పోలీసులపై గిరిజనుల దాడి | Tribal attack on police | Sakshi
Sakshi News home page

పోలీసులపై గిరిజనుల దాడి

Published Wed, Sep 4 2013 4:50 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

Tribal attack on police

జీలుగుమిల్లి, న్యూస్‌లైన్: భూ వివాదం నేపథ్యంలో గిరి జనులు దాడి చేయడంతో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని దిబ్బగూడెంలో రాత్రి 7.30 గంట ల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో భూ ఉద్యమాలకు పాల్ప డుతూ  2012లో నిందితులుగా ఉన్న 9మందిని అరెస్ట్ చేసేందుకు పోలీ సులు జీపు, ఒక ట్రక్కు ఆటోలో మండలంలోని జగన్నాథపురం వెళ్లారు.  గ్రామంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని అంకన్నగూడెం పంచాయతీ పరిధిలోని దిబ్బగూడెంలో మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. భూ ఉద్యమాల్లో పాల్గొన్న గిరిజనులను అదుపులోకి తీసుకుని తమ గ్రామంలో ఉన్న మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న దిబ్బగూడెం గిరిజనులు దాడిచేసేందుకు కారం, కర్రలతో కాపుకాశారు. దిబ్బగూడానికి జీలుగుమిల్లి ఎస్సై బాల సురేష్‌బాబు, కానిస్టేబుళ్లు,  డిస్ట్రిక్ట్ గార్డులు చేరుకోగానే తొలుత జీపును ఆపి చుట్టుముట్టి ఎస్సై కళ్లల్లో కారం కొట్టి దాడికి ప్రయత్నించారు.  
 
 వెనుక ఆటోలో ఉన్న డిస్ట్రిక్ట్ గార్డులు ఎస్సై జీపు వద్దకు చేరుకోవడంతో వారి కళల్లోనూ కారం చల్లి, కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో ఎస్సై, ఐదుగురు  డిస్ట్రిక్ట్ గార్డులు తీవ్రంగా గాయపడగా, మిగిలిన వారు స్పల్ప గాయాలతో బయటపడ్డారు. డిస్ట్రిక్ గార్డులు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నించగా, గిరిజనులు వారిని కిలోమీటరు మేర వెంబడించారు. రాత్రి సమయం కావడంతో డిస్ట్రిక్ట్ గార్డులు దారి తప్పి అడవిలో ఐదు కిలో మీటర్లు వెళ్లి ఒక కొండపై తలదాచుకున్నారు. వారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. చివరకు రాత్రి 10 గంటల సమయంలో కొండపై ఉన్నవారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారు ఉండే ప్రదేశం సమాచారాన్ని తెలుసుకుని టార్చిలైట్ ద్వారా సిగ్నల్‌ను అందించారు. ఆ సిగ్నల్ ఆధారంగా గార్డులు కొండ దిగి వచ్చారు. 
 
 ఐదుగురు డిస్ట్రిక్ గార్డులకు గాను నలుగురు మాత్రమే పోలీసులను వద్దకు చేరుకున్నారు. మిగిలిన ఒక  డిస్ట్రిక్ట్ గార్డు కోసం పోలీసులు గాలించారు.  అతను తీవ్ర గాయాలతో సమీపంలోని వేరే ప్రాంతంలోని స్పృహ కోల్పోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్సై బాల సురేష్‌బాబు, పోలీస్ సిబ్బంది,  డిస్ట్రిక్ట్ గార్డులను సీఐ మురళీరామకృష్ణ, జంగారెడ్డిగూడెం ఎస్సై బీఎన్ నాయక్  పోలీసు సిబ్బందితో కలిసి అంకన్నగూడెం మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు చేర్చారు. అరెస్ట్ చేయడానికి వెళ్లిన వారిలో జీలుగుమిల్లి ఎస్సైతో, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కాని స్టేబుళ్లు, 11 మంది  డిస్ట్రిక్ట్ గార్డులు ఉన్నారు. వారిలో గాయాలపాలైన డిస్ట్రిక్ట్ గార్డులు బి.లక్ష్మీనారాయణ, వీవీ రామకృష్ణ, కె.నరేష్, కె.పాల్, రాజేష్  ఉన్నారు.  దాడికి పాల్పడిన గిరిజనులు సీపీఎం పార్టీకి చెందిన సానుభూతిపరులని  గిరిజనులు చెబుతున్నారు. 
 
 దాడిలో సుమారు 70 నుంచి 80 మంది వరకు గిరిజనులు పాల్గొన్నారని పోలీసులు అంటున్నారు.  గిరిజనుల దాడిలో ఎస్సై జీపు  ధ్వంసమైంది.  దీనిపై ఎస్సై బాల సురేష్‌బాబు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను అరెస్ట్ చేసేందుకు వచ్చామని, గిరిజ నులు ఒక్కసారిగా తమపై కారం చల్లి మూకుమ్మడి దాడికి దిగినట్లు తెలి పారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎస్. రాఘవ జీలుగుమిల్లి చేరుకుని పరిస్థి తిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారందరినీ జీలుగుమిల్లి పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక వైద్యం అనంతరం జంగారెడ్డిగూడెం తరలించనున్నట్లు ఎస్సై నాయక్ చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement