testament
-
వీలునామా రాయడం మరువకుమా..!
‘వీలునామా రాయండి‘ అని ఎవరైనా అంటే మనస్సు చివుక్కుమంటుంది. కానీ సకాలంలో వీలునామా రాయకపోతే కుటుంబసభ్యులు చిక్కుల్లో పడతారు.. ఇబ్బందుల పారవుతారు. తగువులాడుకుంటారు.. కోర్టుకు వెళ్తారు.. మనశ్శాంతి కరువవుతుంది. బంధుత్వం మరుగునపడుతుంది. అప్పుడప్పుడు ఆస్తి అన్యాక్రాంతం కూడా అవుతుంది. అందుకే వీలునామా రాయాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వీలునామా ద్వారా వచ్చిన ఆస్తి మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు .. తెల్లకాగితం మీద స్పష్టంగా మీ మాతృభాషలో రాయవచ్చు. భాష ముఖ్యం. భావం మరీ ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనస్సు స్థిరంగా ఉన్నప్పుడే రాయాలి స్వంతంగానే ఆలోచించినట్లు, ఎవరి ప్రోద్బలం లేదని రాయాలి చేతివ్రాత ఎవరిదయినా ఫరవాలేదు. తాను సంపాదించిన ఆస్తిని లేదా తనకు ఇదివరకు సంక్రమించిన ఆస్తినైనా వీలునామా ద్వారా ఇవ్వవచ్చు. ఆస్తిని స్థిరాస్తిగా, చరాస్తిగా విభజించాలి. స్థిరాస్తి విషయంలో జాబితా చూసుకుని .. ప్రతి ఆస్తి పూర్తి వివరాలు రాయాలి. సర్వే నంబరు, ఇంటి నంబరు, హద్దులు, కొలతలు,కొన్న డాక్యుమెంటు వివరాలు,రిజి్రస్టేషన్ వివరాలు.. ఇలా అన్నీ పొందుపర్చాలి. చరాస్తుల జాబితా తయారు చేసి వివరంగా ఎవరికి ఏది చెందాలనుకుంటున్నారో రాయాలి. గోప్యత ఉండకూడదు. స్పష్టత ముఖ్యం. లబ్ధిదారుల పేర్లు, వివరాలు రాయాలి. ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ అన్నింటికీ ఆధారం. కార్డులో ఉన్నట్లే వివరాలు రాయాలి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. కానీ వీలుంటే చేయించడం మంచిది. లబ్ధిదారులు సాక్షి సంతకాలు చేయకూడదు. లబ్ధిదారులు ఏ వయస్సు వారైనా సరే సాక్షిదార్లని మాత్రం 21 సం. దాటిన వారినే ఎంచుకోవాలి. లబ్ధిదారులు మైనర్ అయితే సంరక్షకులను నియమించాలి. ఇలా ఎన్నో జాగ్రత్తలు, అవసరం అయితే వృత్తి నిపుణుల సలహా తీసుకోండి. ఇక వీలునామాతో ప్రయోజనాలు ఎన్నో.. వీలునామా రాసేందుకు రూపాయి ఖర్చు లేదు. ఇల్లు కదలక్కర్లేదు. ఆస్తి సజావుగా చేతులు మారుతుంది. సంక్రమించిన ఆస్తి మీద ఎలాంటి పన్ను భారం ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఉంటుంది. కలహాలకు తావుండదు. రాసిన వ్యక్తికి ఎంతో విలువైన మనశ్శాంతి లభిస్తుంది. - కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
ఆన్లైన్లో వీలునామా
సాక్షి, పెద్దపల్లి: వీలునామా ఒక వ్యక్తి తదనంతర ఆస్తిపాస్తులను వేరొకరికి ఇవ్వడానికి వీలు కల్పించే పత్రం. వ్యక్తి మరణించిన తర్వాత ఆయన పేరిట ఉన్న ఆస్తులు, నగదు కోసం కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సహజం. కోర్టు కేసులూ మామూలే. కాస్తముందు చూపుతో ఆలోచించి వీలునామా రాస్తే ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. వీలునామా రాయడానికి ప్రత్యేక పద్ధతి ఉంటుంది. కేవలం తనకు నచ్చిన విధంగా వీలునామా రాస్తే సరిపోదు. దీనిని రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ చేయాలి. అప్పుడే కోర్టుతో సహ అన్ని చోట్ల చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ వీలునామాను ఆన్లైన్లో తేలిగ్గా రాసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. తర్వాత దాన్ని రిజిస్టర్ చేయడం వంటి బాధ్యతలు చేపడుతున్నాయి. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ మినహ వీలునామాకు రూ.15వేల వరకు ఖర్చు అవుతుండగా ఆన్లైన్లో రూ.4 నుంచి రూ.5వేలు ఖర్చు అవడం గమనార్హం. నిజప్రతిలోనూ సవరణలు మన చేతికొచ్చిన వీలునామా నిజప్రతిలో కూడా ఏమైనా సవరణలు అవసరమైతే సరి చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత రుసుము చెల్లించాలి. దీంతోపాటు అవసరమైన వారికి వీలునామాను రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను ఈ సంస్థలు తీసుకుంటాయి. ఇ–విల్ సౌకర్యం.. ఎస్బీఐకు చెందిన ఎస్బీఐ క్యాబ్ ట్రస్టీ కంపెనీ ఆన్లైన్ వీలునామా అందుబాటులోకి తేగా.. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్టక్చర్, వార్మెండ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటర్స్ (ముంబై) సంయుక్తంగా ఈ సేవలు అందిస్తున్నాయి. హెచ్ఎఫ్సీ సెక్యూరిటీస్ సంస్థ సైతం లీగల్ జినీ అనే సంస్థతో కలిసి ఈ సేవలను అందిస్తుంది. 5దశల్లో పూర్తి.. – సంబంధిత వెబ్సైట్లకు వెళ్లి వివరాలను నమోదు చేసుకున్న పక్షంలో ఒక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ లభిస్తాయి. వీటి సహాయంతో వీలునామా రాసుకోవచ్చు. – అక్కడి నుంచే నెట్‌బ్యాంకింగ్‌కు వెళ్లి సదరు కంపెనీలు నిర్దేశించిన రుసుము చెల్లించాలి. – ఆ తర్వాత కుటుంబ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. – ఆపైన తదనంతరం మన ఆస్తులు, నగదును ఎవరికి ఎంతమేర బదలాయించాలో తెలుపుతూ సంబంధిత వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి. – ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మనం నమోదు చేసిన వివరాలన్నీ కంపెనీ లీగల్ నిపుణుల వద్దకు చేరుతాయి. వారు మనం ఇచ్చిన వివరాల ఆధారంగా వీలునామా రాస్తారు. దాని చిత్తు ప్రతిని మనకు ఈ–మెయిల్ చేస్తారు. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైనచో వాటిని తిరిగి కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సవరణలు పూర్తయిన తర్వాత నిజప్రతి వీలునామా డాక్యుమెంట్‌ను మన ఈ–మెయిల్‌కు లేదా మనం ఇచ్చిన చిరునామాకు 90రోజుల్లో పంపిస్తారు. -
జెరెమి బెంథాం.. ప్రజెంట్ సార్..
ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ లండన్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.. ఇలాంటి ముఖ్యమైన మీటింగ్‌లకు ఎవరు అటెండ్ అయినా.. కాకున్నా ‘ఈయన’ తప్పనిసరిగా హాజరవుతాడు. ఫొటోలో ఉన్నవాళ్లలో కాస్త తేడాగా కనిపిస్తున్నాడే.. ఆ ఆయనే.. టోపీ పెట్టుకుని.. సరిగ్గా గుర్తుపట్టేశారే.. మనోడు కాస్త ఓల్డ్ ఫ్యాషన్డ్ లెండి.. అందుకే అప్పటి కాలం దుస్తులు.. అయితే.. మీటింగ్‌కు ఠంచనుగా వస్తాడన్న మాటే గానీ.. ఒక్క ముక్క మాట్లాడడు.. ఎవరేమన్నా బదులివ్వడు.. ముఖ్యమైన నిర్ణయాలపై జరిగే ఓటింగ్‌లోనూ పాల్గొనడు.. ఎందుకంటారా? ఎందుకంటే.. మనోడు బతికిలేడు కాబట్టి.. చచ్చి ఇప్పటికే 186 ఏళ్లు గడిచిపోయాయి కాబట్టి.. జెరెమి బెంథాం.. 18వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్త, సామాజిక సంస్కరణల ఉద్యమకారుడు.. అప్పట్లో ఈయనకు చాలా పేరుండేది. భావప్రకటన హక్కు, వ్యక్తిగత, ఆర్థిక స్వాతంత్య్రం, మహిళలకు సమాన హక్కులు, బానిసత్వం రద్దు ఇలా చాలా వాటిపై తన గళాన్ని గట్టిగా వినిపించడమే కాకుండా.. వాటి కోసం పోరాడేవాడు. అంతేనా.. వన్యప్రాణులకు హక్కులుంటాయని వాదించిన తొలితరం ఉద్యమకారుల్లో జెరెమి ఒకడు. మేధావిగా కీర్తి గడించాడు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. 1832లో మరణించాడు. అయితే.. చనిపోయే ముందు అతడో చిత్రమైన వీలునామా రాశాడు.. ఏమిటా వీలునామా? జెరెమి నాస్తికుడు.. పునర్జన్మలు వంటివి నమ్మడు. దీంతో ఖననం చేయొద్దని చెప్పేశాడు. తన మృతదేహం కూడా సమాజానికి ఉపయోగపడాలని భావించి.. చనిపోయిన తర్వాత దాన్ని పరిశోధనల నిమిత్తం వాడుకోవచ్చని చెప్పాడు. అయితే.. తన శరీరాన్ని కోశాక.. అందులోని అస్థిపంజరాన్ని తీసి.. దానికి తానెప్పుడూ ధరించే దుస్తులు వేసి.. తాను కూర్చునే కుర్చీలోనే కూర్చోబెట్టాలని కోరా డు. తన తలను మాత్రం ప్రత్యేక రసాయనాలతో సంరక్షించి.. దానికి తగిలించాలని చెప్పాడు. అయితే.. ఆ సందర్భంగా జరిగిన కొన్ని తప్పిదాల వల్ల దాన్ని సరిగా సంరక్షించడం వీలు కాలేదు. దీంతో మైనంతో అతడి తలను తయారుచేసి పెట్టారు. అదెలా ఉన్నా.. ఎండుగడ్డితో నింపిన ఆ బొమ్మలో ఉన్న అస్థిపంజరం మాత్రం అప్పటి జెరెమి బెంథాందే కావడం గమనార్హం. స్టోర్ రూమ్‌లో ఉన్న తల ఇంతటితో మనోడి వీలునామా ఆగిందా లేదే.. ఇంకా ఉంది.. అదేంటంటే.. తన మిత్రులు, శిష్యులు నిర్వహించే ముఖ్యమైన పార్టీలు, సమావేశాలకు తనను కూడా తీసుకెళ్లాలని షరతు పెట్టాడు. దీంతో కాలేజీలో జరిగే ప్రతి సమావేశానికి ‘అతడు’ హాజరవుతున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే.. కాలేజీ వాళ్లు దీన్ని ఖండిస్తున్నారు. ‘యూనివర్సిటీ కాలేజ్ లండన్ 100, 150వ వార్షికోత్సవాలప్పుడు జరిగిన ముఖ్యమైన కౌన్సిల్ సమావేశాలకు మాత్రమే అతడు ‘వచ్చాడు’. చివరి సారిగా 2013లో వర్సిటీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి రిటైర్మెంట్ సందర్భంగా జరిగిన భేటీకి హాజరయ్యాడు’ అని వర్సిటీ ప్రతినిధి తెలిపారు. మిగతా టైములో జెరెమి కాలేజ్‌లో ఉన్న ఓ చెక్క బీరువాలో ఉంటాడు. ముఖ్యమైన భేటీ ఉంటే.. కాలేజీ సిబ్బంది వచ్చి అతడిని తీసుకెళ్తారు. ఆ మధ్య వరకూ అతడి ఒరిజినల్ తల అతడి కాళ్ల వద్దే ఉండేది. అయితే.. కాలేజీలోని పెంకి కుర్రాళ్లు.. దాన్ని దొంగిలించి.. తిరిగి ఇవ్వడానికి డబ్బులివ్వాలంటూ వర్సిటీ వాళ్లనే బెదిరించేసరికి.. జెరెమి తలను జాగ్రత్తగా స్టోర్ రూంలో దాచిపెట్టారట. ప్రస్తుతం మనోడు.. కాలేజీలోని ఆ చెక్క బీరువాలోనే చెక్క భజన చేస్తున్నాడు.. మరో మీటింగ్‌కు వెళ్లడానికి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు.. – సాక్షి సెంట్రల్ డెస్క్.. -
ఆ'పరేషన్' టీడీపీ
ఏలూరు (మెట్రో): రేషన్ డీలర్లపై మరో పిడుగు పడింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకో నిబంధనతో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న టీడీపీ సర్కారు తాజాగా షాపు ఆలస్యంగా తెరిస్తే జరిమానా విధిచేందుకు సిద్ధపడింది. దీంతో రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచీ అంతే.. తెలుగుదేశం ప్రభుత్వం తొలి నుంచీ రేషన్ డీలర్లపై కక్ష కట్టినట్టు కనిపిస్తోంది. సరుకుల పంపిణీలో పారదర్శకత అంటూ ఆన్లైన్ విధానం, ఈ–పోస్ యంత్రాలు ప్రవేశపెట్టి అటు డీలర్లను, ఇటు లబ్ధిదారులను అవస్థల పాల్జేసింది. ఆ తర్వాత రేషన్ తీసుకోని వారి ఇళ్లకు వెళ్లి సరుకులు ఇవ్వాలనే నిబంధనతో వేధించారు. వేలిముద్ర పడకపోతే వీఆర్ఓ వేలిముద్ర ద్వారా సరుకులు సరఫరా చేయాలని నిబంధన పెట్టారు. వీటిన్నింటితో డీలర్లు తీవ్ర అవస్థలు పడ్డారు. అయినా మింగలేక, కక్కలేక అన్న తీరుగా షాపులను నడిపిస్తున్నారు. కమీషనూ అంతంతమాత్రమే! ఇంత కష్టపడుతున్నా.. రేషన్ డీలర్లకు వచ్చే కమీషన్ అంతంతమాత్రమే. గతంలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, బెల్లం, చింతపండు, మంచినూనె వంటివి అందించేవారు. అయితే ప్రస్తుత సర్కారు కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తోంది. ఒక్కోనెల పంచదార ఇస్తోంది. ఇక నూనె, పప్పులు, బెల్లం వంటి వాటి గురించి ఎప్పుడో మరిచిపోయింది. దీంతో కమీషన్ అంతగా రాని పరిస్థితి నెలకొంది. తాజాగా రూ.500 జరిమానా తాజాగా రేషన్ షాపుల్లో సమయపాలన పాటించకున్నా, షాపులు తెరవకున్నా రోజుకు రూ.500 జరిమానా విధిస్తామని సర్కారు హెచ్చరిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచాలని, ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సరుకులు పంపిణీ చేయాలని, దుకాణాలు తెరుస్తున్నదీ, లేనిదీ ఈ పోస్ యంత్రాల ద్వారా ఆన్లైన్లో నమోదు అవుతుందని వేధిస్తోంది. ఈపీడీఎస్ విధానంలో ప్రతి రోజూ ఎన్ని సరుకులు ఇస్తున్నదీ, ఎంత మంది కార్డుదారులు సరుకులు తీసుకున్నదీ, వసూలు చేసిన మొత్తం ఎంతో తెలిసిపోతుంది. దీంతో దుకాణం తెరవకుంటే ఆటోమేటిక్‌గా రూ.500 జరిమానా పడుతుంది. ఈ మొత్తాన్ని మినహాయించుకుని నెలవారీ కమీషన్ చెల్లించనున్నారు. ఇలా నాలుగుసార్లు జరిమానా పడితే రేషన్ దుకాణాన్నే రద్దు చేయాలని సర్కారు ఆదేశాలు చేయడంపై డీలర్లు మండిపడుతున్నారు. నాలుగుసార్లు జరిగితే షాపు రద్దు మొదటిసారి ఆలస్యం అయినా, షాపు తెరవకున్నా రూ.500 జరిమానా విధిస్తారు. రెండోసారి ఆలస్యమైతే రూ.1,000 జరిమానా, మూడోసారి రూ.1,500 జరిమానా, నాలుగోసారి రూ.2,000 జరిమానా విధిస్తారు. ఇక ఐదోసారి జరిమానా విధించకుండా షాపును రద్దు చేయాలని ఆదేశాలు అందాయి.– సయ్యద్ యాసిన్, జిల్లా పౌరసరఫరాల అధికారి దుకాణాలునిర్వహించలేకపోతున్నాం నెలకో నిబంధన పెడుతూ ప్రభుత్వం రేషన్ డీలర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రేషన్ షాపులు కాకుండా సూపర్మార్కెట్లు అని చెప్పారు. రోజుకో నిత్యావసర వస్తువును తొలగించుకుంటూ వస్తున్నారు. రోజుకో నిబంధన పెడుతున్నారు. తాజాగా దుకాణాన్ని ఏమాత్రం ఆలస్యంగా తెరచినా రూ.500 జరిమానా విధించడం ఎంతవరకూ సమంజసం.– రాణి, రేషన్ డీలరు -
ప్రాణాలు పోతున్నా పట్టదా?
సాక్షి, హైదరాబాద్ :ప్రజల ప్రాణాలను తీసే ప్రమాదకర ఔషధ ప్రయోగాల (క్లినికల్ ట్రయల్స్)పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. పేద ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రయోగ కేంద్రాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా చేస్తున్న ఔషధ ప్రయోగాలతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఔషధ ప్రయోగాలపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రమాదకర ప్రయోగాల కారణంగా కొందరు మృత్యువాతపడటంతోపాటు పలువురు పేదలు తీవ్ర అనారోగ్యానికి గురైన సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూసినప్పటికీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కనీస మాత్రంగా స్పందించడంలేదనే విమర్శలు పెరుగుతున్నాయి. బాధితులకు చట్ట ప్రకారం అండగా నిలవాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ ఇవేమీ చేయడంలేదు. 2017 జూన్‌లో కరీంనగర్ జిల్లాలో ఔషధ ప్రయోగాల కారణంగా యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కలకలం సృష్టించాయి. అప్పట్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఔషధ ప్రయోగాలపై రాష్ట్ర స్థాయిలో నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించేందుకు 2017 జూలై 5న ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. 30 రోజులలోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. కమిటీ ఏర్పాటై ఏడు నెలలు గడిచింది. అయితే కమిటీ ఇప్పటికీ నివేదిక రూపొందించలేదు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టడం ఇప్పట్లో జరిగే పనిగా కనిపించడంలేదని వైద్య శాఖ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఔషధ ప్రయోగాల బాధితులు పెరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర స్థాయిలోనూ చర్యలకు వీలు.. ఔషధ ప్రయోగాల నియంత్రణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని పేర్కొంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలోని పలు విభాగాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర స్థాయిలోనూ ప్రయోగాలపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది. సహేతుక మార్గంలోనే ఔషధ ప్రయోగాలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రయోగాలకు అంగీకరిస్తున్నట్లుగా... ఆయా వ్యక్తులనుంచి రాత పూర్వకంగా, వీడియో రూపంలో సమ్మతిని తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రయోగాలకు అంగీకరించిన వ్యక్తుల పేర్లు, ఇతర వివరాలను కచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలి. జోనల్ కార్యాలయాల పరిధిలో ఔషధ ప్రయోగాలు నిర్వహించే కేంద్రాల వివరాలను నమోదు చేయాలి. ఉన్నత స్థాయి కమిటీలను నియమించి ప్రయోగాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ జనరల్ కార్యాలయం 2013 ఏప్రిల్ 26న అన్ని జోనల్ కార్యాలయాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో కూడా కేంద్ర ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ జోనల్ కార్యాలయం ఉంది. అయితే మన రాష్ట్రంలోనే అనుమతిలేని ఔషధ ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలా జరుగుతున్నాయా? లేక తెలిసీ అధికారులు పట్టించుకోవడంలేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు బేఖాతరు.. ఫార్మసీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ఔషధాలను తయారు చేసి వీటిని ప్రయోగించే కాంట్రాక్టును పరీక్ష కేంద్రాలకు ఇస్తుంటాయి. ఆయా పరీక్ష కేంద్రాలు వ్యక్తులపై వాటిని ప్రయోగించి తుది ఫలితాలను క్రోడీకరిస్తాయి. దేశ వ్యాప్తంగా 84 ప్రయోగ కేంద్రాలు ఉండగా, తెలంగాణలో తొమ్మిది ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉంది. ఔషధ ప్రయోగ కేంద్రాలు... డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (డీసీవో) నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ కేంద్రాలు అనేక సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, వయసు, ప్రయోగించే ఔషధానికి శరీరం తట్టుకుంటుందా లేదా అనే అంశాలను పట్టించుకోకుండానే ఇష్టారాజ్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. వ్యక్తుల వివరాలను నమోదు చేయకపోవడంతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా ఎవరు బాధితులో తెలియడంలేదు. రాష్ట్రంలో ఔషధ ప్రయోగాల బాధితులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
ప్రముఖ నటుడి వీలునామా?
తమిళసినిమా(చెన్నై): విలక్షణ నటుడు కమలహాసన్ తన ఆస్తులను తన కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లకు చెందేలా వీలునామా రాసి ఇచ్చిన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. కమలహాసన్ నటుడిగా, నిర్మాతగా పలు చిత్రాలు చేసినా.. సంపాదించిన డబ్బును పెద్దగా కూడబెట్టుకోలేదనే ప్రచారం ఉంది. ఆయనకు డబ్బు వెనకేసుకోవడం తెలియదని నటుడు రజనీకాంత్ ఇటీవల బహిరంగంగానే వాఖ్యానించారు. కమల్ తన ఆస్తులను శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లకు సరి సమానంగా వీలునామా రాసినట్లు ప్రచారం సాగుతోంది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా కమల్ వీలునామా రాశారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. దీనిపై ఆయన ఏం చెబుతారో చూడాలి. -
నిబంధనలు బేఖతర్!
గుట్టుచప్పుడు కాకుండా ఎంఆర్సీ భవన నిర్మాణం అడ్డుకున్న జెడ్పీ ఫ్లోర్‌లీడర్, ఎంపీపీ నక్కపల్లి (పాయకరావుపేట): పాయకరావుపేట మండల పరిషత్‌కు చెందిన స్థలంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఎంఆర్సీ భవన నిర్మాణాన్ని జెడ్పీటీసీ, ఎంపీపీ నిలుపు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున భవన శ్లాబ్ వేసే ప్రయత్నాలను జెడ్పీటీసీ చిక్కాల రామారావు, ఎంపీపీ శివ అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ భవన నిర్మాణాన్ని అడ్డుకోవాలని సోమవారం జెడ్పీ ఫ్లోర్‌లీడర్, ఎంపీపీ అల్లాడ శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కాంట్రాక్టర్ ఏకపక్షంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. బుధవారం ఉగాది సందర్భంగా అధికారులు ఎవరూ లేని సమయాన్ని చూసి శ్లాబ్ వేసేందుకు చేసిన ప్రయత్నాలను జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు, ఎంపీ పీ శివకుమార్ అడ్డుకున్నారు. ఎంఆర్సీ భవనం నిర్మిస్తున్న స్థలం మండల పరిషత్‌కు చెందినదని, ఇక్కడ ఏదైనా భవనం నిర్మించాలంటే పాలకవర్గం అనుమతి తీసుకోవాల ని, ఎంఈవో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడంతో సర్వశిక్ష అభియాన్ వారు కాంట్రాక్టర్ ద్వారా పనులు చేపడుతున్నారని వీరు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు తక్షణమే నిలిపివేయాలన్నది పాలకవర్గ సభ్యుల డిమాండ్. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. బిల్లులు నిలుపు చేయాలని కోర్టును కోరడంతోపాటు, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడం, చెల్లించిన బిల్లులు రికవరీ చేయాలని కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. -
చెరకును పీల్చేస్తున్నారు
తన్నుకుపోతున్న పొరుగు జిల్లాల ప్రైవేట్ చక్కెర కర్మాగారాలు పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా సమకూరిందన్నదే ప్రశ్న పట్టించుకోని చెరకు అభివృద్ధి అధికారులు అనకాపల్లి : జిల్లాలో సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో సాగవుతున్న చెరకుపై ప్రైవేట్ కర్మాగారాలు కన్నేశాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రైవేట్ చక్కెర కర్మాగారాలు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాంతంలోని చెరకును తరలిస్తున్నాయి. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో గత రెండు సీజన్ల నుంచి గానుగాట జరగకపోవడంతో దీనిని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ విషయంలో చెరకు అభివృద్ధి అధికారులు ప్రైవేట్ కర్మాగారాలకు అనుకూలం గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న చెరకును తరలించే విషయంలో ఆయ ఫ్యాక్టరీలకు అధికారాలు ఉంటాయి. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో గాను గాట ఆడకపోవడంతో ఈ ప్రాంత చెరకును ఏటికొప్పాక, తాండవ చక్కెÆ ý‡ కర్మాగారాలకు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశా లు జారీ చేశారు. అయితే చెల్లింపు లు నగదు రహితంగా జరగాలన్న నిబంధన పెద్ద ప్రతిబంధకంగా మారింది. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని అనుకూలంగా మలుచుకొని... అనకాపల్లి చక్కెర కర్మాగారం పరిధిలో లక్ష హెక్టార్లకు పైబడి చెరకు సాగవుతోంది. దీనిలో కొంత చెరకును బెల్లం తయారీకి వినియోగించగా, మిగిలిన చెరకును తప్పని పరిస్థితుల్లో కర్మాగారాలకు తరలించాల్సి ఉంది. సహకార చక్కెర కర్మాగారాలకు చెరకును తరలించే రైతులకు ఇవ్వాల్సిన మద్దతు ధరను నగదు రహి త లావాదేవీల రూపేణా వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. కానీ ఈ నిబంధనలు అమలు చేయకుండా పొరుగు జిల్లాలకు చెందిన ప్రైవేట్ కర్మాగారాలు వ్యవహరించడం పలు అనుమానాలు తావిస్తోంది. ఈ ప్రాం తం నుంచి చెరకును తరలిస్తున్న ఒక ప్రైవేట్ కర్మాగారం.. తన పరిధిలో చెరకును తరలించిన రైతులకు రూ.8 కోట్ల వరకు బకాయి పడింది. కానీ అనకాపల్లి పరిధి లోని రైతుల నుంచి సేకరిస్తున్న చెరకుకు మద్దతు ధరను టన్ను కు రూ.2,070 చొప్పున చెల్లిస్తోంది. అది కూడా నగదు రూపంలోనే కావడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సంస్థల వద్ద కొత్త కరెన్సీ లేదు. కానీ అనకాపల్లి కర్మాగారం పరిధిలోని కూం డ్రం, నీలకంఠాపురం, వెంకుపాలెం కేంద్రంగా ఏర్పాటు చేసిన చెరకు బరువు తూచే కాటాల వద్ద చెల్లింపులను ఏ రోజుకు ఆ రోజుకు జరుపుతున్నారు. సుమారు 400 టన్నుల వరకు రోజుకు çతరలించుకుపోతున్నారు. ఈ ప్రాంత రైతులకు రోజుకు రూ.8 లక్షల నగదును కొత్త కరెన్సీ రూపంలో అందిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైందన్నదే ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న. సహకార కర్మాగారాల పరిధిలో టన్నుకు రూ.2300 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో టన్నుకు రూ.2300 చెల్లిం చాల్సి ఉంది. అది కూడా అకౌంట్లలోనే జమ చేయాలనే నిబంధన ఉంది. ఈ విధంగా కూడా రైతులు ప్రైవేట్ కర్మాగారాలకు చెరకును తరలించడం ద్వారా టన్నుకు రెం డు వందలకు పైగా నష్టపోతున్నారు. అయితే సహకార కర్మాగారాలకు తరలించే చెరకుకు మద్దతు ధర ఎప్పుడు అందుతుందో తెలియని ఆందోళన కూడా రైతుల్లో కనిపిస్తోంది. ఇప్పుడు ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాలకు తరలివెళ్లాల్సిన 20 వేల టన్నుల చెరకును ఇప్పటికే ప్రైవేట్ కర్మాగారాలు తీసుకెళ్లిపోయాయి. అయితే జిల్లాలో సహకార రంగంలో కొనసాగుతున్న కర్మాగారాల పరిధిలో సమకూరాల్సిన చెరకు మోతాదు తగ్గితే అక్కడ కూడా క్రషింగ్ జరిపే అవకాశాలు తగ్గుతాయి. తద్వారా భవిష్యత్‌లో ప్రైవేట్ కర్మాగారాల పుణ్యాన తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలకు ప్రమాదం పొంది ఉంది. -
పాస్‌పోర్ట్ నిబంధనలు ఇక సరళం
పుట్టిన తేదీకి ఆధారంగా బర్త్ సర్టిఫికెట్ అక్కర్లేదు ► పదో తరగతి సర్టిఫికెట్, టీసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు/ఈ–ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, బీమా పత్రాల్లో ఏదైనా ఒక్కటి చాలు ► అటెస్టేషన్/నోటరీలకు స్వస్తి న్యూఢిల్లీ/విశాఖపట్నం: కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది.వివిధ కేటగిరీలకు చెందిన వారికి మినహాయింపులు ఇచ్చింది. విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఈ వివరాలను శుక్రవారం వెల్లడించారు. సవరించిన నిబంధనల్లో ముఖ్యమైనవి ► పుట్టిన తేదీని నిర్ధారించేందుకు తప్పనిసరి అయిన బర్త్ సర్టిఫికెట్ ఇకమీదట అవసరం లేదు. పదో తరగతి మెమో, టీసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు/ఈ–ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, ఏదైనా ప్రభుత్వరంగ సంస్థ జారీచేసిన బీమా పాలసీ పత్రం.. వీటిలో ఏదైనా ఒకదాన్ని ఆధారంగా చూపితే సరిపోతుంది. అయితే వాటిలో పుట్టినతేదీ ఉండాలి. ► గతంలో తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరిగా తెలపాల్సి ఉండగా, ఇకపై ఎవరి సంరక్షణలో ఉన్నారో వారి వివరాలు తెలపాలి. పాస్‌పోర్ట్ పుస్తకంలో అభ్యర్థి కోరిక మేరకు తల్లి లేదా తండ్రి పేరును నమోదు చేస్తారు. దరఖాస్తులో అనుబంధ వివరాలను తెల్ల కాగితం మీద సంతకం చేసి రాసివ్వాలి. నోటరీ, అటెస్టేషన్లకు పూర్తిగా స్వస్తి చెప్పారు. ► పెళ్లయిన అభ్యర్థులకు అనెక్సర్ ‘కె’ లేదా మ్యారేజ్ సర్టిఫికేట్‌తో పనిలేకుండా చేశారు. అభ్యర్థి విడాకులు పొందితే కోర్టు మంజూరు చేసిన పత్రాలు సమర్పించాలి. భర్త లేదా భార్య పేరును దరఖాస్తులో రాయనక్కర్లేదు. ► దత్తత తీసుకున్న పిల్లల విషయంలో రిజిస్ట్రేషన్ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అది లేకపోతే దరఖాస్తుదారుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ళీ ప్రభుత్వోద్యోగులు గుర్తింపు పత్రంగా అనెక్సర్ ‘బి’, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌గా అనెక్సర్ ‘ఎం’ సమర్పించాలి. అత్యవసరంగా పాస్‌పోర్ట్ కావాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ అనెక్సర్ ‘ఎన్’ ఇవ్వాలి. సాధువులు, సన్యాసులు దరఖాస్తులో తల్లిదండ్రుల పేర్లకు బదులుగా తమ గురువు పేరు, గుర్తింపు పత్రం సమర్పించాలి. కాగా, నూతన నిబంధనలు ఈనెల 26 నుంచి అమల్లోకి రానున్నట్టు విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి చెప్పారు. గతంలో జనవరి 26, 1989 తర్వాత పుట్టిన వారంతా ఆర్డీవో జారీ చేసిన పత్రం అందించాల్సిన నిబంధన ఉండేది. ఆ నిబంధన రద్దయింది. -
తప్పుకున్న అనిల్ ఖన్నా
న్యూఢిల్లీ: అఖిల భారత టెన్నిస్ సం ఘం (ఐటా) అధ్యక్ష పదవి నుంచి అనిల్ ఖన్నా తప్పుకున్నా రు. కేంద్ర క్రీడాశాఖ స్పోర్ట్స కోడ్ నిబంధనల వల్లే తాను తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్రం, క్రీడాశాఖలతో వైరం మంచిది కాదనే తానీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రెండు సార్లు ఐటా అధ్యక్షుడిగా కొనసాగిన అనిల్ ఖన్నా... జీవిత కాల అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికవడం కూలింగ్ ఆఫ్ పీరియడ్‌కు విరుద్ధంగా ఉందని క్రీడాశాఖ తెలిపింది. స్పోర్ట్సకోడ్ అమలు పరచాల్సిందేనంటూ... ఇటీవల ఐటా గుర్తింపును రద్దు చేసింది. దీంతో మరింత వివాదాస్పదం కాకముందే ఖన్నా వైదొలగాలని నిర్ణరుుంచారు. త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని ఐటా ఎగ్జిక్యూటీవ్ కమిటీని ఆయన కోరారు. -
తొమ్మిది స్కూల్ బస్సుల సీజ్
8 ఆటోలు, 4 ద్విచక్ర వాహనాలు కూడా.. నగరంలో వారం రోజులు స్పెషల్ డ్రైవ్ డీటీసీ దుర్గాప్రమీల చంద్రశేఖర్‌కాలనీ : నిజామాబాద్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు బుధవారం సాయంత్రం నగరంలో స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు. జిల్లా ఉప రవాణా ఇన్చార్జి కమిషనర్ దుర్గాప్రమీల ఆధ్వర్యంలో మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్, సిబ్బంది నగరంలోని కంఠేశ్వర్‌లోని సీఎస్ఐ చర్చి సమీపంలో తనిఖీ చేశారు. రవాణా చట్టం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ బస్సులు, ఆటోరిక్షాలు, ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. నగరంలోని వివిధ ప్రైవేటు స్కూళ్లకు చెందిన 9 బస్సులను సీజ్ చేశారు. ఇందులో సామర్థ్యానికి మించిన నడుపుతున్నందున ఏడు బస్సులను, పర్మిట్ లేకుండా నడుపుతున్న రెండు స్కూల్ బస్సులను సీజ్ చేశారు. లైసెన్స్‌లు, ఓవర్‌లోడ్‌తో నడిపిన 8 ఆటోరిక్షాలను, సెల్‌పోన్ మాట్లాడుతూ, ద్విచక్రవాహనాలు నడిపిన నాలుగు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని ఇన్చార్జి డీటీసీ దుర్గా ప్రమీల తెలిపారు. వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తామన్నారు. రవాణా చట్టం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు నడిపితే వాటిని సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంవీఐలు యశంత్‌కుమార్, రవికుమార్, ఏఎంవీఐలు వెంకటస్వామి, రఘుకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
బిల్డర్లతో కుమ్మక్కయ్యారు
కబ్జాదారులకు సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు చెరువుల ఆక్రమణలపై డిసెంబర్‌లోగా నివేదిక ‘రెబెల్స్’ పై విచారణ 22కు వాయిదా స్పీకర్ కోడివాళ బెంగళూరు: నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని చెరువులను ఆక్రమించి భవనాలు నిర్మించడానికి అనుగుణంగా అనుమతులు జారీ చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు దాఖలు చేయనున్నామని చెరువుల ఆక్రమణను నివారించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు, స్పీకర్ కోడివాళ పేర్కొన్నారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతోమాట్లాడారు. నగరంలో కబ్జాకు గురైన చెరువులకు సంబంధించి ఇప్పటి వరకూ 99 శాతం సమాచారాన్ని సేకరించామన్నారు. అక్రమాల్లో బిల్డర్లతో కొంతమంది అధికారులు చేతులు కలిపారన్న విషయం తేలిందన్నారు. సదరు అధికారులపై క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నామని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన నివేదికను డిసెంబర్‌లోపు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులు, రాచకాలువలు అక్రమించి నిర్మించిన అన్ని రకాల నిర్మాణాలను పడగొట్టితీరుతామని ఈ విషయంలో పక్షపాత ధోరణి ఏదీ లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు కోడివాళ సమాధానమిచ్చారు. 14న ప్రత్యేక సమావేశం: జీఎస్టీఅమలుపై చర్చించేందుకు ఈనెల 14న ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలను రాజకీయపార్టీలతో పాటు కొంతమంది నాయకులు తమ ప్రచారం కోసం వాడుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అందువల్లే రాష్ట్ర చట్టసభల నియమావళిలో మార్పులు తీసుకురానున్నామని వెళ్లడించారు. 14న జరిగే శాసనసభ సమావేశాలను రెండు మూడు రోజులు పొడగించే అవకాశం కూడా లేకపోలేదన్నారు. ‘రెబెల్స్’ పై విచారణ 22కు వాయిదా... రాష్ట్ర శాసనసభ నుంచి శాసనమండలి, రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించిన 8 మంది జేడీఎస్ ఎమ్మెల్యేల పై విచారణను ఈనెల 22కు వాయిదా వేస్తూ కోడివాళ నిర్ణయం బుధవారం తీసుకున్నారు. సదరు ఎన్నికల్లో జేడీఎస్ ఎమ్మెల్యేలైన చలువరాయస్వామి, జమీర్‌అహ్మద్‌ఖాన్, రమేష్బండిసిద్ధ హెచ్.సీ బాలకృష్ణ, అఖండశ్రీనివాస్మూర్తి, కే.గోపాలయ్య, ఇక్బాల్, భీమానాయక్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసినట్లు అదే పార్టీకి చెందిన బీ.బీ నింగయ్య కోడివాళకు ఫిర్యాదు చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని అందులో కోరారు. ఈ నేపథ్యంలో అనర్హత విషయమై విచారణ జరిపారు. ఈ విచారణకు ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైకి బాలకృష్ణ, గోపాలయ్య, ఇక్బాల్ అన్సారి, శ్రీనివాసమూర్తిలు హాజరయ్యారు. మిగిలిన వారు తాము విదేశాల్లో ఉన్నట్లు స్పీకర్‌కు తెలియజేశారు. విచారణ అనంతరం కోడివాళ మీడియాతో మాట్లాడుతూ... పార్టీ విప్‌ను ధిక్కరించిన ఎనిమిది మందిపై అనర్హత వేటు వేయాల్సిందిగా కుమారస్వామి లిఖితపూర్వకంగా తనకు తెలియజేశారన్నారు. అనర్హతకు సంబంధించి కొన్ని సాంకేతిక పరమైన సాక్ష్యాలు ఇవ్వడంలో జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి విఫలమయ్యారు. అందువల్ల సదరు సాక్ష్యాలు అందజేయాల్సిందిగా కుమారస్వామికి సూచిస్తూ విచారణను ఈనెల 22కు వాయిదా వేశామన్నారు. అంతేకాకుండా విచారణ సమయంలో జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్య హోదాలో తప్పక స్పీకర్ ఎదుట హాజరయ్యి తన నిర్ణయాన్ని తెలియజేయాల్సిందిగా కుమారస్వామికి తెలిపామని కోడివాళ పేర్కొన్నారు. -
రే టింగ్ అప్‌గ్రేడ్ చేస్తాం..
వృద్ధిని పెంచే సంస్కరణలు కావాలి న్యూఢిల్లీ: వృద్ధిని పెంచే ఆర్థిక, సంస్థాగత సంస్కరణలను ప్రభుత్వం తీసుకొస్తే భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే విషయాన్ని పరిశీలిస్తామని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల సరళీకరణ, ఆర్థిక పరిస్థితులకు మరింత స్థిరత్వాన్ని తెచ్చే లా ద్రవ్య విధానాలను రూపొందించడం తది తర సంస్కరణలు అవసరమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. వృద్ధిని పెంచే, వృద్ధి ని నిలకడగా ఉంచే ఆర్థిక, సంస్థాగత సంస్కరణలను తేవడంలో ప్రభుత్వం విజయం సాధించే అవకాశాలున్నాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సావరిన్ రిస్క్ గ్రూప్)మారీ డిరోన్ చెప్పారు. ఫలితంగా రేటింగ్‌కు అప్‌గ్రేడ్ అవకాశాలున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో మూడీస్ సంస్థ భారత రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్థిరత్వం’ నుంచి ‘సానుకూలం’ నకు మార్చింది. సంస్కరణల జోరు కారణంగా రేటింగ్‌ను మార్చామని, ఏడాది, ఏడాదిన్నర కాలంలో రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొంది. అయితే ఆర్థిక, ద్రవ్య, సంస్థాగత పటిష్ట పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోయినా, బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడినా, లేదా చెల్లింపుల శేషంపై ఆందోళనలు నెలకొన్న భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్థిరత్వం’నకు తగ్గిస్తామని తాజాగా డిరోన్ పేర్కొన్నారు. కాగా భారత్‌కు మూడీస్ సంస్థ ఇచ్చిన సావరిన్ రేటింగ్ ‘బీఏఏ3’గా ఉంది. ఇది కనిష్ట ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. జంక్ రేటింగ్ కంటే ఇది కొంచెం పై స్థాయి. -
ప్రాణాలు.. గాల్లో దీపాలు
ప్రైవేటు బస్సుల్లో రసాయనాలు,సిగరెట్ బండిళ్ల రవాణా పట్టించుకోని అధికారగణం నిబంధనలు తూచ్ తగలబడుతున్న బస్సులు బెంగళూరు : ప్రైవేటు బస్సు యాజమాన్యాలు నిబంధనలను కాలరాస్తుండటంతో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా తయారైంది. గమ్యాలకు చేరాల్సిన ప్రయాణికులు దారి మధ్యలోనే అకాల మృత్యువాత పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. తల్లికి బిడ్డ దూరమవుతోంది. బిడ్డకు తల్లి దూరమవుతోంది. మరికొన్ని ఘటనల్లో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ప్రభుత్వం సైతం ఏదేని ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప శాశ్వత పరిష్కార మార్గాలను అమలు చేయడం లేదని, బుధవారం తెల్లవారుజామున హుబ్లీ సమీపంలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం ఇందుకు అద్దం పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవంగా ప్రయాణికులను తరలించే ప్రైవేటు బస్సుల్లో నిబంధనలను అనుసరించి ఎటువంటి సరుకును రవాణా చేయకూడదు. అయితే టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండక పోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు సరుకులను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. బెంగళూరు నుంచి దేశంలోని చాలా చోట్లకు ప్రైవేటు వాహనాలు నడుస్తున్నాయి. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా సిగరెట్ బండిల్స్, రసాయనాలు, పెయింట్స్‌తో పాటు వివిధ రకాల చికిత్సల్లో వినియోగించే మందులు రవాణా అవుతున్నాయి. ఈ పదార్థాలకు చిన్న నిప్పురవ్వ తగిలినా ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. మరోవైపు సాధారణంగా మల్టీయాక్సిల్ బస్సుల్లో డీజిల్ ట్యాంకు డ్రైవర్ వెనకే ఉంటుంది. అందులో 600 లీటర్ల దాకా డీజిల్ ఉంటుంది. ఈ ట్యాంకుకు చిన్న చిల్లుపడినా, లేదా షార్ట్ సర్క్యూట్ జరిగినా ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. ‘వరూరు’ ఘటనలో కూడా బస్సులో రసాయనాలు ఉండటం వల్లే మంటలు త్వరగా వ్యాపించాయని, వాటిని గుర్తించి తప్పించుకునేలోపే ముగ్గురు మృత్యువుపాలయ్యారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. రవాణా శాఖ అధికారులు ట్రావెల్స్ సంస్థలకు వెళ్లి వారి లెసైన్స్‌లు, బస్సులకు పర్మిట్ ఉందా లేదా వంటి కనీస విషయాలను కూడా పరిశీలించలేదని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్న ట్రావెల్స్ యాజమాన్యం పై కేసులు కూడా బుక్ చేస్తున్న దాఖలాలు లేవు. అందువల్లే 2013లో పాలెం వద్ద జరిగిన బస్సు దగ్ధమైన ప్రమాదంలో 48 మంది చనిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో తరుచుగా బస్సుల్లో మంటలు చెలరేగడం జరుగుతూనే ఉన్నాయని రవాణా శాఖ అధికారులే పేర్కొంటుండటం గమనార్హం. ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఏదీ..? రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో ఎక్కువగా బెంగళూరుకు వచ్చి ఇక్కడే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెదుక్కుంటున్నారు. వీరు పండుగలు, శుభకార్యాల సమయంలో స్వంత ఊళ్లకు వెళ్లడానికి అవసరమైనన్ని కేఎస్ఆర్టీసీ బస్సులు కానీ, రైళ్లు కానీ లేవు. బెంగళూరు -హైదరాబాద్ విషయమే తీసుకుంటే (ఉత్తర కర్ణాటక ప్రాంతాల మీదుగా) రాష్ట్ర రవాణాశాఖకు చెందిన ఏసీ, నాన్ఏసీలు కలిపి రోజూ సుమారు 80 బస్సులను మాత్రమే నడుపుతున్నాయి. రైళ్ల విషయానికి వస్తే రోజూ రెండు రైళ్లు మాత్రమే (ప్రత్యేక రైళ్లను తీసివేస్తే) బెంగళూరు హైదరాబాద్ మధ్య ఉన్నాయి. దీంతో ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి వచ్చినా తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ బస్సు సర్వీసులు ఒకటే లేదా గరిష్టంగా మూడు చోట్ల మాత్రమే ప్రయాణికుల పికప్ పాయింట్లను ఏర్పాటు చేసుకొన్నాయి. అయితే ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం కనిష్టంగా పదిచోట్ల కంటే ఎక్కువ పికప్ పాయింట్లు ఉండటం కూడా ప్రయాణికులు ఆ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని ప్రభుత్వ రవాణా వ్యవస్థను పెంచితే ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు కళ్లెం పడుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. -
శుద్ధమోసం!
