సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: ఉండి మండలం యండగండి గ్రామంలో మృతదేహం పార్శిల్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మ పాత్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మృతదేహం ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు. రంగరాజు కుమార్తెలు తులసి, రేవతి మధ్య ముందు నుంచే గొడవలు ఉన్నాయి.
రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో వివాహం జరిగింది. తులసిని భర్త వదిలేయడంతో పుట్టింట్లో ఉంటోంది. రంగరాజుకి రెండున్నర ఎకరాల పొలం, బంగారం ఉన్నాయి. రంగరాజు ఆస్తి కోసం కుట్ర పన్నిన వర్మ.. తులసి అవసరాన్ని అవకాశంగా మార్చుకుని ఈ కుట్రలో ఇరికించాలని ప్రయత్నించాడు. క్షత్రియ సేవా సమితి పేరిట తులసి ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నట్లు వర్మ, రేవతి డ్రామా ఆడారు.
ఇదీ చదవండి: డామిట్.. పారని ‘పార్శిల్’ పాచిక (క్రైమ్ స్టోరీ)
ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ నెలలో తులసికి పెయింట్స్, టైల్స్ పంపించారు. మూడో పార్శిల్‌గా డెడ్‌బాడీ పంపారు. ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను హత్య చేసి ఆ డెడ్ బాడీని పార్శిల్‌గా పంపారు. డెడ్ బాడీ వచ్చినప్పుడు రంగరాజు, ఆయన భార్య, శ్రీధర్ వర్మ, తులసి, రేవతి ఉన్నారు. డెడ్ బాడీ పార్శిల్ బాక్స్‌లో కోటి 35 లక్షల ఇవ్వాలని లేఖ పెట్టారు. ఎవరికీ తెలియకుండా డెడ్ బాడీ సముద్రంలో పడేస్తానని డబ్బు ఇవ్వాలంటూ శ్రీధర్ వర్మ తులసిని, కుటుంబ సభ్యులను నమ్మించాడు.
పోలీసులకు సమాచారం అందడంతో కారులో పరారయ్యాడు. పర్లయ్యను నైలాన్ తాడుతో గొంతు బిగించి శ్రీధర్ వర్మ చంపాడు. పర్లయ్య కంటే ముందు వేరే వ్యక్తి ని చంపడానికి ప్రయత్నించాడు. ప్రధానంగా ఈ కేసులో శ్రీధర్ వర్మ, రెండో భార్య రేవతి, మూడో భార్య సుష్మ అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నయీం అస్మీ తెలిపారు.
ఇదీ చదవండి: డెడ్ బాడీ పార్శిల్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
Comments
Please login to add a commentAdd a comment