వివాహేతర సంబంధం: చెరువులోపడి భార్య ఆత్మహత్య | Married Women Deceased In Dundigal At Medchal District | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: చెరువులోపడి భార్య ఆత్మహత్య

Mar 10 2021 6:47 PM | Updated on Mar 10 2021 9:01 PM

Married Women Deceased In Dundigal At Medchal District - Sakshi

సాక్షి, మేడ్చల్: దుందిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య చూడటానికి లావు ఉందనే కోపంతో నిత్యం వేధింపులకు గురి చేశాడు ఓ కానిస్టేబుల్. దీంతో ఆ వివాహిత తీవ్ర మనస్తాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీలత భర్త  శివ కుమార్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్రీలత లావు అందనే కోపంతో అన్నం కూడా పెట్టేవాడు కాదని తెలిపారు. కొన్ని నెలలు క్రితమే పూర్వ విద్యార్థుల గేట్‌టుగెదర్ కార్యక్రమం జరిగిన సమయంలో అక్కడ మరో వివాహిత శివ కుమార్‌కి పరిచయం అయింది. దీంతో ఇద్దరి మధ్య  వివాహేతర సంబంధం ఉందని శ్రీలత తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారని దుండిగల్ సీఐ తెలిపారు.

మరోవైపు తమ కూతురును చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రీలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం​ తమ అమ్మాయి శ్రీలతను కానిస్టేబుల్ శివకుమార్‌తో వివాహం చేశామని తెలిపారు. వివాహం జరిగినప్పటి నుంచి కట్నం కోసం వేధింపులు చేస్తున్నాడని తెలిపారు.  ఇక కానిస్టేబుల్ శివ కుమార్ ఆరేళ్ల కూతురు తన తండ్రి అరాచకంపై కన్నీరు పెట్టుకుంది. అమ్మను ప్రతిరోజు  కొట్టేవాడని, అన్నం పెట్టకుండా వేధించే వాడని చిన్నారి తెలిపింది. బయట నుంచి కోపంతో వచ్చి అమ్మ పైన దాడి చేసేవాడిని తెలిపింది. 

చదవండి: గగన్‌ అగర్వాల్‌ హత్యకేసు: వెలుగులోకి కీలక విషయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement