పానసోనిక్ ఇంటిలిజెంట్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ పానసోనిక్ మరో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. వినియోగదారులకు గొప్ప అనుభవాలు అందించే లక్ష్యంతో పానాసోనిక్ సోమవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. స్మార్ట్ నిఘా ఆధారిత ఫీచర్ అర్బో తో ఇంటిలిజెంట్ స్మార్ట్ ఫోన్లను ప్రారంభించింది. దీనికి సంబంధించిమీడియా ఆహ్వానాలను శుక్రవారం పంపించింది. అర్బో ఈజ్ హియర్ తో ఈ ఆహ్వానాలను పంపింది. ఎలుగ ఎక్స్ రే మాక్స్ , ఎలుగ రే ఎక్స్‌పేర్లతో వీటిని లాంచ్ చేసింది. వీటి ధరలను వరుసగా రూ. 11,499 రూ. 8,999 గా నిర్ణయించింది.
కాగా ఈ నెలలోనే ఎలుగా ప్లస్ ఎక్స్, ఎలుగా ప్లస్ పేరుతో రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధరలను వరుసగా రూ.10,990, రూ. 9, 690గ ప్రకటించింది. అలాగే ఫిబ్రవరిలో మూడు టఫ్‌ఫ్యాడ్ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రవాణా, లాజిస్టిక్, తయారీ, ఆటోమోటివ్, రిటైల్, హెల్త్‌కేర్ రంగాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ట్యాబ్లెట్లను లాంచ్ చేసింది.
ఎలుగ ఎక్స్ రే మాక్స్
5.20 అంగుళాల డిస్‌ప్లే
1.4గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్
1080x1920 రిజల్యూషన్
16 మెగాపిక్సెల్ రేర్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4 జీబీ ర్యామ్
32జీబీ స్టోరేజ్
3000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ
ఎలుగ రే ఎక్స్ ఫీచర్స్
5.50 అంగుళాల డిస్‌ప్లే
1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0,
720x1280 రిజల్యూషన్
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5ఎంపీ ఫ్రంట్ కెమెరా
3జీబీ ర్యామ్
32జీబీ స్టోరేజ్
4000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