Jeelugumilli
-
చేపలు పడుతూ.. ఊబిలో చిక్కుకుని
బుట్టాయగూడెం (జీలుగుమిల్లి): చెరువులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ ఊబిలో చిక్కుకుని ఊపిరాడక ఓ బాలిక, మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. జీలుగుమిల్లి సమీపంలోని బుడుగల చెరువులో బుధవారం ఈ ఘటన జరిగింది. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడేనికి చెందిన ఎం.కల్యాణి (15) ఇటీవల పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుండగా, తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం – భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం రామిరెడ్డిగూడేనికి చెందిన ఎం.మహాలక్ష్మి (31) ఉపాధి పనుల కోసం వంకావారిగూడేనికి వచ్చింది. వర్షాలు బాగా పడుతుండటంతో స్థానికులతో కలిసి వీరు జీలుగుమిల్లి సమీపంలోని బుడుగల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. చెరువులోకి దిగి వలతో చేపలు పడుతూ ముందుకు వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఊబిలో చిక్కుకుని మృతి చెందారు. వీరితో పాటు వెళ్లిన మరో ఇద్దరు మహిళలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీలుగుమిల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
జీలుగుమిల్లి(పశ్చిమగోదావరి జిల్లా): జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా టేకూరు గ్రామస్థులకు కేటాయించిన 500 ఎకరాల భూమి విషయంలో స్థానిక (పి.నారాయణపురం) గిరిజనులకు, టేకూరు నిర్వాసితులకు (గిరిజనులు) మధ్య వివాదం చెలరేగింది. ఇరువర్గాలు కర్రలతో కొట్టుకోవడంతో ఇద్దరికి తలలు పగిలి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కామయ్యపాలెం హాస్పిటల్‌కు తరలించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో తమకు ఇచ్చిన భూములను తమకు స్వాధీనం చేయండని ప్రభుత్వాన్ని టేకూరు నిర్వాసితులు కోరుతున్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల తాము భూముల లోకి వెళ్లలేక భౌతిక దాడులకు గురవుతున్నామని టేకూరు నిర్వాసితులు అంటున్నారు. -
ఆరునెలల్లోనే టీడీపీపై ప్రజా వ్యతిరేకత
జీలుగుమిల్లి :అధికారంలోకి రావడానికి చంద్రబాబు మోసపూరితమైన వాగ్దానాలు చేయడం వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని అన్నారు. జీలుగుమిల్లి వైఎస్సార్సీపీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం కక్కిరాల చక్రధర్ నివాసంలో పార్టీ మండల కన్వీనర్ బోధాశ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆళ్లనాని మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు అమలుకాని వాగ్దానాలు చేసి రైతులు, మహిళలు, నిరుద్యోగులను, పేదలను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్ఫథంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని చెప్పారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవకపోయినా ఇప్పటికీ పార్టీకి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు ఉన్నారన్నారు. మండలంలో ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా అందరూ కలిసి కట్టుగా ముందుకు నడవాలన్నారు. త్వరలో మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామని, అవసరమైన చోట గ్రామాల్లో పర్యటిస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల అభిప్రాయాలు అడిగారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయని, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. తొలి సంతకం అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పరిపాలన ప్రారంభంలో పెట్టిన సంతకమే అన్నారు. అందుకు భిన్నంగా చంద్రబాబునాయుడు కల్లబొల్లి కబుర్లు చెబుతూ తొలి సంతకం అర్ధం మార్చేశారన్నారు. ప్రతి కార్యకర్త సేవాభావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారని అందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలే కారణమన్నారు. పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు గంటాప్రసాదరావు, క్రమశిక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు రామతిరుపతిరెడ్డి, జేపి, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ కొవ్వాసి నారాయణ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులు వందనపు సాయిబాలపద్మ, జిల్లా అధికార ప్రతి నిధులు పోల్నాటి బాబ్జి, ఎం.సంపత్‌కుమార్, డీసీసీబీ డెరైక్టర్ శ్రీనివాస్, బి.ప్రేమ్‌కుమార్, ఆరేటి సత్యనారాయణ, కె.వెంకటేశ్వరరావు, ఎం.రామచంద్రరావు, సిర్రిమోహన్, కె.చక్రి, కె.రాము, కె.సూరి, దాసరి బాబ్జి, డి.వేణు,వై.సత్యనారాయణ, జి.బాబ్జి పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి కొయ్యలగూడెం : వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు సమన్వయంతో వ్యవహరించాలని, ఐక్యతతో కలిసి ప్రజా సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్(నాని) పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సర్పంచ్ల చాంబర్ ఉపాధ్యక్షురాలు దేవి గంజిమాల ఆధ్వర్యంలో మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మట్టా శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. టీడీపీ రాక్షస పాలనపై పోరాటానికి అండ టి.నరసాపురం : టి.నరసాపురం మండలంలో టీడీపీ రాక్షసపాలనపై పోరాటానికి కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటానని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఆళ్ళ నాని అన్నారు. స్థానిక కాశీ విశ్వేశ్వరాలయ కల్యాణ మంటపంలో మంగళవారం రాత్రి పార్టీ మండల కన్వీనర్ దేవరపల్లి ముత్తయ్య అధ్యక్షతన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కార్యకర్తలతో సైన్యాన్ని తయారు చేస్తానన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు జగన్మోహనరెడ్డి పిలుపుతో ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. -
కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య
జీలుగుమిల్లి : భర్త వేధింపులు తాళలేక ఒక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన పి.వెంకటేశ్వరరావుతో ములగలంపల్లికి చెందిన శాంత (25)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఐదేళ్ల వరకు వీరి బంధం అన్యోన్యంగా సాగింది. మూడేళ్ల నుంచి భార్యాభర్తల మనస్పర్థలు నెలకొన్నాయి. అప్పటినుంచి భర్త వేధింపులకు గురవుతోంది. లక్ష్మీపురంలోని ఒక హోటల్ పనిచేస్తున్న శాంత మంగళవారం రాత్రి ఇంటికి రాగానే వారిద్దరి మధ్య మరలా వివాదం రావడంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్లి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి చెల్లెలు మడకం దుర్గాంజలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
ఏసీబీ వలలో ఏఈ
జీలుగుమిల్లి : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రూరల్ వాటర్ వర్క్స్ జీలుగుమిల్లి ఏఈ ఎం.ఉదయ్‌కుమార్ రూ.4 వేలు లంచం తీసుకుంటుం డగా అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. జీలుగుమిల్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఉప సర్పంచ్ నెలటూరి అప్పారావు, వార్డు మెంబర్లు గుడెల్లి వెంకటేశ్వరరావు, కుంజా రవీంద్ర కలసి రూ.2.30 లక్షల విలువైన మోటార్ బోరు వేరుుంచారు. ఇందుకు సంబంధించి బిల్లులు సమర్పిం చి, ట్రెజరీ నుంచి ఆ మొత్తాన్ని పొందాల్సి ఉంది. బిల్లులు రూపొందించాలంటే మోటార్ బోరు ఏర్పాటుకు సంబంధించిన పని వివరాలు, కొలతలను మెజర్మెంట్ బుక్ (ఎం.బుక్)లో నమోదు చేయూల్సి ఉంది. ఈ పనిని ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ ఉదయ్‌కుమార్ చేయూల్సి ఉండటంతో ఉపసర్పంచ్ అప్పారావు తదితరులు ఆయనను సంప్రదించారు. ఆ పనికి సంబంధించిన వివరాలను ఎం.బుక్‌లో నమోదు చేయూలంటే రూ.10 వేలు లంచంగా ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశారు. సొమ్ము ఇవ్వకపోవడంతో 20 రోజు లనుంచి పని వివరాలను నమోదు చేయడం లేదు. దీంతో ఉపసర్పంచ్ తదితరులు తొలుత రూ.4 వేలు ఇస్తామని, మిగిలిన రూ.6 వేలను బిల్లు మంజూరయ్యూక ఇస్తామని చె ప్పారు. అందుకు ఏఈ అంగీకరించగా, వారు ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచారు. దీంతో వల పన్నిన ఏసీబీ అధికారులు ఉపసర్పంచ్ అప్పారావు నుంచి ఏఈ ఉదయ్‌కుమార్ రూ.4 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేశామని, అతణ్ణి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. దాడుల్లో ఏసీబీ సీఐ యూజే విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ప్రారంభం
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా రాష్ట్ర విడిపోవడంతో ఈ చెక్‌పోస్టు ఏర్పాటు తప్పనిసరని చాలారోజులుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుల్లో ఉన్న జీలుగుమిల్లి మండలం వద్ద ఈ చెక్‌పోస్టును డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీదేవి సోమవారం ఉదయం ప్రారంభించారు. రవాణా శాఖకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో కొన్నాళ్ల పాటు బస్సులకు మినహాయింపు ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలకు పర్మిట్లు, పన్ను రసీదులు అన్నీ చూపించాల్సి ఉంటుంది. వాటిని తనిఖీ చేసేందుకే ఈ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. -
పోలీసులపై గిరిజనుల దాడి
జీలుగుమిల్లి, న్యూస్‌లైన్: భూ వివాదం నేపథ్యంలో గిరి జనులు దాడి చేయడంతో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని దిబ్బగూడెంలో రాత్రి 7.30 గంట ల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో భూ ఉద్యమాలకు పాల్ప డుతూ 2012లో నిందితులుగా ఉన్న 9మందిని అరెస్ట్ చేసేందుకు పోలీ సులు జీపు, ఒక ట్రక్కు ఆటోలో మండలంలోని జగన్నాథపురం వెళ్లారు. గ్రామంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని అంకన్నగూడెం పంచాయతీ పరిధిలోని దిబ్బగూడెంలో మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. భూ ఉద్యమాల్లో పాల్గొన్న గిరిజనులను అదుపులోకి తీసుకుని తమ గ్రామంలో ఉన్న మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న దిబ్బగూడెం గిరిజనులు దాడిచేసేందుకు కారం, కర్రలతో కాపుకాశారు. దిబ్బగూడానికి జీలుగుమిల్లి ఎస్సై బాల సురేష్‌బాబు, కానిస్టేబుళ్లు, డిస్ట్రిక్ట్ గార్డులు చేరుకోగానే తొలుత జీపును ఆపి చుట్టుముట్టి ఎస్సై కళ్లల్లో కారం కొట్టి దాడికి ప్రయత్నించారు. వెనుక ఆటోలో ఉన్న డిస్ట్రిక్ట్ గార్డులు ఎస్సై జీపు వద్దకు చేరుకోవడంతో వారి కళల్లోనూ కారం చల్లి, కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో ఎస్సై, ఐదుగురు డిస్ట్రిక్ట్ గార్డులు తీవ్రంగా గాయపడగా, మిగిలిన వారు స్పల్ప గాయాలతో బయటపడ్డారు. డిస్ట్రిక్ గార్డులు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నించగా, గిరిజనులు వారిని కిలోమీటరు మేర వెంబడించారు. రాత్రి సమయం కావడంతో డిస్ట్రిక్ట్ గార్డులు దారి తప్పి అడవిలో ఐదు కిలో మీటర్లు వెళ్లి ఒక కొండపై తలదాచుకున్నారు. వారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. చివరకు రాత్రి 10 గంటల సమయంలో కొండపై ఉన్నవారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారు ఉండే ప్రదేశం సమాచారాన్ని తెలుసుకుని టార్చిలైట్ ద్వారా సిగ్నల్‌ను అందించారు. ఆ సిగ్నల్ ఆధారంగా గార్డులు కొండ దిగి వచ్చారు. ఐదుగురు డిస్ట్రిక్ గార్డులకు గాను నలుగురు మాత్రమే పోలీసులను వద్దకు చేరుకున్నారు. మిగిలిన ఒక డిస్ట్రిక్ట్ గార్డు కోసం పోలీసులు గాలించారు. అతను తీవ్ర గాయాలతో సమీపంలోని వేరే ప్రాంతంలోని స్పృహ కోల్పోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్సై బాల సురేష్‌బాబు, పోలీస్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ గార్డులను సీఐ మురళీరామకృష్ణ, జంగారెడ్డిగూడెం ఎస్సై బీఎన్ నాయక్ పోలీసు సిబ్బందితో కలిసి అంకన్నగూడెం మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు చేర్చారు. అరెస్ట్ చేయడానికి వెళ్లిన వారిలో జీలుగుమిల్లి ఎస్సైతో, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కాని స్టేబుళ్లు, 11 మంది డిస్ట్రిక్ట్ గార్డులు ఉన్నారు. వారిలో గాయాలపాలైన డిస్ట్రిక్ట్ గార్డులు బి.లక్ష్మీనారాయణ, వీవీ రామకృష్ణ, కె.నరేష్, కె.పాల్, రాజేష్ ఉన్నారు. దాడికి పాల్పడిన గిరిజనులు సీపీఎం పార్టీకి చెందిన సానుభూతిపరులని గిరిజనులు చెబుతున్నారు. దాడిలో సుమారు 70 నుంచి 80 మంది వరకు గిరిజనులు పాల్గొన్నారని పోలీసులు అంటున్నారు. గిరిజనుల దాడిలో ఎస్సై జీపు ధ్వంసమైంది. దీనిపై ఎస్సై బాల సురేష్‌బాబు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను అరెస్ట్ చేసేందుకు వచ్చామని, గిరిజ నులు ఒక్కసారిగా తమపై కారం చల్లి మూకుమ్మడి దాడికి దిగినట్లు తెలి పారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎస్. రాఘవ జీలుగుమిల్లి చేరుకుని పరిస్థి తిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారందరినీ జీలుగుమిల్లి పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక వైద్యం అనంతరం జంగారెడ్డిగూడెం తరలించనున్నట్లు ఎస్సై నాయక్ చెప్పారు.