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లు అపరిశుభ్రనీటినే క్యాన్లలో నింపేస్తున్న వైనం వ్యాధులబారిన పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు చిత్తూరు నగరంలోని రామ్‌నగర్ కాలనీలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం సమీపాన ఓ వాటర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ బోరు నీటినే సక్రమంగా శుద్ధి చేయకుండా సురక్షిత జలమంటూ ప్రజలకు అంటగడుతున్నారు. కాజూరు, మురకంబట్టు, కొంగారెడ్డిపల్లెల్లోనూ ఇదే పరిస్థితి... ఇది ఒక్క చిత్తూరు నగరంలోనే కాదు.. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. అపరిశుభ్ర నీటినే క్యాన్లకు నింపి ప్లాంట్ల యజమానులు ‘శుద్ధ’ మోసం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చిత్తూరు (కార్పొరేషన్) : చట్టంలోని లొసుగులు అక్రమ నీటి వ్యాపారులకు చుట్టాలుగా మారుతున్నాయి. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అపరిశుభ్ర నీటినే క్యాన్లలో నింపి సురక్షిత జలమని అమ్మేస్తున్నారు. అనుమతులు లేకుండా ప్రమాణాలకు పాతరవేస్తున్న వాటర్‌ప్లాంట్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. నిబంధనలకు పాతర జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 30 వాటర్ ప్లాంట్లు, అనధికారికంగా 400 ప్లాంట్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేని ప్లాంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. రంగు నీళ్లు, బోరు నీటినే క్యాన్లకు నింపి, నకిలీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ స్టిక్కర్లు అంటించి అమ్మేస్తున్నారు. కనీసం క్యాన్లు కూడా సక్రమంగా ుభ్రం చేయడంలేదు. 20 లీటర్ల క్యాన్ వాటర్‌ను డిమాండ్‌ను బట్టి రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ఏడాదికి రూ.50 కోట్ల వరకు నీటి వ్యాపారం సాగుతోంది. నామమాత్రంగా దాడులు వాటర్ ప్లాంట్ల నిర్వహణపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు. ఒకటిన్నర సంవత్సరంగా కేవలం 4 ప్లాంట్లపై తనిఖీలు చేసి చేతులు దులుపుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాలకార్మికులే ఎక్కువ వాటర్ ప్లాంట్లలో బాలకార్మికులే అధికంగా పనిచేస్తున్నారు. తక్కువ కూలీకి వస్తారనే నెపంతో ప్లాంట్ల యజమానులు చిన్నపిల్లలనే ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు తొమ్మిది వందల మంది బాలకార్మికులు పనిచేస్తున్నా కార్మిక శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. బీఐఎస్ ఉంటేనే బీఐఎస్ గుర్తింపు ఉన్న వాటర్ ప్లాంట్లు మాత్రమే మా పరిధిలోకి వస్తాయి. విడి నీళ్ల అమ్మకాలు మాకు సంబంధం లేదు. వాల్టా చట్టాన్ని అనుసరించే ప్లాంట్లకు అనుమతించాలి. కలుషిత నీటిని అమ్మితే చర్యలు తప్పవు. - శ్రీనివాసులు, జిల్లా ఆహార తనిఖీ అధికారి నిబంధనలు ఇలా.. వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలంటే ముందుగా నీటిని పరీక్షించాలి. బోరైతే వాల్టా చట్టం కింద తహసీల్దార్ అనుమతి తీసుకోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి అనుమతి పొంది, ప్రతి ఆరు నెలలకోసారి నీటిని పరీక్షించాలి. ప్రతి కేంద్రంలో ప్రయోగశాల ఉండాలి. రంగు, వాసన, రుచి, డెర్జిడిటీ, టోటల్ డిజుల్యడ్ సాలీడ్స్, సల్ఫైడ్, మాంగనీస్, కాపర్ తదితర 51 పరీక్షలు నిర్వహించాలి. తర్వాతే ప్లాంట్లకు అనుమతించాలి. -
అనుమతి లేని పాఠశాలలపై ఫోకస్
చిత్తూరు(గిరింపేట): జిల్లాలో అనుమతి లేని, నిబంధనలు పాటించని పాఠశాలలు 13 ఉన్నాయని, వాటిని ఎంఈవోలు సందర్శించి యాజమాన్యాల వివరణ తీసుకోవాలని డీఈవో నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది బదిలీలు పొంది రిలీవ్ కాని 560 మంది ఉపాధ్యాయులకు మూడు ఆప్షన్లు ఇచ్చి వారి కోరిక మేరకు బదిలీ చేయనున్నట్లు చెప్పారు. ఈనెల 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని, 13న తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. జూన్‌లోపు జిల్లాలో 1,400 మంది టీచర్లను నియమిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. -
ఇది ప్రభుత్వ వైఫల్యమే
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు వస్త్ర పరిశ్రమల ఆందోళనపై సుమోటాగా స్వీకరణ 23న వివరణ ఇవ్వండి రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశం బెంగళూరు : ప్రావిడెంట్ ఉపసంహరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను నిరసిస్తూ సోమ, మంగళవారాల్లో బెంగళూరులోవస్త్రపరిశ్రమ కార్మికులు జరిపిన నిరసన దీక్ష హింసాత్మకంగా మారడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటాగా స్వీకరించి మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర హోంశాఖ నిఘా వర్గాల నిర్లక్ష్యరాహిత్యమే ఇందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడింది. న్యాయమూర్తి ఏ.ఎన్ వేణుగోపాల్ గౌడ ఈ కేసు విషయమై మాట్లాడుతూ... నిరసన దీక్షలు శాంతిభద్రతల సమస్యగా మారినప్పుడు ఎలా ప్రవర్తించాలన్న విషయంపై మంగళూరు, మైసూరు ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోలేదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బెంగళూరు ఘటనకు సంబంధించి ఈనెల 23న డీజీపీ ఓంప్రకాశ్ కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. -
వేటుకు వేళాయే...!
నిబంధనలు ఉల్లంఘించి వేసవి సెలవుల్లోనూ ఇంటర్ తరగతులు వందకుపైగా ప్రైవేటు కళాశాలలకు షాకాజ్ నోటీసులు సిటీబ్యూరో: నిబంధనలను ఉల్లంఘించి తరగతులు కొనసాగిస్తున్న ప్రైవేటు జూనియర్ కళాశాలలపై వేటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం సెలవులు ప్రకటించినా.. పట్టించుకోకుండా పాఠాలు బోధిస్తున్న యాజమాన్యాలపై అధికారులు కన్నెర్ర చేస్తున్నారు. ఇంటర్ బోర్డు మార్చి 29 నుంచి మే 31 వరకు అన్ని మేనేజ్మెంట్ ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలలకు సెలవులు ప్రకటించింది. సెలవుల్లో తరగతులు నిర్వహించినా, ఎంట్రెన్స్ టెస్ట్‌లకు శిక్షణలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయినా కొన్ని ప్రైవేటు కళాశాలలు బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తున్నాయి. ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటీ, జిప్మర్ ప్రవేశ పరీక్షలకు కోర్సులు నిర్వహిస్తున్నారు. మరికొన్ని కళాశాలలు మరో అడుగు ముందుకేసి.. విద్యార్థులకు అప్పుడే ద్వితీయ సంవత్సరం పాఠాలను బోధిస్తుండటంతో తనిఖీలకు వెళ్లిన అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు రద్దు..? నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై జంట జిల్లాల ఆర్ఐఓ కార్యాలయాలకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాశాలలతోపాటు ఓ మోస్తరు స్థాయి కాలేజీలు కూడా తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆయా కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు జంట జిల్లాలో వందకు పైగా కళాశాలలకు నోటీసులు అందజేయడం విశేషం. శ్రీచైతన్య, నారాయణ, శ్రీగాయత్రి, ఎన్ఆర్ఐ, గౌతం తదితర కళాశాలలు నిబంధనలు ఉల్లంఘించిన జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 40, రంగారెడ్డి జిల్లాలో 70 కళాశాలల్లో విద్యార్థులను బయటికి పంపించి నోటీసులు జారీ చేసిన అధికారులు కళాశాలల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి బోర్డుకు నివేదిక అందజేశారు. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చాక.. చర్యలు చేపడతామని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. సెలవులు పూర్తయ్యే వరకు దాడులు కొనసాగుతాయని వారు పేర్కొంటున్నారు. భిన్న వాదనలు... సెలవుల్లో తరగతుల నిర్వహణపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులే స్వయంగా తమ పిల్లలను తరగతులకు పంపుతున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పేర్కొం టున్నాయి. అలాంటప్పుడు వారికి బోధించాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్‌తోపాటు ఎంసెట్, ఏఐఈఈఈ, జిప్మర్ ప్రవేశ పరీక్షలకు ఏడాదంతా ఆయా కళాశాలలు శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకుగాను తల్లిదండ్రులు రూ.లక్షల్లో ఫీజులను చెల్లించారు. మరి కొన్ని రోజుల్లో ప్రవేశ పరీక్షలు జరగనున్నందున, కీలక సమయంలో కళాశాలలు బంద్ చేస్తే తమ పిల్లలు నష్టపోతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అధికారుల తనిఖీల నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు తరగతులు నిర్వహించేందుకు ధైర్యం చేయట్లేదని సమాచారం. -
హోల్డాన్.. హోల్డాన్.. ఈ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ లేదండీ!
సిటీ, పల్లెవెలుగు, లగ్జరీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ లేదు ప్రయాణికుల భద్రత పట్టించుకోని సంస్థ లబ్బీపేట : ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖ వంతం అనేది నినాదానికే పరిమితమైంది. బస్సుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రథమ చికిత్సా పరికరాలనైనా ఏర్పాటు చేయడం లేదు. దీంతో అకస్మాత్తుగా వేసే బస్సు బ్రేకులతో ప్రమాణికులు ముందుకు పడి చిన్న చిన్న రక్త గాయాలకు గురైన సమయంలో ప్రథమ చికిత్స కూడా చేయలేని దయనీయ స్థితి నెలకొంది. సిటీలో తిరిగే బస్సుల్లోనే కాదు...గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు.. దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో సైతం ఫస్ట్ ఎయిడ్ కిట్ల ఏర్పాటును గాలికొదిలేసారు. పండిట్ నెహ్రూ బస్టేషన్లో శనివారం ‘సాక్షి’ పలు బస్సులను పరిశీలించగా ఆసక్తి కరమైన అంశాలు వెల్లడయ్యాయి. 50 శాతం బస్సుల్లో కిట్లే లేవు బస్టాండ్‌లో వేర్వేరు డిపోలకు చెందిన 30 బస్సులను పరిశీలించగా వాటిలో సగం బస్సులకు అసలు ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లే కనిపించలేదు. ఆర్టీసీతో పాటు పలు అద్దె బస్సులదీ అదే పరిస్థితి. కనీసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లను ఏర్పాటు చేయడమే సంస్థ మరిచిందంటే ప్రయాణికుల రక్షణకు ఏ మాత్రం చర్యలు తీసుకుంటుందో అర్ధమవుతుంది. నిబంధనల ప్రకారం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేసి, దానిలో కాటన్, గాజుగుడ్డతో పాటు, టించర్, సిజర్, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను అందుబాటులో ఉంచాలి. కానీ ఏ ఒక్కబస్సులోనూ కూడా వైద్యానికి సంబంధించి సామగ్రి కాదుకదా. 50 శాతం బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు కూడా లేవు బాక్స్లున్నా..కిట్లు లేవు బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ఉన్నా అవి అలంకార ప్రాయంగానే వేలాడుతున్నాయి. వాటిలో ఒక్కదానిలో వైద్య సామగ్రి లేదు. వి జయవాడ-గుంటూరు ఏసీ నాన్‌స్టాప్ బస్సు ను పరిశీలించగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో నామ మాత్రంగా కాటన్‌ను ఉంచారు. అంతే ఏదో ఒకటి ఉంచాలని మొక్కుబడిగా వుంచినట్లు తెలుస్తోంది. గుడివాడ- విజయవాడ తిరిగే నాన్‌స్టాప్ బస్సును పరిశీలించగా, ఫస్ట్ ఎయిడ్‌బాక్స్ ఉంది కాని ఫస్ట్ ఎయిడ్ సామగ్రి లేదు.మచిలీపట్నం.- విజయవాడ తిరిగే నాన్‌స్టాప్ బస్సును పరిశీలించగా పాడైన బ్యాండెడ్ లు మాత్రమే దర్శనమిచ్చారు. ఇతర సామగ్రి ఏమి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో కనిపించలేదు. నాగాయలంక తిరిగే పల్లెవెలుగు బస్సులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బ్యాక్స్‌లో గ్రీజు ప్యాకెట్లు..ఇతర సావమగ్రి ఉన్నాయి. ఇలా ఏ బస్సు చూసిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉన్న దాఖలాలు లేవు. అంటే ప్రయాణికుల రక్షణను ఆర్టీసీ గాలికొదిలేసిందనే వెల్లడవుతోంది. పైకి మాత్రం సురక్షిత ప్రయాణం అంటూ ఊదరగొట్టే ప్రచారం చేస్తున్న ఆర్టీసీ సంస్థ ..ప్రథమ చికిత్స కిట్లనే విస్మరించడం పలు విమర్శలకు తావిస్తోంది. హసన్‌కా హుకూం...తెరుచుకో శశీ ఆర్టీసీ బస్సులోని ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు నెలల తరబడి తెరుచుకోవడంలేదని ప్రయాణికులు అంటు న్నారు. ఇందుకు అవి దుమ్ముకొట్టుకుపోయి ఉండడమే అని అంటున్నారు. బాక్స్లయితే ఉన్నాయి కాని, అందులో ఫస్ట్ ఎయిడ్ ఉందో లేదో తెలియదని చెబుతున్నారు. తెరుచుకోని ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లును చూసి మూడు దశాబ్దాలనాటి ఆలీబాబా 40దొంగలు సినిమాలోని అప్పటి ప్రేక్షకుల నాలుకపై నాట్యం చేసిన డైలాగ్‌ను గుర్తుచేసు కుంటున్నారు. ‘హసన్‌కా హుకూం.. ఖుదాకీ కసం...తెరుచుకో శశీ’ అని అంటే కూడా బస్సుల్లోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు తెరుచుకోవని చలోక్తి విసురుతున్నారు. -
క్యాట్‌ఫిష్ పెంపకం ఆపండి
నిషేధం ఉన్నా పెంచుతున్నారు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున క్యాట్‌ఫిష్ పెంపకం జరుగుతోందని, ఈ క్యాట్‌ఫిష్ చెరువులను ధ్వంసం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్, ధరూర్, ఆలంపూర్, కొల్లాపూర్, వాడేపల్లి, ఐజ తదితర మండలాల్లో క్యాట్‌ఫిష్ పిల్లల ఉత్పత్తి, పెంపకం, రవాణా, మార్కెటింగ్ జరుగుతోందని పిటిషనర్లు వివరించారు. ఈ వ్యాజ్యాన్ని ఎంపీటీసీ రాధాకృష్ణారెడ్డి, జి.రాఘవేందర్‌రెడ్డిలు దాఖలు చేశారు. ఇందులో మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, డెరైక్టర్, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు స్థానిక పోలీసులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అనుమతులు తీసుకోకుండా వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చి, క్యాట్‌ఫిష్‌లను పెంచుతున్నారన్నారు. జిల్లాలో వేయి నుంచి 2వేల ఎకరాల్లో క్యాట్‌ఫిష్ పెంపకం జరుగుతోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. -
16 కోట్లు.. 20 రోజులు
మార్చి నెలాఖరు గడువు దగ్గర పడటంతో హడావుడిగా నిర్మాణాలు 11 నెలలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు 20 రోజుల్లో రూ. 16 కోట్లకు టార్గెట్ పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యతకు తిలోదకాలు మార్చి నెలాఖరులోగా ఉపాధి హామీ, ఆర్థిక సంఘ నిధులు ఖర్చు చేయాలన్న నిబంధనవల్ల అధికారులు ఆదరాబాదరాగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చాలాచోట్ల వారి పర్యవేక్షణ లేకుండా జరగడం వల్ల నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇదీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధిశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇలాకాలో పరిస్థితి. నర్సీపట్నం: నర్సీపట్నం డివిజన్లో ఉపాధిహామీ, 13, 14 ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. మార్చి నెలాఖరులోగా పూర్తిచేయకుంటే నిధులు రద్దయ్యే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారన్న విమర్శలున్నాయి. ఆదర్శ గ్రామాలే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం రూ. కోట్లు కేటాయించడం తెలిసిందే. 20 రోజుల్లో ఎలా పూర్తి? నర్సీపట్నం డివిజన్లో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఉపాధిహామీ పథకం, 13,14వ ఆర్థిక సంఘం నుంచి 675 పనులకు రూ.22.7 కోట్లు మంజూరయ్యాయి. 11 నెలల వ్యవధిలో రూ.6 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా రూ.16.7 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులోపు పనులు పూర్తి చేయించడానికి అధికారులు హైరానా పడుతున్నారు. ఏడాది కాలంగా పనులు పూర్తి చేయలేని అధికారులు స్వల్ప వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి హెచ్చరించినా.. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను నిర్ధేశించిన సమయానికి ఖర్చు చేయకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యే నిధులపై ప్రభావం చూపిస్తుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన నిధులను వచ్చే ఏడాది విడుదలయ్యే నిధుల్లోచూపించే అవకాశం ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో నిధులు సకాలంలో ఖర్చు చేయాలని అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కేవలం 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయకపోవటం వారు నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. కానరాని నాణ్యత నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేసేందుకు అధికారులు ఆదరాబాదరాగా పనులు చేపట్టడంతో వీటిలో నాణ్యత లోపించే అవకాశం లేకపోలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల్లో చాలామంది టీడీపీకి చెందిన వారే ఉన్నారు. వారంతా అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు జరిపించేస్తున్నారు. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా ఆగమేఘాల మీద నిర్మాణాలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం పనులు: 675 ఏడాదికి కేటాయించిన నిధులు: రూ.22.7కోట్లు 11 నెలల్లో పూర్తయినవి: రూ.6 కోట్ల విలువైన పనులు 20 రోజుల్లో పూర్తికావాల్సినవి: రూ.16.7కోట్ల విలువైన పనులు లక్ష్యాన్ని అధిగమిస్తాం ఇసుక కొరత వల్ల నిర్మాణాల్లో జాప్యం ఏర్పడింది. సాధ్యమైనంత వరకు మార్చి నెలాఖరుకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం. - కె.ప్రభాకర్‌రెడ్డి, ఈఈ, పంచాయతీరాజ్ నర్సీపట్నం డివిజన్ -
భద్రతపై గురి!
10 నుంచి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ! అన్ని సంస్థల్లో సీసీ కెమెరాలు, గార్డులు తప్పనిసరి ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల పరిశీలన ‘సేఫ్‌సిటీ’పై నడుం బిగిస్తున్న పోలీసులు జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కార్యా లయాల్లో భద్రతకు సంబంధించి పోలీసులు కఠిన నిబంధనలను రూపొందిస్తున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ నెల 10 నుంచి అన్ని సంస్థల భద్రతపై ప్రత్యేక నివేదికలు తయారు చేస్తున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో జరిగే ఈ క్షేత్రస్థాయి తనిఖీల్లో ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు (అర్బన్): జిల్లాపై నిఘా పెంచడంతో పాటు భద్రతా ఏర్పాట్లను సమీక్షించడానికి పోలీసుశాఖ సిద్ధమవుతోంది. ఈ నెల 10 నుంచి చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలోని ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో ‘సేఫ్టీ ఆడిట్’ పేరిట తనిఖీలు చేపట్టనున్నారు. ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాను సేఫ్‌సిటీగా మార్చాలనే నినాదంతో పోలీసుశాఖ ప్రజల్లోకి వెళ్లనుంది. ఇలా తనిఖీలు.. ప్రజల భద్రతకు ప్రభుత్వ ప్రయివేటు సంస్థలు తీసుకుంటున్న చర్యలపై పోలీసు శాఖ క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రయివేటు సంస్థలు, సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, సూపర్బజార్లు, కార్పొరేటర్ సంస్థలకు చెందిన మాల్స్‌తో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలను పోలీసులు తనిఖీ చేస్తారు. ఇక్కడ ప్రజలకు ఏదైనా ఇబ్బందులొస్తే సంస్థల యాజమాన్యాలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయనే విషయాలను పరిశీలిస్తారు. అసాంఘిక శక్తులు ప్రమాదకరమైన వస్తువులు తీసుకెళితే ముందగానే గుర్తించి ఎలా నిరోధిస్తారు..? చోరీలను నియంత్రించేందుకు ఏంచర్యలు చేపడుతున్నారనే విషయాలను నిశితంగా పరిశీలిస్తారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా సీసీ కెమెరాలు పెట్టుకోవడం, ప్రజలు మాల్స్, ఇతర సముదాయాల్లోకి వెళ్లేప్పుడు తనిఖీలు చేయడం, గార్డులను నియమించుకోవడంపై ఆయా సంస్థలకు పోలీసు శాఖ నోటీసులు జారీ చేస్తుంది. నిబంధనలు పాటించకుంటే కేసులు.. పోలీసులు సేఫ్టీ ఆడిట్లో గుర్తించిన లోపాలను సరిచేసుకోవాలంటూ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు నోటీసులు ఇస్తుంది. ఇవి తీసుకున్న తరువాత పోలీసులు పేర్కొన్న లోటుపాట్లను సరిచేసుకోవాల్సిన బాధ్యత సంస్థల యాజమాన్యాలపై ఉంటుంది. ఇక నోటీసులు తీసుకున్న నెల రోజుల్లో అక్కడ భద్రతను పునరుద్ధరించుకోవాలి. అలా కాకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తే ఆయా సంస్థలపై కేసులు నమోదు చేసే అధికారం పోలీసు శాఖకు ఉంటుంది. ప్రజలు సహకరించాలి పోలీసుశాఖ పరంగా ప్రజల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటాం. అయితే కొన్ని విషయాలు ప్రజలకు తెలిసినా వాటిని పోలీసులతో షేర్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. పోలీసులపై నమ్మకం ఉంచి తెలిసిన విషయాలు మా దృష్టికి తీసుకురండి. 100 నంబర్‌కు కాల్ చేయండి, స్థానిక ఎస్సైకు చెప్పండి. ఆయన వినకుంటే సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ ఇలా ఎవరికో ఒకరి చెప్పండి. మీకు ఎవరిపైనా నమ్మకం లేకుంటే నాకు నేరుగా ఫోన్ (9440796700) చేసి చెప్పండి. అప్పుడే నేరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. -ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్పీ, చిత్తూరు -
టీచర్లకు షోకాజ్
నిబంధనలకు విరుద్ధంగా పాయింట్ల కేటాయింపుపై 3,850 మందికి నోటీసులు 246 మంది హెచ్ఎంలు,ఎంఈవోలు, డీవైఈవోలకు సైతం మచిలీపట్నం : ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల వెబ్ కౌన్సెలింగ్‌లో పాయింట్ల కేటాయింపులో తప్పుడు సమాచారం ఇచ్చిన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం సాయంత్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాయింట్లు ఎలా కేటాయించుకున్నారని ప్రశ్నిస్తూ.. దీనికి సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 3,850 మంది టీచర్లు, 246 మంది ప్రధానోపాధ్యాయులు, అన్ని మండలాల విద్యాశాఖాధికారులు, డీవైఈవోలకు ఈ షోకాజ్ నోటీసులను అందజేసినట్లు ఆయన చెప్పారు. పాయింట్ల కేటాయింపులో ఉపాధ్యాయులు తప్పులు చేస్తే హెచ్ఎంలు, ఎంఈవోలు, డీవైఈవోలు ఎలా కౌంటర్ సైన్ చేశారని, దీనికి సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నెల రోజుల పాటు వెబ్ కౌన్సెలింగ్ పేరుతో జాప్యం చేసిన ప్రభుత్వం కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయటంపై పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే ప్రభుత్వం లోపభూయిష్టంగా వ్యవహరించిందని, గత డీఈవోను ఈ కారణం చూపి సస్పెండ్ చేశారని ‘సాక్షి’తో అన్నారు. విద్యాశాఖ వైఖరిపై పోరుబాట పట్టనున్నట్లు ఆయన చెప్పారు. -
రూల్స్ కొండెక్కిద్దాం..!
నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ పెద్దలు కుదరదంటున్న కేంద్ర అటవీ శాఖ యాజమాన్య హక్కుల కోసం రాష్ర్ట సర్కారు ఒత్తిడి రెండు కొండలపై హక్కుల కోసం పట్టు అస్మదీయులకు కొండలను కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కేంద్ర అటవీమంత్రిత్వ శాఖతో ఢీ అంటూ ఢీ అంటున్నారు. నగరంలోని రెండు కొండలను పీపీపీ విధానంలో తమవారికి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. వాటిని డీనోటిఫై చేయడంతోపాటు యాజమాన్య హక్కు బదలాయించాలని పట్టుబడుతున్నారు. నిబంధనలకు విరుద్ధమైన ఈ ప్రతిపాదనను సమ్మతించమని కేంద్ర అటవీమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దాంతో ప్రభుత్వ పెద్దలు రాజకీయంగా ఒత్తిడి తెచ్చి మరీ తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం : నగరంలోని 3,071 ఎకరాల విస్తీర్ణంలోని కొండలను దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. పర్యాటక ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణ పేరుతో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ కొండలను అస్మదీయులకు కట్టబెట్టాలని ఎత్తగడ వేశారు. ఇవి రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉండటంతో వారి గొంతులో వెలక్కాయపడింది. దాంతో డీనోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. యాజమాన్య హక్కును బదలాయిస్తూ డీనోటిఫై చేయాలని ప్రతిపాదించింది. అలా అయితే ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టవచ్చని భావించింది. వుడా కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు కొన్ని నెలల క్రితం లేఖ కూడా రాసింది. కేంద్రం అనుమతి ఇస్తుందని తొలి విడతగా 1,105 ఎకారాల్లోని సీతకొండ( 893 ఎకరాలు), ఎర్రకొండ(212 ఎకరాలు) పర్యాటక ప్రాజెక్టుల కోసం టెండర్లు కూడా పిలిచింది. వీటి పరిశీలనకు కన్సల్టెన్సీని కూడా నియమించేసింది. కుదరదంటే కుదరదు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ ఐజీ నగ్వీ ఇటీవల జిల్లాలో పర్యటించి జిల్లా అధికారులతో సమీక్షించారు. రిజర్వు ఫారెస్టు పరిధిలోని కొండలను డీనోటిఫై చేయలేమని తేల్చిచెప్పారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. పర్యాటక ప్రాజక్టులు, విల్లాల నిర్మాణం మొదైలవి ప్రైవేటు రంగంలో నెలకొల్పనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అవి ప్రజోపయోగ ప్రాజెక్టులు కాకుండా వ్యాపారాత్మక ప్రాజెక్టులు కిందకు వస్తాయని కూడా ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో రెవెన్యూ పోరంబోకు కొండలపై పీపీపీ ప్రాజెక్టులు నిర్మించుకోమని కూడా నగ్వీ సూచించారు. రిజర్వు ఫారెస్టు భూములు ఇవ్వలేమని స్పష్టం చేశారు. అనుమతించినా న్యాయపరమై ఇబ్బందులు వస్తాయని చెప్పడం గమనార్హం. యాజమాన్య హక్కు ఇవ్వాల్సిందే అటవీ శాఖ అభ్యంతరంతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారు. లీజకు విషయంలో నిబంధనలు కఠినంగా ఉన్నాయి. చెట్లను ఇష్టానుశారం నరకడానికి వీల్లేదు. ఓ పరిమితికి మించి నిర్మాణాలు చేపట్టకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే లీజును రద్దు చేస్తారు కూడా. ప్రభుత్వం మాత్రం కొండలను తమ అస్మదీయులకు కట్టబెట్టి వాటిపై భారీ నిర్మాణాలకు ప్రణాళిక రూపొందించింది. అందుకే ఆ కొండలను డీనోటిఫై చేస్తూ యాజమాన్య హక్కు బదలాయించేలా కేంద్ర ఉన్నతాధికారులను ఒప్పించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. తగిన ప్రతిపాదనలతో ఓ బృందం ఢిల్లీ వెళ్లాలని చెప్పారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్ ట్రస్టులు
నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం మైనింగ్ ప్రభావిత ప్రాంతాల పరిరక్షణ కోసం హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించిన గనులు, ఖనిజాలు(అభివృద్ధి, ని యంత్రణ) చట్టం-2015 నిబంధనలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు(డీఎంఎఫ్టీ)లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం డీఎంఎఫ్‌టీల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది. మైనింగ్ ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తులు, ప్రాంతాల ప్రయోజనాలు కాపాడటం లక్ష్యంగా ఈ ట్రస్టు పనిచేస్తుంది. పరిశ్రమలు, భూగర్భ వనరులశాఖ కార్యదర్శి ‘సెట్లర్’ హోదాలో ట్రస్టుల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే పాలకమండలిలో జాయింట్ కలెక్టర్, ఎస్పీ కో చైర్మన్లుగా వ్యవహరిస్తారు. అటవీ, గిరిజనాభివృద్ధి, జడ్పీ, నీటి పారుదల, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు భవనాలు, గనులు, భూగర్భ జలవనరులు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల జిల్లాస్థాయి అధికారులు, మినరల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి ట్రస్టీలుగా ఉంటారు. జిల్లా పంచాయతీ అధికారి ట్రస్టీ కార్యదర్శిగా పనిచేస్తారు. పాలకమండలి ట్రస్టు విధివిధానాలను రూపొందించడంతోపాటు, ట్రస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. వార్షిక ప్రణాళిక తయారి, మైనింగ్ ప్రాంతాలు, వ్యక్తులకు లబ్ధి చేకూర్చే పథకాల రూపకల్పన పాలకమండలి విధుల్లో చేర్చారు. దీనితోపాటు జిల్లా పరిషత్ సీఈవో చైర్మన్‌గా గనులు, భూగర్భ వనరులశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సభ్యుడిగా, జిల్లా పంచాయతీ అధికారి సభ్యకార్యదర్శిగా మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. మైనింగ్ లీజుదారుల నుంచి కంట్రిబ్యూషన్ ఫండ్ వసూలు చేయడం తదితరాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.