
సాక్షి, లింగంపేట(నిజామాబాద్): ఆడపిల్లలు పుట్టారని భర్త నిత్యం వేధిస్తుండంటంతో ఓ వివాహిత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన లింగంపేట మండలంలోని పొల్కంపేటలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్ల నాగవణి(27), సంజీవులు భార్యాభర్తలు. వీరికిపెళ్లయి 12 ఏళ్లు అవుతోంది. ఈదంపతులకుఇద్దరు ఆడపిల్లలు భవిత(11), లాస్య (ఏడాది)ఉన్నారు. సంజీవులు బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లి తిరిగి వచ్చాడు. గల్ఫై నుంచి వచ్చిననాటి నుంచి ఆడపిల్లలు పుట్టారని సంజీవులు నాగమణిని వేధిస్తున్నాడు.
దీంతో ఆమె ఈ విషయాన్నితన తల్లిదండ్రులకు వివరించింది. వారు వచ్చి పలుమార్లు నచ్చజేప్పారు. అయినా అతనిలోమార్పు రాలేదు. అంతేకాకుండా నాగమణి తల్లిదండ్రులను ఇంటికి రానిచ్చే వాడుకాదు. ఫోన్‌లో సైతం మాట్లాడవద్దని బెదిరించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నాగమణి తన తల్లితో ఫోన్ లోమాట్లాడింది. వారికి ఎందుకు ఫోన్ చేశావని సంజీవులు ఆమెతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన నాగమణి రాత్రి అందరు పడుకున్నాక ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
గురువారం ఉదయం గ్రామస్తులు వెతుకుతుండగా గ్రామ సమీపంలోని వాగులోని నీటి మడుగులో విగతజీవిగా కనిపించింది. ఆడ పిల్లలు పుట్టారని అల్లుడు వేధిస్తుండటంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని నాగమణి తల్లి వడ్ల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment