ప్రపంచంలోనే అతిచిన్న ప్రింటర్..ధర ఎంత ? | HP has announced the launch of the world's smallest All-in-One printer | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతిచిన్న ప్రింటర్..ధర ఎంత ?

Published Mon, Sep 26 2016 3:06 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

ప్రపంచంలోనే అతిచిన్న ప్రింటర్..ధర ఎంత ? - Sakshi

ప్రపంచంలోనే అతిచిన్న ప్రింటర్..ధర ఎంత ?


ప్రపంచంలోనే అతిచిన్న  ప్రింటర్ ను సోమవారం లాంచ్ అయింది.  టెక్నాలజీ దిగ్గజం, ప్రముఖ ప్రింటర్ల తయారీదారు  హెచ్పీ   విడుదల చేసిన ఈ ప్రింటర్ ఆల్ ఇన్ వన్ ప్రింటర్ గా కంపెనీ చెబుతోంది.   ' డెస్క్ జెట్  ఇంక్ అడ్వాంటేజ్ 3700' పేరుతో వస్తున్న ఈ బుల్లి   ప్రింటర్ ధరను రూ 7, 176గా   ప్రకటించింది. వినియోగదారులు అంచనాలకనుగుణంగా  ఈ ప్రింటర్ రూపొందించామని సంస్థ ప్రకటించింది. , కన్స్యూమర్ జీవనశైలి, సరసమైన ధర,  ప్రభావవంతమైన,  ఉత్పాదక ఉండాలనే  కీలక  అంశాలపై దృష్టి సారించినట్టు హెచ్ పీ ఇంక్ ఇండియా  మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ శ్రీవాత్సవ   చెప్పారు. తమ తాజా ప్రయోగం తమ వినియోగదారులకు అద్భుతమైన ఇంజనీరింగ్ అనుభవాన్ని ఇవ్వడంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం  దీని ద్వారా  స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుంచి   స్కాన్ చేసుకొని, సులువుగా  ప్రింట్ కాపీ  తీసుకోవచ్చు.  రూ .550 విలువ చేసే  కాట్రిడ్జ్ తో సుమారు480 పేజీలను ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే   ఒక మోనోక్రోమ్ ముద్రణ కయ్యే ఖర్చుఒక రూపాయి.   403x177x141ఎంఎం  డైమన్షన్స్ తో ఉన్న ఈ ప్రింటర్ బరువు  2.33 కిలోలు. అంతేకాదు  వైర్ లెస్  ప్రింటింగ్ కోసం  వైఫై కి సపోర్టు చేస్తుంది.  ఆన్ లైన్ , ఆఫ్ లైన్, రీటైల్ స్టోర్లలో  రెడ్, గ్రీన్, బ్లూ రంగుల్లో  వినియోగదారులకు అందుబాటులోఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement