Parcel
-
AP: బురదలో ఆహార పొట్లాలు.. సాయం ఇలాగేనా?
సాక్షి, విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ఆహారం, నీరు లేకపోవడంతో హెలికాప్టర్ వద్దకి ప్రజలు పరుగులు తీస్తున్నారు. వాంబే కాలనీలో ఆహార పొట్లాలను హెలికాప్టర్ ద్వారా బురదలోకి జారవిడుస్తున్నారు. దీంతో ఆహారం, వాటర్ కోసం స్థానికులు బురదలో పడి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.పక్కనే అపార్ట్మెంట్లు ఉన్నా బురదలో పడేయడం ఏంటి అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బురదలో పడి ఆహారం కోసం కుక్కలా కొట్టుకొనేటట్లు ప్రభుత్వం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురదలో ఆహార ప్యాకెట్లు పడటంతో సగం పైనే బురదమయం అవుతున్నాయని మహిళలు వాపోతున్నారు.మరో వైపు, వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి కష్టాలు తప్పడం లేదు. వరద బాధితులను తరలించేందుకు అధికారులు బోట్లను రప్పించారు. తిండీ తిప్పల్లేకుండా ఆకలితో అలమటిస్తూ.. బోట్లతో మత్స్యకారులు వచ్చారు. ముస్తాబాద్ వద్ద వరద బాధితుల కోసం బోటు ఏర్పాటు చేయగా, బోటుతో పాటు మచిలీపట్నం నుంచి ముగ్గురు మత్స్యకారులు వచ్చారు.అధికారులు తీసుకొచ్చి తమను వదిలేశారని.. ఒక్కరు కూడా తమను పట్టించుకోవడమ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల ప్రాణాలను రక్షిస్తున్న తమ ప్రాణాలకు గ్యారంటీ లేదని మత్స్యకారులు వాపోతున్నారు. -
స్మగ్లింగ్ కేరాఫ్ కొరియర్స్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులో తయారైన మాదకద్రవ్యం ఎఫిడ్రిన్‌ను నగరంలోని అక్బర్‌బాగ్ నుంచి కొరియర్ ద్వారా ఆస్ట్రేలియా పంపాలని చూసిన ముఠాను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.⇒ ఢిల్లీలోని ఓ కొరియర్ సంస్థ హిమాయత్‌నగర్‌లోని వ్యాపారికి వజ్రాలను పార్శిల్ చేసింది. వీటిని కొరియర్ ఉద్యోగులే తస్కరించడంతో ఏళ్లుగా జరుగుతున్న అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.⇒ ఓ కొరియర్ సంస్థ ద్వారా హాంకాంగ్ వెళ్తున్న ఓ పార్శిల్‌ను ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు స్కానింగ్ చేశారు. ఫలితంగా అందులో రూ.5 లక్షల విలువైన ఎర్ర చందనం ఉన్నట్లు తేలడంతో అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.⇒ హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు కొరియర్ ద్వారా అక్రమంగా ఎఫిడ్రిన్ రవాణా చేస్తున్నారంటూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు (డీఆర్ఐ) సమాచారం అందింది. శనివారం ఓ కొరియర్ కార్యాలయంలో సోదాలు చేసి మూడు కేజీలు స్వాధీనం చేసుకున్నారు.⇒ ఈ ఉదంతాలే కాదు.. తెరపైకి రాకుండా చాపకింద నీరులా కొరియర్స్ ద్వారా సాగిపోతున్న బంగారం, వజ్రాలు, ఎర్రచందనం, మాదకద్రవ్యాల దందాకు నగరంలో కొదవేలేదు. ఏళ్లుగా ‘బులియన్ మార్కెట్’ అక్రమ దందా సాగుతుండగా.. కొన్నేళ్లుగా ఎర్ర చందనాన్నీ కొరియర్స్ ద్వారా దేశం దాటించడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకూ కొరియర్స్‌ను వాడుతున్నారని వెలుగులోకి వచ్చింది.అవి ఇక్కడికి.. ఇవి అక్కడికి..హోల్‌సేల్‌గా బంగారాన్ని కిలోల లెక్కన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు, వజ్రాలను ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి రిటైలర్స్‌కు, జ్యువెలరీ దుకాణ యజమానులకు విక్రయిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో తీసుకుని రావడానికీ వెనుకంజ వేస్తున్న వ్యాపారులు ఏకంగా పార్శిల్స్ చేసి పంపిస్తున్నారు. అలాగే నగర శివార్లతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల్లోనూ ఖాయిలా పడ్డ ఫార్మా పరిశ్రమలు అనేకం ఉన్నాయి. వీటితో పాటు కొందరి ఇళ్లూ డ్రగ్స్ కార్ఖానాలుగా మారిపోతున్నాయి. ప్రధానంగా ఎఫిడ్రిన్, ఆల్ఫాజోలం తదితరాలు వీటిలో తయారవుతున్నాయి. వీటి ధర ఇక్కడ కిలో రూ.లక్షల్లో ఉండగా.. విదేశీ విపణిలో మాత్రం రూ.కోట్లు పలుకుతోంది. దీంతో ఆ సరుకులు కొరియర్స్ ద్వారా సిటీకి వస్తుండగా.. ఎఫిడ్రిన్, సూడో ఎఫిడ్రిన్ వంటి డ్రగ్స్ సిటీ నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి.ఆర్థిక లావాదేవీలకు అక్రమ మార్గంలో..వీటిలో ఏవి ఎటు వచ్చినా, వెళ్లినా... చెల్లింపులు మాత్రం నేరుగా, బ్యాంకు ఖాతాల ద్వారా సాగించరు. దీనికి అనేక మంది వ్యాపారులు, స్మగ్లర్లు అక్రమ ద్రవ్య మార్పిడైన హుండీ, హవాలాలను ఆశ్రయిస్తున్నారు. నగరంలో ఉన్న ఏజెంట్లకు డబ్బు అప్పగించే వ్యాపారులు, అది చేరాల్సిన వ్యక్తి వివరాలు చెప్పి కమీషన్ ఇస్తే చాలు. గంటలోపే డెలివరీ అయిపోతుంది. ఇక్కడకు రావాలన్నా ఇదే పంథా కొనసాగుతోంది. ఈ విధానమే తమకు సురక్షితమని భావిస్తున్న స్మగ్లర్లు, వ్యాపారస్తులు దీన్నే అవలంబిస్తున్నారు. నగరంలోని బేగంబజార్, పాతబస్తీ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ రోజూ రూ.కోట్లలో ఈ అక్రమ ద్రవ్యమార్పిడి బిజినెస్ నడుస్తోందని పోలీసులే అంగీకరిస్తున్నారు. ప్రతి రూ.లక్షకు కేవలం రూ.300 నుంచి రూ.600 వరకు మాత్రమే కమీషన్‌గా ఉండటం వీరికి కలిసి వస్తోంది. ఏవైనా ఉదంతాలు చోటు చేసుకున్న సందర్భంలో మాత్రమే ఏజెన్సీల రికార్డుల్లోకి ఈ వ్యవహారాలు ఎక్కుతున్నాయి. డ్రగ్స్ రవాణా వ్యవహారాల్లో పాత్రధారులు మినహా సూత్రధారులు దొరుకుతున్న సందర్భాలు లేవు.అన్నీ స్కానింగ్ సాధ్యం కాదుకొరియర్ పార్శిల్స్ ద్వారా డ్రగ్స్, పేలుడు పదార్థాలు, డబ్బు, నగలు, మానవ అవయవాలు, మత్తు పదార్థాలు తదితరాలను పార్శిల్ చేయడంపై పూర్తి నిషేధం ఉంది. అయినా పట్టుబడిన నిందితులు చెప్పిన వివరాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం అనేక కొరియర్స్ ద్వారా ఈ రవాణా జరుగుతోంది. ఇలాంటి అంశాల్లో పూర్తి వివరాలను వెలికితీసే అవకాశం పోలీసు, ఏజెన్సీలకు ఉండట్లేదు. ఎయిర్‌కార్గో ద్వారా రవాణా అయ్యే ప్రతి పార్శిల్‌ను స్కానింగ్ చేయడం, క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యం కాదు. సంబంధిత విభాగంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం, మానవవనరులు లేవు. నిరంతర నిఘా, ప్రతి కేసులోనూ మూలాలను అన్వేషించడం ద్వారానే ఇలాంటి వాటికి చెక్ చెప్పగలం.– శ్రీనివాస్, కస్టమ్స్ విభాగం మాజీ అధికారి -
ఆన్లైన్లో ఎయిర్ ప్రైయర్ బుక్ చేస్తే బల్లిని డెలివరీ చేశారేంటి!
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇన్నిరోజులు ఫుడ్ ఆర్డర్ పెడితే ఇటుక బిళ్లలు రావడం, ఫోన్ ఆర్డర్ పెడితే ధర్మకోల్ షీట్లు రావడం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అదే ఆన్లైన్లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెడితే బల్లులు ప్రత్యక్షమవుతున్నాయి.దక్షిణ అమెరికాకు చెందిన సోఫియా సెరానో అనే మహిళ ఎయిర్ ప్రైయర్ను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ రానే వచ్చింది. వెంటన్ ఎయిర్ ఫ్రైయర్ ఎలా ఉందోనని పరిశీలించేందుకు పార్శిల్ తెరిచి చూసింది. అంతే పార్శిల్ లోపల ఉన్న బల్లిని చూసి వణికిపోయింది. వెంటనే తనకు ఎదురైన చేదు అనుభవంపై స్పందించింది.అమెజాన్ పంపిన పార్శిల్ లోపల ఉన్న బల్లి ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను అమెజాన్‌లో ఎయిర్ ఫ్రైయర్ కోసం ఆర్డర్ పెట్టా. కానీ పార్శిల్లో బల్లి వచ్చింది. ఇది అమెజాన్ సంస్థ తప్పా లేదంటే కొరియర్ సంస్థది తప్పా అనేది తెలియదు’అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌పై అమెజాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. Pedimos una air fryer por Amazon y nos llegó con un acompañante 🙄 no sé si fue culpa de Amazon o la transportadora … buenos días! pic.twitter.com/BgYDi4qUev— Sofia Serrano (@sofiaserrano97) July 18, 2024కాగా, అమెజాన్ పంపిన పార్శిల్లో బల్లి ఉండడంపై పలువురు నెటిజన్లు పలు జాగ్రత్తలు చెబుతున్నారు. ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేసిన వస్తువు పార్శిల్ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేసే సమయంలో వీడియో తీయడం మంచిది. అలా వీడియో తీయడం వల్ల మీరు పెట్టిన ఆర్డర్ ఒకటైతే..మీకు వచ్చిన వస్తువు మరొకటి అయినప్పుడు.. సదరు ఈకామర్స్ సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు, తగిన నష్ట పరిహారం పొందేందుకు సులభతరం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. -
ఇదో కొత్తతరహా మోసం.. జాగ్రత్త: సజ్జనార్
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్త నేరాలకు తెరలేపారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్సిళ్ల పేరుతో వారు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాను మొదలెట్టారని... మీ పేరిట ఫెడెక్స్‌లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారని హెచ్చరించారు. నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. భయపడినవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పార్శిల్ అనగానే భయపడిపోయి అడిగినంత డబ్బులు సమర్పించుకోవద్దన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. మీ పేరిట ఫెడెక్స్‌లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. భయపడిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి… pic.twitter.com/l30JmmPCeS — V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 2, 2024 -
‘పార్సిల్ స్కాం పసిగట్టండి ఇలా..’
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయని వస్తువుల పేరుతో పార్సిల్ వచ్చిదంటూ అమాయకులకు ఫోన్లు చేసి డబ్బు గుంజుతున్నారని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వివిధ మార్గాల్లో సేకరించి ఆ వివరాలతో వారికి పార్సిల్ వచ్చిందంటూ మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ఇలా అపరిచిత వ్యక్తులు పంపే పార్సిళ్లలో కొన్ని అక్రమ పదార్థాలు, వస్తువులు ఉంటున్నాయని... అడిగినంత డబ్బు పంపకపోతే అరెస్టు తప్పదని బ్లాక్మెయిల్ చేస్తూ వీలైనంత డబ్బు గుంజుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలా గుర్తించాలంటే... ♦ ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్ ద్వారా వచ్చే అనుమానాస్పద వివరాలను, ఆర్డర్ చేయని వస్తువులు పార్సిల్‌గా వచ్చాయంటూ వచ్చే ఫోన్స్‌కాల్స్‌ను నమ్మొద్దు. ♦ మీకు పార్సిల్స్ వచ్చాయంటూ వచ్చే ఈ–మెయిల్స్‌లో పార్సిల్ పంపిన వారి అడ్రస్, ఫోన్ నంబర్లు పరిశీలించాలి. అనుమానాస్పద నంబర్ల నుంచి పార్సిళ్లకు సంబంధించిన మెసేజ్‌లు వస్తే అవి నకిలీవని గుర్తించాలి. మెసేజ్‌లు, ఈ–మెయిల్స్‌లో అక్షర దోషాలు, అచ్చు తప్పులను గుర్తించాలి. అలాంటివి నకిలీవని గుర్తుంచుకోవాలి. ♦ మీరు ఆర్డర్ చేయని పార్సిళ్లకు, మీ పేరిట వచ్చిన పార్సిల్లో ఏవైనా అక్రమ వస్తువులు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడి డబ్బు డిమాండ్ చేసినా డబ్బు పంపొద్దు. వెంటనే పోలీసులకు ఈ సమాచారాన్ని ఇచ్చి ఫిర్యాదు చేయాలి. -
'తపాల శాఖ' ద్వారా.. ఇక విదేశాలకు పార్సిళ్లు..!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ప్రధాన తపాల కార్యాలయం నుంచి డాక్ నిర్యాత్ కేంద్ర సర్వీస్ ద్వారా తక్కువ ఖర్చుతో విదేశాలకు సులభంగా పార్సల్స్ పంపే సేవలు ప్రారంభించినట్లు ఆదిలాబాద్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ సుజిత్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఉట్నూర్ పరిధిలోని బ్రాంచి పోస్ట్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. విదేశాలకు పార్సల్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ప్రధాన తపాల కార్యాలయంలో సైతం విదేశాలకు పార్సెల్ సర్వీస్ కరపత్రాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు సమీప పోస్టు ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం తిరుపతి, రమేశ్, బీపీఎంలు చంద్రశేఖర్, ప్రవీన్, గోకు ల్, విజయ్, సాద్ తదితరులు పాల్గొన్నారు. -
పోస్టాఫీసుల నుంచే ఫారిన్‌కు పార్శిల్
సాక్షి, అమరావతి: విదేశాల్లో ఉన్న మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు పార్శిళ్లు పంపించడం మరింత సులభతరం కానుంది. మీ సమీపంలోని పోస్టాఫీసు నుంచే ఫారిన్‌కు పార్శిళ్లు పంపించవచ్చు. ఇందుకోసం దేశంలో భారీగా పోస్టాఫీసులకు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ శాఖ అనుమతించింది. పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్విసులను కొన్నేళ్ల క్రితమే ప్రవేశపెట్టారు. కానీ, వాటిని అతి తక్కువ పోస్టాఫీసులకే పరిమితం చేశారు. దీంతో విదేశాలకు పార్శిళ్లు పంపించాలంటే దూరంగా ఉన్న పోస్టాఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. లేదా అధిక రుసుము చెల్లించి ప్రైవేట్ కొరియర్ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యను గుర్తించి పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్విసులను దేశవ్యాప్తంగా మరింత విస్తృతం చేయాలని కేంద్ర ఎక్సైజ్–కస్టమ్స్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా కొత్తగా 715 పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్వీసులను అనుమతించింది. త్వరలోనే కొత్తగా అనుమతించిన పోస్టాఫీసుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో 4 నుంచి 24కు పెంపు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 55 పోస్టాఫీసుల నుంచి విదేశాలకు పార్శిల్ సర్వీసులకు అనుమతించారు. వాటిలో హెడ్ పోస్టాఫీసులు(హెచ్‌వో), సబ్ పోస్టాఫీసులు(ఎస్వో) కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు నాలుగు పోస్టాఫీసుల నుంచే విదేశాలకు పార్శిల్ సర్వీసులు అందిస్తున్నారు. కొత్తగా 24 పోస్టాఫీసుల నుంచి ఈ సేవలు అందించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు తెలంగాణలో కేవలం ఒక్క పోస్టాఫీసు నుంచే విదేశాలకు పార్శిల్ చేసేందుకు అవకాశం ఉంది. తాజాగా 31 పోస్టాఫీసులకు అనుమతించారు. ఏపీలో కొత్తగా అనుమతించిన పోస్టాఫీసులు శ్రీకాకుళం హెచ్‌వో, విజయనగరం హెచ్‌వో, పార్వతీపురం హెచ్‌వో, అనకాపల్లి హెచ్‌వో, పాడేరు హెచ్‌వో, అమలాపురం హెచ్‌వో, కాకినాడ హెచ్‌వో, సామర్లకోట హెచ్‌వో, రాజమహేంద్రవరం హెచ్‌వో, తాడేపల్లిగూడెం హెచ్‌వో, మచిలీపట్నం హెచ్‌వో, విజయవాడ పాలిటెక్నిక్ ఎస్వో, గుంటూరు హెచ్‌వో, నరసరావుపేట హెచ్‌వో, బాపట్ల హెచ్‌వో, ఒంగోలు హెచ్‌వో, చిత్తూరు హెచ్‌వో, రాయచోటి హెచ్‌వో, కడప హెచ్‌వో, కర్నూలు హెచ్‌వో, నంద్యాల హెచ్‌వో, అనంతపురం హెచ్‌వో, ప్రశాంతినిలయం ఎస్వో, విజయవాడ బకింగ్‌హామ్‌పేట ఎస్వో. తెలంగాణలో కొత్తగా అనుమతించిన పోస్టాఫీసులు హైదరాబాద్ జీపీవో, భూపాలపల్లి ఎస్వో, జగిత్యాల హెచ్‌వో, జేఎన్టీయూ కూకట్పల్లి ఎస్వో, కొత్తగూడెం కోల్స్ హెచ్‌వో, మహబూబాబాద్ హెచ్‌వో, మహబూబ్‌నగర్ హెచ్‌వో, నిర్మల్ ఎల్ఎస్జీ ఎస్వో, వనస్థలిపురం ఎస్వో, వికారాబాద్ హెచ్‌వో, మంచిర్యాల హెచ్‌వో, మెదక్ హెచ్‌వో, ములుగు బి–క్లాస్ ఎస్వో, నాగర్‌కర్నూల్ ఎస్వో, నల్లగొండ హెచ్‌వో, నారాయణపేట ఎస్వో, భువనగిరి హెచ్‌వో, హన్మకొండ హెచ్‌వో, జనగాం హెచ్‌వో, కామారెడ్డి హెచ్‌వో, ఖమ్మం హెచ్‌వో, సిరిసిల్ల ఎస్వో, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎస్వో, సూర్యాపేట హెచ్‌వో, లక్ష్మీపూర్ ఎస్వో, వనపర్తి హెచ్‌వో, గద్వాల్ హెచ్‌వో, నిజామాబాద్ హెచ్‌వో, పెద్దపల్లి హెచ్‌వో, ఆర్సీ పురం హెచ్ఈ ఎస్వో, షాద్‌నగర్ ఎస్వో. -
ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!
'సేవ' అంటే ఆయా వ్యక్తుల వారికి తోచిన రీతిలో అనాథలకు, అభాగ్యులకు తమ సర్వీస్‌ని అందిచడం. కొందరూ కొన్ని స్వచ్ఛంద సంస్థల మద్దతు కూడా సేవలందిస్తారు. అలా ఇలా కాకుండా యావత్తు సమజాన్ని మహత్తర సేవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అంటే మాటలకందని విషయం. అలా సాధ్యమా! అనిపిస్తుంది కూడా. ఔను! సాధ్యమే అంటూ కేరళకు చెందిన ఓ యువజన సంస్థ చేసి చూపించింది. కేరళలో వేలాది మహిళలు తమ కుంటుంబానికి సరిపడా వంట కంటే అదనంగా వండుతారు. ఒకరికో లేదా ఇద్దరికో సరిపడే ఆహారం అయ్యి ఉండొచ్చు. అయితే వారు చేసిన భోజనం పొట్లం ఏ అతిధికి చేరుతుందో ఎవరో తింటారో వారికి తెలియదు. అయినా వారంతా తమ వంతుగా ఈ సేవలో భాగమవుతున్నారు. దీన్ని కేరళలో 'పోతిచూరు' అంటారు. 'పోతిచోరు' అంటే భోజనం పొట్లం అని అర్థం. అలా అందించేవాళ్లు ధనవంతులు కారు. వారంతా సామాన్య ప్రజలు. వారు వండుకునే దానిలో కొంచెం ఇలా ప్యాక్‌చేసి పొట్లాల రూపంలో అందిస్తారు. ఇలా మొత్తం 40 వేల పోతిచోరు(భోజనం పొట్లాలు) వస్తాయంటే నమ్ముతారా?. ఔను} స్వచ్ఛందంగా చిన్న చితక పనులుచేసుకునే ప్రజల దగ్గర నుంచి యువత వరకు అందరూ ఇలా తమకు తోచినన్ని ఆహార పొట్లాలను ఇవ్వడం జరుగుతోంది. ఇలా కేరళలో 2017 నుంచి జరుగుతోంది. ఆ భోజన పోట్లాలన్ని ఆయా జిల్లాలోని ప్రభుత్వా ఆస్పత్రులకు వచ్చే పేదలకు, ప్రయాణికులకు, వృద్ధులకు చేరతాయి. దీన్ని సీపీఐ(ఎం) యువజన సంస్థ అయిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) 2017లో తిరువనంతపురం మెడికల్ కాలేజ్‌లో 300 పోతిచోరు ప్యాకెట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని "హృదయపూర్వం" అని కేరళలో పిలుస్తారు. దీని అర్థం హార్టీ మీల్ పార్సెల్ అని. ఆ తర్వాత ఆరేళ్లకు క్రమక్రమంగా కేరళలోని 14 జిల్లాలోని 50 ఆస్పత్రులకు ప్రతి రోజు 40 వేల పోతిచోరులు పంపిణీ చేసే స్థాయికి వచ్చిందని డీవైఎఫ్ఐ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్ చెప్పారు. ఈ హృదయపూర్వం కార్యక్రమం కోసం ప్రత్యేక కిచెన్ కమ్యూనిటీఏమి లేదు. ఆ ఆహారపు పొట్లాలన్ని ఒక్కక్కొరి ఇళ్ల నుంచి సేకరించినవేనని చెబుతున్నారు. ఈ డీవైఎఫ్ఐ కార్యకర్తలు పక్కా ప్రణాళికతో హృదయపూర్వం కార్యక్రమం కోసం పోతిచోరు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది ఆహార పంపిణీకి సంబంధంచిన క్యాలెండర్ ముందుగానే పక్కాగా సిద్ధం చేస్తారు. ఆ జాబితా ఆధారంగా డీవైఎప్‌ఐ మండలి కమిటీలతో పంచుకుంటారు. ఆ తర్వాత మండల కమిటీలు ఒకదాని తర్వాత మరొకటి ఆహార పంపిణీ బాధ్యతలను తీసుకుంటాయి. ముందుగా డీవైఎఫ్ఐ కార్యకర్తలు వారి ప్రాంతంలోని ఇళ్లను సందర్శించి మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం కోసం అదనంగా ఒకరికి భోజనం వండమని కోరతారు. కానీ వారంతా ఇద్దరు లేదా మూడు నుంచి ఐదు వరకు ఆహారపొట్లాలు సమకూర్చడం విశేషం. ఇక ఆ తర్వాత కార్యకర్తల ఈ సేకరించిన అదనపు ఆహారాన్ని నియమించిన ప్రభుత్వ ఆస్పత్రులలో పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం మొత్తం సమాజం మద్దుతునే జయప్రదంగా జరుగుతోంది. ఈ కార్యకర్తలు, వరదలు, లాక్డౌన్ సమయంలో ఆకలితో అలమటించే అభాగ్యులకే గాక డ్యూటీలో ఉండే పోలీసు సిబ్బందికి, ప్రయాణికులకు ఆ ఆహారపొట్లాలను అందిస్తారు. ఇలా పంపిణీ చేసే కార్యక్రమంలో చాలా ఆసక్తికరమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో ఓ ఆసక్తికరమైన ఘటన.. మలప్పురం మంపాడ్ ఎంఈఎస్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజేష్ మోంజీ ఈ ఏడాది జనవరిలో తన తల్లి చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీలో ఉన్నారు. ఆయనకు ఈ పోతిచోరు పొట్లం అందింది. ఆయన ఆ పొట్లం విప్పి చూడగా.. ఒక చిన్నారి రాసిన చిన్న కాగితపు నోటు కనిపించింది. ఆ నోట్లో ఇలా ఉంది.."చెట్టా, చెచీ, ఉమ్మా, తథా, అమ్మా..అని ఉంది. అంటే ఈ ఫుడ్ పార్శిల్ ఎవరికి అందుతుందో వారు ముందుగా నన్ను క్షమించండి. మా అమ్మ ఇంట్లో లేదు. నేను స్కూల్‌కి వెళ్లే తొందరలో దీన్ని సిద్ధం చేశాను. ఆహారం రుచిగా లేదు. అలాగే మీరు త్వరగా కోలుకోండి." అని రాసి ఉంది. ఆ పోతిచూరులో ఉన్న ప్రతి బియ్యపు గింజలో ఆ చిన్నారి ప్రేమతో నిండిపోయింది అని ఉపాధ్యాయుడు తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. నిజానికి ఇది కేవలం ఆహార కాదు అంతకుమించినది. ఈ భోజన పంపిణీని దాతృత్వంగా భావించొద్దు ఎందుకంటే ప్రస్తుతం యువతో పెరుగుతున్న స్వార్థాన్ని అంతం చేసేందుకు ఇది చక్కగా దోహదపడుతోంది అన్నారు సీపీఎం రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్. కాగా, ఈ ఆహారపొట్లాల సేకరణలో భాగం పంచుకుంట్ను ఓ గృహిణి మాట్లాడుతూ..పోతిచోరు సేకరణ తేది ఎప్పుడూ అని తెలుసుకుని...ఇలా పిడికెడు అన్నం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను చేయగలిగినంతలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని ఆమె చెబుతోంది. -
పార్సిల్ ట్రాకింగ్ పేరిట కొత్త మోసాలు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో వస్తువులను కొనడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. అయితే మనకు వచ్చే ఆ పార్సిల్ ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు ట్రాకింగ్ చేయడం పరిపాటి. ఇదే అదనుగా ఆన్లైన్లో వస్తువులను కొనేవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ఆన్లైన్లో వస్తువులను ఆర్డర్ చేసేందుకు మా వెబ్‌సైట్‌ను సంప్రదించండి.. అంటూ నకిలీ యాడ్స్‌ను ఇస్తున్నారు. అదేవిధంగా ట్రాకింగ్ కోసం అంటూ ఆన్లైన్లో కొన్ని ఫేక్ కాల్ సెంటర్ నంబర్లను పెడుతున్నారు. వాటిని నమ్మి ఎవరైనా ఆ నంబర్లకు ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారికి నకిలీ మాల్వేర్ లింకులతో కూడిన ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్‌లు పెడుతున్నారు. వినియోగదారులు ఆ లింక్‌లపై క్లిక్ చేస్తే మన ఫోన్లోని పూర్తి సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లడంతోపాటు మన ఫోన్లను వారి నియంత్రణలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ట్రాకింగ్ పేరిట ఇచ్చే యాడ్స్‌ను నమ్మి మోసపోవద్దని, ఆయా కంపెనీల అధికారిక వెబ్సైట్ల నుంచి మాత్రమే ఫోన్ నంబర్లు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. -
హలో.. మీ పేరుతో ఓ పార్సిల్ వచ్చింది
‘‘మీ పేరు, చిరునామాతో ఉన్న ‘ఫెడెక్స్’ పార్సిల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి. దర్యాప్తు నిమిత్తం మీపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నాం. ఒకవేళ మీపై కేసు నమోదు కాకుండా ఉండాలంటే కస్టమ్స్ అధికారులతో ‘ఒప్పందం’ కుదుర్చుకోండి’’ ఇదీ హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వచ్చిన సైబర్ నేరగాళ్ల ఫోన్‌కాల్! యువతిని నమ్మించేందుకు ఆమె వాట్సాప్‌కు డ్రగ్స్ ఉన్న పార్సిల్, కస్టమ్స్ అధికారి ఐడీ కార్డు కూడా పంపించారు. దీంతో భయపడిన ఆమె... కేసు నమోదు చేయొద్దంటూ వేడుకొని ఆన్లైన్ ద్వారా రూ. లక్షలు సమర్పించుకుంది. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు దోపిడీ లకు ఇటీవల కాలంలో దర్యాప్తు అధికారుల అవతారమెత్తుతున్నారు. ముంబై, ఢిల్లీ పోలీసులమని, సీబీఐ, ఈడీ, కస్ట మ్స్ అధికారులమంటూ అమాయ కులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. భయపడి పోతున్న సామాన్యులు రూ. లక్షల్లో ముట్టజెప్పి మోసపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ తరహా కేసులు పెద్ద సంఖ్యలో నమోద వుతున్నాయని సైబర్ పోలీసులు తెలిపారు. ఎలా చేస్తున్నారంటే.. సామాజిక మాధ్యమాలు, డేటా ప్రొవైడర్ల ద్వారా సైబర్ నేరస్తులు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఫోన్ చేసి ఢిల్లీ, ముంబై కస్టమ్స్ అధికారులమని పేరు, చిరునామా చెబుతూ సంభాషిస్తారు. మీ పేరు, అడ్రస్‌తో ఉన్న పార్సిల్ కస్టమ్స్‌లో అనుమానాస్పదంగా కనిపించి నిలిపివేసినట్లు, తెరిచి చూస్తే అందులో మాదకద్రవ్యాలు, ఇతరత్రా చట్ట వ్యతిరేక ఉత్పత్తులు ఉన్నాయని గుర్తించినట్లు బెదిరిస్తారు. ఫోన్లో ఏమాత్రం బెరుకుగా మాట్లాడుతున్నట్లు అనిపించగానే బెదిరింపులు రెట్టింపు చేస్తారు. మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల కేసులు నమోదు చేస్తామని వరుసగా ఫోన్లు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తారు. కేసు వద్దంటే స్వాహా.. అమాయకులను నమ్మించేందుకు నకిలీ పోలీసు అధి కారుల గుర్తింపు కార్డులు సైతం కేటుగాళ్లు వాట్సాప్ చేస్తారు. ఈ వ్యవహారం నుంచి బయట పడాలంటే దర్యాప్తు సంస్థల అధికారులతో మాట్లాడి ఒప్పందం చేసుకో వాలని సలహా ఇస్తారు. ఆపై కొద్దిసేపటికి మరో నకిలీ అధికారి ఫోన్ చేసి కేసు లేకుండా ఉండాలంటే కొంత నగదు చెల్లించాల్సి ఉంటుందని సూచిస్తారు. ఇలా బాధితులను బెది రించి రూ. లక్షల్లో నగదు కొట్టేస్తున్నారు. ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువ ఈ తరహా మోసాలు ఎక్కువగా ఫెడెక్స్ పార్సిల్ సంస్థ పేరుతో జరుగుతున్నాయని సైబర్ పోలీసులు విచారణలో గుర్తించారు. రాజస్తాన్, హరియాణా, జార్ఖండ్‌కు చెందిన సైబర్ ముఠాలు ఎక్కువగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
కార్గో పార్శిళ్లపై నిఘా పెంచండి
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో గంజాయి, గుట్కా, లిక్కర్, ఇతర చట్టవిరుద్దమైన వస్తువుల రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని.. కార్గో ద్వారా బుక్ చేసే పార్శిళ్లపై నిఘా పెంచాలని ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల, జోన్ల ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు అనుమతి లేని లగేజ్ తీసుకుంటున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడినా, ఆర్టీసీ ఆదాయానికి గండికొట్టే చర్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆర్టీసీ పరిధిలోని అన్ని కౌంటర్లలో గంజాయి, మత్తు, పేలుడు పదార్థాలు, చట్టబద్ధంగా నిషేదించబడిన అన్నిరకాల వస్తువులను అనుమతించరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కార్గోలో బుక్ చేసే ప్రతి పార్శిల్‌ను క్షుణంగా పరిశీలించాలని సూచించారు. వినియోగదారుని ఆధార్, అడ్రస్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని, ఈ అంశాల పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేఎస్ బ్రహ్మనందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు, ఓఎస్డీ రవివర్మ, సీటీఎం చంద్రశేఖర్, నాగేంద్రప్రసాద్, డిప్యూటీ సీటీఎం త్రినాథ్ పాల్గొన్నారు. (చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ) -
షాకింగ్ ఘటన: ఐ ఫోన్ బుక్ చేసి.. ఎంత దారుణం చేశాడంటే..
యశవంతపుర(కర్ణాటక): ఆన్లైన్లో ఐ ఫోన్ బుక్ చేసిన యువకుడు డబ్బులు ఎగ్గొట్టాలని ఏకంగా డెలివరీ బాయ్‌ని హత్య చేసిన ఘటన హాసన్ జిల్లా అరసికెరెలో జరిగింది. వివరాలు.. పట్టణంలోని లక్ష్మీపురకు చెందిన హేమంత్ దత్త (20) నిందితుడు. ఇతడు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ను బుక్ చేశాడు. డెలివరీ సమయంలో నగదు ఇచ్చే ఆప్షన్ పెట్టాడు. అరసికెరె తాలూకాకు చెందిన డెలివరీ బాయ్ హేమంత్ నాయక్ (23) ఈ నెల 11న ఫోన్‌ను తీసుకుని దత్త ఇంటికి వెళ్లాడు. అతడు ఫోన్‌ను తీసుకుని, ఇప్పుడే డబ్బులు తీసుకొని వస్తానని బాయ్‌ను కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం హేమంత్‌దత్త వెనుక వైపు నుంచి వచ్చి నాయక్‌పై కత్తితో పొడిచాడు. బలమైన గాయాలై రక్తస్రావంతో కుప్పకూలి అక్కడే మృత్యువాత పడ్డాడు. ఇంట్లోనే మూడురోజులు తరువాత మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకున్నాడు. చివరికి 14వ తేదీన గోనెసంచిలో శవాన్ని మూటగట్టి స్కూటర్‌పై తీసుకెళ్లి సమీపంలోని కొప్పలు రైల్వేగేట్ సమీపంలో పడేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. మరోవైపు హేమంత్ నాయక్ కనిపించడం లేదని తల్లిదండ్రులు 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో రైల్వేగేటు వద్ద కాలిన శవం ఉందని తెలిసి పోలీసులు వెళ్లి పరిశీలించగా అది హేమంత్ నాయక్ మృతదేహంగా గుర్తించారు. నాయక్ మొబైల్‌కు వచ్చిన చివరి ఫోన్ కాల్ ఆధారంగా వెంటనే హేమంత్‌దత్తను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు నోరు విప్పాడు. కఠినంగా శిక్షించాలి పోలీసులు అతని ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా హేమంత్‌దత్త స్కూటర్‌పై బంక్ వద్దకు వెళ్లి బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లిన దృశ్యాలను కనుగొన్నారు. హత్య చేసి, ఆపై సాక్ష్యాలను నాశనం చేయడానికి హేమంత్‌దత్త అన్ని ప్రయత్నాలు చేశాడని ఎస్పీ హరిరామ్ శంకర్ తెలిపారు. ఈ దురాగతం స్థానికంగా సంచలనం కలిగింది. ఇటువంటి హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. చదవండి: భార్యకు తెలియకుండానే విడాకులిచ్చిన భర్త.. డబ్బు కొట్టేయాలని ప్లాన్ -
ఉక్రెయిన్ ఎంబసీలకు ‘జంతువుల కళ్ల’ పార్శిళ్లు
కీవ్: వివిధ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలకు లెటర్ బాంబులు, ఉత్తుత్తి లెటర్ బాంబులు, ఆవు, పంది కళ్లతో కూడిన పార్శిళ్లు అందినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీకి శుక్రవారం జంతువుల కళ్లతో కూడిన పార్శిల్ అందింది. ప్రత్యేకమైన రంగు, వాసనతో కూడిన ద్రవంలో ముంచిన ఇటువంటి ప్యాకేజీలు హంగరీ, నెదర్లాండ్స్, పోలండ్, క్రొయేషియా, ఇటలీ తదితర ప్రాంతాల్లోని 17 ఎంబసీలకు అందాయని ఉక్రెయిన్ పేర్కొంది. అదేవిధంగా, వాటికన్ సిటీలోని ఉక్రెయిన్ రాయబారి నివాసంపై దాడి జరిగింది. కజకిస్తాన్ ఎంబసీకి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో ఎంబసీలు, కాన్సులేట్ల వద్ద భద్రత మరింత పెంచాలని ఉక్రెయిన్ ఆదేశించింది. గత వారం స్పెయిన్ ప్రధాని సాంచెజ్‌తోపాటు మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్, అమెరికా దౌత్య కార్యాలయాలకు లెటర్ బాంబులు అందాయి. -
ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్..!
బెంగళూరు: కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి దివాళీ సేల్ సందర్భంగా అక్టోబర్ 15న ఫ్లిప్‌కార్ట్‌లో 'ఏసస్ టఫ్' గేమింగ్ ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 20న ఇంటికి పార్సిల్ వచ్చింది. అయితే అది ఓపెన్ చేసిన అతనికి షాక్ తగిలింది. పార్సిల్ బాక్స్‌లో ల్యాప్‌టాప్‌కు బదులు పెద్ద రాయి, ఈ-వేస్ట్ వచ్చింది. దీంతో అతడు ఫ్లిప్‌కార్డ్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. దాన్ని రిటర్న్ తీసుకునేందుకు వారు నిరాకరించారు. ల్యాప్ ఆర్డర్ చేసిన వ్యక్తి చిన్మయ రమణ ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. తనకు వచ్చిన పార్సిల్లో ల్యాప్‌టాప్ బాక్స్‌పై ప్రోడక్ట్ డీటేయిల్స్‌ను చింపేశారని, అది ఓపెన్ చేసి చూస్తే రాయి, కంప్యూటర్ వేస్టేజ్ ఉందని వాపోయాడు. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్‌ను సంప్రదించినా సరైన స్పందన లేదని, ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు. తాను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసినా.. మూడు రోజుల తర్వాత వారు స్పందించారని రమణ వాపోయాడు. రీఫండ్ ఇచ్చేందుకు సెల్లర్ నిరాకరించాడని, పార్సిల్ డెలీవరీ సమయంలో ఎలాంటి డ్యామేజీ కూడా జరగలేదని చెప్పారని తెలిపాడు. ఫ్లిప్‌కార్ట్ సర్వీసు అస్సలు బాగాలేదని రమణ ఆరోపించాడు. తన ఫిర్యాదు అనంతరం మళ్లీ అప్డేట్ ఇస్తామని చెప్పారని, కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు ఈమెయిల్ పంపినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నాడు. తాను చెప్పేది అబద్దమని ఎవరికైనా అన్పిస్తే, తన ఖాతా పాత ఆర్డర్లు చెక్‌చేసుకోవచ్చని చెప్పాడు. 2015 నుంచి తాను ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌గా ఉన్నానని, చాలా ఆర్డర్లు పెట్టానని వివరించాడు. Ordered for laptop and recived a big stone and E-waste ! During Diwali sale on Flipkart!@VicPranav @geekyranjit @ChinmayDhumal @GyanTherapy @Dhananjay_Tech @technolobeYT @AmreliaRuhez @munchyzmunch @naman_nan @C4ETech @r3dash @gizmoddict @KaroulSahil @yabhishekhd @C4EAsh pic.twitter.com/XKZVMVd4HK — Chinmaya Ramana (@Chinmaya_ramana) October 23, 2022 చదవండి: ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్ -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పార్సిల్స్ వైరల్ వీడియో: అమెజాన్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: అమెజాన్ పార్సిళ్లను విసిరిపారేస్తున్న వైనంపై ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ స్పందించింది. వీడియోలో ని దృశ్యాలు వాస్తవమైనవే అయినా, ఇది పాత వీడియో ..దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని వివరణ ఇచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంపై స్పందించిన అమెజాన్ ప్రతినిధులు ఇవి ఈ ఏడాది మార్చిలో బయటకు వచ్చిన వీడియో అని తెలిపారు. వీడియో సరైందే అయినా మీడియాలో ఆలస్యంగా వచ్చిందని తెలిపారు. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే సరైన చర్యలు తీసుకున్నామని, కస్టమర్లకు నాణ్యమైన వస్తువులను అందించడమే తమ లక్ష్యమని అమెజాన్ ప్రతినిధులు పేర్కొన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పార్సిల్స్ పరిస్థితి ఇదీ అంటూ ట్విటర్లో ఒక వీడియో బాగా షేర్ అయింది. అసోంలోని రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పోర్టర్లు అమెజాన్,ఫ్లిప్‌కార్ట్, ఇతర ప్యాకేజీలను విసిరిపారేసిన వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇది న్యూఢిల్లీ దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (12424) ద్వారా వచ్చాయని తెలుస్తోంది. ఈ విజువల్స్ మార్చి 14న రికార్డయ్యాయట. అయితే తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, ప్యాకేజీలను విసిరిపారేసింది. భారతీయ రైల్వే సిబ్బంది కాదని స్పష్టం చేస్తూ నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. "పార్సెల్స్‌ను నిర్వహించే వ్యక్తులు పార్శిల్ వ్యాన్‌ను లీజుకు తీసుకున్న పార్టీ ఎంపిక చేసుకుంటుందనీ తెలిపారు. దీని ప్రకారం, వారి క్లయింట్ పార్శిల్లను SLR/పార్శిల్ వ్యాన్ల నుండి లోడ్ చేయడం/అన్లోడ్ చేయడం వారి బాధ్యదే" అని పేర్కొంది. This is an old video https://t.co/1VES8n3yBR pic.twitter.com/tOkUt7brZJ — Northeast Frontier Railway (@RailNf) August 29, 2022 -
‘స్కానింగ్’ అయ్యాకే రైళ్లలోకి పార్శిళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రైళ్లలో రవాణా చేసే పార్శిళ్లను తనిఖీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్కానర్లను ఏర్పాటుచేసి, పరిశీలించాకే పార్శిళ్లను రైళ్లలోకి ఎక్కించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి పార్శిళ్ల స్కానర్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ఏర్పాటైంది. త్వరలో మిగిలిన ప్రధాన స్టేషన్లలోనూ ఏర్పాటు కానున్నాయి. దర్భంగా పేలుడుతో.. గతేడాది బిహార్‌లోని దర్భంగా స్టేషన్లో పార్శిల్ వ్యాగన్లో తీవ్రవాదులు అమర్చిన బాంబు పేలిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ప్రయాణికుల రైళ్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పార్శిళ్లను వినియోగించాలని పథకాలు రచిస్తున్నట్టు కేంద్రం గుర్తించింది. ప్రయాణికుల రైళ్లలో తీసుకెళ్లే పార్శిళ్ల కోసం తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రైల్వేని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రయాణికుల రైళ్లలో పార్శిళ్లు పెద్దమొత్తంలో తరలే స్టేషన్లలో నాంపల్లి తొలి స్థానంలో ఉంటుంది. దీంతో తొలి స్కానర్ ఏర్పాటుకు ఈ స్టేషన్‌నే ఎంపిక చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో.. స్కానర్ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే దిశగా రైల్వే యోచిస్తోంది. ఇదే తరహాలో నాంపల్లి రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ యూనిట్‌ను ఇటీవలే ప్రారంభించింది. తాజాగా పార్శిల్ స్కానర్‌నూ ఏర్పాటు చేయించింది. ఇందుకు ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. నాంపల్లి నుంచి టన్నుల కొద్ది పార్శిళ్లు వెళ్తాయి. కొన్ని సంస్థలైతే ఏకంగా వ్యాగన్ మొత్తాన్ని పార్శిల్ కోసం బుక్ చేసుకుంటాయి. వీటిని లీజ్డ్ వ్యా న్లుగా పేర్కొంటారు. ఇలాంటి లీజ్డ్ వ్యాన్లలో తరలే పార్శిల్‌కి రూ.5, లీజ్డ్ కాని వ్యాన్లలో తీసుకెళ్లే ప్రతి పార్శిల్‌కి రూ.10 చార్జ్ చేస్తారు. ఈ మొత్తం ఆ ప్రైవేటు సంస్థ తీసుకుంటుంది. స్కానింగ్ తరువాతే లోడింగ్.. భారతీయ రైల్వేలోని న్యూఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్‌లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. స్కానర్ ద్వారా తనిఖీ చేసిన పార్శిళ్లపై ప్రత్యేకం గా స్టిక్కర్లు అతికిస్తారు. వాటిని మాత్రమే లోడింగ్‌కు అనుమతిస్తారు. కంప్యూటర్ ఆధారిత స్కానర్ల వల్ల పార్శిళ్లలో ఉన్న వస్తువులను, ప్రమాదకర పదార్థాలను గుర్తించటం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు. నాంపల్లి స్టేషన్లో స్కానర్లు అమర్చటంలో కీలకంగా ఉన్న సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్‌కుమార్ గుప్తా, సిబ్బందిని దక్షిణ మధ్యరైల్వే ఇన్చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు. -
ఫోటో ఫ్రేమ్స్ వెనుక డ్రగ్స్ పెట్టి పార్సిళ్లు
-
ఏం కష్టమొచ్చిందో పాపం.. రైలులో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, నాంపల్లి: హుబ్లీ నుంచి హైదరాబాదుకు వచ్చిన ఓ రైలులోని ఎస్ఎల్ఆర్ పార్శిల్ బోగీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్లాట్ఫారం మీదకు వచ్చిన రైలు బోగీలో ఉరేసుకుని వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం నాంపల్లి జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని నాంపల్లి (హైదరాబాదు) రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాదు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ప్లాట్ఫారం–1 మీద నిల్చున్న రైలులోని ప్రయాణికులందరూ దిగిపోయారు. కానీ వస్తు రవాణా కోసం ఉంచిన పార్శిల్ బోగీలో 60 ఏళ్ల వయస్సు కలిగిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హైదరాబాదు రైల్వే స్టేషన్లో ఆగిన రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తరలించే ముందు రైల్వే సిబ్బంది బోగీలను పరిశీలించారు. ఎస్ఎల్ఆర్ పార్శిల్ బోగీలో వేలాడుతూ మృతదేహం కనిపించడంతో రైల్వే సిబ్బంది స్థానిక జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బోగీలోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి భద్రపరిచారు. -
అమెజాన్ పార్సిల్ అనుకుంటున్నారా.. కాదండోయ్!
పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, న్యూ ఇయర్ వేడుకలు... ఇలా శుభకార్యం ఏదైనా కేక్ ఉండాల్సిందే. కేక్ కటింగ్ చేస్తేనే స్పెషల్ డేగా ఫీల్ అవుతాం. మరి కేక్‌కు ఇంతలా డిమాండ్ పెరుగుతండటంతో తయారీదారులు(బేకర్స్) కూడా విభిన్న రూపాల్లో డిజైన్ చేస్తున్నారు. మనకు నచ్చే విధంగా కొత్త కొత్తగా తయారు చేసి ఇస్తున్నారు. ఇటీవలే హాస్పిటల్ బెడ్‌పై నవ్వుతున్న ఓ పేషెంట్లా తయారు చేసిన కేకు ఒకటి ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కోవకే చెందిన ఓ వినూత్న కేక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది సాధారణమైన కేక్ కాదండోయ్.. అమెజాన్ పార్సిల్ రూపంలో ఉన్న కేక్. అవును మీరు విన్నది నిజమే. అచ్చం అమెజాన్ నుంచి వచ్చే ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ కేక్‌ను డిజైన్ చేశారు. అయితే దీనిని ఓ కేకు తయారీ సంస్థ డిజైన్ చేసింది. యాజమాని కొడుకు పుట్టినరోజు కోసం ఈ కేక్ తయారు చేశారు. ఇక దీనిని ట్వీటర్లో పోస్టు చేయడంతో అమెజాన్ పార్సిల్ కేక్ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీన్నిచూసిన నెటిజన్లు నిజంగానే అమెజాన్ పార్సిల్ అనుకుంటున్నారు. కానీ అది కేక్ అని చెప్పడంతో సందేహించి మరింత పరీక్షించి చూస్తున్నారు. ఈ తర్వాత కేక్ అని క్లారిటీ రావడంతో సర్ప్రైజ్ అవుతున్నారు. అంతేగాక అనేకమంది నెటిజన్లు ఈ కేక్‌పై మీమ్స్ సృష్టిస్తున్నారు. మరి ఇతంలా వైరలవుతున్న దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి Yn dilyn my mhost ddoe, teisan bocs Amazon, dyma'r prawf i ddangos mai teisen ydyw. 😊 Following my post yesterday, Amazon box cake, here's the proof that it is actually cake! 😊#Anglesey #Amazon #cake #cakes pic.twitter.com/RZ5HbcQ7T1 — Nina's Cake Cabin (@angleseycakeart) February 3, 2021 Omds not this shit again wtf pic.twitter.com/b1fsQihngf — ً (@rxmchls) February 18, 2021 Omds not this shit again wtf pic.twitter.com/b1fsQihngf — ً (@rxmchls) February 18, 2021 Imagine seeing this outside your door and picking it up to put under your arm pic.twitter.com/ghiaiGMqn7 — KSB 👨🏾🚒 (@kfRedhot) February 19, 2021 -
పెళ్లివారమండీ... ‘విందు’ తెచ్చినామండీ..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): పెళ్లంటే మేళ తాళాలు.. మామిడి తోరణాలు. సందళ్ల ముంగిళ్లు.. పచ్చని పందిళ్లు. మూడు ముళ్లు.. ఏడడుగులు. వీటన్నింటి కళను ఇనుమడించేలా.. బంధుమిత్రుల ఆనందోత్సహాలు. చిరకాలం గుర్తుండిపోయేలా షడ్రసోపేతమైన విందు భోజనాలు. అయితే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో ఇంత సంతోషం ఆవిరైపోయింది. జీవితాంతం గుర్తుండిపోయే వివాహ వేడుక మొక్కుబడి తంతుగా మారిపోయింది. పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించేలా ఆంక్షలు అమలవుతూ ఉండడంతో పెళ్లికి పప్పన్నం కూడా పెట్టలేని పరిస్థితి తలెత్తింది. అయితే సమస్య ఉన్నప్పుడే చిట్కా కూడా ఉంటుంది కదా.. అందుకే ఇప్పుడు పెళ్లికి కొద్ది మందినే ఆహ్వానిస్తున్నా.. బంధుమిత్రులందరికీ పెళ్లి వేడుక జరిగే రెండు రోజులూ పంచభక్ష్య పరమాన్నాల పార్శిళ్లు పంపే కొత్త సంప్రదాయం మొదలైంది. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఐదు నెలల కిందట వివాహం కుదిరింది. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అప్పుడే పెండ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. జూలై 25న కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలకు నిర్ణయించుకున్నాయి. ఇంతలో కరోనా ముంచుకొచ్చింది. వ్యాధి విజృంభణ అధికంగా ఉండడంతో ప్రభుత్వం వివాహ వేడుకలకు నిబంధనలు విధించింది. దీంతో ఘనంగా శుభకార్యం చేసుకోవాలనుకున్న ఇరు కుటుంబాల వారు నీరసపడిపోయారు. దగ్గర బంధువులకే చెప్పుకుని మొక్కుబడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వివాహం అనగానే అందరికీ గుర్తొచ్చేంది విందు భోజనం. పది మందికి ఆకులు వేయాలన్న సంప్రదాయాన్ని కొనసాగించాలని పెండ్లి కుమారుడు నిర్ణయించుకున్నాడు. వివాహానికి ఆహ్వానం పలికిన కొద్ది మందికైనా భోజనం పెట్టాలి.. ఎలా అని ఆలోచించాడు. అందర్నీ పిలిచి భోజనాలు పెట్టేకన్నా.. భోజనాలు తయారు చేసి నేరుగా బంధువుల ఇంటికే పంపిస్తే.. అని ఆలోచించి అమలు చేశాడు. బంధువుల ఇంటికే నేరుగా టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం పంపించే ఏర్పాట్లు చేసుకున్నాడు. వివాహ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అతన్ని పెండ్లి కుమారుడ్ని చేశారు. ముందుగా అనుకున్నట్టే తన కుటుంబ సభ్యులతో ఉదయం 7 గంటలకే బంధువుల ఇంటికి నేరుగా టిఫిన్ అందించాడు. మధ్యాహ్నం 11 గంటలకే భోజనం పంపించాడు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో తెలుసుకుని టిఫిన్, భోజనాలు, ప్లేట్లు, స్పూన్, వాటర్ బాటిల్, డిన్నర్ స్పూన్.. పంచభక్ష్య పరమన్నాలన్నీ కలిపి ఓ ప్యాక్ చేసి అందించడం విశేషం. ఫలితంగా బంధువులు వారి వారి ఇళ్లల్లోనే పెండ్లి భోజనం తృప్తిగా ఆరగించారు. బత్తెం రోజులు గుర్తొచ్చాయి మూడు, నాలుగు దశాబ్దాల కిందట బత్తెలు పంచేవారు. ఎటువంటి శుభకార్యం నిర్వహించినా.. సమీప బంధువులు, కుటుంబ సభ్యులకు భోజనాలకు చెప్పుకునేవారు. ఇరుగు పొరుగు వారికి కిలో బియ్యం, పావు కిలో పెసరపప్పు/కందిపప్పు, కాసింత చింతపండు, వంకాయ, బంగాళదుంప.. ఇలా కూరగాయలతో పాటు ఎండుమిర్చి, పోపు దినుసులు ఇచ్చేవారు. కాలం మారింది. బత్తెం రోజులకు స్వస్తి పలికారు. అందరికీ సహపంక్తి భోజనాలు పెట్టేవారు. మారుతున్న కాలంలో సహపంక్తి భోజనాలకు బై.. బై చెప్పారు. బఫే మీల్స్ ట్రెండ్‌గా మారింది. నిలబడి తినే రోజులు వచ్చాయి. కరోనా వచ్చింది.. వాటన్నింటిని తిరగ రాసింది.. అసలు భోజనాలు పెట్టుకోవడానికే అవకాశం లేకుండా చేసింది. -
చెన్నై నుంచి పాకిస్తాన్‌కు పార్సిళ్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తపాలాశాఖ కార్యాలయాల ద్వారా పాకిస్తాన్‌కు రోజుకొకటి చొప్పున నెలకు 30 పార్సిళ్లుగా వెళుతున్న తపాలాను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకోవడం నిలిపివేశారు. జమ్ముకశ్మీర్ వ్యవహారంలో 370 ఆర్టికల్ రద్దు తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌కు తపాలా సేవలను నిలుపుదల చేసింది. పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం సర్వదేశ నియమ నిబంధనలకు విరుద్ధమని భారత్ ఖండించింది. ఆగస్టు 27వ తేదీ తరువాత భారత్ నుంచి ఎలాంటి తపాలా పార్సిళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం స్వీకరించలేదని సమాచారం. కాగా, తమిళనాడులోని అనేక ప్రాంతాల నుంచి పాకిస్తాన్‌కు ఉత్తరాలు, పార్సిళ్లు, డాక్యుమెంట్లు వెళుతుంటాయి. వీటిల్లో స్పీడ్‌పోస్టులు ముంబై మీదుగా, సాధారణ పోస్టులు ఢిల్లీ మార్గంలో పంపుతుంటారు. ఢిల్లీ లేదా ముంబై నుంచి రోడ్డు మార్గం లేదా విమానం కార్గోల ద్వారా భారత తపాలాశాఖ పాకిస్తాన్‌కు చేరవేస్తుంటుంది. ఎక్కువశాతం పార్సిళ్లలో వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు వెళుతుంటాయి. నెలకు ఐదు రిజిస్టర్ పోస్టులు వెళుతుంటాయి. చెన్నైలోని తపాలాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ పాకిస్తాన్ నుంచి తమిళనాడుకు వచ్చే తపాలా పార్సిళ్లు ఢిల్లీ మీదుగా వస్తున్నందున స్వదేశీ సేవగా పరిగణిస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్ నుంచి తమిళనాడుకు ఎన్ని పార్సిళ్లు వస్తున్నాయనే గణాంక వివరాలు మా వద్ద లేవు. తమిళనాడు నుంచి సగటున రోజుకొకటి అంటే నెలకు 30 పార్సిళ్లు పాకిస్తాన్‌కు వెళుతుంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ తపాలా సేవలను నిలుపుదల చేసిన కారణంగా ఆ దేశానికి ఎలాంటి తపాలాలు పంపవద్దని కేంద్రం ఆదేశించింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్‌కు ఎలాంటి తపాలా పోస్టులు రిజిస్టర్ కాలేదని ఆయన చెప్పారు. -
‘పార్శిల్స్’ కేసులో నిందితుడి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ సహా పదుల సంఖ్యలో ప్రముఖులకు మురికినీరు, బురద పార్శిల్ చేసి పంపడానికి ప్రయత్నించిన కేసులో నిందితుడు వొడ్డాపల్లి వెంకటేశ్వర్రావును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతను తన మాజీ క్లాస్‌మేట్‌తో పాటు ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్లపై కక్ష సాధించేందుకు వారి పేర్లు ఫ్రమ్ అడ్రస్‌లో రాసి ఈ పని చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని కమ్మరివాడికి చెందిన వెంకటేశ్వర్రావు బొల్లారంలోని ఉస్మానియా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలో కొన్నేళ్ల క్రితం ఎంబీఏలో చేరాడు. కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో అది పూర్తి కాలేదు. తాను అన్ని పరీక్షలు సక్రమంగానే రాశానని, వర్శిటీ ప్రొఫెసర్లే ఉద్దేశపూర్వకంగా తనను ఫెయిల్ చేశారని ఆరోపిస్తూ హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. ఇతడితో పాటు అదే కళాశాలలో నగరానికి చెందిన ఓ యువతి సైతం ఎంబీఏలో చేశారు. అప్పట్లో ఆమెతో స్నేహం చేయడానికి ప్రయత్నించి విఫలమైన వెంకటేశ్వర్రావు ఆమెపై కక్షకట్టి అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు ఓయూ ప్రొఫెసర్ల పైనా ఒకేసారి పగ తీర్చుకోవాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో వారే పంపినట్లు ప్రముఖులను మురికినీరు, బురద పార్శిల్ చేయాలని భావించాడు. ఈ నెల 16న ఆటోలో 62 పార్శిల్స్‌ను ప్యాట్నీలోని హెడ్–పోస్టాఫీస్‌కు తీసుకువచ్చాడు. అప్పటికే సమయం మించిపోయిందని సిబ్బంది చెప్పడంతో మర్నాడు వస్తానని చెప్పి వాటిని అక్కడే ఉంచి వెళ్ళాడు. 17న ఉదయం పోస్టాఫీస్‌కు వచ్చిన వెంకటేశ్వర్రావు ముఖ్యమంత్రికి చెందిన నాలుగు చిరునామాలు, డీజీపీతో పాటు ప్రముఖులతో కలిపి మొత్తం 62 మందికీ ఆ బాక్సుల్ని పంపాలంటూ వారి చిరునామాలు ఇచ్చి బుక్ చేయించాడు. ఇందుకుగాను రూ.7216 చెల్లించాడు. ఎక్కడా తన గుర్తింపు బయటపడకుండా బోగస్ వివరాలు ఇచ్చాడు. ఓ పార్శిల్‌పై మాత్రం ఫ్రమ్ అడ్రస్‌గా తన మాజీ క్లాస్మేట్ పేరు, ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్ల పేర్లు రాశాడు. ఈ నెల 19న పోస్టాఫీసు డిస్పాచ్ సిబ్బంది వాటిని తరలించేందుకుగాను ఓ బాక్సును పైకి ఎత్తగా లోపల ద్రవ పదార్థం ఉన్నట్లు అనుమానించి తెరిచి చూడగా అందులో రెండు బాటిళ్ళల్లో మురుగునీరు, బురద ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది వాటిని రసాయనాలుగా, ప్రముఖులకు పంపాలని చూడటంతో దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్లు అనుమానించారు. దీంతో మహంకాళి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సైంటిఫిక్ అధికారుల్ని రప్పించి పరీక్షలు చేయించగా, అవి డ్రైనేజ్ వాటర్, బురదగా తేలింది. దీంతో స్థానికంగా ఉన్న మురుగునీరు, మంచినీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ఎవరైనా ఈ పని చేసి ఉంటారని భావించారు. అయితే ముఖ్యమంత్రికి అడ్రస్ చేసిన పార్శిల్‌పై ఓ మహిళతో పాటు ఓయూ వీసీ ఎస్.రామచంద్ర, ప్రొఫెసర్ విఠల్ పేర్లు ప్రస్తావించాడు. సదరు మహిళ ‘ఏజీఏఏఆర్‌ఏఎల్‌ఆర్‌ఓ’ పేరుతో ఓ సంస్థను నడుపుతున్నట్లు వెంకటేశ్వర్రావు పేర్కొనడంతో అనుమానించిన సీనియర్ పోస్టు మాస్టర్ వెంకట రమణరెడ్డి గత మంగళవారం మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి రంగంలోకి దిగారు. పోస్టాఫీసు మార్గంలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు సాకేంతికంగానూ దర్యాప్తు చేసి ఆ బాక్సుల్ని తీసుకువచ్చిన ఆటోను గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వెంకటేశ్వర్రావు చిరునామా బయటపడింది. దీంతో అతడిని పట్టుకోగా నేరం అంగీకరించాడు. ఇతడి నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ల్యాప్‌టాప్, ప్రింటర్, ద్విచక్ర వాహనం తదితరాలు స్వాధీనం చేసుకుని మహంకాళి పోలీసులకు అప్పగించారు. ఇతడు తన మాజీ క్లాస్మేట్ పేరుతో పాటు డాటరాఫ్ అంటూ ఓ టీఆర్ఎస్ నాయకుడి పేరు రాశాడు. ఆయన ఆమె సమీప బంధువే తప్ప తండ్రి కాదని పోలీసులు నిర్థారించారు. -
క్లాస్‌మేట్‌పై కక్షతోనే ‘పార్శిల్స్’?
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ సహా పదుల సంఖ్యలో ప్రముఖులకు ‘పార్శిల్స్’ పంపే ప్రయత్నం చేయడం వెనుక ఉద్దేశం సమాజహితం కాదని... క్లాస్‌మేట్‌పై వ్యక్తిగత కక్షేనని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ పని చేసిన కమ్మరివాడికి చెందిన ఎంబీఏ డ్రాప్‌ఔట్ వెంకట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. సదరు క్లాస్మేట్ మహిళపై ఇతడు ఎందుకు కక్ష కట్టాడు? ఆమెతో పాటు ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్ల పేరుతో వాటిని ఎందుకు పంపాడు? తదితర అంశాలను తేల్చేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఉదంతంతో పోస్టాఫీసుల్లో ఉన్న భద్రత లోపాలపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించారు. సికింద్రాబాద్, కమ్మరివాడికి చెందిన వెంకట్ బోయిన్‌పల్లిలోని ఉస్మానియా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలో కొన్నేళ్ల క్రితం ఎంబీఏలో చేరాడు. కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో డ్రాప్ఔట్గా మారాడు. అయితే తాను అన్ని పరీక్షలు సక్రమంగానే రాశానని, వర్శిటీ ప్రొఫెసర్లే ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేశారని ఆరోపించాడు. దీనికి సంబంధించి అతను కోర్టులో ఓ కేసు కూడా దాఖలు చేసినట్లు తెలిసింది. ఇతడితో పాటు అదే కళాశాలలో నగరానికి చెందిన ఓ యువతి సైతం ఎంబీఏలో చేరారు. ఆమె చదువు పూర్తికావడంతో ప్రస్తుతం వేరే ప్రాంతంలో నివసిస్తున్నారు. గడిచిన కొన్నాళ్ళుగా చిత్రంగా ప్రవర్తిస్తున్న వెంకట్ శుక్రవారం సాయంత్రం కమ్మరివాడి నుంచి 62 పార్శిళ్లను ఓ ఆటోలో తీసుకుని ప్యాట్నీలోని హెడ్–పోస్టాఫీస్‌కు వచ్చాడు. అయితే అప్పటికే సమయం మించిపోయినట్లు సిబ్బంది చెప్పడంతో మరుసటి రోజు వస్తానని చెప్పిన అతడు వాటిని అక్కడే ఉంచి వెళ్లాడు. తిరిగి శనివారం ఉదయం 11.30 గంటలకు పోస్టాఫీస్‌కు వచ్చిన వెంకట్ ముఖ్యమంత్రికి చెందిన నాలుగు చిరునామాలు, డీజీపీతో పాటు ప్రముఖులతో కలిపి మొత్తం 62 మందికీ ఆ బాక్సులను పంపాలంటూ వారి చిరునామాలు ఇచ్చి బుక్ చేయించారు. దీనికి సంబ«ంధించి రూ.8 వేలు చెల్లించాడు. ఆ సందర్భంగా పోస్టాఫీసు అధికారులు ఆ పార్శిల్స్‌లో ఏ ముందని ప్రశ్నించగా పుస్తకాలు ఉన్నట్లు తెలిపాడు. ఎక్కడా తన గుర్తింపు బయటపడకుండా బోగస్ వివరాలు ఇచ్చాడు. సోమవారం పార్శిల్స్ పంపడానికి ప్రయత్నించిన పోస్టాఫీసు డిస్పాచ్ సిబ్బంది వాటిని తరలించే ప్రయత్నం చేశారు. ఓ బాక్సును పైకి ఎత్తగా అందులో ద్రవ పదార్థం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు అన్నీ అలాగే ఉండటంతో ఓ పార్శిల్స్ తెరిచారు. అందులో రెండు బాటిళ్ళల్లో మురుగునీరు, బుదర ఉండటాన్ని చూసిన సిబ్బంది తొలుత వాటిని రసాయనాలుగా, ప్రముఖులకు పంపాలని చూడటంతో దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్లు అనుమానించారు. దీంతో మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సైంటిఫిక్ అధికారులను రప్పించి పరీక్షలు చేయించగా, అవి డ్రైనేజ్ వాటర్, బురదగా తేలింది. దీంతో స్థానికంగా ఉన్న మురుగునీరు, మంచినీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ఎవరైనా ఈ పని చేసి ఉంటారని అనుమానించారు. అయితే ముఖ్యమంత్రికి అడ్రస్ చేసిన పార్శిల్‌పై ఓ మహిళతో పాటు ఓయూ వీసీ ఎస్.రామచంద్ర, ప్రొఫెసర్ విఠల్ పేర్లు ప్రస్తావించాడు. సదరు మహిళ ‘ఏజీఏఏఆర్‌ఏఎల్‌ఆర్‌ఓ’ పేరుతో ఓ సంస్థను నడుపుతున్నట్లు రాశాడు. దీంతో అనుమానించిన సీనియర్ పోస్టు మాస్టర్ వెంకట రమణరెడ్డి మంగళవారం మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐసీపీలోని 419, 506, 511 సెక్షన్ల కింద కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సాంకేతికంగానూ దర్యాప్తు చేసి వెంకట్‌ను గుర్తించి పట్టుకున్నారు. ఇతడు సదరు యువతి పేరుతో పాటు డాటరాఫ్ అంటూ టీఆర్ఎస్ నాయకుడి పేరు రాశాడు. అయితే ఆయన ఆమె సమీప బంధువే తప్ప తండ్రి కాదని మహంకాళి పోలీసులు నిర్థారించారు. వెంకట్‌కు తన క్లాస్మేట్ అయిన ఆ మహిళపై ఎందుకు కక్ష, ఓయూ ప్రొఫెసర్లు పేరు పార్శిల్ ఫ్రం అడ్రస్‌లో ఎందుకు రాశాడు? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ ఉదంతంతో పోస్టల్‌శాఖ మేల్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా పోస్టాఫీసులు, పార్శిల్ సెక్షన్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాము ఈ ప్రతిపాదనలకు సంబంధించి గత నెల్లోనే ఉన్నతాధికారులకు లేఖ రాశామని, ఈ నెలాఖరులోపు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీనియర్ పోస్టుమాస్టర్ రమణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పోస్టాఫీసు, పార్శిల్స్ భద్రత విషయంలో ఆందో«ళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. -
పార్శిల్స్ ఘటనపై స్పందించిన పోస్టల్ శాఖ
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ పోస్టాఫీస్‌కు వచ్చిన పలు పార్శిల్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు అధికారుల పేరిట పార్శిల్స్ రావడం అధికారులను పరుగులు పెట్టించింది. తాజాగా ఈ ఘటనపై సికింద్రాబాద్ సీనియర్ పోస్ట్ మాస్టర్ రమణారెడ్డి స్పందించారు. ‘మాకు శనివారం సాయంత్రం పార్శిల్స్ వచ్చాయి. ఆఫీస్ టైమ్ అయిపోవడంతో వాటిని తిరిగి పంపించాం. మంగళవారం ఉదయం మళ్లీ పోస్ట్ చేయడానికి తీసుకొచ్చారు. అయితే పార్శిల్స్ నుంచి చెడు వాసన వచ్చింది. ఆ పార్శిల్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ల నుంచి పోస్టు చేసినట్టు తెలిసింది. దీంతో మేము వారి నుంచి సమాచారం కోరాం. వారు తాము ఎలాంటి పార్శిల్స్ పంపలేదని తెలిపారు. తమను ఇబ్బంది పెట్టడానికి ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని వారు వివరణ ఇచ్చారు. తొలుత అందులో కెమికల్స్ ఉన్నాయని భావించినప్పటికీ.. అది మురుగు నీరు అని తేలింది. ఆ పార్శిల్స్తోపాటు మూడు పేజీల లేఖ కూడా ఉంది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నార’ని రమణారెడ్డి తెలిపారు. కాగా, ఆ పార్శిల్స్ ఓయూ నుంచి ప్రధాన పోస్టాఫీస్‌కు వచ్చాయని అధికారులు గుర్తించారు. అందులో మురుగు నీరు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మురుగు నీటి సమస్యను ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వర్సిటీ విద్యార్థులే ఇలా పార్శిల్స్ పంపించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పార్శిల్ పరేషాన్
రాంగోపాల్‌పేట్: తమ ప్రాంతంలో కలుషిత జలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కొంత మంది వినూత్న రీతిలో తీవ్ర నిరసనకు దిగారు. కలుషిత జలాలను ప్రభుత్వ పెద్దలు, వీవీఐపీలకు పార్శిల్ చేసి కలకలం సృష్టించారు. మంగళవారం సికింద్రాబాద్ పోస్టాఫీస్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, పోలీసులు, ఇటు పోస్టాఫీస్ వర్గాలు ఈ విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ నెల 17న ఉస్మానియా యూనివర్సిటీ పోస్టాఫీస్ నుంచి పార్శిళ్లు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, డీజీపీ మహేందర్‌రెడ్డి, కొందరు మంత్రుల చిరునామాతో పార్శిళ్లు వచ్చాయి. ఉస్మానియా నుంచి వాటిని ప్రధాన పోస్టాఫీస్ అయిన సికింద్రాబాద్‌కు వచ్చాయి. మంగళవారం ఆ పార్శిళ్ల నుంచి వాసన వస్తుండటంతో పోస్టాఫీస్ వర్గాలకు అనుమానం వచ్చి మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పోలీసులు, క్లూస్ టీం అక్కడికి చేరుకుని పార్శిళ్లను విప్పి చూడగా అందులో కలుషిత జలాలు కనిపించాయి. అవి కలుషిత జలాలా.. మరేదైనా కెమికల్ కలిపారా.. అనేది తెలుసుకునేందు క్లూస్ టీం శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు తీసుకెళ్లారు. వీటిని ఎవరు పంపించారు.. ఏ చిరునామాతో వచ్చాయనే వివరాలు లేవని తెలిసింది. మురుగు నీటి సమస్యపై.. ఉస్మానియా వర్సిటీలో ఉన్న మురుగు నీటి సమస్యను ప్రభుత్వంతో పాటు, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వర్సిటీ విద్యార్థులే ఇలా పార్శిల్స్ పంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్శిళ్లతో పాటు తమ ప్రాంతంలో ఉండే కలుషిత జలాల సమస్య ఎవరు పట్టించుకోవడం లేదని ఘాటైన లేఖలు కూడా జతచేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని మహంకాళి ఇన్స్పెక్టర్ జయపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కొన్ని పార్శిళ్లపై పోస్టాఫీస్ వర్గాలు అనుమానం వ్యక్తం చేయడంతో పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని వెళ్లి పరిశీలించామన్నారు.