పానసోనిక్ డిటాచబుల్ టఫ్ బుక్ లాంచ్ | Panasonic launches new detachable 'Toughbook' in India | Sakshi
Sakshi News home page

పానసోనిక్ డిటాచబుల్ టఫ్ బుక్ లాంచ్

Published Thu, Jun 23 2016 3:22 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

పానసోనిక్  డిటాచబుల్ టఫ్ బుక్ లాంచ్

పానసోనిక్ డిటాచబుల్ టఫ్ బుక్ లాంచ్

న్యూఢిల్లీ:  ప్రముఖ  ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు సంస్థ  పానసోనిక్ ఇండియా  తన కొత్త  డిటాచబుల్ టప్‌ బుక్‌  ను గురువారం   భారత మార్కెట్లో లాంచ్ చేసింది.  ఫుల్లీ రగ్డ్, లైట్ వెయిట్  టఫ్ బుక్ సీఎఫ్ 20 ని  మార్కెట్లో ప్రవేశపెట్టింది. తేలికైన  10.1  అంగుళాల 2-ఇన్ -1  ఈ డిటాచబుల్  డివైస్ ధరను  రూ 2,25,000 (అంచనా ధర, పన్నులు  అదనం)  కంపెనీ ప్రకటించింది. చమురు, గ్యాస్, రవాణా,  లాజిస్టిక్స్, ఆరోగ్య, భీమా, ప్రజా భద్రత ,  డిఫెన్స్  సెగ్మెంట్లలోని కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించింది. 2016  ఆగస్టు నుంచి   భారతదేశం లో అందుబాటులో ఉంటుందని  పానసోనిక్ ఇండియా నేషనల్ బిజినెస్ గుంజన్ సచ్ దేవ్ తెలిపారు.  
స్పెసికేషన్స్   
విండోస్ 10 ప్రో ,   
6వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఎం5 వీ ప్రాసెసర్,
128జీబీ  ఎస్ ఎస్ డీ,   8జీబీ ర్యాం,  
గ్లోవ్ ఎనేబుల్డ్  టచ్ స్క్రీన్ తోపాటు  నిరంతర ఉపయోగం కోసం  ఆప్షనల్ బ్రిడ్జ్ బ్యాటరీ సదుపాయాన్ని కల్పించింది.  మూడు సంవత్సరాల వారంటీ కూడా ఇస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement