Panasonic
-
పానాసోనిక్ 4680 బ్యాటరీ: ఎక్కువ రేంజ్ కోసం..
జపాన్‌కు చెందిన పానాసోనిక్ కంపెనీ 4680 లిథియం అయాన్ బ్యాటరీ సెల్‌లను భారీగా ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాల పరిధిని (రేంజ్) పెంచడానికి ఈ కంపెనీ వీటిని తయారు చేయడానికి పూనుకుంది. ఈ బ్యాటరీల వినియోగంతో ఖర్చు కూడా తగ్గుతుందని తెలుస్తుంది.సాధారణంగా ఇప్పటి వరకు చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించిన 2170 సెల్స్ 21 మిమీ వ్యాసం, 70 మిమీ పొడవు (0.83 x 2.8 ఇంచెస్) ఉంటుంది. అయితే 4680 సెల్స్ మాత్రం 46 x 80 మిమీ (1.8 x 3.1 ఇంచెస్) వద్ద చాలా లావుగా, కొంచెం పొడవుగా ఉంటాయి. అంతే వీటి పనితీరు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.4680 సెల్స్ పరిమాణంలో లావుగా ఉండటం వల్ల.. చిన్న సెల్స్ కంటే కూడా ఐదు రెట్లు ఎక్కువ పవర్ డెలివరీ చేస్తాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించినప్పుడు రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు పీక్ పవర్ ఆశించవచ్చు. ఛార్జింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. టెస్లా 2020 బ్యాటరీ డేలో ప్రకటించిన సెల్ కూడా ఇదే పరిమాణంలో ఉంది.ఇదీ చదవండి: పసిడి పరుగు.. భారీగా పెరిగిన బంగారం ధరలు పానాసోనిక్ కంపెనీ 4680 బ్యాటరీల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 400 మంది సిబ్బంది దీనికోసం పనిచేయనున్నట్లు సమాచారం. సంస్థ ఈ సెల్స్ ఉత్పత్తి చేసి టెస్లా, లూసిడ్, టయోటా, ఫోర్డ్ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
ఏపీకి గుడ్‌న్యూస్: మరో రూ.300 కోట్ల పెట్టుబడి
వారణాసి: స్విచ్‌లు, స్విచ్ బోర్డుల తయారీలో ఉన్న ప్యానాసోనిక్ ఎలక్ట్రిక్ వర్క్స్ ఇండియా సామర్థ్యం పెంపునకు ఆంధ్రప్రదేశ్‌లో మరో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ‘శ్రీ సిటీ ప్లాంటులో తొలి దశలో ఇప్పటికే రూ.300 కోట్లు వెచ్చించాం. 2026 నాటికి మరో రూ.300 కోట్లు ఖర్చు చేస్తాం. ఎగుమతుల కోసం ఈ కేంద్రాన్ని వినియోగించుకుంటాం. తొలుత మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తాం’ అని ప్యానాసోనిక్ ఎలక్ట్రిక్ వర్క్స్ ఇండియా పవర్ బిజినెస్ యూనిట్ డైరెక్టర్ రాజేశ్ నంద్వానీ వెల్లడించారు. శ్రీ సిటీ, డామన్, హరిద్వార్ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 62 కోట్ల యూనిట్లు ఉంది. 2025 నాటికి 70 కోట్లు, 2030 కల్లా 100 కోట్ల యూనిట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన ఈ సంస్థకు భారత్‌లో 8,900 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. -
రోబోటిక్ వీడియో కెమెరా: ధర తెలిస్తే షాకవుతారు
సాక్షి, ముంబై: జపానీస్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ ‘పానసోనిక్’ కొత్తగా రోబోటిక్ వీడియో కెమెరాను విడుదల చేసింది. ‘ఏడబ్ల్యూ–యూఈ 160 యూహెచ్డీ 4కే 1 ఎంఓఎస్ పీటీజ్’ పేరుతో విడుదల చేసిన ఈ కెమెరా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యంత స్పష్టమైన చిత్రాలను, వీడియోలను తీయగలదు. ఇందులో ఎంఓఎస్ సెన్సర్, లో పాస్ ఫిల్టర్, హైస్పీడ్ ఫ్రేమ్ రేట్స్ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. పరిసరాల్లోని వెలుగు నీడలకు అనుగుణంగా ఈ కెమెరా తనను తానే సర్దుకుని స్పష్టమైన వీడియోలను చిత్రించగలదు. జూమ్, టిల్ట్ వంటివి రిమోట్‌తో నియంత్రించవచ్చు. ఇది స్లోమోషన్ వీడియోలను కూడా పూర్తి స్పష్టతతో తీయగలదు. ఈ కెమెరాకు సంబంధించిన యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుంటే, దాని ద్వారా కెమెరా పనితీరును సులువుగా నియంత్రించుకోవచ్చు. దీని ధర 14,495 డాలర్లు (రూ.11.93 లక్షలు). -
ఏసీ, రిఫ్రిజిరేటర్లకు ఫుల్ డీమాండ్
భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఈ సంవత్సరం సాధారణ స్థాయి కంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) పేర్కొనడంతో శీతలీకరణ పరికర తయారీదారులు ఏసీ, రిఫ్రిజిరేటర్లకు ఫుల్ డీమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వాతావరణంతో పాటు పెరుగుతున్న కరోనా కేసులు, వర్క్ హోమ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో ఏసీ, రిఫ్రిజిరేటర్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. "గత 3-4 నెలలుగా ఎయిర్ కండీషనర్ల విభాగంలో 25 శాతం వృద్ధిని సాధించాము, ఇక ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నాము. ఈ ఏడాది క్యూ4 వరకు 100 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నాము" అని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ & సీఈఓ మనీష్ శర్మ పేర్కొన్నారు. ఈ డిమాండ్ ఎయిర్ కండిషనర్లు మాత్రమే పరిమితం కాకుండా పానాసోనిక్ రిఫ్రిజిరేటర్లలో 30 శాతం రికార్డు వృద్ధిని సాదించనున్నట్లు పేర్కొన్నారు. మునుపటి సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలలో అధిక డిమాండ్ ఉన్నట్లు వారు పేర్కొన్నారు. "ఈ వేసవి కాలంలో పట్టణ మినీ-మెట్రో నగరాలలో బ్రాండెడ్ గృహోపకరణాల వాడకం పెరిగే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మరి ముఖ్యంగా గ్రామీణ, టైర్ 2 & 3 నగరాల నుంచి డిమాండ్ పెరుగుతుంది" అని వోల్టాస్ ప్రతినిధి పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పరికరాలను తయారు చేస్తున్నట్లు వోల్టాస్ పేర్కొంది. చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! -
కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్!
2021 ఏడాదిలో అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. మొన్నటి దాక చమురు పెరిగితే, నిన్న గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ ఎయిర్ కండీషనర్ ధరలు పెరగనున్నాయి. అసలే ఇప్పటికే ఎండలు బాగా మండుతున్నాయి. చాలా మంది వర్క్ ఫ్రమ్ చేస్తున్న కారణంగా ఏసీలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు వారికి షాక్ తగిలింది. కంపెనీలూ 5 నుంచి 8 శాతం మేర ఏసీ ధరలు పెంచాలని చూస్తున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరిగిపోవడం వల్ల కంపెనీలు వీటి ధరలు పెంచేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఏసీ తయారీకి వినియోగించే లోహాలు, కంప్రెసర్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచి ఏసీల ధరలు 3 నుంచి 5 శాతం పెంచనున్నట్లు డైకిన్ తెలిపింది. అమ్మకాల మీద ధరల పెంపు ప్రభావం కొంతమేర మాత్రమే ఉంటుందని, వేసవి కాలంలో ఎక్కువ వేడి కారణంగా డిమాండ్ ఏమాత్రం తగ్గదని డైకిన్ ఇండియా ఎండీ, సీఈవో కన్వాల్ జీత్ జావా అంచనా వేశారు. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో 6 నుంచి 8 శాతం ధరలు పెంచనున్నట్లు పానాసోనిక్ వెల్లడించింది. ప్రముఖ టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్ ఇప్పటికే ఏసీ ధరలను పెంచింది. చదవండి: మస్క్, బెజోస్‌లను అధిగమించిన అదానీ! -
ఏప్రిల్ 1 విడుదల... ధర దడ
న్యూఢిల్లీ: ఎల్ఈడీ టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ వడ్డింపు ఉండనుంది. ఓపెన్–సెల్ ప్యానెళ్లు ఖరీదు కావడమే ఇందుకు కారణం. గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్యానెళ్ల ధర 35 శాతం వరకు అధికమైందని కంపెనీలు అంటున్నాయి. వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెంచాలని ప్యానాసోనిక్, హాయర్, థామ్సన్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎల్జీ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 5–7 శాతం ధర పెరిగే చాన్స్ ఉంది. టీవీ స్క్రీన్ తయారీలో ఓపెన్–సెల్ ప్యానెల్ అత్యంత కీలక విడిభాగం. మొత్తం ధరలో దీని వాటాయే అధికంగా 60% వరకు ఉంటుంది. కంపెనీలు టెలివిజన్ ప్యానెళ్లను ఓపెన్–సెల్ స్థితిలో దిగుమతి చేసుకుంటాయి. చైనా సంస్థలే ఓపెన్–సెల్ తయారీ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇక అప్లయెన్సెస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో టీవీలదే అగ్రస్థానం. దేశంలో ప్రస్తుతం ఏటా 1.7 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయి. వీటి విలువ రూ.25,000 కోట్లు. 2024–25 నాటికి మార్కెట్ 2.84 కోట్ల యూనిట్లకు చేరుతుందని సియామా, ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ అంచనా. మరో మార్గం లేకనే..: ప్యానెళ్లు ప్రియం అవుతూనే ఉన్నందున టీవీల ధర కూడా అధికం అవుతుందని ప్యానాసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి టీవీల ధర వచ్చే నెలకల్లా 5–7 శాతం అధికం కానుందని ఆయన వెల్లడించారు. ధరల సవరణ తప్ప తమకు మరో మార్గం లేదని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఓపెన్–సెల్ ప్రైస్ గణనీయంగా పెరిగిందని, ట్రెండ్ ఇలాగే కొనసాగనుందని అన్నారు. ఓపెన్–సెల్‌కు అనుగుణంగా టీవీల ధరలను సవరించాల్సిందేనని స్పష్టం చేశా రు. తాము టీవీల ధరను పెంచడం లేదని ఎల్జీ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరిలో ధరలను సవరించామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం అప్లయెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు తెలిపారు. వాటికి కొరత ఉన్నందునే.. మార్కెట్లో ఓపెన్–సెల్ ప్యానెళ్లకు కొరత ఉందని సూపర్ ప్లాస్ట్రానిక్స్ తెలిపింది. గడిచిన ఎనిమిది నెలల్లో వీటి ధర మూడింతలైందని కంపెనీ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అంతర్జాతీయంగా ప్యానెళ్ల మార్కెట్ మందగించిందని, అయినప్పటికీ నెల రోజుల్లో ధర 35% అధికమైందని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఒక్కో టీవీ ధర కనీసం రూ.2–3 వేలు పెరగనుందన్నారు. ఫ్రాన్స్ కంపెనీ థామ్సన్, యూఎస్ సంస్థ కొడాక్ టీవీల లైసెన్స్‌ను భారత్‌లో సూపర్ ప్లాస్ట్రానిక్స్ కలిగి ఉంది. అత్యధికంగా అమ్ముడయ్యే 32 అంగుళాల టీవీల ధర రూ. 5–6 వేలు పెరగ వచ్చని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ చెప్పారు. -
ఏసీలు, ఫ్రిజ్‌లు కొనేవారికి షాక్!
న్యూఢిల్లీ: 2021-22 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ ఉత్పత్తుల్లో దిగుమతి చేసుకొనే వాడే విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీ పెంచేశారు. దిగుమతి చేసుకున్న విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరగడం వల్ల రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఎల్ఈడీ లైట్లు, మొబైల్ ఫోన్లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో కీలకంగా వాడే కంప్రెషర్‌పై 2.5 శాతం, ఎలక్ట్రిక్ మోటార్లపై 10-15 శాతం కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందడానికి విదేశీ వస్తువుల దిగుమతిపై ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని విధించిందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలకు అనుగుణంగా 40 శాతం రిఫ్రిజిరేటర్లు, 20 శాతం ఎయిర్ కండీషనర్ల స్థానికంగా ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది.(చదవండి: గృహ కొనుగోలుదారులకు శుభవార్త!) తాజాగా కస్టమ్స్ సుంకం పెంచడంతో స్వల్పంగా ఒక శాతం అంటే రూ.100 నుంచి రూ.500 మధ్య ధరలు పెరుగనున్నాయి. ఈ పెంపు అనేది ఇండస్ట్రీపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) అధ్యక్షుడు కమల్‌నంది పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్లపై 12.5 శాతం, ఏసీలపై 15 శాతం పన్ను విధించనున్నందున మొత్తం కంప్రెషర్ ధర 25-30 శాతం ఎక్కువవుతుందన్నారు. పానాసోనిక్ ఇండియా సీఈవో మనీశ్ శర్మ మాట్లాడుతూ.. కస్టమ్స్ సుంకం పెంపు ప్రభావం 0.6 శాతం ఉంటుందని చెప్పారు. రెండు పెద్ద కంపెనీలు కంప్రెషర్ తయారీకి ఉత్పాదక యూనిట్లు ప్రారంభించాయని, కానీ కరోనాతో అంతరాయం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. -
పానసోనిక్ కొత్త స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: పానసోనిక్ మరో కొత్తస్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎలుగా సిరీస్‌లో ఎలుగా రే-530 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఫేస్ అన్‌లాక్ ,ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ ఓరియోలాంటి ఫీచర్లతో తాజాగా స్మార్ట్ఫోన్నుప్రారంభించింది. ధర 8,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. బ్లూ, బ్లాక్ కలర్స్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పటికే ఆఫ్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంది. ఎలుగా రే-530 ఫీచర్లు 5.7అంగుళాల డిస్ప్లే(18: 9) 1440 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాడ్-కోర్ మీడియా టెక్ 64-బిట్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 3 జీజీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమెరీ 128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 13ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ సెల్పీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
పానాసోనిక్.. 2 ఏఐ మొబైల్
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) ఆధారిత స్మార్ట్ఫోన్లను పానాసోనిక్ గురువారం విడుదలచేసింది. ‘ఎలుగా ఎక్స్1’ పేరిట అందుబాటులోకి వచ్చిన మొబైల్ ధర రూ.22,990 కాగా, ‘ఎక్స్1 ప్రో’ ధర రూ.26,990 వద్ద నిర్ణయించినట్లు ప్రకటించింది. డ్యుయల్ 4జీ సిమ్ సదుపాయం కలిగిన ఈ స్మార్ట్ఫోన్లను సంస్థ ఫ్లాగ్షిప్ మొబైల్స్‌గా అభివర్ణించింది. -
60 శాతం అమ్మకాలు తెలుగు రాష్ట్రాల నుంచే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ కుకర్ల విక్రయాల్లో 60 శాతం వ్యాపారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నమోదవుతున్నట్లు ప్యానాసోనిక్ అప్లియెన్సెస్ వెల్లడించింది. దేశీయంగా నెలకు 7.5–8 లక్షల ఎలక్ట్రిక్ కుకర్లను విక్రయిస్తున్నామని కంపెనీ ఎండీ హిదెనోరి అసో తెలిపారు. కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌లో ఏటా వివిధ కంపెనీలు 15 లక్షల ఎలక్ట్రిక్ కుకర్లను విక్రయిస్తున్నాయి. ఇందులో మాకు 55 శాతం మేర వాటా ఉంది. ఏటా 20 శాతం వృద్ధి చెందుతున్నాం. ప్రస్తుత ఏడాది 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం 2.5–3 లక్షల యూనిట్లు అమెరికాతో సహా మొత్తం 43 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. భారత్‌లో ఎలక్ట్రిక్ కుకర్లను పూర్తి స్థాయిలో తయారు చేస్తున్న ఏకైక కంపెనీ ప్యానాసోనిక్’ అని హిదెనోరి వివరించారు. దేశంలో ఏటా సుమారు 50 లక్షల ప్రెషర్ కుకర్లు అమ్ముడవుతున్నాయి. -
కొత్త మొబైల్: లైట్ వెయిట్, బడ్జెట్ ధర
సాక్షి, ముంబై: పానసోనిక్ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. పీ సిరీస్‌లో పీ 99 పేరుతో ఈ మొబైల్నుగురువారం విడుదల చేసింది. దీని ధరను రూ .7,490గా నిర్ణయించింది. మెరుగైన డిస్ప్లే , ఫ్రంట్, రియర్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో ‘పీ 99’ ను తమ కస్టమార్లకు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ - మొబిలిటీ డివిజన్ పంకజ్ రాణా ఒక ప్రకటనలో తెలిపారు. 145గ్రా.ల బరువు తూగే ఈ స్మార్ట్‌ఫోన్ షాంపైన్ గోల్డ్, బ్లాక్, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది. పీ 99 ఫీచర్లు 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1.25 గిగాహెడ్జ్క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 28జీబీ వర్తకు విస్తరించుకునే అవకాశం 8ఎంపీ ఆటో ఫోకస్ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారీ బ్యాటరీ, బడ్జెట్ ధర: ‘పీ55 మాక్స్’
న్యూఢిల్లీ: పానసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్ పీ55 మాక్స్‌ను విడుదల చేసింది. అతిపెద్ద బ్యాటరీతో వస్తున్న ఈ డివైస్‌ను బడ్జెట్ ధరలో సోమవారం లాంచ్ చేసింది. రూ.8,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. జూలై 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ లోప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 5000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ద్వారా వాల్యూ బేస్డ్ సెగ్మెంట్లో వినియోగదారులకు నిరంతరాయ సేవలు అందుబాటులోకి తెచ్చామని పానసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్(మొబిలిటీ డివిజన్) పంకజ్ రాణా చెప్పారు. పానసోనిక్ పీ55 మాక్స్ ఫీచర్లు... 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 3 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
హైదరాబాద్‌లో వీడియోకాన్ జీఎస్టీ సమిట్
ప్రముఖ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయెన్సెస్ కంపెనీ ‘వీడియోకాన్’ తాజాగా అసోచామ్, పానాసోనిక్‌లతో కలిసి హైదరాబాద్‌లో జీఎస్టీ సదస్సును నిర్వహించింది. కన్సూమర్ ఎలక్ట్రానిక్ వర్తకుల్లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి నెలకొని ఉన్న సందేహాలను, సవాళ్లను నివృత్తి చేయడమే ఈ సమిట్ ఉద్దేశం. ఈ జీఎస్టీ సదస్సులో కమర్షియల్ ట్యాక్స్ (ఎన్ఫోర్స్మెంట్) అసిస్టెంట్ కమీషనర్లు జి.రాజేశ్ కుమార్, ఆర్.ఏడుకొండలు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీడియోకాన్ తాజా సమిట్‌లో ‘ఎSఖీఃఠిజఝ్చజీl.జీn’ అనే డిజిటల్ హెల్ప్‌లైన్‌ను కూడా ఆవిష్కరించింది. దీని ద్వారా రిటైలర్లు వారి సందేహాలను ఈ–మెయిల్ చేసి పరిష్కరించుకోవచ్చు. కాగా సంస్థ దేశవ్యాప్తంగా 200కుపైగా సదస్సులను నిర్వహించనుంది. -
పానాసోనిక్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్
ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్ న్యూఢిల్లీ: పానాసోనిక్ ఇండియా తాజాగా ‘ఎలుగా రే మ్యాక్స్’, ‘ఎలుగా రే ఎక్స్’ అనే రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటిల్లో ‘ఎలుగా రే మ్యాక్స్’ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యంకానుంది. 32 జీబీ వేరియంట్ ధర రూ.11,499గా, 64 జీబీ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. ఇక ‘ఎలుగా రే ఎక్స్’ ధర రూ.8,999గా ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే వర్చువల్ అసిస్టెంట్ అనే ‘ఎర్బో’ ఫీచర్ ఉంది. ఇది ఒకరకంగా యాపిల్ సిరి లాంటిదే. వర్చువల్ అసిస్టెంట్ అనేది ఒక సెల్ఫ్–లెర్నింగ్ టెక్నాలజీ. ఇది యూజర్‌కు ఇంటెలిజెంట్ యూసేజ్‌కు సంబంధించి తగిన సూచనలు అందిస్తుంది. కాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ‘ఎలుగా రే మ్యాక్స్’లో 5.2 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, 1.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 16 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఇక ‘ఎలుగా రే ఎక్స్’లో 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపింది. -
పానసోనిక్ ఇంటిలిజెంట్ స్మార్ట్ఫోన్లు లాంచ్
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ పానసోనిక్ మరో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. వినియోగదారులకు గొప్ప అనుభవాలు అందించే లక్ష్యంతో పానాసోనిక్ సోమవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. స్మార్ట్ నిఘా ఆధారిత ఫీచర్ అర్బో తో ఇంటిలిజెంట్ స్మార్ట్ ఫోన్లను ప్రారంభించింది. దీనికి సంబంధించిమీడియా ఆహ్వానాలను శుక్రవారం పంపించింది. అర్బో ఈజ్ హియర్ తో ఈ ఆహ్వానాలను పంపింది. ఎలుగ ఎక్స్ రే మాక్స్ , ఎలుగ రే ఎక్స్పేర్లతో వీటిని లాంచ్ చేసింది. వీటి ధరలను వరుసగా రూ. 11,499 రూ. 8,999 గా నిర్ణయించింది. కాగా ఈ నెలలోనే ఎలుగా ప్లస్ ఎక్స్, ఎలుగా ప్లస్ పేరుతో రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధరలను వరుసగా రూ.10,990, రూ. 9, 690గ ప్రకటించింది. అలాగే ఫిబ్రవరిలో మూడు టఫ్ఫ్యాడ్ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రవాణా, లాజిస్టిక్, తయారీ, ఆటోమోటివ్, రిటైల్, హెల్త్‌కేర్ రంగాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ట్యాబ్లెట్లను లాంచ్ చేసింది. ఎలుగ ఎక్స్ రే మాక్స్ 5.20 అంగుళాల డిస్ప్లే 1.4గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 1080x1920 రిజల్యూషన్ 16 మెగాపిక్సెల్ రేర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4 జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ 3000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఎలుగ రే ఎక్స్ ఫీచర్స్ 5.50 అంగుళాల డిస్ప్లే 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0, 720x1280 రిజల్యూషన్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ -
ప్యానాసోనిక్ కొత్త టఫ్ప్యాడ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ ప్యానాసోనిక్ టఫ్‌ప్యాడ్ విభాగంలో మరో 3 మోడళ్లను హైదరాబాద్ వేదికగా భారత మార్కె ట్లో మంగళవారం ప్రవేశపెట్టింది. వీటిలో రెండు 4.7 అంగుళాల మోడళ్లు కాగా, మరొకటి 10.1 అంగుళాల ట్యాబ్లెట్. ధర రూ.99,000 నుంచి ప్రారంభమై రూ.1.2 లక్షల వరకు ఉంది. అన్ని మోడళ్లు కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేసి ఇస్తారు. అన్ని కఠిన వాతావరణ పరిస్థితులకు తట్టుకునే ఈ ఉపకరణాలు రవాణా, తయారీ, వాహన, రిటైల్, ఆరోగ్య సేవల రంగాలకు ఉపయుక్తమైనవని కంపెనీ తెలిపింది. టఫ్‌ప్యాడ్ విభాగంలో 12 మోడళ్ల దాకా అందుబాటులోకి తెచ్చామని కంపెనీ సిస్టమ్, సొల్యూషన్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ విజయ్ వాధ్వాన్ తెలిపారు. జపాన్, తైవాన్ ప్లాంట్ల నుంచి భారత్‌కు దిగుమతి చేస్తున్నామన్నారు. 2016లో భారత్‌లో 10,000 యూనిట్లను విక్రయించామని టఫ్‌బుక్, టఫ్‌ప్యాడ్ విభాగం నేషనల్ బిజినెస్ హెడ్ గుంజన్ సచ్దేవ్ చెప్పారు. దేశీయంగా రగ్గ్డ్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల మార్కెట్ నాలుగేళ్లుగా 20% వృద్ధి చెందుతోందని, విలువ రూ.125 కోట్లుందని వివరించారు. యూపీ, బెంగళూరు పోలీసు శాఖ టఫ్ప్యాడ్స్ను వినియోగిస్తున్నాయని తెలిపారు. -
పానసోనిక్ డిటాచబుల్ టఫ్ బుక్ లాంచ్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు సంస్థ పానసోనిక్ ఇండియా తన కొత్త డిటాచబుల్ టప్ బుక్ ను గురువారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఫుల్లీ రగ్డ్, లైట్ వెయిట్ టఫ్ బుక్ సీఎఫ్ 20 ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. తేలికైన 10.1 అంగుళాల 2-ఇన్ -1 ఈ డిటాచబుల్ డివైస్ ధరను రూ 2,25,000 (అంచనా ధర, పన్నులు అదనం) కంపెనీ ప్రకటించింది. చమురు, గ్యాస్, రవాణా, లాజిస్టిక్స్, ఆరోగ్య, భీమా, ప్రజా భద్రత , డిఫెన్స్ సెగ్మెంట్లలోని కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించింది. 2016 ఆగస్టు నుంచి భారతదేశం లో అందుబాటులో ఉంటుందని పానసోనిక్ ఇండియా నేషనల్ బిజినెస్ గుంజన్ సచ్ దేవ్ తెలిపారు. స్పెసికేషన్స్ విండోస్ 10 ప్రో , 6వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఎం5 వీ ప్రాసెసర్, 128జీబీ ఎస్ ఎస్ డీ, 8జీబీ ర్యాం, గ్లోవ్ ఎనేబుల్డ్ టచ్ స్క్రీన్ తోపాటు నిరంతర ఉపయోగం కోసం ఆప్షనల్ బ్రిడ్జ్ బ్యాటరీ సదుపాయాన్ని కల్పించింది. మూడు సంవత్సరాల వారంటీ కూడా ఇస్తోంది. -
అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో పి 75 స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: పానసోనిక్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను గురువారం భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. అత్యధిక బ్యాటరీ పవర్ తో పాటు ఎఫర్డబుల్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ చెబుతోంది. 5000ఎంఏహెచ్ అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో రూ 5,990 ల సరసమైన ధరకే పి 75 ను లాంచ్ చేశామని బిజినెస్ హెడ్ పంకజ్ రాణా వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ సామర్ధ్యం గల మొబైల్ ను వినియోగదారుల సేవలకోసం అందుబాటులోకి తెచ్చామన్నారు. పానసోనిక్ పి 75 ఫీచర్లు ఇలా ఉన్నాయి 5-అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే 5.1 లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ 1.3 గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 1 జీబీ రాం, 1జీబీ రామ్ 32జీబీ ఎక్స్ పాండబుల్ మొమరీ, 8 జీబి ఇంటర్నల్ మొమరీ 5మెగా పిక్సెల ఫ్రంట్ కెమెరా, విత్ నైన్ బ్యూటీ మోడెస్ 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఫ్లాష్ షాంపైన్ గోల్డ్, సాండ్ బ్లాక్ కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. మరోవైపు రూ. 399 విలువగల స్క్రీన్ గార్డును ఉచితంగా అందిస్తోంది. -
భారత్‌లో ప్యానాసోనిక్ రిఫ్రిజిరేటర్ల తయారీ ప్లాంటు
ఆరు నెలల్లో మేక్ ఇన్ ఇండియా ఫోన్ ♦ రూ.6 వేలలోపు 4జీ స్మార్ట్ ఫోన్ కూడా ♦ ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న ప్యానాసోనిక్ భారత్‌లో రిఫ్రిజి రేటర్ల తయారీ ప్లాంటును ఏడాదిన్నరలో ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లను కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తోంది. రూ.200-300 కోట్ల అంచనా వ్యయంతో 6-10 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పుతామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ తెలిపారు. ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పోలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్‌తోపాటు మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాల కు ఇక్కడ తయారైన రిఫ్రిజిరేటర్లను ఎగుమతి చేస్తామని వెల్లడించారు. భారత్‌ను హబ్‌గా చేసుకుంటామని వివరించారు. మేక్ ఇన్ ఇండియా ఫోన్.. మొబైల్ ఫోన్లను సైతం కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేస్తోంది. ఆరు నెలల్లో మేక్ ఇన్ ఇండియ ఫోన్ తీసుకొస్తామని ఎండీ పేర్కొన్నారు. సొంతంగా ప్లాంటు పెట్టడమా, లేదా థర్డ్ పార్టీ కంపెనీతో చేతులు కలపడమా త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తయారీ సామర్థ్యం నెలకు 10 ల క్షల యూనిట్లు ఉంటుందన్నారు. ‘2014-15లో ఆదాయంలో మొబైల్స్ విభాగం వాటా 5 శాతం మాత్రమే. 2015-16లో ఇది 20 శాతం చేరనుంది. నెలకు 3.20 లక్షల మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్నాం. మార్చికల్లా రూ.6 వేలలోపు ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తాం’ అని వెల్లడించారు. ధరలు పెరగొచ్చు: రూపాయి పతనం కారణంగా వివిధ కంపెనీల గృహోపకరణాల ధరలు అక్టోబరు నుంచి 3-5 శాతం పెరిగే చాన్స్ ఉందని కంన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సియామా) ప్రెసిడెంట్ కూడా అయిన మనీష్ శర్మ తెలిపారు. గతేడాది పరిశ్రమ రూ.48,000 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ఈ ఏడాది రూ.52,000 కోట్లు దాటుతుందని అంచనాగా చెప్పారు. ఫైనాన్స్ కంపెనీల జీరో ఫైనాన్స్ పథకాలతో అమ్మకాలకు బూస్ట్నిస్తుందన్నారు. వ్యాపార అవకాశాలు ఉన్న దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు పరిశ్రమకు అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే మేక్ ఇన్ ఇండియా విజయవంతం అవుతుందని చెప్పారు. -
‘పీ55 నోవో’ స్మార్ట్‌ఫోన్ @ రూ. 9,290
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ పానాసోనిక్ ‘పీ55 నోవో’ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.9,290. ఈ ఫోన్లో 5.3 అంగుళాల హెచ్డీ తెర, 1.4 గిగాహెర్ట్జ్ఆక్టాకోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఆర్ సెన్సింగ్ (ఇన్ఫ్రారెడ్ ఆధారిత టీవీ, సెట్-టాప్ బాక్స్, ఏసీ వంటి ఉపకరణాలను ఆపరేట్ చేయొచ్చు) వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. -
ఏపీలో పెట్టుబడులు పెట్టండి: చంద్రబాబు
హైదరాబాద్ : జపాన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ....పానాసోనిక్ కార్పొరేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలోని పారిశ్రామిక విధానం, అందుబాటులో ఉన్న వనరులపై ఆయన ఈ సందర్భంగా ప్రజంటేషన్ ఇచ్చారు. 25 ఏళ్ల తర్వాత భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. జపాన్‌లో మంచి పారిశ్రామిక సంబంధాలు పెట్టుకోవాలన్నది తమ ఆలోచనగా ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 15 పోర్టులను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగంలోనూ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ ముందుకు రావాలని కోరుతున్నామన్నారు. ఏడు రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేలా పాలసీని సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. భారత్, జపాన్ మధ్య మంచి సంబంధాలున్నాయని పానాసోనిక్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత విస్తరిస్తామని వారు పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా జపాన్ అంటే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, ఏపీలో ఇప్పటికే కొన్ని జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని పానాసోనిక్ కార్పోరేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు జపాన్ పర్యటన వివరాలను హైదరాబాద్ లో ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మంగళవారం ప్రకటన జారీ చేసింది. -
ప్యానాసానిక్ ‘ఎల్యూగా యు’@ రూ.18,990
న్యూఢిల్లీ: ప్యానాసానిక్ కంపెనీ ఎల్యూగా సిరీస్ స్మార్ట్ఫోన్లను బుధవారం భారత్ మార్కెట్లోకి ఆవిష్కరించింది. వచ్చే నెల మొదటివారం నుంచి ‘ఎల్యూగా యు’ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభిస్తామని ప్యానాసానిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ చెప్పారు. ధర రూ.18,990 అని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్లో క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ డిస్ప్లే, 16 జీబీ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 13 మెగాపిక్సెల్ రియర్-2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు. 15 స్మార్ట్ఫోన్లు: రానున్న కొన్ని నెలల్లో 15కు పైగా కొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తేనున్నామని మనీష్ శర్మ తెలిపారు. భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమ వాటా ప్రస్తుతం 3 శాతమని, ఏడాదిలో దీనిని 5 శాతానికి పెంచుకోవడం లక్ష్యంగా 15కు పైగా స్మార్ట్ఫోన్లను, 8 ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తేనున్నామని పేర్కొన్నారు. అయితే స్మార్ట్ఫోన్లపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. భారత్ కేంద్రంగా తమ మొబైల్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పారు. సరైన ధరలకు నాణ్యత గల మొబైళ్లనందించే తమలాంటి కంపెనీలకు భారత్‌లో అపార అవకాశాలున్నాయన్నారు. -
పానసోనిక్ పీ31
స్మార్ట్‌ఫోన్ కోసం మరీ 20, 30 వేల రూపాయలు ఖర్చు చేయడం దండగనుకునే వారికి జపనీస్ కంపెనీ పానసోనిక్ అందుబాటులోకి తెచ్చిన తాజా ఫోన్ ఈ పీ31. అయిదు అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ డిస్ప్లే, సంజ్ఞలతోనూ పనిచేసే అత్యాధునిక టెక్నాలజీల కలబోతగా ఉండే ఈ ఫోన్ ఖరీదు కేవలం రూ.11,990 మాత్రమే. ప్లే లైఫ్ ఫీచర్ గెస్చర్స్ కంట్రోల్, పాటల ఆర్గనైజేషన్ కోసం, మల్టీటాస్కింగ్, బ్యాటరీ పొదుపు కోసం పనికొస్తుంది. మధ్యమశ్రేణి ఫోన్ అయినప్పటికీ కనెక్టివిటీకి సంబంధించి త్రీజీతోపాటు వైఫై, ఏ-జీపీఎస్, వైఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ వంటి ఆప్షన్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. రెండు మైక్రోసిమ్ కార్డులను మాత్రమే సపోర్ట్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన అంశం. ప్రాసెసర్: 1.3 గిగాహెర్ట్జ్, క్వాడ్‌కోర్ ప్రధాన కెమెరా: 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా: వీజీయే ఆపరేటింగ్ సిస్టమ్: 4.2 జెల్లీబీన్ ర్యామ్: 1 జీబీ మెమరీ: 4 జీబీ ఇంటర్నల్ (మైక్రోఎస్డీ కార్డుతో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు) బ్యాటరీ: 2000 ఎంఏహెచ్ ( 9 గంటల టాక్‌టైమ్, 600 గంటల స్టాండ్‌బై) -
ప్యానాసోనిక్ వియరా టీవీలపై వినూత్నమైన ఆఫర్లు
హైదరాబాద్: పండుగల సీజన్ సందర్భంగా రాష్ట్ర వినియోగదారులకు వియరా టీవీలపై వినూత్న ఆఫర్లను అందిస్తున్నామని పానాసానిక్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఫ్లాట్ప్యానెల్ సెగ్మెంట్లో ప్రస్తుతం 9 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను 15 శాతానికి పెంచుకోవడం లక్ష్యంగా అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన వియరా టీవీలను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ రీజనల్ మేనేజర్ ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. కేవలం రూ.1,947 మాత్రమే చెల్లించి వియరా టీవీలను కొనుగోలు చేయవచ్చని మిగిలిన మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చని తెలిపారు. 39 అంగుళాల ఎల్ఈడీ టీవీ కొనుగోలుపై రూ. 5,990 విలువ గల స్పీకర్‌ను, 29 అంగుళాల ఎల్ఈడీ టీవీ కొనుగోలుపై రూ.1,990 విలువైన బెనెటన్ బ్యాగ్‌ను ఉచితంగా ఇస్తామని, మూడేళ్ల వారంటీని కూడా ఆఫర్ చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్, తిరుపతిల్లోని తమ పానాసానిక్ బ్రాండ్ షాపుల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వినియోగదారులను అలరించే ఆధునిక ఫీచర్లతో 22 నుంచి 60 అంగుళాల వియరా టీవీలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటి ధరలు రూ. 14,900 నుంచి రూ.1,95,000 రేంజ్లో ఉన్నాయని వివరించారు.