
సమారా: గ్రూప్ ‘హెచ్’ టాపర్‌గా కొలంబియా ప్రపంచకప్‌లో నాకౌట్ చేరింది. సెనెగల్‌తో గురువారం ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 1–0 తేడాతో గెలుపొందింది.‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎరీ మినా (74వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. బంతిపై 43 శాతమే నియంత్రణ దక్కినా... అటాకింగ్ గేమ్‌తో సెనెగల్ పోరాడింది. అయితే, మినా అద్భుతమైన హెడర్ గోల్‌తో కొలంబియాకు ఆధిక్యం అందించాడు. దీనిని సమం చేసేందుకు అవకాశం చిక్కని సెనెగల్ ఉసూరుమంటూ నిష్క్రమించింది. జపాన్‌పై పోలాండ్ నెగ్గడంతో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. కొలంబియా 6 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది.
1982 తర్వాత ఆఫ్రికా ఖండానికి చెందిన ఒక్క జట్టు కూడా నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి