సాక్షి, హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీహబ్‌కు నేటికి ఏడాది పూర్తయింది. ఏడాది కింద ఇదే రోజున గవర్నర్ నరసింహన్, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా చేతుల మీదుగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో రూ.40 కోట్లతో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదంతస్థుల భవనాన్ని ఏర్పాటు చేశారు. ఐఎస్ బీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్ వర్సిటీల భాగస్వామ్యంతో ఏర్పడ్డ ఈ టీహబ్‌లో 150 పైగా స్టార్టప్‌లు కొనసాగుతున్నాయి. ప్రభు త్వం రెండో దశ హబ్‌ను రూ.100 కోట్లతో రాయదుర్గంలో ఏర్పాటు చేయనుంది.