ఈ-కామర్స్ వ్యాపారంలో ఫ్లిప్‌కార్ట్ అగ్రగామిగా దూసుకెళ్తోంది. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ గతంలోనే ఫ్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే.
ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో కంపెనీను విడిచి బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త కంపెనీ పెడుతున్నట్లు బిన్నీ ఇప్పటికే చెప్పారు.
జనవరి 2024 ప్రారంభంలో ఆయన తన కొత్త కంపెనీ ‘ఆప్‌డోర్’ OppDoorను ప్రకటించారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ కంపెనీల అభివృద్ధి, విస్తరణకు ఎండ్ టూ ఎండ్ సోల్యూషన్స్‌ను అందించనుందని తెలిసింది. ‘ఆప్‌డోర్’ మొదట యూఎస్, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, సింగపూర్, జపాన్ , ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ-కామర్స్ కంపెనీలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: బిన్నీ బన్సల్ కూడా.. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫౌండర్లు ఇద్దరూ అవుట్!
ఫ్లిప్‌కార్ట్ మరో కోఫౌండర్ సచిన్ బన్సాల్ నవీ అనే ఫిన్‌టెక్ వెంచర్ ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల కిందటే ఫ్లిప్‌కార్ట్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత 16 సంవత్సరాలుగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సాధించిన విజయాల పట్ల బిన్నీ బన్సల్ గర్వాన్ని వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వ బృందంతో కంపెనీ బలమైన స్థానంలో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment