thub
-
క్లీన్ టెక్నాలజీ కేరాఫ్ టీహబ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌కు మణిహారం టీహబ్ ఇప్పుడు క్లీన్ టెక్నాలజీ రంగంలోని స్టార్టప్ కంపెనీలను ఆకర్షిస్తోంది. కెనడాకు చెందిన ప్రతిష్టాత్మక కెనడా డిజిటల్ మీడియా నెట్‌వర్క్‌తో(పబ్లిక్ప్రైవేట్ ఇన్నోవేషన్ హబ్)తో టీహబ్ గతంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడు సత్ఫలితాన్నిస్తోంది. కెనడాలో బయో టెక్నాలజీ, క్లీన్ టెక్నాలజీ, బిజినెస్టు బిజినెస్ తదితర రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న అంకుర పరిశ్రమలను నగరానికి ఆహ్వానించేందుకు కెనడియన్ డిజిటల్ మీడియా నెట్వర్క్ (సీడీఎంఎన్)కు అనుబంధంగా పనిచేస్తున్న 26 సంస్థలను టీహబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రిడ్జి ప్రోగ్రాంకు ఎంపిక చేసినట్లు టీహబ్ ప్రతినిధులు తెలిపారు. ఆయా రంగాల్లో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తుల సాధనే లక్ష్యంగా పనిచేసే సంస్థలకు భారత్‌లో మార్కెట్ అవకాశాలను చూపడంతోపాటు పలు పరిశ్రమలకు చేయూతనందించేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీహబ్ వర్గాలు పేర్కొన్నాయి. కెనడా నుంచి మెరుగైన సాంకేతికతను పొందడంతోపాటు ఇక్కడి చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం, నూతన అంకుర పరిశ్రమలకు జీవం పోయడమే ధ్యేయమన్నారు. ప్రధానంగా నిలకడగల అభివృద్ధి సాధన,హెల్త్‌కేర్ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. నూతన అంకుర పరిశ్రమల రాకతో ఉద్యోగవకాశాలు పెరగడంతోపాటు.. కెనడా, భారత దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. కెనడాకు చెందిన కంపెనీలు టీహబ్ నుంచి కార్యకలాపాలు సాగించేందుకు కూడా అనువైన వాతావరణం ఏర్పాటు చేశామన్నారు. (చదవండి: ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’) -
టీ హబ్‌కి ఎంపీలు ఫిదా.. మంత్రి కేటీఆర్‌ని మెచ్చుకున్న ఫ్రైర్‌బ్రాండ్
THubHyd: స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ హబ్‌ని పార్లమెంట్ ఐటీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటు ఐటీ స్టాండింగ్ కమిటీ ఇటీవల టీ ఐటీ హబ్‌ని సందర్శించారు. ఇక్కడ స్టార్టప్‌లకు అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వపరమైన ప్రోత్సహాకాలను వారు పరిశీలించారు. మంత్రి కేటీఆర్‌కు ప్రశంసలు తెలంగాణ ఐటీ హబ్ పనితీరును పశ్చిమ బెంగాల్‌కి చెందిన టీఎంసీ ఎంపీ, ఫైర్‌బ్రాండ్ మహువా మెయిత్రా మెచ్చుకున్నారు. 70 వేల చదరపు అడుగుల ఇంక్యుబేటర్ సెంటర్‌ని త్వరలోనే 3.50 లక్షల అడుగుల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. ఒక ఐడియాతో తెలంగాణ ఐటీ హబ్‌లోకి వెళితే ప్రొడక్టుతో బయటకు రావొచ్చంటూ ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు వండర్ఫుల్ జాబ్ ఆల్ అరౌండ్ కేటీఆర్టీఆర్ఎస్ అంటూ ప్రశంసించారు. — KTR (@KTRTRS) September 8, 2021 థ్యాంక్యూ మహువా మోయిత్రా ప్రశంసల ట్వీట్‌కి మంత్రి కేటీఆర్ స్పందించారు. థ్యాంక్యూ మహువా జీ అంటూ ట్వీట్ చేశారు. తమిళనాడుకి అవసరం మరోవైపు తమిళనాడుకు చెందిన కార్తి చిదంబరం సైతం ఐటీ హబ్‌ని మెచ్చుకున్నారు. ఇటువంటి ఐటీ హబ్ తమిళనాడుకు అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. టీ హబ్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ అండ్ ఎఫెక్టివ్ ఇన్షియేటివ్ అంటూ ట్వీట్ చేశారు. చదవండి : ఆన్‌లైన్‌లోకి ఆటో మొబైల్.. భారీగా నియామకాలు! -
టీహబ్‌కు నేటితో ఏడాది
సాక్షి, హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీహబ్‌కు నేటికి ఏడాది పూర్తయింది. ఏడాది కింద ఇదే రోజున గవర్నర్ నరసింహన్, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా చేతుల మీదుగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో రూ.40 కోట్లతో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదంతస్థుల భవనాన్ని ఏర్పాటు చేశారు. ఐఎస్ బీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్ వర్సిటీల భాగస్వామ్యంతో ఏర్పడ్డ ఈ టీహబ్‌లో 150 పైగా స్టార్టప్‌లు కొనసాగుతున్నాయి. ప్రభు త్వం రెండో దశ హబ్‌ను రూ.100 కోట్లతో రాయదుర్గంలో ఏర్పాటు చేయనుంది. -
టీహబ్‌ను సందర్శించిన అమెరికా రాయబారి
రాయదుర్గం: గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ ప్రాంగణంలోని టీ హబ్‌ను భారతదేశంలోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా టీ హబ్‌లో కల్పిస్తున్న సౌకర్యాలు, స్టార్టప్ సంస్థల పనితీరును పరిశీలించారు. అనంతరం సింక్రోమ్స్ అనే స్టార్టప్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. టీ హబ్‌లో ఇకోసిస్టమ్ అమలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, స్టార్టప్ సంస్థలకు అంది స్తున్న అన్ని రకాల సహకారంపై అడిగి తెలుసుకున్నారు. టీహబ్‌లో అందిస్తున్న సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయిలో కావాల్సిన సలహాలు, సూచనలు అందించేందుకు అమెరికా సిద్దంగా ఉందని హమీ ఇచ్చారు. స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా సహకరిస్తామన్నారు. అరుణ్‌వర్మ మాట్లాడుతూ సింక్రోమ్స్ పేరిట హోటల్, టూరిజమ్ రంగాల్లో వినియోగదారులు అందించే సేవలను మరింత సులభతరం చేసేందుకు స్టార్టప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. స్టార్టప్ నిష్ణాతులు, మెంటర్స్ అందిస్తున్న సేవలు, విలువైన సలహాలు, సూచనలే తమ సంస్థ ఎదుగుదలకు కారణమన్నారు. టీహబ్ సహకారంతో అమెరికా రాయబారితో మాట్లాడే అవకాశం కలిగించడం నూతన పరిణామమన్నారు. కార్యక్రమంలో టీహబ్, అమెరికా రాయబార కార్యాలయ అధికారులు, స్టార్టప్ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.