కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య | married women Suicide in Jilugumilli | Sakshi
Sakshi News home page

కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య

Published Thu, Oct 30 2014 12:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య - Sakshi

కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య

జీలుగుమిల్లి : భర్త వేధింపులు తాళలేక ఒక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన పి.వెంకటేశ్వరరావుతో ములగలంపల్లికి చెందిన శాంత (25)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఐదేళ్ల వరకు వీరి బంధం అన్యోన్యంగా సాగింది. మూడేళ్ల నుంచి భార్యాభర్తల మనస్పర్థలు నెలకొన్నాయి. అప్పటినుంచి భర్త వేధింపులకు గురవుతోంది. లక్ష్మీపురంలోని ఒక హోటల్ పనిచేస్తున్న శాంత మంగళవారం రాత్రి ఇంటికి రాగానే వారిద్దరి మధ్య మరలా వివాదం రావడంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకుని బాత్రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి చెల్లెలు మడకం దుర్గాంజలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement