married women Suicide
-
క్షణికావేశంలోవివాహిత ఆత్మహత్య
మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అప్పాయపల్లికి చెందిన శ్వేత (26) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల ద్వారా తెలిసిన వివరాలు.. కుటుంబ సభ్యులందరూ కలిసి మంగళవారం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లివచ్చారు. కుటుంబ సమస్యల కారణంగా క్షణికావేశంలో వివాహిత తమ ఇంటికి అనుసరించుకొని ఉన్న పాత ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు కొన ఊరిపితో ఉన్న ఆమెను నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందింది. ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. -
ఆడ పిల్లలు పుట్టారని భర్త వేధింపులు.. దీంతో ఆ మహిళ
సాక్షి, లింగంపేట(నిజామాబాద్): ఆడపిల్లలు పుట్టారని భర్త నిత్యం వేధిస్తుండంటంతో ఓ వివాహిత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన లింగంపేట మండలంలోని పొల్కంపేటలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్ల నాగవణి(27), సంజీవులు భార్యాభర్తలు. వీరికిపెళ్లయి 12 ఏళ్లు అవుతోంది. ఈదంపతులకుఇద్దరు ఆడపిల్లలు భవిత(11), లాస్య (ఏడాది)ఉన్నారు. సంజీవులు బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లి తిరిగి వచ్చాడు. గల్ఫై నుంచి వచ్చిననాటి నుంచి ఆడపిల్లలు పుట్టారని సంజీవులు నాగమణిని వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఈ విషయాన్నితన తల్లిదండ్రులకు వివరించింది. వారు వచ్చి పలుమార్లు నచ్చజేప్పారు. అయినా అతనిలోమార్పు రాలేదు. అంతేకాకుండా నాగమణి తల్లిదండ్రులను ఇంటికి రానిచ్చే వాడుకాదు. ఫోన్లో సైతం మాట్లాడవద్దని బెదిరించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నాగమణి తన తల్లితో ఫోన్ లోమాట్లాడింది. వారికి ఎందుకు ఫోన్ చేశావని సంజీవులు ఆమెతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన నాగమణి రాత్రి అందరు పడుకున్నాక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. గురువారం ఉదయం గ్రామస్తులు వెతుకుతుండగా గ్రామ సమీపంలోని వాగులోని నీటి మడుగులో విగతజీవిగా కనిపించింది. ఆడ పిల్లలు పుట్టారని అల్లుడు వేధిస్తుండటంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని నాగమణి తల్లి వడ్ల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
డబ్బు ఇవ్వలేనంది.. ఫోన్ రికార్డు భర్తకు ఇవ్వడంతో
కావలి: బంధువు వేధింపులు, భర్త, అత్త కుటుంబ సభ్యుల హింసలు తట్టుకోలేక ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో నిందితులను జలదంకి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు కావలి డీఎస్పీ డి.ప్రసాద్ వివరాలు వెల్లడించారు. జలదంకి మండలం కొత్తపాళెం గ్రామానికి చెందిన కోట మహితకు ప్రసాద్‌రెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. గ్రామంలో న్యూడిల్స్ అమ్మకా లు చేసే వ్యక్తి తన పాటు చిన్నప్పటి నుంచి చదువుకున్న స్నేహితుడు కావడంతో అప్పుడప్పుడు మహిత తన బంధువైన కోట వెంకటరెడ్డి సెల్ ఫోన్‌తో మాట్లాడుతుండేది. అయితే వీరి మధ్య ఎటువంటి అసభ్యకరమైన, అభ్యంతరకరమైన మాటలు లేవు. అయితే వారి మాటలను కోట వెంకటరెడ్డి తన ఫోన్లో రికార్డ్ చేస్తుండేవాడు. ఈ విషయం మహితకు తెలియదు. కొద్ది రోజులకు కోట వెంకటరెడ్డి న్యూడిల్స్ అమ్మకాలు చేసే వ్యక్తితో మాట్లాడుతున్న విషయం భర్త, అత్త మామలకు చెబుతానని, అలా చెప్పకూడదంటే తనకు డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. మహిత భయపడి కోట వెంకటరెడ్డికి పలుమార్లు డబ్బులు ఇస్తుండేది. అయితే వెంకటరెడ్డి వేల రూపాయలు ఇవ్వాలని ఆమెను బెదిరిస్తున్నాడు. అంత డబ్బులు ఇచ్చే స్థోమత లేని మహిత తాను ఇవ్వలేనని చెప్పేసింది. దీంతో కోట వెంకటరెడ్డి తన ఫోన్లో ఉన్న మహిత, న్యూడిల్స్ అమ్మకాలు చేసే వ్యక్తి కాల్స్‌కు సంబంధించిన వాయిస్ రికార్డులను ఆమె భర్తకు అందజేశాడు. దీంతో ఆమెను భర్త ప్రసాద్‌రెడ్డి, అత్త పద్మ, భర్త అమ్మమ్మ రావమ్మ శారీరకంగా, మానసికంగా హింసించసాగారు. తట్టుకోలేక మహిత ఈ నెల 13న ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు జలదంకి పోలీసులు కేసు నమోదు చేశారు. కావలి రూరల్ సీఐ పి.అక్కేశ్వరరావు, జలదంకి ఎస్సై ఎం.వెంకట్రావు, సిబ్బంది దర్యా ప్తు చేసి కోట వెంకటరెడ్డి ఫోన్లోని డేటాను శాస్త్రీయంగా సేకరించి కేసును దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఆత్మహత కేసుగా నమోదు కాగా, దర్యాప్తు అనంతరం మృతురాలి భర్త ప్రసాద్‌రెడ్డి, మిగిలిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భర్తతో పాటు సెల్ఫోన్లో వాయిస్ రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన కోట వెంకటరెడ్డిను శనివారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. మిగిలిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేస్తామని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ అక్కేశ్వరరావు, ఎస్సై వెంకట్రావు పాల్గొన్నారు. చదవండి: పోలీస్‌స్టేషన్‌లో నగదు మాయం -
వివాహేతర సంబంధం: చెరువులోపడి భార్య ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: దుందిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య చూడటానికి లావు ఉందనే కోపంతో నిత్యం వేధింపులకు గురి చేశాడు ఓ కానిస్టేబుల్. దీంతో ఆ వివాహిత తీవ్ర మనస్తాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీలత భర్త శివ కుమార్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్రీలత లావు అందనే కోపంతో అన్నం కూడా పెట్టేవాడు కాదని తెలిపారు. కొన్ని నెలలు క్రితమే పూర్వ విద్యార్థుల గేట్‌టుగెదర్ కార్యక్రమం జరిగిన సమయంలో అక్కడ మరో వివాహిత శివ కుమార్‌కి పరిచయం అయింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని శ్రీలత తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని దుండిగల్ సీఐ తెలిపారు. మరోవైపు తమ కూతురును చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రీలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తమ అమ్మాయి శ్రీలతను కానిస్టేబుల్ శివకుమార్‌తో వివాహం చేశామని తెలిపారు. వివాహం జరిగినప్పటి నుంచి కట్నం కోసం వేధింపులు చేస్తున్నాడని తెలిపారు. ఇక కానిస్టేబుల్ శివ కుమార్ ఆరేళ్ల కూతురు తన తండ్రి అరాచకంపై కన్నీరు పెట్టుకుంది. అమ్మను ప్రతిరోజు కొట్టేవాడని, అన్నం పెట్టకుండా వేధించే వాడని చిన్నారి తెలిపింది. బయట నుంచి కోపంతో వచ్చి అమ్మ పైన దాడి చేసేవాడిని తెలిపింది. చదవండి: గగన్ అగర్వాల్ హత్యకేసు: వెలుగులోకి కీలక విషయాలు -
భర్త వేధింపులు: వివాహిత ఆత్మహత్య
-
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
పెందుర్తి: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం 69వ వార్డు వేపగుంట దరి అప్పలనర్సయ్య కాలనీలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అప్పలనర్సయ్యకాలనీలో నివసిస్తున్న పూడి శ్రీనుబాబునాయుడు నేవల్ డాక్‌యార్డులో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి 72వ వార్డు శ్రీనివాసనగర్‌కు చెందిన పూడి గాయత్రి(26)తో 2010లో వివాహమైంది. వీరికి ఎనిమిది నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు. ఇదిలా ఉండగా.. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఈ తరుణంలో గాయత్రి తండ్రి కర్రి పైడిరాజు మంగళవారం జరిగిన పైడితల్లి అమ్మవారి పండగకు అల్లుడిని, కూతురిని శ్రీనివాసనగర్‌లోని తన ఇంటికి ఆహ్వానించాడు. మంగళవారం రాత్రి గాయత్రిని, పిల్లలను పుట్టింటిలో వదిలి శ్రీనుబాబునాయుడు చెప్పాపెట్టకుండా వెంటనే వెళ్లిపోయాడు. ఇందేంటని విషయం తెలుసుకుని పైడిరాజు అల్లుడికి పలుమార్లు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అదేరోజు రాత్రి గాయత్రి కూడా పిల్లలను తీసుకుని తిరిగి వచ్చేసింది. బుధవారం ఉదయం భర్తకు భోజనం బాక్స్ కట్టి ఇచ్చింది. పిల్లలకు స్నానం చేయించింది. అనంతరం ఒంట్లో బాగోలేదని పనిమనిషికి చెప్పి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కొంత సేపటికి పిల్లలు ఏడుస్తుండడంతో పనిమనిషి తలుపు తట్టింది. ఎంతకీ తీయకపోయేసరికి పక్క గదిలో ఉన్న గాయత్రి మామకు విషయాన్ని చెప్పింది. ఆయన కూడా వచ్చి తలుపు తట్టాడు. తీయకపోవడతో విషయాన్ని శ్రీనుబాబుకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. భర్త వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపల చూడగా చున్నీతో గాయత్రి ఉరి వేసుకుని కనిపించింది. కొనఊపిరి ఉన్నట్టు భావించి వెంటనే గాయత్రి తండ్రికి ఫోన్‌చేసి రప్పించాడు. పైడిరాజు వచ్చి వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని అప్పలనర్సయ్య కాలనీకి తీసుకొచి తన కుమార్తె మృతికి కారణం భర్త, మామ, కుటుంబీకులేనని పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పెందుర్తి సీఐ వెంకునాయుడు శవపంచనామా జరిపి గాయత్రి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసును దర్యాపు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంఘటన స్థలంలో ఇరు కుటుంబాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పోస్టుమార్టం అనంతరం అప్పలనర్సయ్య కాలనీలో ఉన్న ఇంటికి మృతదేహాన్ని తీసుకురాగా ఆమె భర్తని, కుటుంబీకులను చూడనివ్వకుండా గాయత్రి బంధువులు అడ్డుకున్నారు. దీంతో గ్రామపెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. -
వివాహిత ఆత్మహత్య
అనంతపురం ,రాయదుర్గం రూరల్: మండలంలోని రేకులకుంట గ్రామానికి చెందిన గాజుల అంజలీ (21) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. బాధితురాలి తండ్రి చంద్ర, తరుపు బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ... రేకులకుంటకు చెందిన అంగడి గోవిందప్ప రెండో కుమారుడు సోమనాథ్‌కు కంబదూరు మండలం కదిరిదేవరపల్లి గ్రామానికి చెందిన చంద్ర కుమార్తె అంజలితో మూడేళ్ల క్రితం వివామైంది. భార్యను పోషించలేని సోమనాథ్ తరచూ అంజలీని అనుమానం పడుతు వరకట్నం తీసుకురావాలని చిత్రహింసలు పెట్టి వేధించేవాడు. విషయాన్ని అంజలీ గతంలో తండ్రికి చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదిర్చారు. బుధవారం కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన అంజలీతో అత్త లక్ష్మీదేవి, మామ గోవిందప్ప, మరిది సతీష్, బావ నారాయణస్వామిలు ఒత్తిడి చేసి ఆమెపై చేయిచేసుకున్నారు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన అంజలి క్షణికావేశంలో ఇంటిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు అంజలీని ఎన్. గుండ్లపల్లి ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని అంజలి బంధువులకు చెప్పారు. గ్రామానికి చేరుకున్న బంధువులు... పోస్టుమార్టం నిమిత్తం అంజలి మృతదేహాన్ని తరలించే సమయంలో ఆమె ఒంటిపై కొట్టిన దెబ్బలు స్పష్టంగా కనబడటంతో అనుమానం వచ్చి పరిశీలించారు. చిత్రహింసలు పెట్టి కుటుంబ సభ్యులే ఉరివేసుకుని చనిపోయినట్లుగా చిత్రికరించేందుకు పన్నాగాలు పన్నుతున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్ట్‌మార్టం చేయడానికి పోలీసులు సాయంత్రం 4.30 గంటల వరకూ నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఆగ్రహించిన బాధితురాలి బంధువులు రోడ్డుపై ధర్నా నిర్వహించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో కొంతమంది వ్యక్తులు, వారి కుటుంబీకులతో పోలీసులు కుమ్మకై కమీషన్ల కోసం కక్కుర్తిపడి కేసును పక్కదోవ పట్టించేందుకు కుటిల యత్నాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. గ్రామంలో గతంలో గాజుల ప్రమీలమ్మ, ఆమె కుమార్తె భారతీని కూడా వారి బంధువులు హత్యలు చేసి కేసులు లేకుండా చేయడంలో కొంతమంది గ్రామస్తులు ఆరితేరారని చెప్పారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మల్లికార్జున ప్రభుత్వాస్పత్రికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు. పోస్ట్‌మార్టం చేయిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఐపీసీ 394బి, 498 , రెడ్‌విత్ 34, 3, 4 డీపీఏ కేసులను ఆరుగురిపై నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
కృష్ణలంక(విజయవాడ తూర్పు): అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రీ కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంకాబత్తుల తారకరాము (రాము)కు విద్యాధరపురానికి చెందిన స్రవంతి(28)తో తొమ్మిదేళ్ల కిందట వివాహం అయ్యింది. వీరు ఐదేళ్ల పవిత్ర, మూడేళ్ల ఉపాసనల సంతానంతో కృష్ణలంక రాణిగారితోటలో నివాసముంటున్నారు. రాము కూల్‌డ్రింక్స్ డిస్టిబ్యూషన్ వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల చెడు వ్యసనాలకు బానిస అయ్యి అప్పులపాలయ్యాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ తరచూ భార్య స్రవంతితో గొడవలు పడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం స్రవంతి తండ్రి నూతన గృహప్రవేశ వేడుకకు రావాల్సిందిగా రాముకు ఫోన్ చేసి ఆహ్వానించిన క్రమంలో తనకు రూ. 2లక్షలు ఇస్తేనే వస్తానంటూ తేల్చిచెప్పాడు. ఈ విషయంపై భార్య, భర్తలకు తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆదివారం ఉదయం 11గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రీ 11గంటల సమయంలో రాము ఇంటికి రాకపోవడంతో అతని ఇంటి పైఅంతస్తులో నివాసముండే అతని సోదరుడు వెళ్లి తలుపు కొట్టడంతో రాము కూతురు తలుపు తీసింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో స్థానికుల సహాయంతో కిందికి దించి దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి భర్త రాముతోపాటు వారి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, సుధారాణిలను అదుపులోకి తీసుకుని 498 సెక్షన్‌కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇది ముమ్మాటికీ హత్యే.. మృతురాలి భర్త రాము చెడు వ్యసనాలకు బానిస అవ్వడంతో పాటు ఇటీవల ఒక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు, దీనిపై తరచూ వారి మధ్య గొడవలు జరుగుతుండేవని, భార్య అడ్డు తొలగించుకునేందుకు అతనే తన బిడ్డను దారుణంగా కొట్టి హత్యచేసి ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి తన బిడ్డ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కన్నీటి పర్యంతమయ్యారు. -
అవమాన భారంతో..
హయత్‌నగర్: పక్క పోర్షన్లో నివసించే వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని అవమానంగా భావించిన ఓ గృహిణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పవనగిరి కాలనీలో నివసించే కొమిరెల్లి రమేశ్‌రెడ్డి ఆర్టీసీ డ్రైవర్. అతని భార్య ప్రశాంతి (24) గృహిణి. వారికి ఓ బాబు, పాప ఉన్నారు. శనివారం రాత్రి 9 గంటలకు మృతురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పక్క పోర్షన్లో నివసించే కుంచాల నరేష్ అనే వ్యక్తి ఆమె ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఆమె బయటికి పరుగులు తీసి ఇంటి ఓనర్‌కు విషయం చెప్పింది. దీనిని అవమానంగా భావించిన ప్రశాంతి తన బాబును బయటికి పంపించి పాప నిద్ర పోతున్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు కారణమైన నరేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త మందలించాడని భార్య ఆత్మహత్య
బంజారాహిల్స్: దత్తత తీసుకున్న కుమార్తెను సరిగ్గా చూడడంలేదని మందలించినందుకు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. బంజారాహిల్స్ రోడ్డు నెం.10 లోని సింగాడీకుంట బస్తీలో నివసించే నజీమాఖాన్ (29)కు 2009లో జమీల్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి నలుగురు మగపిల్లలు కాగా, ఏడాదిక్రితం నజీమాఖాన్కు సమీపంలో నివసించే రియాజ్ అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో ఆరు నెలలక్రితం ఇద్దరూ విడిపోయారు. కాగా పిల్లలను జమీల్ తనతో పాటే ఉంచుకున్నాడు. దీంతో నజీమా ఐదు నెలలక్రితం రెండున్నర ఏళ్ల వయస్సున్న ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటూ చిన్నారికి ఉమేద అని పేరుపెట్టింది. ఇదిలాఉండగా నజీమా ఇటీవల తన భర్త వద్ద ఉన్న పిల్లలకు తిరిగి దగ్గరై వారందర్నీ చూసుకుంటోంది. ఈ క్రమంలోనే జమీల్ దత్తత తీసుకున్న కుమార్తెను సరిగ్గా చూడడంలేదంటూ మందలించాడు. గురువారం రాత్రి శుభకార్యానికి వెళ్లివచ్చిన వీరు అర్ధరాత్రి 12 గంటల వరకు గొడవపడ్డారు. శుక్రవారం ఉదయం జమీల్ ఎప్పటిలాగే విధులకు వెళ్లిన కొద్దిసేపటికే నజీమా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కలవారు గమనించి జమీల్‌కు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
విశాఖపట్నం ,గాజువాక: భర్తతో తలెత్తిన ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చైతన్యనగర్‌కు చెందిన పి.శేషుబాబు ఫార్మా కంపెనీలోని లారస్ ఫార్మాష్యూటికల్స్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన పరిమళ (29)తో ఆరు నెలల క్రితం వివాహమైంది. శేషుబాబు కంపెనీ పనిమీద ఊరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి రెండు రోజుల క్రితం వెళ్లాడు. ఈ నేపథ్యంలో పరిమళ లారస్ కంపెనీకి బుధవారం వెళ్లి భర్త ఆచూకీ కోసం అడిగింది. ఇంటర్వ్యూల కోసం అతడు విజయవాడ వెళ్లినట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అక్కడి నుంచి భర్తకు ఫోన్ చేసి మాట్లాడిన పరిమళ ఇంటికి చేరుకుంది. అనంతరం ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకొని మృతి చెందింది. దీన్ని గమనించిన స్థానికులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తతో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని, అందువల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ప్రసాద్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నట్టు సీఐ కె.రామారావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
చిచ్చు పెట్టిన పంచాయతీ ఎన్నికలు వివాహిత ఆత్మహత్య
-
క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): దంపతుల నడుమ స్వల్ప వివాదం చెలరేగి క్షణికావేశానికి లోనైన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నెల్లూరు నగరంలోని శ్రీహరినగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సమాచారం మేరకు మర్రిపాడు మండలం చిలకపాడు గ్రామంలో బి.ఓబుల్‌రెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన కుమార్తె స్రవంతి(26) బీటెక్ పూర్తిచేసుకొంది. 2013లో ఆమెకు మర్రిపాడు మండలం సింగన్నపల్లికి చెందిన ఆర్.వెంకటేశ్వర్లురెడ్డితో వివాహమైంది. వెంకటేశ్వర్లురెడ్డి అమెరికాలోని లాస్ఏంజెల్స్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వివాహానంతరం దంపతులిద్దరూ అమెరికాకు వెళ్లారు. ఈక్రమంలో 2016 జూలైలో స్రవంతి తన చెల్లెలు వివాహ నిశ్చితా ర్థం కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వగ్రామానికి వచ్చింది. అప్పటి నుంచి ఆమె తన తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. వీసా సమస్యల కారణంగా వెంకటేశ్వర్లురెడ్డి చిలకపాడుకు రాలేకపోయారు. ఐదు నెలల క్రితం ఆయన స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకొంటూ దంపతులిద్దరూ నగరంలోని శ్రీహరినగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. దీపావళి పండగ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ చిలకపాడుకు వెళ్లాలని దంపతులిద్దరూ నిర్ణయించుకొన్నారు. స్రవంతి తన తండ్రి ఓబుల్‌రెడ్డికి ఫోన్ చేసి ఊరికి వస్తున్నామని చెప్పగా ఆయన బస్సులో రావాలని సూచించాడు. అయితే వెంకటేశ్వర్లురెడ్డి చిలకపాడు నుంచి తన ఊరికి బైక్‌పై వెళదామని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. బస్సులోనే వెళదామని స్రవంతి పట్టుబట్టింది. వెంకటేశ్వర్లురెడ్డి ససేమిరా అన్నారు. కుమారుడు రామ్‌శ్రావణ్‌రెడ్డి వస్తువులన్నీ కింద పడేస్తుండడంతో స్రవంతి అతనిని మందలించడాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకు కుమారుడిని తిడుతావని ఆమెను ప్రశ్నించాడు. దీంతో మనస్థాపం చెంది సీలింగ్‌ఫ్యాను హుక్కుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయాన్ని గమనించిన భర్త స్థానికుల సహకారంతో ఆమెను కిందకు దించి సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందిందని నిర్ధారణ కావడంతో బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. శుక్రవారం అర్ధరాత్రి మృతురాలి తండ్రి ఓబుల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రభుత్వ వైద్యులు శనివారం మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. -
గృహిణి ఆత్మహత్య
పాయకరావుపేట: పట్టణంలో కంటోన్మెట్‌లో కాకర సుమలత అలియాస్ పార్వతి(35) అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఎస్ఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమలత అలియాస్ పార్వతి భర్త సురేష్‌తో కలిసి గాజువాకలో నివాసం ఉండేది. సురేష్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. ఆ ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో పాయకరావుపేటలో ఉంటున్న సుమలత తల్లి ఇంటికి వచ్చేశారు. ఐదు రోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకుని వేరే ఉంటున్నారు. గురువారం భర్త సురేష్ బయటకు వెళ్లిన తరువాత సుమలత ఉరివేసుకుని మృతిచెందినట్టు ఎస్ఐ చెప్పారు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కేసునమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
ముత్తుకూరు: భర్తపై అనుమానంతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తుకూరు ఎస్సై సాంబశివరావు కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా, సాన్కోహ్లి గ్రామానికి చెందిన బంజాకుమార్‌స్వాయి–బాసంతిస్వాయి(24) దంపతులు స్థానిక గురుకుల పాఠశాల ఎదురుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బంజాకుమార్ పోర్టులోని అక్షర ఇండస్ట్రీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. డ్యూటీ నుంచి ఆలస్యంగా వచ్చిన భర్తను సోమవారం భార్య నిలదీసింది. అయితే సక్రమంగా సమాధానం చెప్పకుండా మంగళవారం ఉదయం భర్త డ్యూటీపై గుమ్మడిపూండికి వెళ్లిపోయాడు. ప్రశ్నించిన తనను సముదాయించకపోగా, సక్రమంగా బదులివ్వని భర్తపై అనుమానం పెంచుకుంది. రాత్రి ఉరేసుకుని మృతి చెందింది. రైలు దిగే బంజాకుమార్‌ను నెల్లూరు నుంచి తీసుకు వచ్చేందుకు సురేష్ అనే స్నేహితుడు మోటారు సైకిల్ కోసం ఇంటికి వెళ్లి చూడగా బాసంతి ఉరేసుకుని ఉండడంతో హతాశుడయ్యాడు. భర్త ఇంటికి వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
కలిగిరి (నెల్లూరు): మండల కేంద్రమైన కలిగిరి పంచాయతీ జిర్రావారిపాలెం ఎస్సీకాలనీలో కట్టా మమత (20) అనే వివాహిత సోమవారం ఇంట్లో ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతిచెందింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్సీకాలనీకి చెందిన కట్టా నాగేశ్వరరావు కుమారుడు సూర్యకు రాయచోటికి చెందిన బండ్ల కుమార్, రమణమ్మల కుమార్తె మమతకు ఒకటిన్నర సంవత్సరం క్రితం వివాహమైంది. భర్త వేధింపులు అధికంగా ఉన్నాయని గతంలో మమత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను జైలులో ఉండి వచ్చాడు. నెలరోజుల క్రితం పెద్దలు సర్దుబాటు చేసి ఆమెను జిర్రావారిపాలెంలోని భర్త ఇంటికి పంపారు. సోమవారం ఉదయం సూర్య తన భార్య ఇంట్లోని వంటగదిలో ఉరి వేసుకుందని స్థానికులకు తెలిపాడు. ఆమెను కలిగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మమత మృతదేహన్ని ఇంటి వద్దకు తీసుకువచ్చి సూర్య పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మమత బంధువులు గ్రామానికి చేరుకుని సూర్య వేధింపుల కారణంగానే ఇలా జరిగిందని ఆవేదన చెందారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఆగ్రహం తహసీల్దార్ సి.ఉష ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మమత మృతదేహాన్ని, ఉరి వేసుకున్నట్టు చెబుతున్న చున్నీని పరిశీలించారు. ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేశారు. సూర్య పారిపోయేందుకు ప్రయత్నించాడని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్సై పి.చినబలరామయ్య అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య
మానకొండూర్: అత్తి వేధింపులకు మరో వివాహిత ప్రాణాలు విడిచింది. పెళ్లయి పుష్కరకాలం గడిచినా.. కట్నం వేధింపులు ఆ మహిళను వీడలేదు. మనస్తాపం చెందిన సదరు వివాహిత నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామం లో గురువారం చోటు చేసుకుంది. సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన మాచర్ల ఎల్లయ్య పెద్ద కూతురు రేణుక(32)ను తన సొంత అక్క అయిన మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామాని కి చెందిన మొలుగూరి ఎల్లవ్వ కొడుకు గోపాల్‌కు ఇచ్చి 13 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఆ సమయంలో రూ. లక్షాపదివేల కట్నం, ఇతర లాంఛనాలు అందజేశారు. గోపాల్ కులవృత్తి చేస్తుండగా.. రేణుక వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. కొద్దిరోజులు వీరికాపురం సజావుగానే సాగింది. వీరికి కుమారుడు జయంత్ జన్మించాడు. ఆ తరువాత మరో ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. అదనపు కట్నం వేధింపులు.. కొద్దిరోజులకు ఇంట్లో అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. మృతురాలి భర్త గోపాల్. అత్త ఎల్లవ్వ, మామ రాములు, ఆడపడుచు చెక్కిల్ల సరోజన గత ఐదేళ్లుగా కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు పంచాయితీలు సైతం జరిగాయి. దీంతో తన బిడ్డ సంతోషంగా ఉండాలని మరో రూ. 50 వేలు సైతం మృతురాలి తండ్రి అందించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగలేదు. మంచిగా సదువుకో కొడుకా.. అని.. గురువారం ఉదయం సైతం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం భర్త కులవృత్తికి వెళ్లగా.. అత్త బ్యాంకుకని వెళ్లింది. మామ బయటకు వెళ్లాడు. రేణుక తనకొడుకు జయంత్‌ను పాఠశాలకు సిద్ధంచేసి ‘కొడుకా.. మంచిగ సదువుకో’ అని సాగనంపింది. అనంతరం తలుపులు వేసుకుని కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. ఇంట్లోంచి పొగలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు తెరిచి చూడగా.. రేణుక మంటల్లో దహనమైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో భర్త, అత్త, మామ, ఆడపడుచులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. -
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
సాక్షి, నాగులుప్పలపాడు : తనపై అత్యాచారం యత్నం చేయడమే కాక నిందితుల బంధువులు కూడా సూటిపోటి మాటలు అనడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ఉప్పుగుండూరులో చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్న మద్దిపాడు ఎస్సై రాజేష్ సమాచారం మేరకు ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన లచ్చంశెట్టి వెంకటేశ్వర్లుకు నవ్య (20)తో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి ఉప్పుగుండూరు గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఈ నెల 1వ తేదీన తన ఇంటి సమీపంలోని సంగు వెంకటప్రసాద్, సాయి, మహేష్ అనే యువకులు నవ్య ఒక్కతే ఉన్న సమయంలో ప్రవేశించి అత్యాచార ప్రయత్నం చేశారు. ప్రతిఘటించిన ఆమె ఆ యువకులపై నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ ముగ్గురు యువకుల తల్లులు గంగు పద్మ, భూదిరి పద్మ, అనమర్లపూడి సరోజినితో పాటు వారి బంధువులు సంగు వెంకటరత్నం, సైదులు, లక్ష్మీ అనే వారు నవ్య ఇంటిపైకి వచ్చి తీవ్రమైన పదజాలంతో దూషణ చేస్తున్నారు. తన పట్ల అవమానకరంగా ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన నవ్య మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. తన మరణానికి కారకులైన వారి పై సూసైడ్ లేఖ రాసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించగా మృతి చెందినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
వేధింపులే కారణమా..?
చిన్నపాటి తగాదాకు మనస్తాపం చెందిందా..? అత్తా, మరిది కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి చీటికిమాటికి వేధిస్తుండడంతో అఘాయిత్యానికి ఒడిగట్టిందా..? కారణాలు ఏవైతేనేం.. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పెద్దకుమార్తె ప్రమాదంనుంచి బయటపడగా.. ముక్కుపచ్చలారని చిన్నారితో సహా ఆ మాతృమూర్తి అగ్నిగి ఆహుతైంది. ఈవిషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, మృతురాలి తండ్రి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ (భువనగిరి): మండలంలోని రహీమ్‌ఖాన్‌గూడెం గ్రామానికి చెందిన పిట్టబోయిన భిక్షపతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసపోయాడు. అక్కడే బోడుప్పల్లో నివాసముంటున్నాడు. తన కూతురు నిర్మల(25)ను ఆరేళ్లక్రితం మదిర గూడూరుకు చెందిన జూరూర్ శ్రీశైలంయాదవ్‌కు ఇచ్చి వివాహాం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. విడిగా కాపురం పెట్టుకుని అత్తామామ ఇంట్లోనే అన్యోన్యంగా జీవిస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని.. గతంలో నిర్మల ఓప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. చిన్నకుమార్తె జన్మించిన తర్వాత ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటోంది. కాగా శ్రీశైలం, తన తమ్ముడు వెంకటేశ్ వేరుగా కాపురం పెట్టుకున్నప్పటికీ తల్లి దండ్రుల ఇంట్లోనే ఉంటున్నారు. భర్త లేని సమయంలో అత్త జయమ్మ, మరిది తరుచూ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ తన కూతురు నిర్మలను వేధించేవారని నిర్మల తండ్రి భిక్షపతి ఆరోపించాడు., ప్రతి దానికి సూటిపోటి మాటాలను అంటుండడంతో మనస్తాపం చెంది నిర్మల పిల్లలతో కలసి అత్మహత్యకు పాల్పడిందని కన్నీటిపర్యంతమయ్యాడు. తన అల్లుడు మంచివాడేనని, అతడిపై మాకు అనుమానాలు లేవన్నాడు. తప్పించుకున్న పెద్ద కూతురు ఉదయం 9గంటల సమయంలో భర్త గొర్రెలను మేపేందుకు వెళ్లగా, అత్తమామలు పొలానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నిర్మల ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పు అంటించే సమయంలో భయాందోళనకు గురైన ఎల్కేజీ చదువుతున్న పెద్ద కూతురు ప్రజ్ణ ఇంట్లోని ప్రహరీ ఆవరణంలోకి వెళ్లింది . దీంతో నిర్మల తన దగ్గరే ఉన్న 16నెలల చిన్నకూతురు శృతితో కలసి నిప్పంటించుకుంది. దీంతో వారిద్దరూ సజీవ దహనమయ్యారు. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతిదానికీ చిరాకు పడేది ఇంట్లో ఏదైనా చిన్న పాటి గొడవ జరిగినా మనస్పర్థలు చోటు చేసుకున్నా తన భార్య చిరాకు పడుతూ గొడవపెట్టుకుని అలిగేదని నిర్మల భర్త శ్రీశైలం పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ఇంట్లో పిల్లలకు పాలు లేకపోవడంతో భర్తతో నిర్మల గొడవపడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. భర్త గొర్రెలు మేపేందుకు వెళ్లాడని దీంతో మనస్తాపం చెందిన నిర్మల పిల్లలతో కలసి అత్మహత్య చేసుకోవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో భర్త,అత్తా, మరిది సంఘటన స్థలంలోనే ఉన్న నిర్మల భర్త, అత్త, మామ, మరిదిని పోలీస్‌లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్‌కుమార్ తెలిపారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ...
బొబ్బిలి రూరల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రవీంద్రరాజు, బంధువులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ఎం.బూర్జవలస పంచాయతీ పరిధిలోని గున్నతోటవలస గ్రామానికి చెందిన కోండ్రు అనూరాధ(25), ఈశ్వరరావు నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండున్నరేళ్ల బాబు రుషి ఉన్నాడు. ఈశ్వరరావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ఏడాదిన్నరగా ఈశ్వరరావు అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అనూరాధ గురువారం మధ్యాహ్నం నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను స్థానికులు ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తనను భర్త వేధిస్తున్నాడని కేరళలో ఉన్న తల్లి చంద్రావతి, సవతి తండ్రి షాకోచన్‌లకు ఇటీవలే అనరాధ తెలియజేయడంతో వారు రెండురోజుల కిందటే వచ్చారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ సౌమ్యలత, తహసీల్దార్ ప్రసాద్‌పాత్రో మృతదేహాన్ని పరిశీలించి శవపంచనామా చేశారు. ఎస్సై రవీంద్రరాజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమె మృతదేహం కోసం ‘వారి’ వాగ్వాదం
♦ అయిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న వివాహిత ఆత్మహత్య ♦ తల్లిదండ్రులు హిందువులు, భర్త ముస్లిం కావడంతో వివాదం ♦ ఉస్మానియా మార్చురీ వద్ద 3 గంటలసేపు ఇరువురి బంధువుల వాగ్వాదాలు ♦ పోలీసుల జోక్యంతో కొలిక్కి, బందోబస్తు మధ్య ఖననం సాక్షి, హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకోవడానికి ఆమె కులం, మతం గోడలు బద్దలుకొట్టింది. అయితే చనిపోయిన తర్వాత వాటి నేపథ్యంలోనే ఆమె అంతిమ సంస్కారం ‘వివాదం’లో చిక్కుకోవడం పలువురిని కదిలించింది. ఆమె తల్లిదండ్రులు హిందువులు, భర్త ముస్లిం కావడంతో ఏ మతాచారం ప్రకారం ఆమెను సాగనంపాలన్న దానిపై రగడ చోటుచేసుకుంది. నగరంలోని ఉస్మానియా మార్చురీ వద్ద మంగళవారం మూడు గంటల పాటు సాగిన ఈ వివాదం చివరకు రాజీతో తెరపడింది. అంత్యక్రియల నేపథ్యంలో ఆసిఫ్‌నగర్ పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన విక్రమాచారి కుమార్తె ప్రియాంక చారి. తమ కుటుంబ స్నేహితుడిగా ఉన్న జునైద్ ఆష్మీతో ప్రేమలో పడింది. అయిదేళ్ల కిందట అతడిని వివాహం చేసుకోవడానికి ఇస్లాం మతం స్వీకరించి తన పేరును అర్బా సుల్తానాగా మార్చుకుంది. వృత్తిరీత్యా కారుడ్రైవరైన జునైద్ ఆరు నెలల కిందట జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు.అర్బా మాత్రం జేబాబాగ్ మిలన్ థియేటర్ సమీపంలో అత్తవారింట్లో నివసిస్తోంది. జునైద్, అర్బాలకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. డిసెంబర్ 31న పుట్టింటికి వెళ్లిన అర్బా ఆదివారం జేబాబాగ్కు తిరిగి వచ్చింది. సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హఠాత్తుగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అర్బా కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్య విషయం తెలుసుకున్న జునైద్ మంగళవారం దుబాయ్ నుంచి నగరానికి చేరుకున్నాడు. పోస్టుమార్టం పరీక్షలు పూర్తయ్యే సమయానికి అర్బా తల్లిదండ్రులు, భర్త తదితరులు మార్చురీ వద్దకు చేరుకున్నారు. వీరిలో ఎవరికి వారు తమ మతాచారం ప్రకారం అంత్యక్రియలు చేయాలని భావించారు. దీంతో మృతదేహాన్ని తమకు అప్పగించాలంటే తమకు ఇవ్వాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఇలా ప్రారంభమైన చిరువివాదం మూడున్నర గంటల పాటు తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చివరకు పోలీసుల జోక్యంతో రాజీకి వచ్చిన అర్బా తల్లిదండ్రులు మృతదేహాన్ని జునైద్‌కు అప్పగించడానికి అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. మంగళవారం సాయంత్రం జేబాబాగ్లోని ముస్లిం శ్మశాన వాటికలో అర్బా మృతదేహం ఖననం చేయగా...ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఇరు పక్షాలు వారంతట వారే రాజీకి రావడంతో అర్బా భర్తకు ఆమె మృతదేహాన్ని అప్పగించామన్నారు. దీంతో వివాదం ముగిసిందని తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
అత్తింటి వేధింపులేనని పోలీసులకు తండ్రి ఫిర్యాదు నల్గొండలో ఘటన జమ్మికుంటలో విషాదం.. మేడారంలో కట్నం వేధింపులతో మరో వివాహిత బలవన్మరణం జమ్మికుంట రూరల్ : పట్టణంలోని చంద్రగిరి శ్రీనివాస్ - విజయ దంపతుల రెండో కూతురు హారిక(27) నల్గొండలోని అత్తవారింటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. హారికను నల్గొండకు చెందిన దొంతుల కిషన్- అనసూయల కుమారుడు శ్రీకాంత్‌కు ఇచ్చి 2013 డిసెంబర్లో వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.6లక్షలు, 12 తులాల బంగారం, 15తులాల వెండి, ఇతర లాంఛనాలు అప్పగించారు. ఆర్నెల్ల క్రితం హారిక కూతురుకు జన్మనిచ్చింది. అప్పట్నుంచి రూ.2లక్షల కట్నం తీసుకురావాలంటూ ఆమె అత్త అనసూయ, మామ కిషన్, బావ శ్రీనివాస్, తోడికోడలు వేధిస్తున్నారు. ఈవిషయాన్ని పలుమార్లు తన తండ్రి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఇటీవల నల్గొండలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి హారికను అత్తవారింటికి పంపించారు.అప్పట్నుంచి మళ్లీ వేధింపులు మొదలయ్యూరుు.ఈ క్రమంలోనే హారిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని సమాచారం అందింది. దీంతో శ్రీనివాస్ వెంటనే నల్గొండకు చేరుకున్నాడు. కాగా అత్తవారింటివారే ఉరివేసి చంపారని చంద్రగిరి శ్రీనివాస్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాహితను బలిగొన్న కట్నం వేధింపులు ధర్మారం : కట్నం వేధింపులు భరించలేక మండలంలోని మేడారం గ్రామానికి చెందిన పర్శ రజని(23) శనివారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మేడారం గ్రామానికి చెందిన రజనిని ఏడాదిన్నర క్రితం పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన పర్శ హరీష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.1.50లక్షల కట్నంతోపాటు ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. వివాహమైన ఆర్నెల్లకే మరో రూ.లక్ష కట్నం కావాలని భర్త హరీష్‌తోపాటు అత్త లలిత, ఆడపడచు కంది కవిత కలిసి రజనిని వేధించడం ప్రారంభించారు. వేధింపులు తాళలేక శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి మేనత్త బొడ్డు అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. -
వివాహిత బలవన్మరణం
పచ్చర్లబోడుతండా(భువనగిరి అర్బన్): కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని పచ్చర్లబోడుతండాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పచ్చర్లబోడుతండా గ్రామానికి చెందిన మేగావత్ సర్థార్‌కు 15 సంవత్సరాల క్రితం మీటితండాకు చెందిన బుజ్జమ్మతో వివాహం జరిగింది. మూడేళ్లకే మనస్పర్థలు వచ్చి విడిపోయారు. సర్థార్‌నాయక్ 12 ఏళ్ల క్రితం బొమ్మలరామారం మండలానికి చెందిన మేగావత్ పద్మ(28)ను వివాహం చేసుకున్నాడు. వీరికి 7 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఇదిలా ఉండగా మేగవత్ సర్థార్ కొన్ని రోజులుగా మొదటి భార్య బుజ్జమ్మతో సఖ్యతగా ఉంటున్నాడు. ఈ విషయం పద్మకు తెలియడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. సర్థార్ ఎంత చెప్పినా వినకపోవడంతో పద్మ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 5 గంటల సమయంలో గ్రామ సమీపంలోని ఓవ్యవసాయ బావిలో దూకింది. కల్లాపి చల్లడానికి పేడ తీసుకువస్తానని వెళ్లిన పద్మ ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఓ వ్యవసాయ బావి వద్ద ఆమె చెప్పులు, పేడ జబ్బ కనపించింది. వెంటనే బావిలోకి దిగి చూడగా అప్పటికే పద్మ మృతిచెందింది. ఈ మేరకు సంఘటన స్థలం వద్ద రూరల్ పోలీసులు శవ పంచానమా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు రూరల్ ఎస్ఐ నర్సింగ్‌రావు తెలిపారు. -
కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య
జీలుగుమిల్లి : భర్త వేధింపులు తాళలేక ఒక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన పి.వెంకటేశ్వరరావుతో ములగలంపల్లికి చెందిన శాంత (25)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఐదేళ్ల వరకు వీరి బంధం అన్యోన్యంగా సాగింది. మూడేళ్ల నుంచి భార్యాభర్తల మనస్పర్థలు నెలకొన్నాయి. అప్పటినుంచి భర్త వేధింపులకు గురవుతోంది. లక్ష్మీపురంలోని ఒక హోటల్ పనిచేస్తున్న శాంత మంగళవారం రాత్రి ఇంటికి రాగానే వారిద్దరి మధ్య మరలా వివాదం రావడంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్లి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి చెల్లెలు మడకం దుర్గాంజలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.