తప్పిపోయిన పిల్లలను సులభంగా కనుగొనేందుకు వీలుగా చైనా పోలీసులు కొత్త యాప్ ను ప్రయోగాత్మకంగా ఆవిష్కరించారు.
చైనాః ఇకపై చైనాలో చిన్నారుల మిస్సింగ్ కేసులు తగ్గే అవకాశం కనిపిస్తోంది. తప్పిపోయిన పిల్లలను సులభంగా కనుగొనేందుకు వీలుగా చైనా పోలీసులు కొత్త యాప్ ను ప్రయోగాత్మకంగా ఆవిష్కరించారు. సుమారు 5,000 కు పైగా యాంట్రీ ట్రాఫికింగ్ పోలీసులు యాప్ ద్వారా తప్పిపోయిన పిల్లల నివేదికలను యాప్ ఆధారంగా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసే అవకాశం ఉందని, ప్రజా భద్రతా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రకటించింది.
చైనా పోలీసులు ప్రారంభించిన కొత్త యాప్ ద్వారా వినియోగదారులు ఎప్పటికప్పుడు పిల్లల సమాచారానికి సంబంధించిన పుష్ నోటిఫికేషన్స్, ఫొటోలు వంటివి అందుకునే వీలుంటుంది. ఈ అధికారిక సమాచార వేదిక... సినా వీబో అకౌంట్ డాట్ పోలీస్ సేవలు ప్రజలకు కూడ అందుబాటులో ఉంటాయి. మీడియా ఔట్ లెట్లలోనూ, మొబైట్ యాప్ ల ద్వారా దీన్ని వినియోగించుకొని ప్రజలు కూడ యాంటీ ట్రాఫికింగ్ ను అరికట్టేందుకు సహకరించే అవకాశం కల్పించారు.