వైర్డు కమ్యూనికేషన్ టెక్నాలజీ ‘నెస్సుమ్ వైర్’ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నాలుగు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు పానాసోనిక్, టీ-హబ్ తెలిపాయి. ఇటీవల ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో భాగంగా టీ-హబ్‌తో కలిసి పానాసోనిక్ ఈ స్టార్టప్‌లను ఫైనల్ చేసినట్లు ప్రకటించింది. ఈ నాలుగు స్టార్టప్‌ల్లో అక్యా కంట్రోల్ సిస్టమ్స్, గోవిద్యుత్ మొబిలిటీ, ప్యూర్‌లాజిక్ ల్యాబ్స్ ఇండియా, ఎక్సీడ్‌ఐవోలు ఉన్నాయని పేర్కొంది.
ఇప్పటికే ఉన్న వైర్డ్ డేటా కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరిచేలా చేసే నెస్సమ్ వైర్ టెక్నాలజీని విస్తరించాడానికి ఈ స్టార్టప్ లు పానాసోనిక్, టీ-హబ్‌తో కలిసి పనిచేస్తాయి. డేటా కమ్యూనికేషన్ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి మారుమూల ప్రాంతాల్లో సాంకేతిక సేవలు అందించేందుకు ఈ సంస్థలు పని చేయనున్నాయి.
ఈ స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు పానాసోనిక్, టీ-హబ్‌లు సెప్టెంబర్ 2024లో ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రారంభించాయి. నెస్సమ్ టెక్నాలజీని ప్రభావితం చేయడానికి సరైన స్టార్టప్‌లను అన్వేషించాయి. అందుకోసం టీ-హబ్‌కు దరఖాస్తు చేసుకున్న 197 స్టార్టప్‌ల పనితీరు, వాటి భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించింది. తర్వాత డెమో కోసం ఎనిమిది స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్ చేశారు. అందులో నాలుగు కంపెనీలను చివరిగా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన కంపెనీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
అక్యా కంట్రోల్ సిస్టమ్స్: ఇది ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్‌లో ప్రత్యేకత కలిగిన క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలో ముందంజలో ఉంది.
గోవిద్యుత్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్: ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీని అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.
ప్యూర్‌లాజిక్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: వినూత్న పరిష్కారాల ద్వారా గాలి నాణ్యతను పర్యవేక్షిస్తుంది.
ఎక్సీడ్ ఐఓ: ఇది తయారీ, ఎనర్జీ రంగాలకు డిజైన్‌లను అందిస్తోంది.
ఇదీ చదవండి: విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్
షార్ట్‌లిస్ట్ అయిన స్టార్టప్‌లను అభినందిస్తూ పానాసోనిక్ హోల్డింగ్స్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీస్ హెడ్ మిస్టర్ సైజో హిరోషి మాట్లాడారు. ‘పానాసోనిక్ మిషన్‌కు అనుగుణంగా నెస్సమ్ వైర్ టెక్నాలజీని ఉపయోగించి మా ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌ల కోసం వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి స్టార్టప్‌లు జపాన్‌లోని భారత బృందంతో భాగస్వామ్యం అవుతాయి. ఈ కంపెనీల సాయంతో ప్రపంచ మార్కెట్‌లకు అనుకూలంగా పరిష్కారాలను అందించడానికి ఆసక్తిగా ఉన్నాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment