టీహబ్‌ను సందర్శించిన అమెరికా రాయబారి | the American ambassador richard varma was visited thub | Sakshi
Sakshi News home page

టీహబ్‌ను సందర్శించిన అమెరికా రాయబారి

Published Wed, Oct 5 2016 10:59 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులతో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ - Sakshi

స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులతో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ

రాయదుర్గం: గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలోని టీ హబ్‌ను భారతదేశంలోని అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా టీ హబ్‌లో కల్పిస్తున్న సౌకర్యాలు, స్టార్టప్‌ సంస్థల పనితీరును పరిశీలించారు. అనంతరం సింక్రోమ్స్‌ అనే స్టార్టప్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. టీ హబ్‌లో ఇకోసిస్టమ్‌ అమలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, స్టార్టప్‌ సంస్థలకు అంది స్తున్న అన్ని రకాల సహకారంపై అడిగి తెలుసుకున్నారు.

టీహబ్‌లో అందిస్తున్న సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయిలో కావాల్సిన సలహాలు, సూచనలు అందించేందుకు అమెరికా సిద్దంగా ఉందని హమీ ఇచ్చారు. స్టార్టప్‌ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా సహకరిస్తామన్నారు. అరుణ్‌వర్మ మాట్లాడుతూ సింక్రోమ్స్‌ పేరిట హోటల్, టూరిజమ్‌ రంగాల్లో వినియోగదారులు అందించే సేవలను మరింత సులభతరం చేసేందుకు స్టార్టప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.

స్టార్టప్‌ నిష్ణాతులు, మెంటర్స్‌ అందిస్తున్న సేవలు, విలువైన సలహాలు, సూచనలే తమ సంస్థ ఎదుగుదలకు కారణమన్నారు. టీహబ్‌ సహకారంతో అమెరికా రాయబారితో మాట్లాడే అవకాశం కలిగించడం నూతన పరిణామమన్నారు. కార్యక్రమంలో టీహబ్, అమెరికా రాయబార కార్యాలయ అధికారులు, స్టార్టప్‌ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.



 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement