ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇన్నిరోజులు ఫుడ్ ఆర్డర్ పెడితే ఇటుక బిళ్లలు రావడం, ఫోన్ ఆర్డర్ పెడితే ధర్మకోల్ షీట్లు రావడం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అదే ఆన్‌లైన్‌లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెడితే బల్లులు ప్రత్యక్షమవుతున్నాయి.
దక్షిణ అమెరికాకు చెందిన సోఫియా సెరానో అనే మహిళ ఎయిర్ ప్రైయర్‌ను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ రానే వచ్చింది. వెంటన్ ఎయిర్ ఫ్రైయర్ ఎలా ఉందోనని పరిశీలించేందుకు పార్శిల్ తెరిచి చూసింది. అంతే పార్శిల్ లోపల ఉన్న బల్లిని చూసి వణికిపోయింది. వెంటనే తనకు ఎదురైన చేదు అనుభవంపై స్పందించింది.
అమెజాన్ పంపిన పార్శిల్ లోపల ఉన్న బల్లి ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను అమెజాన్‌లో ఎయిర్ ఫ్రైయర్ కోసం ఆర్డర్ పెట్టా. కానీ పార్శిల్‌లో బల్లి వచ్చింది. ఇది అమెజాన్ సంస్థ తప్పా లేదంటే కొరియర్ సంస్థది తప్పా అనేది తెలియదు’అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌పై అమెజాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
Pedimos una air fryer por Amazon y nos llegó con un acompañante 🙄 no sé si fue culpa de Amazon o la transportadora … buenos días! pic.twitter.com/BgYDi4qUev
— Sofia Serrano (@sofiaserrano97) July 18, 2024
కాగా, అమెజాన్ పంపిన పార్శిల్‌లో బల్లి ఉండడంపై పలువురు నెటిజన్లు పలు జాగ్రత్తలు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసిన వస్తువు పార్శిల్ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేసే సమయంలో వీడియో తీయడం మంచిది. అలా వీడియో తీయడం వల్ల మీరు పెట్టిన ఆర్డర్ ఒకటైతే..మీకు వచ్చిన వస్తువు మరొకటి అయినప్పుడు.. సదరు ఈకామర్స్ సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు, తగిన నష్ట పరిహారం పొందేందుకు సులభతరం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment