పాయకరావుపేట: పట్టణంలో కంటోన్మెట్‌లో కాకర సుమలత అలియాస్ పార్వతి(35) అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్‌ఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమలత అలియాస్ పార్వతి భర్త సురేష్‌తో కలిసి గాజువాకలో నివాసం ఉండేది. సురేష్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. ఆ ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో పాయకరావుపేటలో ఉంటున్న సుమలత తల్లి ఇంటికి వచ్చేశారు. ఐదు రోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకుని వేరే ఉంటున్నారు. గురువారం భర్త సురేష్ బయటకు వెళ్లిన తరువాత సుమలత ఉరివేసుకుని మృతిచెందినట్టు ఎస్‌ఐ చెప్పారు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కేసునమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment