
ఢిల్లీ : దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా. ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు.గొప్ప మహోన్నత వ్యక్తి.మానవతా మూర్తి.సమాజ సేవకుడు. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. తన లక్షల కోట్ల ఆస్తుల్లో ఎవరికి ఎంత చేరాలో మరణానికి ముందే ఆయన వీలునామా రూపంలో సూచించారు. తాజాగా ఓ రహస్య వ్యక్తికి రూ.500 కోట్లు ఇచ్చేలా వీలునామా రాసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. రతన్ టాటా తన వీలునామాలో ఇప్పటివరకు ఎవరికి ఎంత రాసిచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గతేడాది అక్టోబర్ 9న రతన్ టాటా మరణించారు. మరణానికి ముందే తన ఆస్తిలో ఎవరికి ఎంత చెందాలనేది వివరంగా తన వీలునామాలో రాశారు.రతన్ టాటా రాసిన రూ.10,000 కోట్ల వీలునామాలో తన పెంపుడు జర్మన్ షెపర్డ్ శునకం ‘టిటో’ను చేర్చారు. ఈ శునకానికి అపరిమిత సంరక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించినట్లు సమాచారం. టాటాతో మూడు దశాబ్ధాలుగా ఉంటున్న పనిమనిషి సుబ్బయ్యకు సంబంధించిన నిబంధనలను కూడా వీలునామాలో చేర్చారు.
తాజాగా,తన ఆస్తిలో మరో రూ.500కోట్లు టాటా కుటుంబానికి, సన్నిహితులకు ఏమాత్రం పరిచయం లేని మోహిని మోహన్ దత్తాకు రూ.500కోట్లు రాసిచ్చారు. మోహిని మోహన్ దత్తా ఎవరా? అని ఆరా తీస్తే.. వ్యాపార వ్యవహారాల్లో రతన్ టాటాకు చేదోడు వాదోడుగా ఉన్నట్లు సమాచారం.
మోహినీ మోహన్ దత్తా ఎవరు?
జంషెడ్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్తే మోహిని మోహన్ దత్తా. స్టాలియన్ అనే సంస్థ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. స్టాలియన్‌లో మోహినీ మోహన్ దత్తాకు 80శాతం, టాటా సర్వీసెస్‌కు 20 శాతం వాటా ఉంది. ఆ తర్వాత స్టాలియన్ సంస్థను టాటాలో విలీనం చేశారు మోహన్ దత్తా.
మోహన్ దత్త రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో టాటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను 24 ఏళ్ల వయస్సులో ఉండగా.. జంషెడ్‌పూర్‌లోని డీలర్స్ హాస్టల్‌లో తొలిసారి రతన్ టాటాను కలిశాను. అప్పటి నుంచి ఆయనతో పరిచయం కొనసాగుతూ వచ్చింది. నన్ను తన ఇంటి కుటుంబ సభ్యుడిలానే చూసుకునేవారని గుర్తు చేసుకున్నారు.
ఫార్చ్యూన్‌లో ఒక నివేదిక ప్రకారం.. దత్తా కుమార్తె సైతం టాటాగ్రూప్‌తో కలిసి పనిచేశారు. మొదట 2015 వరకు తాజ్ హోటల్స్‌లో, 2024 వరకు టాటా ట్రస్ట్స్‌లో పనిచేసినట్లు పేర్కొంది.
కాగా, రతన్ టాటా తన వీలునామా ప్రకారం.. మోహినీ మోహన్ దత్తాకు రూ.500కోట్లు చెందాలంటే న్యాయ స్థానం ధృవీకరించాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ భారీ మొత్తం దత్తాకు అందనుంది. ఇందుకోసం సుమారు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment