ఏసీబీ వలలో ఏఈ
జీలుగుమిల్లి : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రూరల్ వాటర్ వర్క్స్ జీలుగుమిల్లి ఏఈ ఎం.ఉదయ్‌కుమార్ రూ.4 వేలు లంచం తీసుకుంటుం డగా అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. జీలుగుమిల్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఉప సర్పంచ్ నెలటూరి అప్పారావు, వార్డు మెంబర్లు గుడెల్లి వెంకటేశ్వరరావు, కుంజా రవీంద్ర కలసి రూ.2.30 లక్షల విలువైన మోటార్ బోరు వేరుుంచారు. ఇందుకు సంబంధించి బిల్లులు సమర్పిం చి, ట్రెజరీ నుంచి ఆ మొత్తాన్ని పొందాల్సి ఉంది. బిల్లులు రూపొందించాలంటే మోటార్ బోరు ఏర్పాటుకు సంబంధించిన పని వివరాలు, కొలతలను మెజర్‌మెంట్ బుక్ (ఎం.బుక్)లో నమోదు చేయూల్సి ఉంది.
ఈ పనిని ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ ఉదయ్‌కుమార్ చేయూల్సి ఉండటంతో ఉపసర్పంచ్ అప్పారావు తదితరులు ఆయనను సంప్రదించారు. ఆ పనికి సంబంధించిన వివరాలను ఎం.బుక్‌లో నమోదు చేయూలంటే రూ.10 వేలు లంచంగా ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశారు. సొమ్ము ఇవ్వకపోవడంతో 20 రోజు లనుంచి పని వివరాలను నమోదు చేయడం లేదు. దీంతో ఉపసర్పంచ్ తదితరులు తొలుత రూ.4 వేలు ఇస్తామని, మిగిలిన రూ.6 వేలను బిల్లు మంజూరయ్యూక ఇస్తామని చె ప్పారు. అందుకు ఏఈ అంగీకరించగా, వారు ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచారు. దీంతో వల పన్నిన ఏసీబీ అధికారులు ఉపసర్పంచ్ అప్పారావు నుంచి ఏఈ ఉదయ్‌కుమార్ రూ.4 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేశామని, అతణ్ణి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. దాడుల్లో ఏసీబీ సీఐ యూజే విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు.