూ కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటాయి. గత సమస్యలతో వీటికి ΄ోలిక ఉండక΄ోవచ్చు. కొన్నిసార్లు పరిష్కారం దుర్భేద్యంగా అనిపించవచ్చు. ఇలాంటి సమయంలోనే వ్యూహకర్తలు చురుగ్గా ఆలోచించాలి. వ్యూహకర్తగా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన ఈప్సితా దాస్గుప్తాఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచింది. ‘మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?’ అనే ప్రశ్నకు ఈప్సితా చెప్పే జవాబు... ‘వీరు వారు అని కాదు. నేను మాట్లాడే ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతుంటాను. సా«ధారణ ప్రజల నుంచి ఇన్వెస్టర్లు, లీడర్లు, ఆర్టిస్టుల వరకు నాకు ఎంతోమంది రోల్ మోడల్స్ కనిపిస్తారు’ -
హెచ్‌పీ నుంచి రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌లు
న్యూఢిల్లీ: హెచ్‌పీ సంస్థ రీఫర్బిష్డ్ (మరమ్మతులు చేసి పునర్వినియోగానికి అనుకూలంగా మార్చిన) ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్టార్టప్‌లు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలకు అందుబాటు ధరలకే ల్యాప్‌టాప్‌లు అందించే లక్ష్యంతో వీటిని తీసుకొచి్చనట్టు తెలిపింది. హెచ్‌పీ ధ్రువీకృత భాగస్వాములు రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌లను రిటైల్ కస్టమర్లు, వ్యాపార సంస్థలకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. విక్రయానంతర సేవలను కూడా వారే అందిస్తారని తెలిపింది. -
భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ షురూ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్, పీసీల తయారీ సంస్థ హెచ్‌పీ కలిసి భారత్‌లో క్రోమ్‌బుక్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. భారత్‌లో తొలిసారిగా తయారుచేస్తున్న క్రోమ్‌బుక్స్‌తో దేశీ విద్యార్థులకు చౌకగా, సురక్షితమైన విధంగా కంప్యూటింగ్ అందుబాటులోకి రాగలదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ చేశారు. చెన్నైకి దగ్గర్లోని ఫ్లెక్స్ ఫెసిలిటీలో హెచ్‌పీ వీటిని తయారు చేస్తోంది. కొత్త క్రోమ్‌బుక్స్ ఆన్లైన్లో రూ. 15,990 నుంచి లభిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2020 నుంచి హెచ్‌పీ భారత్‌లో తమ తయారీ కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తోంది. ఎలీట్‌బుక్స్, ప్రోబుక్స్, జీ8 సిరీస్ నోట్‌బుక్స్ వంటి వివిధ ల్యాప్‌టాప్‌లు, ఆల్–ఇన్–వన్ పీసీలు, డెస్క్‌టాప్‌లు మొదలైన వాటిని దేశీయంగా తయారు చేస్తోంది. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 17,000 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి కూడా దరఖాస్తు చేసుకుంది. -
గూగుల్ - హెచ్‌పీ భాగస్వామ్యంలో క్రోమ్‌బుక్..ధర ఎంతంటే?
గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ భాగస్వామ్యంలో హెచ్‌పీ సాయంతో క్రోమ్‌బుక్ తయారీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలిసారి భారత్‌లో క్రోమ్‌బుక్‌లు తయారు చేసేందుకు హెచ్పీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. తద్వారా భారతీయ విద్యార్ధులకు అనువుగా, బడ్జెట్ ధరలో సురక్షితమైన కంప్యూటింగ్ అవకాశాలు మెరుగవుతాయి’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. We’re partnering with HP to manufacture Chromebooks in India - These are the first Chromebooks to be made in India and will make it easier for Indian students to have access to affordable and secure computing. https://t.co/PuzZnck1wo — Sundar Pichai (@sundarpichai) October 2, 2023 చెన్నై సమీపాన ఫ్లెక్ ఫెసిలిటీ ప్లాంట్ వద్ద సెప్టెంబర్ 2నుంచి క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభమైందని హెచ్‌పీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే 2020 నుంచి ఫ్లెక్ ఫెసిలిటీ ప్లాంట్‌లో పలు రకాల లాప్‌టాప్‌లు, డెస్క్ టాప్ కంప్యూటర్లను హెచ్‌పీ తయారు చేస్తుందని పేర్కొన్నారు. కాగా రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంలో విడుదల కానున్న క్రోమ్ బుక్ ధర రూ.15,990 నుంచి ప్రారంభం కానుంది. -
గూగుల్‌తో హెచ్‌పీ జట్టు!
న్యూఢిల్లీ: భారత్‌లోనే క్రోమ్‌బుక్స్‌ను ఉత్పత్తి చేసే దిశగా టెక్ దిగ్గజం గూగుల్‌తో కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ చేతులు కలిపింది. అక్టోబర్ 2 నుంచి వీటిని చెన్నైకి దగ్గర్లోని తమ ఫ్లెక్స్ ఫెసిలిటీలో వీటి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడి తెలిపారు. 2020 ఆగస్టు నుంచి హెచ్‌పీ ఈ ప్లాంటులోనే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల శ్రేణిని ఉత్పత్తి చేస్తోంది. (ఎస్బీఐ గుడ్‌న్యూస్, హోంలోన్ ఆఫ్ర్ పొడిగింపు, ఇక కార్ లోన్లపై..!) భారత్‌లో విద్యారంగం డిజిటల్ పరివర్తనకు తమ వంతు తోడ్పాటు అందించే క్రమంలో ఇదొక కీలక మైలురాయి కాగలదని గూగుల్ ఎడ్యుకేషన్ విభాగం హెడ్ (దక్షిణాసియా) బాణీ ధవన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంతో లభించే క్రోమ్‌బుక్స్‌ను ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది పైచిలుకు విద్యార్థులు, టీచర్లు వినియోగిస్తున్నారు. కేజీ నుంచి పన్నెండో తరగతి వరకు విద్యాభ్యాసానికి ఉపయోగిస్తున్న డివైజ్‌లలో ఇవి అగ్రస్థానంలో ఉన్నాయి. నోట్‌బుక్స్‌తో పోలిస్తే క్రోమ్‌బుక్స్ ధరలు కొంత తక్కువగా ఉంటాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 17,000 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థల్లో హెచ్‌పీ కూడా ఉంది. -
ఆకస్మిక ఆంక్షలు: షాక్‌లో దిగ్గజ కంపెనీలు, దిగుమతులకు బ్రేక్!
ల్యాప్‌టాప్‌లు,కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం నిర్ణయం చైనా కంపెనీలతో సహా ,ఆపిల్, శాంసంగ్,హెచ్‌పీ లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో చైనా లైసెన్సు లేకుండానే చిన్న టాబ్లెట్ల నుంచి ఆల్ ఇన్ వన్ పీసీల దిగుమతులపై ఆంక్షలు ఆయా కంపెనీల ఆదాయంపై భారీగా ప్రభావం చూపనుంది. ల్యాప్‌టాప్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, మేకిన్‌ఇండియా, స్థానిక ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వ ఈ చర్య తీసుకుంది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) లైసెన్స్‌లను తప్పనిసరి చేయడంతో ప్రపంచంలోని అతిపెద్ద పీసీ మేకర్స్, ఇతర కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. భారతదేశానికి ల్యాప్‌టాప్‌లు టాబ్లెట్ల కొత్త దిగుమతులను నిలిపివేశాయి. అయితే ఆకస్మిక లైసెన్సింగ్ ప్రకటించడం పరిశ్రమను అతలాకుతలం చేసిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ సంస్థల బహుళ-బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఇది భారీ గండి కొడుతుందని అంచనా. రానున్న దీపావళి షాపింగ్ సీజన్,బ్యాక్-టు-స్కూల్ కాలం సమీపిస్తున్నందున డిమాండ్ పుంజుకోనున్న టైంలో లైసెన్సులను ఎలా త్వరగా పొందాలనే దానిపై సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) గ్లోబల్ ఇన్వెంటరీ, అమ్మకాల వృద్ధిని పునఃప్రారంభించడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న తయారీదారులకు ఈ అవసరం అదనపు తలనొప్పిని సృష్టిస్తుందనీ, ఫలితంగా దేశీయ లాంచ్‌లు ఆలస్యం కావడానికి లేదా విదేశీ సరుకులపై ఇప్పటికీ ఎక్కువగా ఆధారపడే కంపెనీల్లో ఉత్పత్తి కొరతకు దారితీయవచ్చనేది ప్రధాన ఆందోళన. కాగా దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ముఖ్యంగా చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో తీసుకున్న ఈ నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. మరోవైపు దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు ఇతర హార్డ్‌వేర్ తయారీదారులను ఆకర్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం 170 బిలియన్ రూపాయల ($2.1 బిలియన్) ఆర్థిక ప్రోత్సాహక ప్రణాళిక కోసం దరఖాస్తులను కోరుతున్న సంగతి తెలిసిందే. -
భారత్‌లో హెచ్‌పీ నూతన ఉత్పత్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో తొలి 45 అంగుళాల సూపర్ అల్ట్రావైడ్ డ్యూయల్ క్యూహెచ్డీ కర్వ్డ్ డిస్ప్లేను టెక్నాలజీ సంస్థ హెచ్‌పీ భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.1,26,631 ఉంది. అలాగే పాలీ వాయేజర్ ఫ్రీ 60 యూసీ ఇయర్‌బడ్స్, 960 4కే స్ట్రీమింగ్ వెబ్‌క్యామ్, 925 ఎర్గానమిక్ వర్టికల్ మౌస్, థండర్‌బోల్ట్ జీ4 డాక్ సైతం ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.8,999 నుంచి ప్రారంభం. -
వచ్చే ఆరు నెలల్లో పీసీలకు డిమాండ్: హెచ్‌పీ ఇండియా
న్యూఢిల్లీ: వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) మార్కెట్ కోలుకుంటోందని, వచ్చే ఆరు నెలల్లో పీసీలకు అధిక డిమాండ్ వస్తుందని అంచనా వేస్తున్నట్టు హెచ్‌పీ ఇండియా తెలిపింది. కరోనా నాటితో పోలిస్తే పర్సనల్ కంప్యూటర్ల సంఖ్య పెరిగినట్టు హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ (పీసీలు) విక్రమ్ బేడీ పేర్కొన్నారు. ఇవి ఇంకా పెరిగేందుకు సానుకూలతలు ఉన్నట్టు చెప్పారు. హెచ్‌పీ ఇండియా మంగళవారం పలు నూతన ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా విక్రమ్ బేడీ మాట్లాడారు. హెచ్‌పీ 14, పెవిలియన్ ఎక్స్360, హెచ్‌పీ పెలివియన్ ప్లస్ 14 నోట్‌బుక్‌లను విడుదల చేయగా, వీటి ధరలు రూ.39,999 నుంచి రూ.81,999 మధ్యలో ఉన్నాయి. దేశ పీసీ మార్కెట్లో హెచ్‌పీ ఇండియాకి 30 శాతం మార్కెట్ వాటా ఉంది. -
ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ, మార్కెట్లో హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్ విడుదల!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్‌పీ అతి తక్కువ ధరకే క్రోమ్‌బుక్ ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేసింది.హెచ్‌పీ క్రోమ్ బుక్ 15.6 అని పిలిచే క్రోమ్‌బుక్‌లో సెలెరాన్ N4500 ఆధారిత ప్రాసెసర్ ఉండగా.. మార్కెట్లో లభ్యమవుతున్న ఈ ల్యాప్‌టాప్‌ను స్కూల్, కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు హెచ్‌పీ వెల్లడించింది. ఈ ల్యాప్‌ట్యాప్‌లో పెద్ద డిస్ప్లే, వైఫై 6 సపోర్ట్‌తో బలమైన కనెక్టివిటీ (stronger connectivity),11.5 గంటల బ్యాటరీ ఈ బ్యాటరీ పనిచేస్తుంది. ఈ సందర్భంగా హెచ్‌పీ క్రోమ్‌బుక్‌పై హెచ్‌పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడీ మాట్లాడుతూ.. హైబ్రిడ్ లెర్నింగ్ విధానం అందుబాటులోకి రావడంతో పర్సనల్ కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువుగా మారింది. అందుకే స్టైలిష్, శక్తివంతంగా ఉన్న ఈ క్రోమ్ బుక్ విద్యార్ధులకోసం ప్రత్యేకంగా ఈ క్రోమ్ బుక్ 15.6 ల్యాప్‌ట్యాప్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. ఇంట్లో లేదా క్లాస్ రూమ్‌లో చదువుతున్నా కనెక్టివిటీ, ప్రొడక్టీవ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. HP Chromebook 15.6 ధర HP Chromebook 15.6 ప్రారంభ ధర రూ. 28,999కే లభిస్తుంది. ఫారెస్ట్ టీల్, మినరల్ సిల్వర్‌తో సహా రెండు వేరియంట్ కలర్స్‌తో అందుబాటులో ఉంది. HP Chromebook 15.6 స్పెసిఫికేషన్లు HP Chromebook మైక్రో-ఎడ్జ్ బెజెల్స్‌తో 15.6 ఇమ్మర్సివ్ డిస్ప్లేను కలిగి ఉంది. మైక్రో ఎడ్జ్ బెజెల్స్, 250 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, ముందు భాగంలో వీడియో కాల్స్ మాట్లాడేందుకు వీలుగా వైడ్ విజన్ హెచ్డీ కెమెరా ఉంది. వీటితో పాటు స్పీకర్ ఎన్‌క్లోజర్ డిజైన్‌తో పెద్ద డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. దీంతో పాటు గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్లాస్‌రూమ్‌తో పాటు ఫైల్స్, ఫొటోలను తొందరగా పంపిచటానికి హెచ్‌పీ క్విక్ డ్రాప్ సదుపాయం ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో నియర్‌బై షేర్ మాదిరిగానే పని చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365కు ఈ ల్యాప్‌టాప్ లో వినియోగించుకోవచ్చు. ఇక ఈ హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ను 15.6ను నదులు, తీర ప్రాంతాల నుంచే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలిసే ప్లాస్టిక్‌తో, రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. -
సూపర్ ఫీచర్లతో హెచ్‌పీ పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్‌ట్యాప్: షాకింగ్ ప్రైస్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌పీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఇండియాలో ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లో ఒమెన్ 17 పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లో సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ,Nvidia GeForce RTX 4080 ను జోడించింది. హెచ్‌పీ ఒమన్ ధర రూ.2,69,990గా నిర్ణయించింది. ఇండియాలో ఒమెన్ ప్లేగ్రౌండ్ స్టోర్స్, HP వరల్డ్ స్టోర్స్ , HP ఆన్లైన్ స్టోర్ వంటి వివిధ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ టెక్నాలజీతో ఒమెన్ 17 ఒమెన్ గేమింగ్ హబ్‌గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. గేమింగ్ ల్యాప్‌టాప్ హెచ్‌పీ ఒమెన్ 17 ఫీచర్లు 17.3-అంగుళాల IPS డిస్ప్లే క్వాడ్ HD (2560 × 1440 పిక్సెల్‌లు) రిజల్యూషన్ 24 కోర్ 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ప్యానెల్ 240Hz రిఫ్రెష్ రేట్ 32 జీబీ DDR5 ర్యామ్, 1TB PCIe NVMe SSD నిల్వ Nvidia RTX 4080 ల్యాప్‌టాప్ GPUతో వస్తుంది. ఇంకా ఒమెన్ 17 బ్యాంగ్ & ఒలుఫ్సెన్ డ్యూయల్ స్పీకర్స్, 720p HD వెబ్‌క్యామ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ అర్రే డిజిటల్ మైక్రోఫోన్ల Wi-Fi 6E కనెక్టివిటీ, థండర్‌బోల్ట్ 4 టైప్-C పోర్ట్, మూడు USB టైప్-A పోర్ట్స్, HDMI పోర్ట్, మినీ డిస్ప్లే పోర్ట్, RJ-45 పోర్ట్ , RTX 40 సిరీస్ ల్యాప్‌టాప్ 330W ఛార్జింగ్‌కు మద్దతుతో 83 Wh Li-ion పాలిమర్ బ్యాటరీ మొదలైనవి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
ఫోటోలు కడిగించాలంటే స్టూడియోకి వెళ్లే పనిలేదు..చేతిలో ఈ గాడ్జెట్ ఉంటే చాలు
స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఫొటోగ్రఫీ తేలికైంది. అయితే, స్మార్ట్‌ఫోన్‌లో ముచ్చటగా తీసుకున్న ఫొటోలను ముద్రించుకోవాలంటే మాత్రం స్టూడియోలు, కలర్ ల్యాబ్‌లకు వెళ్లాల్సిందే! అంత శ్రమ లేకుండా సత్వరమే ఫొటోలు ముద్రించగల ఫొటో ప్రింటర్‌ను కంప్యూటర్ల తయారీ సంస్థ హ్యూలెట్ పాకార్డ్ ‘హెచ్‌పీ’ అందుబాటులోకి తెచ్చింది. ఇది స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ‘హెచ్‌పీ స్ప్రాకెట్ స్టూడియో ప్లస్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఫొటో ప్రింటర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్ల ద్వారా తేలికగా ఉపయోగించవచ్చు. వాటిలో డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా క్షణాల్లోనే కోరుకున్న ఫొటోలను ముద్రించుకోవచ్చు. ఇందులో 6 “ 4 అంగుళాల సైజులో మాత్రమే ఫొటోలను ముద్రించుకునే అవకాశం ఉంది. దీని ధర 149.99 డాలర్లు (రూ.12,374) మాత్రమే! -
కొనసాగుతున్న కొలువుల కోత.. ఉద్యోగుల్లో కలవరం
న్యూఢిల్లీ: టెక్ ప్రపంచంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా బాటలోనే గూగుల్, హెచ్‌పీ తదితర సంస్థలు కూడా సిబ్బందిని తగ్గించుకోవడమో లేక హైరింగ్‌ను నిలిపివేయడమో చేస్తున్నాయి. తాజాగా గూగుల్ 10 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది తొలినాళ్లలో ప్రకటించినట్లుగా పనితీరును మెరుగుపర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరైన పనితీరు లేని ఉద్యోగులను వర్గీకరించాల్సిందిగా మేనేజర్లకు ఆదేశాలు వచ్చినట్లు వివరించాయి. దీని ప్రకారం సుమారు 6 శాతం మంది ఉద్యోగులను (దాదాపు 10,000 మంది) ఈ కేటగిరీ కింద వర్గీకరించవచ్చని పేర్కొన్నాయి. (ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ150: ధర ఎంతంటే?) గూగుల్ వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయంటూ సంస్థలో ఇన్వెస్టరయిన టీసీఐ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించు కుంది. ఉద్యోగుల సంఖ్య.. వారిపై వ్యయాలు చాలా భారీ గా ఉంటున్నాయని, ఈ విషయంలో మేనేజ్మెంట్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ యాజమాన్యానికి రాసిన లేఖలో టీసీఐ ఎండీ క్రిస్టోఫర్ హాన్ సూచించారు. ఆల్ఫాబెట్లో టీసీఐకి 6 బిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లు ఉన్నాయి. కోతల ప్రభావం భారత్‌లోని ఉద్యోగులపై ఎలా ఉండవచ్చనేది తెలియరాలేదు. భారత్‌లో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న గూగుల్‌కు దేశీయంగా సుమారు 5 వేల ఉద్యోగులున్నారు. ఇక్కడ 10 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు 2020లో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. హెచ్‌పీలో 6 వేల ఉద్యోగాలు కట్ .. మరోవైపు, పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో వాటి తయారీ దిగ్గజం హెచ్‌పీ కూడా సిబ్బందిని తగ్గించుకునే యోచనలో ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను 12 శాతం (6వేల వరకూ) తగ్గించుకోవాలని భావిస్తోంది. హెచ్‌పీలో సిబ్బంది సంఖ్య సుమారు 50,000 దాకా ఉండగా.. 4,000-6,000 వరకూ ఉద్యోగాల్లో కోత విధించే అవకాశం ఉంది. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ, ఇతరత్రా వ్యయాల కింద 1 బిలియన్ డాలర్ల వరకూ వెచ్చించాల్సి రావచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. మొత్తం మీద ఈ ప్రక్రియతో 2025 ఆర్థిక సంవత్సరం తర్వాత ఏటా 1.4 బిలియన్ డాలర్ల మేర ఆదా చేయొచ్చని భావిస్తోంది. మహమ్మారి కాలంలో ఒక్కసారిగా ఎగిసిన పీసీల (పర్సనల్ కంప్యూటర్స్) అమ్మకాలు ఆ తర్వాత గణనీయంగా తగ్గాయి. ద్రవ్యోల్బణం దశాబ్దాల రికార్డు స్థాయుల్లో తిరుగాడుతుండటంతో వినియోగదారులు .. కొనుగోళ్లపై వెచ్చించడాన్ని తగ్గించుకుంటూ ఉండటమే ఇందుకు కారణం. దీంతో హెచ్‌పీ, డెల్ టెక్నాలజీస్ వంటి తయారీ సంస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. మూడో క్వార్టర్లో డెల్ ఆదాయం 6 శాతం, నాలుగో త్రైమాసికంలో హెచ్‌పీ ఆదాయం 11 శాతం పడిపోయింది. మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్బుక్), అమెజాన్ ఇప్పటికే సుమారు 10,000 మంది చొప్పున ఉద్యోగుల తీసివేత ప్రక్రియ మొదలుపెట్టాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో 7,500 మంది పైగా సిబ్బంది ఉండగా, కంపెనీ ఈ సంఖ్యను సగానికి పైగా తగ్గించుకుంది. సిస్కో సిస్టమ్స్ కూడా ఈ దిశగా ప్రణాళికలు ప్రకటించింది. అటు హార్డ్ డ్రైవ్‌ల తయారీ సంస్థ సీగేట్ టెక్నాలజీ హోల్డింగ్స్ సుమారు 3,000 ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, స్ట్రైప్ వంటివి కూడా సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. ఉద్వాసనలతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ కంపెనీల షేర్లు మాత్రం పెరుగుతున్నాయి. అక్టోబర్ ఆఖరులో ఉద్యోగాల కోతల వార్త ప్రకటించినప్పటి నుండి మెటా షేరు సుమారు 18 శాతం పెరిగింది. -
హాట్ కేకుల్లా డెస్క్ టాప్ సేల్స్!! భారత్‌లో కింగ్ మేకర్ ఎవరంటే!
కోవిడ్ కారణంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్‌హోమ్ తో దేశంలో పర్సనల్ కంప్యూటర్లు (పీసీ-డెస్క్‌టాప్),ల్యాప్‌ట్యాప్‌ల వినియోగం బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన క్యూ4 ఫలితాల్లో దేశీయంగా పర్సనల్ కంప్యూటర్లు 14.8 మిలియన్ యూనిట్ల షిప్ మెంట్ జరిగినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. 1.3 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌తో హెచ్‌పీ సంస్థ మార్కెట్లో కింగ్ మేకర్‌గా నిలిచింది. ►2020నుంచి హెచ్‌పీ భారత్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగింది. ►క్యూ4లో వరుసగా రెండో త్రైమాసికంలో 1మిలియన్ యూనిట్లకు పైగా షిప్పింగ్ చేస్తూ 23.6శాతం షేర్‌తో డెల్ దేశీయ మార్కెట్లో రెండో స్థానంలో నిలించింది. ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ నుండి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెల్ 38శాతం వాటాతో ఎంటర్ప్రైజ్ విభాగంలో ముందుంది. ►మరో టెక్ సంస్థ లెనోవో పీసీ సెగ్మెంట్లో 22.8శాతం వృద్ధిని సాధించింది. 24.7శాతం వాటాతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎస్ఎంఈ) విభాగం నుండి డిమాండ్ పెరగడంతో లెనోవో..,హెచ్‌పీ కంటే మందంజతో రెండవ స్థానంలో ఉంది. ►ఏసర్ 8.2శాతం, ఆసుస్ 5.9శాతం మార్కెట్ వాటాతో నాలుగు, ఐదవ స్థానాల్ని సంపాదించుకున్నాయి. డెస్క్‌టాప్ విభాగంగాలో ఏసర్ అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. ఇది 25.8శాతం మార్కెట్ వాటా ఉంది. ►ఆసుస్ సంవత్సరానికి 36.1శాతం వృద్ధి చెందింది. ఈ సందర్భంగా ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ (పీసీ డివైజెస్) భరత్ షెనాయ్ మాట్లాడుతూ వరుసగా రెండో సంవత్సరం సైతం విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు/టాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. వారిలో కొంతమంది విద్యార్ధులు మాత్రం పెద్దస్క్రీన్, వాడుకలో సౌలభ్యం వంటి ఇతర ప్రయోజనాల కారణంగా పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. -
చైనాకు కోలుకోని దెబ్బ, శరవేగంగా కేంద్రం కీలక నిర్ణయాలు!!
దేశంలో సెమీకండక్టర్ల తయారీలో కేంద్రం వడివడి అడుగులు వేస్తుంది. చైనా కోలుకోలేని విధంగా షాకిస్తూ కేంద్రం మరో రెండేళ్ల తర్వాత దేశంలో చిప్‌లు తయారయ్యే దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దేశీయ టెక్ కంపెనీలు వేలకోట్లు పెట్టుబడులు పెట్టేలా కేంద్రం ప్రోత్సహిస్తుంది. కేంద్రం దేశీయంగా సెమీకండెక్టర్లు, డిస్ప్లే తయారీకి రూ.76వేల కోట్ల విలువైన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకానికి ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో భాగంగా సెమీకండక్టర్ల తయారీ కోసం దేశీయ టెక్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూకడుతున్నాయి. మొబైల్ హ్యాండ్సెట్స్ మొదలుకుని ఆటోమొబైల్స్ దాకా అనేక ఉత్పత్తుల్లో సెమీ కండక్టర్లు(చిప్) కీలకంగా ఉంటున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, వాషింగ్ మెషీన్ల వంటి అనేక ఉత్పత్తుల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఎక్కువ శాతం ఈ చిప్‌లు విదేశీ కంపెనీలు తయారు చేస్తుంటే..వాటిని కొనుగోలు చేస్తున్నాం. అయితే ఇకపై అలాంటి సమస్య లేకుండా కేంద్రం పీల్ఐ స్కీం అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో 10% వాటా లక్ష్యంగా పెట్టుకుంది.సెమీకండక్టర్లలో రూ.90వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. చిప్ కొరత సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చిప్ ఉత్పత్తి తయారీ సంస్థలతో మాట్లాడుతోందని ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఇక దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి విషయానికొస్తే మరో రెండేళ్ల తర్వాత సాధ్యమవుతుంది" అని గౌర్ చెప్పారు. అంతేకాదు ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీమ్‌లో హెచ్‌పీ, డెల్, యాక్సర్ వంటి టెక్ సంస్థలు వేల పెట్టుబడులు పెట్టనున్నాయని గౌర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. చైనాకు గట్టి ఎదురుదెబ్బ! చిప్స్ కొరత సమస్య భారతదేశంలోని ఆటో, స్మార్ట్ ఫోన్, వైట్ గూడ్స్ పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. సెమీకండక్టర్ తయారీదారులను ఆకర్షించడానికి అమెరికా వంటి దేశాలు భారీ సబ్సిడీలను నిలిపివేయడంతో భారతదేశం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చీప్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్లు నిపుణులు అంటున్నారు. కొరియన్ దిగ్గజం శామ్ సంగ్ ఇటీవల అమెరికాలోని టెక్సాస్ లో 17 బిలియన్ డాలర్ల చిప్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చదవండి: మీరు ఈ టెక్నాలజీలో ఎక్స్‌పర్టా? అయితే మీకు జాబులే జాబులు!! -
మేడిన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, పీసీలు
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు సహా వివిధ రకాల పర్సనల్ కంప్యూటర్లను భారత్‌లో తయారు చేయడం ప్రారంభించినట్లు టెక్ దిగ్గజం హెచ్‌పీ వెల్లడించింది. ప్రభుత్వ విభాగాలు కూడా కొనుగోలు చేసే విధంగా వీటిలో కొన్ని ఉత్పత్తులకు అర్హతలు ఉన్నాయని పేర్కొంది. గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రభుత్వ విభాగాలు ఆర్డరు చేసేందుకు ఇవి అందుబాటులో ఉంటాయని హెచ్‌పీ ఇండియా మార్కెట్ ఎండీ కేతన్ పటేల్ తెలిపారు. ‘భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి చురుగ్గా పనిచేస్తున్నాం. కోట్ల కొద్దీ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మేకిన్ ఇండియా ప్రోగ్రాంకి అనుగుణంగా మేము దేశీయంగా తయారీని చేపట్టాము. మా తయారీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా స్వావలంబన భారత కల సాకారం కావడంలో అర్ధవంతమైన పాత్ర పోషించగలమని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కమర్షియల్ డెస్క్‌టాప్‌ల తయారీ కోసం ఫ్లెక్స్ సంస్థతో 2020 ఆగస్టులో హెచ్‌పీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి అనుగుణంగా తమిళనాడు రాజధాని చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లోని ఫ్లెక్స్ ప్లాంటులో పీసీలు, ల్యాప్‌టాప్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. తొలిసారిగా విస్తృత శ్రేణి .. హెచ్‌పీ ఎలీట్‌బుక్స్, హెచ్‌పీ ప్రోబుక్స్, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్ వంటి విస్తృత శ్రేణి ల్యాప్‌టాప్‌లను భారత్‌లో తయారు చేయడం ఇదే తొలిసారని సంస్థ పేర్కొంది. డెస్క్‌టాప్ మినీ టవర్స్ (ఎంటీ), మినీ డెస్క్‌టాప్స్ (డీఎం), స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ (ఎస్ఎఫ్ఎఫ్) డెస్క్‌టాప్స్, ఆల్–ఇన్–వన్ పీసీలు మొదలైన వాటిని కూడా తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్ల ఆప్షన్లతో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు హెచ్‌పీ పేర్కొంది. ఫ్లెక్స్ ఫ్యాక్టరీ.. చెన్నై పోర్టుకు దగ్గర్లో ఉండటం వల్ల నిర్వహణపరమైన సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని, ల్యాప్‌టాప్‌లు..ఇతర పీసీ ఉత్పత్తులకు అవసరమైన ముడివస్తువులను సమకూర్చుకోవడం సులభతరంగా ఉంటుందని తెలిపింది. -
ల్యాప్‌టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు స్కూల్, కాలేజీ వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం క్లాస్ లు అన్నీ ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్దులకు ల్యాప్‌టాప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మీరు కొత్తగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని చూస్తుంటే, కొనే ముందు ఒకసారి ఈ విషయాలను గుర్తుంచుకోండి. బడ్జెట్ రూ.50,000 లోపు ఉండాలి కేవలం స్కూల్ లేదా కాలేజీ విద్యార్దుల కోసం విండోస్ ల్యాప్‌టాప్ తీసుకోవాలని అనుకుంటే దానిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హెచ్ పీ, డెల్, ఏసర్, ఆసుస్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు రూ.30,000-రూ.50,000 ధరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ లు తీసుకొస్తున్నాయి. ఫుల్హెచ్డీ డిస్ప్లే సరిపోతుంది ల్యాప్‌టాప్ అధిక రిజల్యూషన్ డిస్ ప్లే ప్యానెల్ వల్ల భారీగా ధర పెరుగుతుంది కనుక అలాంటి డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ అవసరం లేదు. ఫుల్ హెచ్ డీ(1920 8 1080 పీక్సెల్స్) డిస్ ప్లే గల ల్యాప్‌టాప్ తీసుకున్న సరిపోతుంది. ఇంకా తక్కువ ధరకు ల్యాప్‌టాప్ తీసుకోవాలి అనుకుంటే 1366 * 768 పీక్సెల్స్ ల్యాపీ తీసుకోవచ్చు. ప్రాసెసర్ ముఖ్యమే ఇంటెల్ కోర్ ఐ3 వంటి ల్యాప్‌టాప్ లు ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని సంవత్సరాల పాటు మీరు వాడుతారు కాబట్టి కోర్ ఐ5 ప్రాసెసర్ గల ల్యాప్‌టాప్ తీసుకుంటే మంచిది. ర్యామ్ ఎంత అవసరం మీ ల్యాప్‌టాప్ లో కనీసం 8జీబీ ర్యామ్ ఉండేలా చూసుకోండి. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు మీకు ఇది మంచిగా సరిపోతుంది. 4 జీబీ ర్యామ్ మాత్రం తీసుకోకండి. హార్డ్ డ్రైవ్ ఎంత ఉండాలి మీ అవసరాల కోసం 512జీబీ హెచ్ డీడీ లేదా 256జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ సరిపోతుంది. మీ దగ్గర కనుక కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే 512జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్‌టాప్ తీసుకోండి. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్ మీ ల్యాప్‌టాప్ లో ఒరిజినల్ విండోస్ 10 ఓఎస్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చాలా కంపెనీ ఉచితంగా విండోస్ 10 ఓఎస్ ను అందిస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం మంచిది. దీని వల్ల మీరు సైబర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 ఉంటే మంచిది. చదవండి: సైబర్ పవర్లో ఇజ్రాయిల్ కంటే వెనుకనే భారత్! -
ఉప్పు.. పప్పు.. ల్యాప్‌టాప్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోం ప్రాచుర్యం పెరుగుతోంది. లాక్డౌన్ లేకున్నా... నిబంధనలు సడలిస్తున్నా కూడా కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయించడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు కూడా మెల్లగా నిత్యావసరాల జాబితాలోకి చేరిపోతున్నాయి. ఫలితంగా... నిబంధనలు సడలించిన వెంటనే ఈ షాపులకు కస్టమర్ల తాకిడి పెరిగింది. ఐటీ సహా పలు రంగాల్లోని ఉద్యోగులకు ఇళ్లలో కూడా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ తప్పనిసరి అవుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. రానున్న రెండేళ్లూ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు బాగా పెరుగుతాయనేది వారి అంచనా. 15–40 శాతం దాకా డిస్కౌంట్లు నిజానికి లాక్‌డౌన్‌కు ముందు ఉత్పత్తులపై ఎలాంటి డిస్కౌంట్లూ లేవు. ఇపుడు మాత్రం పలు కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవటానికి గిఫ్ట్ కార్డులు, డిస్కౌంట్లు వంటివి ఇస్తున్నాయి. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ వంటి కంపెనీలు వ్యక్తిగత కొనుగోలుదార్లకు 15 శాతం దాకా తగ్గింపు ఆఫర్ ఇస్తున్నాయి. అలాగే స్క్రాచ్‌కార్డ్‌తో మొబైల్, ట్యాబ్లెట్ వంటి బహుమతులను, రూ.50,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను, ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8,000 విలువ చేసే యాక్సెసరీస్‌ను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. 25 పైన యూనిట్లు కొనుగోలు చేసే ఇన్స్టిట్యూషనల్ కస్టమర్లకయితే చాలా కంపెనీలు తమ డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం దాకా... యాక్సెసరీస్‌పై 25 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తున్నాయి. మారిన బ్యాంకుల వ్యూహం.. వ్యక్తిగత కొనుగోలుదార్ల కోసం గతంలో బ్యాంకులు, రుణ సంస్థలు స్పెషల్ స్కీములు ఆఫర్ చేసేవి. ఆరు నెలల్లో గనుక తిరిగి తీర్చేసేలా ఉంటే ఎలాంటి వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసేవి కాదు. డౌన్ పేమెంట్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, 6 శాతం వడ్డీ వసూలు చేస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు చెప్పారు. ప్రైవేటు బ్యాంకులైతే ప్రాసెసింగ్ ఫీజు రూ. 500తో పాటు డౌన్ పేమెంట్ 35% ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి. దీంతో పూర్తి నగదు చెల్లించి ఉపకరణాన్ని కొనేందుకే ఎక్కువ మంది కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. అమ్మకాలు డబుల్... లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే నిబంధనలు సడలించాక అమ్మకాలు రెట్టింపయినట్లు దేశంలోని టాప్ సెల్లర్స్‌లో ఒకరైన ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ‘‘ఇన్స్టిట్యూషనల్ సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయి. విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు మొదలుపెడితే డిమాండ్ అనూహ్యంగా ఉంటుంది. మొత్తం విక్రయాల్లో ల్యాప్‌టాప్‌లు 85%, డెస్క్‌టాప్‌లు 15% వరకు ఉంటున్నాయి. వీటిలో కూడా రూ.35–50 వేల శ్రేణి ల్యాప్‌టాప్‌లు, రూ.25–50 వేల శ్రేణి డెస్క్‌టాప్‌ల సేల్స్ ఎక్కువ’’ అని ఆయన చెప్పారు. తయారీ, సరఫరా సమస్యల కారణంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల ధర కంపెనీని బట్టి 5–12% పెరిగినట్లు తెలియజేశారు. ఇక హార్డ్ డిస్క్, ర్యామ్, అడాప్టర్ల వంటి యాక్సెసరీస్ ధరలు రెట్టింపయ్యాయి. ‘‘అయినా కస్టమర్లు వెనుకాడడం లేదు. సర్వీస్ రిక్వెస్టులూ పెరిగాయి’’ అని చెప్పారు.