నిబంధనలు బేఖతర్‌! | This is contrary to the terms of the pace of construction | Sakshi
Sakshi News home page

నిబంధనలు బేఖతర్‌!

Published Thu, Mar 30 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

నిబంధనలు బేఖతర్‌!

నిబంధనలు బేఖతర్‌!

గుట్టుచప్పుడు కాకుండా ఎంఆర్‌సీ భవన నిర్మాణం
అడ్డుకున్న జెడ్పీ ఫ్లోర్‌లీడర్, ఎంపీపీ


నక్కపల్లి (పాయకరావుపేట): పాయకరావుపేట మండల పరిషత్‌కు చెందిన స్థలంలో అనుమతి లేకుండా  నిర్మిస్తున్న ఎంఆర్‌సీ భవన నిర్మాణాన్ని జెడ్పీటీసీ, ఎంపీపీ నిలుపు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున భవన శ్లాబ్‌ వేసే ప్రయత్నాలను జెడ్పీటీసీ చిక్కాల రామారావు, ఎంపీపీ శివ అడ్డుకున్నారు.  నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ భవన నిర్మాణాన్ని అడ్డుకోవాలని సోమవారం జెడ్పీ ఫ్లోర్‌లీడర్, ఎంపీపీ అల్లాడ  శివకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కాంట్రాక్టర్‌  ఏకపక్షంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. బుధవారం ఉగాది సందర్భంగా అధికారులు ఎవరూ లేని సమయాన్ని చూసి శ్లాబ్‌ వేసేందుకు చేసిన ప్రయత్నాలను జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ చిక్కాల రామారావు, ఎంపీ పీ శివకుమార్‌  అడ్డుకున్నారు.  

ఎంఆర్‌సీ భవనం నిర్మిస్తున్న స్థలం మండల పరిషత్‌కు చెందినదని, ఇక్కడ ఏదైనా భవనం నిర్మించాలంటే పాలకవర్గం అనుమతి తీసుకోవాల ని,  ఎంఈవో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడంతో సర్వశిక్ష అభియాన్‌ వారు కాంట్రాక్టర్‌ ద్వారా పనులు చేపడుతున్నారని వీరు ఆరోపిస్తున్నారు.   ఈ నిర్మాణ పనులు తక్షణమే  నిలిపివేయాలన్నది  పాలకవర్గ సభ్యుల డిమాండ్‌. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. బిల్లులు నిలుపు చేయాలని కోర్టును కోరడంతోపాటు, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడం, చెల్లించిన బిల్లులు రికవరీ చేయాలని కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement