Colombian
-
ఆన్లైన్లో ఎయిర్ ప్రైయర్ బుక్ చేస్తే బల్లిని డెలివరీ చేశారేంటి!
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇన్నిరోజులు ఫుడ్ ఆర్డర్ పెడితే ఇటుక బిళ్లలు రావడం, ఫోన్ ఆర్డర్ పెడితే ధర్మకోల్ షీట్లు రావడం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అదే ఆన్లైన్లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెడితే బల్లులు ప్రత్యక్షమవుతున్నాయి.దక్షిణ అమెరికాకు చెందిన సోఫియా సెరానో అనే మహిళ ఎయిర్ ప్రైయర్ను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ రానే వచ్చింది. వెంటన్ ఎయిర్ ఫ్రైయర్ ఎలా ఉందోనని పరిశీలించేందుకు పార్శిల్ తెరిచి చూసింది. అంతే పార్శిల్ లోపల ఉన్న బల్లిని చూసి వణికిపోయింది. వెంటనే తనకు ఎదురైన చేదు అనుభవంపై స్పందించింది.అమెజాన్ పంపిన పార్శిల్ లోపల ఉన్న బల్లి ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను అమెజాన్‌లో ఎయిర్ ఫ్రైయర్ కోసం ఆర్డర్ పెట్టా. కానీ పార్శిల్లో బల్లి వచ్చింది. ఇది అమెజాన్ సంస్థ తప్పా లేదంటే కొరియర్ సంస్థది తప్పా అనేది తెలియదు’అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌పై అమెజాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. Pedimos una air fryer por Amazon y nos llegó con un acompañante 🙄 no sé si fue culpa de Amazon o la transportadora … buenos días! pic.twitter.com/BgYDi4qUev— Sofia Serrano (@sofiaserrano97) July 18, 2024కాగా, అమెజాన్ పంపిన పార్శిల్లో బల్లి ఉండడంపై పలువురు నెటిజన్లు పలు జాగ్రత్తలు చెబుతున్నారు. ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేసిన వస్తువు పార్శిల్ ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేసే సమయంలో వీడియో తీయడం మంచిది. అలా వీడియో తీయడం వల్ల మీరు పెట్టిన ఆర్డర్ ఒకటైతే..మీకు వచ్చిన వస్తువు మరొకటి అయినప్పుడు.. సదరు ఈకామర్స్ సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు, తగిన నష్ట పరిహారం పొందేందుకు సులభతరం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. -
అమెజాన్ అడవుల్లో గ్రేట్ ఎస్కేప్
-
లాక్డౌన్: సాయం చేస్తానని తోడుగా వచ్చి..
ముంబై: కరోనా లాక్‌డౌన్‌తో భారత్‌లో చిక్కుకున్న కొలంబియా మహిళ పట్ల ముంబై పోలీసు ఒకరు అనుచితంగా వ్యహరించాడు. సాయం చేస్తానని చెప్పి లైంగిక వేధింపులకు దిగాడని ఈ మేరకు బాధితురాలు ముంబై పోలీస్ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. ‘టూరిస్టు వీసాపై భారత్‌కు వచ్చాను. ఫిబ్రవరి 22న ముంబైకి చేరుకుని బాంద్రాలోని ఓ హోటల్లో మార్చి 31 వరకు ఉన్నాను. డబ్బులు అయిపోవడం, లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో ఢిల్లీలోని కొలంబియా ఎంబసీని సంప్రదించాను. అయితే, ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో తిరిగి ముంబైకి వెళ్లిపోదామనుకున్నాను. ఈ క్రమంలో ముంబైకి చెందిన ఓ పోలీస్ అంధేరీలో లాడ్జ్ వెతికిపెట్టాడు. ఏప్రిల్ 1న లాడ్జ్‌లో దిగాను. అక్కడ సదరు పోలీస్ ప్రవర్తన నన్ను ఇబ్బందులకు గురిచేసింది. నన్ను డ్రింక్ తాగాలని బలవంతం చేశాడు. తిరస్కరించాను. నా ఫోన్‌కు అసభ్యకర మెజేస్‌లు పంపించాడు. నన్ను తాకేందుకు యత్నించాడు. లాడ్జ్ అద్దె తానే చెల్లిస్తానని, తనను రూమ్‌లోకి ఆహ్వానించాలని కోరాడు. అతన్ని బయటికి నెట్టేశాను. (చదవండి: కరోనా అనుమానంతో ఆసుపత్రిలో చేరిక) దాంతో అతను నాపై కక్ష కట్టాడు. నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించొద్దని లాడ్జ్ సిబ్బందిని హెచ్చరించాడు. నిత్యవసరాలు లేక నరకం అనుభవించాను. నా వ్యధనంతా వీడియో రూపంలో కొలంబియా అధికారులకు పంపించడంతో వైరల్ అయింది. దానికి స్పందనగా ఏప్రిల్ 18న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఒక డాక్టర్ నా వద్దకు వచ్చి ఆహారం అందించారు. ఆరోగ్య పరీక్షలు చేశారు. క్లిష్ట సమయంలో తోడుగా నిలిచారు. చివరకు ఓ ఎన్జీఓ సాయంతో లాడ్జ్ నుంచి బయటపడి.. వారి సంరక్షణలో ఉన్నాను. కీచక పోలీస్ ఆటకట్టించేందుకే ఫిర్యాదు చేస్తున్నాను’అని పేర్కొన్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదుపై విచారిస్తామని.. ఆరోపణలు నిజమైతే సదరు పోలీస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. నిందితుడు సహర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్టున్నట్టు తెలిసింది. (చదవండి: దేశవ్యాప్తంగా 20,000 దాటిన పాజిటివ్ కేసులు) -
గ్రూప్‘హెచ్’ టాపర్ కొలంబియా
సమారా: గ్రూప్ ‘హెచ్’ టాపర్‌గా కొలంబియా ప్రపంచకప్‌లో నాకౌట్ చేరింది. సెనెగల్‌తో గురువారం ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 1–0 తేడాతో గెలుపొందింది.‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎరీ మినా (74వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. బంతిపై 43 శాతమే నియంత్రణ దక్కినా... అటాకింగ్ గేమ్‌తో సెనెగల్ పోరాడింది. అయితే, మినా అద్భుతమైన హెడర్ గోల్‌తో కొలంబియాకు ఆధిక్యం అందించాడు. దీనిని సమం చేసేందుకు అవకాశం చిక్కని సెనెగల్ ఉసూరుమంటూ నిష్క్రమించింది. జపాన్‌పై పోలాండ్ నెగ్గడంతో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. కొలంబియా 6 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. 1982 తర్వాత ఆఫ్రికా ఖండానికి చెందిన ఒక్క జట్టు కూడా నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి -
కొలంబియా మోడల్ కు 15 ఏళ్ళ జైలు!
బీజింగ్ః మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా కేసులో ఓ మోడల్ కు 15 ఏళ్ళ జైలు శిక్ష పడింది. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోందన్న ఆరోపణలతో గతేడాది కాలంగా ఆమెపై విచారణ జరుగుతోండగా.. చివరికి ఆమె దోషిగా తేలడంతో శిక్షను విధిస్తూ చైనా కోర్టు తీర్పునిచ్చింది. చైనా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమైన 22 ఏళ్ళ కొలంబియన్ మోడల్ కు 15 సంవత్సరాల జైలు శిక్ష పడింది. జులియానా లోపేజ్ గతంలో స్వంతగా ఓ బొటిక్ ను నడిపించేది. అంతేకాక ఓ టీవీ షోలో కూడా ఆమె ఓ సొంత కార్యక్రమాన్ని చేసేది. అలాగే ప్రొ ఫుట్ బాలర్ గా కూడా ఆమె అందరికీ తెలుసు. అయితే తన ల్యాప్ తో డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తోందన్న అనుమానంతో గతేడాది ఆమెను చైనా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన బొటిక్ కోసం వస్తువులు కొనేందుకు కుటుంబ సభ్యులతో కలసి గాంగ్జూ వెళ్ళిన జూలియానా... అక్కడ వారినుంచీ తప్పిపోవడంతో అంతా ఆందోళన చెందారు. అయితే అదే సమయంలో జూలియానాను చైనా పోలీసులు అరెస్టు చేశారన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయారుకూడా. నిషేధిత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు పెద్ద మొత్తంలో ఆమెవద్ద గుర్తించడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అప్పట్నుంచీ విచారణ ఎదుర్కొంటున్న జూలియానా దోషిగా తేలడంతో 15 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ చైనా కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాక ఆమె జైలు శిక్ష పూర్తయిన అనంతరం ఆమెను చైనా నుంచి బహిష్కరించాలని కూడా గంగ్వ్సూ పీపుల్స్ ఇంటర్మీడియల్ కోర్టు ఆదేశించింది. గతేడాది జూలై 18న గాంగ్జూ వెళ్ళిన జూలియానా.. బైయున్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో 610 గ్రాముల కొకైన్ ను లాప్ టాప్ లో కనిపించకుండా దాచి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొలంబియాలో మిస్ యాంటియోక్వియా బ్యూటీ కాంటెస్ట్ లో విన్నర్ అయిన జూలియానా అనంతరం మిస్ వరల్డ్ కొలంబియాలోనూ గెలిచి, మిస్ వరల్డ్ చైనాగా నిలవాలనుకుంది. అదే సమయంలో ఆమె చైనాలో తప్పిపోయిందని, మత్తుపదార్థాల అక్రమ రవాణా కేసులో విచారణ ఎదుర్కొంటోందని తెలిసి ప్రపంచం నివ్వెరపోయింది. తనకు ఓ వ్యక్తి స్మగ్లింగ్ లో హెల్స్ చేస్తే 2,500 డాలర్లు ఇస్తానన్నాడని, లేదంటే తన కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడని అందుకే తాను స్మగ్లింగ్ కు పాల్పడినట్లు కోర్టు ముందు ఒప్పుకుంది. అయితే జూలియానా పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను తనతో తీసుకువెళ్ళడాన్ని కోర్టు తప్పుబట్టింది. భారీ ఎత్తున మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు శిక్ష విధించింది.